new premium
-
జీవిత బీమా కొత్త పాలసీలు పెరిగాయ్..
న్యూఢిల్లీ: జీవిత బీమా సంస్థలు ఈ ఏడాది సెప్టెంబర్‌లో కొత్త పాలసీల ప్రీమియం రూ.35,020 కోట్లు నమోదు చేశాయి. 2023 సెప్టెంబర్‌తో పోలిస్తే ప్రీమియం 14 శాతం పెరగడం విశేషం. లైఫ్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ సెప్టెంబర్ గణాంకాల ప్రకారం.. బీమా రక్షణ పట్ల వ్యక్తిగత కస్టమర్ల నుంచి డిమాండ్ పెరగడంతో సెప్టెంబర్‌లో జారీ అయిన కొత్త పాలసీల సంఖ్య 45.49 శాతం దూసుకెళ్లి 32,17,880 నమోదైంది.ఇండివిడ్యువల్ సింగిల్ ప్రీమియం 13 శాతం అధికమై రూ.5,142 కోట్లు సాధించింది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ 25 శాతం వృద్ధితో నూతన ప్రీమియం రూ.20,369 కోట్లు అందుకుంది. ఈ ఏడాది ఏప్రిల్–సెప్టెంబర్‌లో నూతన పాలసీల ద్వారా అందుకున్న ప్రీమియం గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 19 శాతం ఎగసి రూ.1,89,214 కోట్లకు చేరుకుంది. -
జీవిత బీమా ప్రీమియం ఆదాయంలో వృద్ధి
ముంబై: జీవిత బీమా కంపెనీలు ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో మంచి పనితీరు చూపించాయి. మొదటి ఏడాది పాలసీల ప్రీమియం ఆదాయం 22.2 శాతం వృద్ధిని చూపించింది. రూ.31,001 కోట్ల ఆదాయం సమకూరింది. 2020 సెపె్టంబర్లో ఈ రూపంలో కంపెనీలకు వచ్చిన ఆదాయం రూ.25,336 కోట్లుగానే ఉంది. బీమా రంగంలోనే దిగ్గజ కంపెనీ ఎల్ఐసీ మొదటి ఏడాది ప్రీమియం సెప్టెంబర్ నెలలో 11.5 శాతం పెరిగింది. కానీ 2020 సెప్టెంబర్‌లో వృద్ధి 30 శాతంతో పోలిస్తే తగ్గినట్టు స్పష్టమవుతోంది. ఏప్రిల్–సెప్టెంబర్‌లోనూ మంచిపనితీరు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో (ఏప్రిల్–సెప్టెంబర్) జీవిత బీమా కంపెనీల తొలి ఏడాది ప్రీమియం (కొత్త పాలసీలకు సంబంధించి) 5.8 శాతం వృద్ధి చెంది రూ.1,31,982 కోట్లుగా నమోదైంది. కానీ అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో తొలి ఏడాది ప్రీమియం ఆదాయం 0.8 శాతం పడిపోవడం గమనార్హం. ఎల్ఐసీ తొలి ఏడాది ప్రీమియం ఆదాయం 3.3 శాతం తగ్గి రూ.85,113 కోట్లుగా ఉంది. అదే మిగిలిన ప్రైవేటు రంగ జీవిత బీమా కంపెనీల తొలి పాలసీ ప్రీమియం ఆదాయం 27.7 శాతం వృద్ధి చెంది రూ.46,869 కోట్లకు చేరింది. -
కొత్త ప్రీమియంలో 40 శాతం వృద్ధి లక్ష్యం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కొత్త ప్రీమియం వసూళ్లలో దాదాపు 40 శాతం వృద్ధి లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ అరిజిత్ బసు తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం వ్యక్తిగత పాలసీల ప్రీమియం వసూళ్లు సుమారు రూ. 7,100 కోట్లు కాగా.. ఈ సారి రూ. 9,800 కోట్ల దాకా అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక, స్థూలంగా మొత్తం ప్రీమియం వసూళ్లు దాదాపు రూ. 21,000 కోట్లు ఉండగా.. ఈసారి రూ. 25,000 కోట్ల మేర అంచనా వేస్తున్నట్లు ఆయన వివరించారు. వ్యక్తిగత పాలసీల కొత్త ప్రీమియం వసూళ్లు ఈ ఏడాది ఇప్పటిదాకా 46 శాతం వృద్ధితో దాదాపు రూ. 4,700 కోట్లుగా ఉన్నాయని, మిగతా నాలుగు నెలల్లో మరింత మెరుగుపడగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సోమవారమిక్కడ ఎస్బీఐ లైఫ్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయాలు వివరించారు. హైదరాబాద్ రీజియన్ రీజనల్ డైరెక్టర్ దేబాసిస్ చటర్జీ తదితరులు ఇందులో పాల్గొన్నారు. హైదరాబాద్ రీజియన్‌లో కొత్త పాలసీల ప్రీమియం వసూళ్లు సెప్టెంబర్ ఆఖరు నాటికి రూ. 145 కోట్ల నుంచి రూ. 205 కోట్లకు పెరిగినట్లు బసు చెప్పారు. 70 శాతం డిజిటల్.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా తమకు 96,000 మంది ఏజెంట్లు ఉండగా.. హైదరాబాద్ రీజియన్‌లో 4,978 మంది ఉన్నారని బసు పేర్కొన్నారు. సంస్థ వ్యాపారంలో బ్యాంకెష్యూరెన్స్ చానల్ వాటా 65 శాతంగాను, ఏజెన్సీ చానల్‌ది 32 శాతంగాను ఉంటోందని ఆయన వివరించారు. కొత్తగా మరో రెండు బ్యాంకులు.. తమ బ్యాంకెష్యూరెన్స్ చానల్‌కి తోడవుతున్నట్లు చెప్పారు. మరోవైపు, వచ్చే నెలలో ’పూర్ణ సురక్ష’ పేరిట నాలుగు రకాల క్రిటికల్ ఇల్నెస్ సమస్యలకు సమగ్రమైన కవరేజీ ఇచ్చే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు బసు తెలిపారు. తమ వ్యాపారంలో దాదాపు 60–70 శాతం డిజిటల్ మాధ్యమంలో.. ట్యాబ్‌లు, మొబైల్స్ ద్వారానే ఉంటోందని పేర్కొన్నారు. పూర్తి ఆన్లైన్ విధానానికి సంబంధించి మూడు పాలసీలు అందిస్తున్నామని.. ఏటా సుమారు 20,000 పాలసీలను విక్రయిస్తున్నామన్నారు. దేశీయంగా ఉన్న దాదాపు 23 బీమా సంస్థల్లో చాలామటుకు కంపెనీలు మెరుగైన లాభాలు సాధిస్తూనే ఉన్న నేపథ్యంలో కన్సాలిడేషన్ అవకాశాలు తక్కువే ఉండొచ్చని బసు చెప్పారు. -
మార్కెట్లోకి లగ్జరీ మెటల్ ‘లుమినెక్స్ యునో’
హైదరాబాద్: ప్రముఖ అంతర్జాతీయ జువెలరీ అసోసియేషన్ ‘లీడింగ్ జువెలర్స్ ఆఫ్ ద వరల్డ్’ (ఎల్‌జేఓడబ్ల్యూ) తాజాగా ‘లుమినెక్స్ యునో’ అనే కొత్త ప్రీమియం లగ్జరీ లోహాన్ని (మెటల్) మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ధర గ్రాముకు రూ.120 నుంచి రూ.125 మధ్యలో ఉంది. ఈ ధర బంగారం, ప్లాటినం లోహాల ధర కన్నా చాలా తక్కువ. దీన్ని ఆభరణాల తయారీకి ఉపయోగంచవచ్చని.. అటు రిటైలర్లకు, ఇటు ఇన్వెస్టర్లకు ‘లుమినెక్స్ యునో’ ప్రత్యమ్నాయ లోహంగా ఉంటుందని ఎల్‌జేఓడబ్ల్యూ డెరైక్టర్ సంజీవ్ అగర్వాల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘లుమినెక్స్ యునో’.. బంగారం, ప్లాటినం, పల్లాడి యం, వెండి వంటి లోహాల మిశ్రమమని తెలిపారు. భారత్‌లో పలువురు కంపెనీల ద్వారా ఈ లోహాన్ని ఎల్‌జేఓడబ్ల్యూ మార్కెటింగ్ చేస్తుందని పేర్కొన్నారు. -
సప్టెంబర్‌లో ల్యాండ్ రోవర్ కొత్త ‘డిస్కవరీ స్పోర్ట్’
న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ల్యాండ్ రోవర్ కొత్త ప్రీమియం ఎస్యూవీ వెహికల్ ‘డిస్కవరీ స్పోర్ట్’ను సెప్టెంబర్ 2న మార్కెట్లోకి తీసుకువస్తోంది. రిటైలర్లు వీటి బుకింగ్స్ ప్రారంభించారు. ల్యాండ్ రోవర్ ఉత్పత్తుల విస్తరణలో ‘డిస్కవరీ స్పోర్ట్’ ఒక మైలురాయిగా నిలుస్తుందని ల్యాండ్ రోవర్ ఇండియా లిమిటెడ్ ప్రెసిడెంట్ రోహిత్ సూరి ధీమా వ్యక్తం చేశారు. భారత్‌లో ల్యాండ్ రోవర్ వాహనాలు 22 ఔట్‌లెట్స్‌లో వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి.