న్యూఢిల్లీ: జీవిత బీమా సంస్థలు ఈ ఏడాది సెప్టెంబర్‌లో కొత్త పాలసీల ప్రీమియం రూ.35,020 కోట్లు నమోదు చేశాయి. 2023 సెప్టెంబర్‌తో పోలిస్తే ప్రీమియం 14 శాతం పెరగడం విశేషం. లైఫ్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ సెప్టెంబర్ గణాంకాల ప్రకారం.. బీమా రక్షణ పట్ల వ్యక్తిగత కస్టమర్ల నుంచి డిమాండ్ పెరగడంతో సెప్టెంబర్‌లో జారీ అయిన కొత్త పాలసీల సంఖ్య 45.49 శాతం దూసుకెళ్లి 32,17,880 నమోదైంది.
ఇండివిడ్యువల్ సింగిల్ ప్రీమియం 13 శాతం అధికమై రూ.5,142 కోట్లు సాధించింది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ 25 శాతం వృద్ధితో నూతన ప్రీమియం రూ.20,369 కోట్లు అందుకుంది. ఈ ఏడాది ఏప్రిల్–సెప్టెంబర్‌లో నూతన పాలసీల ద్వారా అందుకున్న ప్రీమియం గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 19 శాతం ఎగసి రూ.1,89,214 కోట్లకు చేరుకుంది.
Comments
Please login to add a commentAdd a comment