యువతకు చేయూత
► 18 నుంచి 35 సంవత్సరాల యువతతో
► స్వయం సహాయక సంఘాలు
► సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం...
► స్వయం ఉపాధిలో శిక్షణ
► పైలట్ ప్రాజెక్టు కింద 14 మండలాలు ఎంపిక
► మే 4వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ
విధానంలో భాగంగా యువత కోసం వినూత్న పథకాలు కార్యక్రమాలను చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా యు వజన నంఘాలు, అధికారులు, జాతీయ యువజ న అవార్డు గ్రహీతల అభిప్రాయూలు సేకరించింది.
సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం
యువత సేవా కార్యక్రమాలలో పాల్గొనే విధంగా మండల స్థాయిలో ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తుంది. యువజన సంఘాలు రక్తదాన శిబిరాలు, అవయవ దానాలపై అవగాహన సదస్సులు, మొక్కలు నాటే కార్యక్రమం(హరితాహారం), స్వచ్ఛ తెలంగాణ - స్వచ్ఛ భారత్, మిషన్ కాకతీయ, యోగా, స్పోర్ట్స్, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన వారికి తగిన గుర్తింపు ఇవ్వనుంది. రిపబ్లిక్ డే, స్వాతంత్య్ర దినోత్సవాల సందర్బంగా జిల్లా, మండల స్థాయిలో అవార్డులను ఇచ్చి ప్రోత్సహించనుంది.
సోషల్ మీడియాలో..
యువజన సంఘం వారి పేరు మీద ఫేస్‌బుక్ పేజీ క్రియేట్ చేసుకుని అందులో చేసే కార్యక్రమాలను పొందుపర్చాలి. అలాగే ఈ మెయిల్ ఐడీని సైతం క్రియేట్ చేయాలి. మొదట యూత్ క్లబ్ పేరు తరువాత మండలం, జిల్లా పేరు తో మెయిల్ ఐడీని క్రియేట్ చేసుకోవాలి. ప్రతి మం డలానికి మండల పరిషత్ అధికారి మండల యువజన అధికారిగా వ్యవహరించనున్నారు. ఇక నుంచి యువజన వ్యవహారాలు అన్ని మండల స్థాయిలో మండల పరిషత్ అధికారులు చుసుకోనున్నారు.
యువజన భవనాల నిర్మాణం
యువత సంస్థాగత తోడ్పాటు కోసం దేశంలో తొలిసారిగా యూత్ భవన్‌లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎంపీలు, ఎమ్మెల్యేల నియోజకవర్గ నిధుల నుంచి ఈ భవనాలను నిర్మించేందుకు వెసులుబాటు కల్పించింది. అందులోనే మల్టీలెవల్ ట్రెనింగ్ ఇచ్చేందుకు, గ్రంథాలయం నిర్వహణకు సైతం ఉపయోగపడే విధంగా నిర్మించనున్నారు. యువతకు స్థానిక చిన్న, మధ్యతరహా పరిశ్రమలలో ఉపాధి అవకాశాలు సైతం కల్పించనుంది. యువతకు మీ సేవ కేంద్రాలను సైతం కేటాయించేందుకు నిర్ణయం తీసుకోనుంది. యువజన సంఘ సభ్యులకు ప్రమాద బీమా సౌకర్యం కూడా కల్పించేందుకు నివేదిక రుపొందిస్తోంది.
14 మండలాలు ఎంపిక
జిల్లాలో యువ చేతన కార్యక్రమంలో భాగంగా 14 మండలాలు పెలైట్ ప్రాజెక్ట్ కింద ఎంపికయ్యూరుు. మహబూబాబాద్, ములుగు, నర్సంపేట, తొర్రూరు, వర్ధన్నపేట, పరకాల, మొగుళ్ళపల్లి, ఏటురునాగారం, జనగాం, దేవరుప్పుల, నర్మెట, స్టేషన్‌ఘన్‌పూర్, ఖానాపూర్, హసన్‌పర్తి మండలాలను ఎంపిక చేశారు. ఈ మండలాలలో పథకం విజయవంతమైతే దశల వారీగా జిల్లా వ్యాప్తంగా విస్తరించనున్నారు. ఈ మండలాల వారు రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం యూత్ అసోసియేషన్ రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. బ్యాంక్ ఖాతా యువజన సంఘం పేరు మీదనే ఉండాలి. ఈ క్లబ్‌లోని సభ్యులందరు 18 నుంచి 35 సంవత్సరాల వారే ఉండాలి. యువజన సంఘాలను పాతవి అయిన కొత్తవి అయినా సంబంధిత గ్రామ కార్యదర్శి ద్వారా మండల అభివృద్ధి అధికారి కార్యాలయంలో దరఖాస్తులు ఈ నెల 4వ తేదీలోగా అందజేయాలి. మరిన్ని వివరాలకు వరంగల్ ములుగు రోడ్‌లోని జిల్లా యువజన సంక్షేమ శాఖ కార్యాలయంలో గానీ, 0870-2623125 నెంబర్ ద్వారా గానీ సంప్రదించొచ్చు.
యువతపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
రాష్ట్ర ప్రభుత్వం యువత సంక్షేమం కోస ప్రత్యేక దృష్టి పెట్టింది. యువత తమ కాళ్ల మీద తాము నిలబడే విధంగా ప్రోత్సహిస్తుంది. యువత కోసం అనేక పథకాలను అమలు చేయనుంది. సేవా కార్యక్రమాలు నిర్వహించే వారికి ప్రత్యేక ప్రోత్సాహకాలు సైతం అందజేయాలని పరిశీలిస్తుంది. మొదట పెలైట్ ప్రాజెక్ట్ కింద జిల్లాలోని 14 మండలాలను ఎంపిక చేశాము. గోపాల్ రావు, జిల్లా యువజన సంక్షేమ శాఖ అధికారి