చాగంటి శ్రీరామ రత్నంరాజు (పాత చిత్రం)
సామర్లకోట (పెద్దాపురం): స్థానిక ప్రముఖ వైద్యులు చాగంటి శ్రీరామ రత్నంరాజు గురువారం ఉదయం మృతి చెందారు. 1929లో జన్మించిన ఆయన అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల చైర్మన్‌గా ఉన్నారు. 1972లో ఏర్పడిన ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డిగ్రీ కళాశాల ఏర్పాటు కోసం ఆయన ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఆయనకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన కుమారులు, కుమార్తెలు, మనవలు, మనుమరాళ్లు కూడా డాక్టర్లు కావడం విశేషం.
సుమారు ఆయన ఇంట 18 మంది డాక్టర్లు ఉన్న విశేష కుటుంబంగా పేరు పొందింది. రత్నంరాజు మృతితో సామర్లకోట పట్టణం మూగ బొయింది. ఆయన మృతి పట్ల అనేక మంది ఆయన మృతదేహం వద్ద నివాళులర్పించారు. మాజీ మున్సిపల్ చైర్మన్ డాక్టరు చందలాడ అనంతపద్మనాభం, డాక్టరు ఐవీ రావు, డాక్టరు పసల సత్యానందరావు, పారిశ్రామిక వేత్తలు పసల పద్మరాఘవ రావు, ఆర్వీ సుబ్బరాజు, వీరభద్రరావు, కౌన్సిల్ ప్రతిపక్ష నాయకుడు అవాల లక్ష్మీనారాయణ, పట్టణ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు మద్దాల శ్రీను, టీడీపీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి మన్యం చంద్ర రావు తదితరులు పాల్గొన్ని మృత దేహం వద్ద నివాళ్లు అర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment