గవర్నర్ నర్సింహన్ నుంచి అవార్డు అందుకుంటున్న సీఎండీ ఎన్.శ్రీధర్
గోదావరిఖని(రామగుండం) కరీంనగర్ : సింగరేణి సంస్థ సేవలకు గుర్తింపు లభించింది. సంస్థ చేపట్టిన సామాజిక సేవలకు అవార్డు దక్కింది. రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏటా అందించే ఉత్తమ సేవా అవార్డు సీఎండీ శ్రీధర్ శుక్రవారం గవర్నర్ నర్సింహన్ చేతులమీదుగా అందుకున్నారు.సింగరేణి సంస్థ ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల్లో కొన్నేళ్లుగా రెడ్‌క్రాస్ సొసైటీ చేస్తున్న సామాజిక కార్యక్రమాలకు తనవంతుగా సహకారం అందిస్తోంది.
తలసేమియా బాధితులు, సికిల్‌సన్ వ్యాధిగ్రస్తుల కోసం రక్తనిధి, రక్తశుద్ధికి సంబంధించిన విడాస్ (ఆర్) బయోమిరియక్స్ మిషన్, సీరం పెర్రిటిన్ టెస్ట్‌కిట్లను రూ.17.18 లక్షలతో కొనుగోలు చేసి రెడ్‌క్రాస్ సొసైటీ అందజేసింది. బెల్లంపల్లి, రామకృష్ణాపూర్ ఏరియా ఆస్పత్రుల్లో స్థానిక ప్రజల కోసం పలుమార్లు ఉచిత వైద్యశిబిరాలు నిర్వహించింది. రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాల్లో సిం గరేణి అధికారులు, కార్మికులు, రెస్క్యూ సిబ్బంది తొమ్మిదిసార్లు రక్తదానం చేశారు.
ప్రతిసారీ 100కు పైగా సింగరేణి ఉద్యోగులు రక్తదాన శిబిరాల్లో పాల్గొన్నారు. 2008 నుంచి సింగరేణి సంస్థ తలసేమియా బాధితులను ఆదుకోవడం కోసం రక్తనిధి నిర్వహణకు ఉచితంగా పలురకాల ఎక్విప్‌మెంట్లను అందజేసింది. రూ.25 లక్షల విలువైన మూడు రకాల రిఫ్రిజిరేటర్లు, సెంట్రీప్యూడ్, మూడు రకాల రక్తనిధి రిఫ్రిజిరేటర్లతో పాటు మైక్రో స్కోపులు, హాట్ ఎయిర్ ఓపెన్, ఇంక్యూబేటర్లు, ఎలీషా రీడర్, ఎలీషావాషర్లు సమకూర్చింది.
సింగరేణి కార్మికుల కుటుంబాలు, సమీప గ్రామాల్లోని తలసేమియా సికిల్‌సన్ వ్యాధిగ్రస్తుల సేవల కోసం సింగరేణి ఆస్పత్రిలో పనిచేసే పాథాలజిస్ట్ డాక్టర్ కృష్ణమూర్తిని 2012 నుంచి డిప్యూటేషన్‌పై రెడ్‌క్రాస్ ఆస్పత్రికి కేటాయించి వైద్యసేవలు అందజేస్తోంది. గత ఏడాది సుమారు రూ.40 కోట్లతో గ్రామాలు, పట్టణాల్లో మౌలి క సదుపాయాల కల్పనకు పలురకాల పనులు చేపట్టింది. సంస్థ విశిష్ట సేవలకుగాను గుర్తింపుగా రెడ్‌క్రాస్ సొసైటీ ఉత్తమ సేవా అవార్డు 2017–18 సంవత్సరానికి గాను సీఎండీకి అందజేసింది.
Comments
Please login to add a commentAdd a comment