స్వచ్ఛభారత్‌కు కమల్ సై
స్వచ్ఛభారత్‌కు నటుడు కమలహాసన్ శ్రీకారం చుట్టారు. తన 60వ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం ఆయన సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సాధారణంగా తారలు పుట్టిన రోజున పూజలు, అనంతరం శుభాకాంక్షల కార్యక్రమం, విందులు, వినోదాలతో గడిపేస్తుంటారు. అలాంటిది ప్రఖ్యాత నటు డు సామాజిక సేవ కోసం నడుం బిగించడం విశేషం.
నటుల ప్రభావం అభిమానులపై చా లా ఉంటుందన్నది నిజం. ఆ విధంగా కమల్ చేపట్టిన ఈ సంక్షేమ కార్యక్రమానికి ఆయన అభిమానులతో పాటు పుర ప్రజలు చేయి కలిపారు. కమలహాసన్ తన పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం ఉద యం దక్షిణ చెన్నైలోని మాడంబాక్కం సమీపంలోని నీటి కాలువను శుద్ధిచేసే కార్యక్రమాన్ని సంకల్పించారు. ఈ కార్యక్రమానికి ఆ ప్రాంత వాసులు మేము సైతం అంటూ ముందుకు వచ్చారు.
ఎన్విరాన్‌మెంట్ లిస్ట్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియాతో కలిసి దక్షిణ చెన్నై, మాడంబాక్కం సమీపంలోని నీటి కాలువ ఒకప్పుడు గలగల పారే సెలయేరులా ఉండేది. ఆ ప్రాంత వ్యవసాయ అవసరాలకు ఉపయోగపడుతూ జంతుజాలం దాహార్తి తీర్చే జీవ కాలువ అది. అయితే రానురాను చెట్లు, చెత్తాచెదారం, పూడికలతో నీటి ప్రవాహం తగ్గిపోయింది. దీంతో ఆ ప్రాంత వ్యవసాయదారులు, నీటి కొరతతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దీన్ని గుర్తించిన ఎన్విరాన్‌మెంట్‌లిస్ట్ ఫౌండేషన్ ఆఫ్ ఇండి యా సంస్థ 2012లో ఈ కాలువను శుద్ధి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
ఆ ప్రాంత ప్రజలు, పంచాయతీ సహకారంతో కొంచెం కొంచెంగా ఆ కాలువ పరిసర ప్రాంతాలను శుద్ధి చేస్తోంది. ఇప్పుడీ శుద్ధి కార్యక్రమానికి కమలహాసన్ తోడుగా నిలిచారు. స్వచ్ఛభారత్ పథకంలో భాగంగా ఈ పారిశుద్ధ్య కార్యక్రమం శుక్రవారం నుంచి ప్రారంభమైంది. పుదుకోట్టై, సర్కలి, చిదంబరం, పాండిచ్చేరి, చెంగల్‌ప ట్టు, కాంచీపురం, తిరుత్తణి, వేలూరు, కృష్ణగిరి, ధర్మపురి, ఈరోడ్, ఎలంపిల్లై, కుమరపాళయం, పొల్లాచ్చి, ఉడుమలపేట్ట, రాజపాళయం, శ్రీవిల్లిపుత్తూరు, తిరునెల్వేలి, అంబాసముద్రం, నాగర్‌కోవిల్, కన్యాకుమారి, రా మనాథపురం, కారైకుడి, అరంతాంగి, చెన్నై తదితర ప్రాంతాల్లో కొనసాగుతోందని ఎన్విరాన్‌మెంట్‌లిస్ట్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా, ఆ ల్ ఇండియా కమలహాసన్ నర్పని ఇయక్కం నిర్వాహకులు వెల్లడించారు.