new policies
-
జీవిత బీమా కొత్త పాలసీలు పెరిగాయ్..
న్యూఢిల్లీ: జీవిత బీమా సంస్థలు ఈ ఏడాది సెప్టెంబర్‌లో కొత్త పాలసీల ప్రీమియం రూ.35,020 కోట్లు నమోదు చేశాయి. 2023 సెప్టెంబర్‌తో పోలిస్తే ప్రీమియం 14 శాతం పెరగడం విశేషం. లైఫ్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ సెప్టెంబర్ గణాంకాల ప్రకారం.. బీమా రక్షణ పట్ల వ్యక్తిగత కస్టమర్ల నుంచి డిమాండ్ పెరగడంతో సెప్టెంబర్‌లో జారీ అయిన కొత్త పాలసీల సంఖ్య 45.49 శాతం దూసుకెళ్లి 32,17,880 నమోదైంది.ఇండివిడ్యువల్ సింగిల్ ప్రీమియం 13 శాతం అధికమై రూ.5,142 కోట్లు సాధించింది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ 25 శాతం వృద్ధితో నూతన ప్రీమియం రూ.20,369 కోట్లు అందుకుంది. ఈ ఏడాది ఏప్రిల్–సెప్టెంబర్‌లో నూతన పాలసీల ద్వారా అందుకున్న ప్రీమియం గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 19 శాతం ఎగసి రూ.1,89,214 కోట్లకు చేరుకుంది. -
ఏటా 10 శాతం చొప్పున జీవితాంతం
న్యూఢిల్లీ: జీవిత బీమా రంగ దిగ్గజం ఎల్ఐసీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మూడు నుంచి నాలుగు వరకు నూతన పాలసీలను ఆవిష్కరించనుంది. నూతన వ్యాపార ప్రీమియంలో రెండంకెల వృద్ధిని సాధించాలనే లక్ష్యంతో ఉంది. ‘‘గతేడాదితో పోలిస్తే రెండంకెల వృద్ధిని సాధిస్తాం. ఎందుకంటే ఇండివిడ్యువల్ రిటైల్ వ్యాపారం పుంజుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆకర్షణీయమైన కొత్త పాలసీలను ఆవిష్కరించనున్నాం’’అని ఎల్ఐసీ చైర్మన్ సిద్ధార్థ మహంతి తెలిపారు. డిసెంబర్ మొదటి వారంలో ఎల్ఐసీ ఒక ఉత్పత్తిని తీసుకువస్తుందని వెల్లడించారు. దీనితో మార్కెట్లో మంచి స్పందన వస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. డిసెంబర్లో తెచ్చే నూతన పాలసీ గురించి వివరిస్తూ.. పాలసీ మెచ్యూరిటీ తర్వాత (గడువు ముగిసిన అనంతరం) జీవితాంతం ఏటా సమ్ అష్యూర్డ్‌లో (బీమా కవరేజీలో) 10 శాతం చొప్పున లభిస్తుందని తెలిపారు. ఇది మార్కెట్లో సంచలనాన్ని సృష్టిస్తుందన్నారు. 20–25 ఏళ్ల తర్వాత ఎంత చొప్పున వస్తుంది, ఎంత ప్రీమియం చెల్లించాలన్నది తెలుసుకునేందుకు ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపిస్తారని పేర్కొన్నారు. ఈ ప్లాన్‌పై రుణ సదుపాయం, ముందస్తు ఉపసంహరణకూ అవకాశం ఉంటుందన్నారు. హామీతో కూడిన రాబడులు ఇచ్చే పాలసీలకు పాలసీదారులు, వాటాదారులు ఆసక్తి చూపిస్తున్నారని చెబుతూ.. తమ కంపెనీ వాటాదారుల్లో చాలా మంది పాలసీదారులుగా ఉన్నట్టు మహంతి తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో (ఏప్రిల్–సెపె్టంబర్) నూతన వ్యాపార ప్రీమియం (ఇండివిడ్యువల్) 2.65 శాతమే వృద్ధి చెంది రూ.25,184 కోట్లకు చేరుకోవడం గమనార్హం. -
బ్యాంక్‌లు మారాలి.. లేదంటే మూత: కేవీ కామత్
ముంబై: బ్యాంక్‌లు ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ తమను తాము కొత్తగా ఆవిష్కరించుకోవాలని.. విధానాలు, పని నమూనాలను కాలానికి అనుగుణంగా పనిచేసేలా చూసుకోవాలని వెటరన్ బ్యాంకర్ కేవీ కామత్ అభిప్రాయపడ్డారు. ఈ విధంగా చేయలేని బ్యాంక్‌లు వాటి దుకాణాలను మూతేసుకోవాల్సి వస్తుందని కొంత హెచ్చరికగా పేర్కొన్నారు. గ్లోబల్ ఫిన్‌టెక్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు. బ్యాంక్‌లు నూతనతరం ఫిన్‌టెక్ కంపెనీలతో కలసి పనిచేయాలన్నారు. -
కొత్త పాలసీల ప్రీమియంలో కనిపించని వృద్ధి
ముంబై: జీవిత బీమా కంపెనీలు కొత్త పాలసీల ప్రీమియం రూపంలో జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో రూ.73,005 కోట్లను సమకూర్చుకున్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో వచి్చన ప్రీమియం ఆదాయం రూ.73,674 కోట్లతో పోల్చి చూస్తే నికరంగా 0.9 శాతం మేర క్షీణించింది. జీవిత బీమా రంగంలోనే దిగ్గజ సంస్థ అయిన ఎల్ఐసీపై ఎక్కువ ప్రభావం పడింది. క్రితం ఏడాది జూన్ త్రైమాసికంలో జీవిత బీమా కంపెనీల నూతన పాలసీల ప్రీమియం ఆదాయం 40 శాతం వృద్ధి చెందడం గమనార్హం. జూన్ క్వార్టర్లో ఎల్ఐసీ న్యూ బిజినెస్ ప్రీమియం ఆదాయం 7 శాతం క్షీణించి రూ.44,837 కోట్లకు పరిమితమైంది.(ఎస్బీఐ ఖాతాదారులకు అదిరిపోయే వార్త!) ఇండివిడ్యువల్ (వ్యక్తుల) సింగిల్ ప్రీమియం ఆదాయం 1.4 శాతం తగ్గి రూ.4,568 కోట్లుగా ఉంది. కానీ, క్రితం ఏడాది ఇదే కాలంలో ఎల్ఐసీ ఈ విభాగంలో 38 శాతం ప్రీమియం ఆదాయ వృద్ధిని నమోదు చేసింది. ఇండివిడ్యువల్ నాన్ సింగిల్ ప్రీమియం ఆదాయం 6.6 శాతం తగ్గి రూ.5,871 కోట్లుగా ఉంది. గ్రూప్ సింగిల్ ప్రీమియం 7.4 శాతం తగ్గి రూ.33,465 కోట్లుగా నమోదైంది. జూన్ త్రైమాసికం చివరి నెలలో మాత్రం ఎల్ఐసీ తొలి ఏడాది ప్రీమియం ఆదాయంలో 18.3 శాతం వృద్ధిని చూపించింది. మే నెలలో 4.1 శాతం క్షీణతతో పోలిస్తే మెరుగైన పనితీరు చూపించింది. ఇక ప్రైవేటు జీవిత బీమా సంస్థలు అన్నింటి నూతన ప్రీమియం ఆదాయం జూన్ క్వార్టర్లో 10.6 శాతం పెరిగి రూ.28,168 కోట్లుగా నమోదైంది. (నిజంగా భయంకరమే..! రేణూ దేశాయ్ అద్భుతమైన పిక్స్ వైరల్!) -
APSSDC: ఏపీఎస్ఎస్డీసీకి జాతీయ గుర్తింపు.. ఎందుకంటే?
సాక్షి, అమరావతి: నైపుణ్యాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ నైపుణ్య అభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్డీసీ) అమలు చేస్తోన్న కొత్త విధానాలకు జాతీయ గుర్తింపు లభించింది. కర్ణాటకలో జరుగుతున్న 2వ ఇండిగ్లోబల్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ సమ్మిట్‌లో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న నూతన స్కిల్ విధానాలను అభినందిస్తూ అవార్డు వచ్చినట్లు ఏపీఎస్ఎస్డీసీ సోమవారం ప్రకటన విడుదల చేసింది. చదవండి: AP: ఎస్ఎల్బీసీ నివేదిక.. వారికి భారీగా రుణాలు 5 రాష్ట్రాలకు చెందిన 20కిపైగా యూనివర్సిటీ విద్యార్థులు, 20 రంగాలకు చెందిన పరిశ్రమలు పాల్గొన్న ఈ సమ్మిట్‌లో న్యూ ఆక్టివిటీస్ అండ్ క్యాస్కేడింగ్ స్కిల్ సిస్టమ్ గురించి ఏపీఎస్ఎస్డీసీ ప్రెజెంటేషన్ ఇచ్చింది. దానికి అవార్డు లభించడంపై ఏపీఎస్ఎస్డీసీ ఎండీ ఎస్ సత్యనారాయణ ఉద్యోగులకు అభినందనలు తెలిపారు. -
AP: ఎగుమతులపై ‘పుష్’ పాలసీ
సాక్షి, అమరావతి: సముద్ర ఆధారిత వాణిజ్య అవకాశాలపై ప్రధానంగా దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం కొత్త పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణంతో పాటు లాజిస్టిక్స్, ఎగుమతులను ప్రోత్సహించేలా నూతన పాలసీలను తెస్తోంది. 2020–21లో రూ.1.24 లక్షల కోట్లుగా ఉన్న రాష్ట్ర వాణిజ్య ఎగుమతులను వచ్చే ఐదేళ్లలో రూ.3.50 లక్షల కోట్లకు చేర్చాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందుకోసం ఏపీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ పాలసీ –2022 – 27 రూపొందించింది. ఈ ముసాయిదా పాలసీకి రాష్ట్ర కేబినెట్ గురువారం ఆమోదం తెలిపింది. చదవండి: ఎంఎస్ఎంఈ ప్రణాళికపై ఏపీ ప్రభుత్వం కసరత్తు ‘పుష్’ విధానంతో రెట్టింపు ఎగుమతులను రెట్టింపు చేసేలా ‘పుష్’ (పీయూఎస్‌హెచ్) విధానాన్ని అమలు చేయనున్నట్లు ముసాయిదా పాలసీలో పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉత్పత్తులకు మరింత విలువను జోడించడం ద్వారా ఎగుమతులను ప్రోత్సహించనున్నారు(ప్రమోట్–పీ). ఇందుకోసం జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ఎగుమతి ప్రోత్సాహక వ్యవస్థలను అభివృద్ధి చేస్తారు. ఎగుమతులకు కీలకమైన ఓడ రేవులు, గోడౌన్లు, కోల్డ్ స్టోరేజ్లతో పాటు మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులు లాంటి కీలక మౌలిక వసతులను అభివృద్ధి (అప్‌గ్రేడ్–యూ) చేయనున్నారు. ఇప్పటికే 4 పోర్టులు, 9 ఫిషింగ్ హార్బర్లతో పాటు విశాఖ, అనంతపురంలో 2 మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. వీటితో పాటు మౌలిక వసతుల కల్పనతో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేలా పలు ప్రోత్సాహకాలను ముసాయిదాలో ప్రతిపాదించారు. ఎగుమతుల విధానాన్ని స్ట్రీమ్‌లైన్ (ఎస్) చేస్తూ నూతన టెక్నాలజీ వినియోగం ద్వారా (హార్నెస్–హెచ్) ఎగుమతులను ప్రోత్సహించేలా ముసాయిదా పాలసీలో ప్రతిపాదించారు. ఆరు ఆంశాలపై దృష్టి ఎగుమతులను ప్రోత్సహించేందుకు ఆరు కీలక అంశాలపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించనుంది. ఎగుమతుల సమాచారమంతా ఒకేచోట లభించే విధంగా డ్యాష్‌బోర్డు అభివృద్ధి చేయడంతోపాటు టెక్నాలజీని మరింతగా వినియోగించుకోనున్నారు. గిడ్డంగులు, శీతల గిడ్డంగులు, సముద్ర ఉత్పత్తుల ప్రాసెసింగ్ యూనిట్లు, లాజిస్టిక్ హబ్, ఎయిర్‌పోర్టులు, పోర్టు, రహదారుల అనుసంధానం లాంటి వాటిపై భారీగా ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ప్రతి జిల్లాను ఎక్స్పోర్ట్ హబ్‌గా తీర్చిదిద్ది ఎగుమతి ప్రోత్సాహక కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. నాణ్యతా పరమైన కారణాలతో ఎగుమతులు తిరస్కరణకు గురి కాకుండా క్వాలిటీ టెస్టింగ్ కేంద్రాలను ఎక్కడికక్కడ ఏర్పాటు చేస్తారు. నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించండంతో పాటు ఆర్థిక ప్రోత్సాహకాలను కల్పించేలా పాలసీలో పలు ప్రతిపాదనలు పొందుపర్చారు. ‘స్వయం ఆంధ్రా’ పేరుతో బ్రాండింగ్ రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే వస్తువులను అంతర్జాతీయంగా సరఫరా చేసే విధంగా ‘స్వయం ఆంధ్రా’ పేరుతో ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ (ఏపీటీపీసీ)ఎగుమతులను ప్రోత్సహించనుంది. కేవలం ఎగుమతుల కోసం ఉత్పత్తి పేరుతో అంతర్జాతీయంగా ప్రచారం కల్పించి నాణ్యత ధ్రువీకరణ సదుపాయాలు కల్పిస్తారు. సర్టిఫికేషన్ చార్జీలపై సబ్సిడీ, మార్కెటింగ్, అంతర్జాతీయ ట్రేడ్ ఫెయిర్స్లో పాల్గొనే వారికి రాయితీలతో పాటు ఫైనాన్సింగ్, అవార్డులు లాంటి ప్రోత్సాహకాలను పాలసీలో ప్రతిపాదించారు. ♦తూర్పు తీరంలో 974 కి.మీ సుదీర్ఘ సముద్ర తీరం కలిగిన ఏకైక రాష్ట్రం ♦14 నోటిఫైడ్ పోర్టులు ఉండగా 6 పోర్టుల్లో కార్యకలాపాల నిర్వహణ ♦మరో నాలుగు గ్రీన్ ఫీల్డ్ పోర్టులను అభివృద్ధి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ♦2020–21 నాటికి రాష్ట్ర వాణిజ్య ఎగుమతులు రూ.1.24 లక్షల కోట్లు. ఇది దేశ జీడీపీలో 19.14 శాతానికి సమానం ♦దేశం మొత్తం ఎగుమతుల్లో రాష్ట్రం వాటా 5.8 శాతం ♦దేశీయ ఎగుమతుల సంసిద్ధత ర్యాంకుల్లో 20 నుంచి 9 స్థానానికి ఎగబాకిన ఏపీ ♦వచ్చే ఐదేళ్లలో రాష్ట్ర ఎగుమతులను రూ.3.50 లక్షల కోట్లకు చేర్చడం లక్ష్యం. జిల్లాల వారీగా ఉత్పత్తులకు ప్రోత్సాహం ఒక్కో జిల్లాల్లో ఎగుమతికి అవకాశం ఉన్న వాటిని గుర్తించి ప్రోత్సహిస్తాం. ఎగుమతులను రెట్టింపు చేయడమే లక్ష్యంగా పోర్టులు, ఎయిర్‌పోర్టుల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. – గుడివాడ అమర్నాథ్, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి పోర్టులపై రూ.20,000 కోట్లు సముద్ర వాణిజ్య అవకాశాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా దృష్టిసారించింది. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఒకేసారి నాలుగు ఓడరేవులు, తొమ్మిది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాన్ని చేపట్టింది. ఇందుకోసం సుమారు రూ.20,000 కోట్లు వ్యయం చేస్తోంది. – మురళీధరన్, సీఈవో, ఏపీ మారిటైమ్ బోర్డు -
జూన్‌లోనూ జీవిత బీమా జోరు
న్యూఢిల్లీ: జీవిత బీమా కంపెనీలు జూన్‌లోనూ మంచి పనితీరు చూపించాయి. నూతన పాలసీల నుంచి వచ్చే మొదటి ఏడాది ప్రీమియం(న్యూ బిజినెన్ ప్రీమియం)లో 4% వృద్ధి నమోదైంది. ఈ రూపంలో రూ.30,009 కోట్ల ఆదాయం వచ్చినట్టు బీమా రంగ నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏఐ) గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. క్రితం ఏడాది జూన్ నెలలో అన్ని జీవిత బీమా కంపెనీల కొత్త పాలసీల ప్రీమియం ఆదాయం రూ.28,869 కోట్లుగా ఉండడం గమనార్హం. దేశంలో 24 జీవితబీమా కంపెనీలుండగా.. ఎల్ఐసీ అతిపెద్ద మార్కెట్ వాటాతో దిగ్గజ సంస్థగా కొనసాగుతోంది. ఎల్ఐసీ నూతన ప్రీమియం ఆదాయం ఈ ఏడాది జూన్‌లో 4.14 శాతం పడిపోయింది. 2020 జూన్‌లో కొత్త పాలసీల రూపంలో రూ.22,737 కోట్ల మేర ప్రీమియం ఆదాయం ఎల్ఐసీకి సమకూరగా.. 2021 జూన్‌లో ఆదాయం రూ.21,796 కోట్లకు పరిమితమైంది. మిగిలిన 23 ప్రైవేటు జీవిత బీమా కంపెనీలకు నూతన పాలసీల రూపంలో ఆదాయం 34% పెరిగి రూ.6,132 కోట్ల నుంచి రూ.8,213 కోట్లకు చేరుకుంది. జూన్ త్రైమాసికంలో 7 శాతం వృద్ధి... ఈ ఏడాది (2021–22) జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలోనూ 24 జీవిత బీమా సంస్థల నూతన వ్యాపార ప్రీమియం 7% పెరిగి (క్రితం ఏడాది ఇదే కాలంలో పోలిస్తే) రూ.53,725 కోట్లుగా నమోదైంది. ఎల్ఐసీ వరకే చూస్తే తొలి త్రైమాసికంలో ప్రీమియం ఆదాయం 2.54% తగ్గి రూ.25,601 కోట్లుగా ఉంది. 23 ప్రైవేటు జీవిత బీమా సంస్థల తొలి ప్రీమియం ఆదాయం జూన్ క్వార్టర్లో 34% వృద్ధితో రూ.17,124 కోట్లుగా నమోదైంది. 2021 జూన్ నాటికి మొత్తం జీవిత బీమా కవరేజీ (సమ్ అష్యూర్డ్) పరంగా చూస్తే ఎల్ఐసీ మార్కెట్ వాటా 12.55%గా ఉంటే, మిగిలిన 23 జీవిత బీమా కంపెనీలకు సంబంధించి సమ్ అష్యూర్డ్ 87.45%. ఎల్ఐసీ ఎక్కువగా ఎండోమెంట్ పాలసీలను విక్రయిస్తుంటుంది. వీటిపై జీవిత బీమా కవరేజీ తక్కువగా ఉండడం వల్లే ఇంత అంతరం కనిపిస్తోంది. ప్రొటెక్షన్ పాలసీల్లో (టర్మ్‌ప్లాన్లు) ప్రైవేటు బీమా సంస్థల ఆధిపత్యం ఎక్కువగా ఉంటోంది. జీవిత బీమా అంటేనే.. జీవితానికి రక్షణ కల్పించేదని అర్థం. ఇందుకు ఉదాహరణ టర్మ్ ప్లాన్లు. కానీ, నామమాత్రపు కవరేజీనిస్తూ.. 4–5% రాబడులిచ్చే ఎండోమెంట్ ప్లాన్లనే ఇప్పటికీ ఎక్కువ మంది తీసుకోవడం గమనార్హం. సాధారణ బీమా సైతం వృద్ధి పథమే సాధారణ బీమా సంస్థల (జీవిత బీమా కంపెనీలు కాకుండా) స్థూల ప్రత్యక్ష ప్రీమియం ఆదాయం జూన్ నెలలో 7 శాతం వృద్ధితో రూ14,809 కోట్లుగా నమోదైంది. దేశంలో 32 సాధారణ బీమా సంస్థలు పనిచేస్తున్నాయి. ఇవి క్రితం ఏడాది జూన్‌లో రూ.13,842 కోట్ల స్థూల ప్రత్యక్ష ఆదాయాన్ని పొందడం గమనార్హం. 25 సాధారణ బీమా సంస్థలకు సంబంధించి ప్రత్యక్ష ప్రీమియం ఆదాయం 5 శాతం పెరిగి రూ.13,041 కోట్లుగా ఉంది. ఐదు స్టాండలోన్ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థల ప్రీమియం ఆదా యం ఏకంగా 47 శాతం వృద్ధితో రూ.1,557 కోట్లకు చేరుకుంది. కరోనా వచ్చిన తర్వాత చాలా మంది హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం, ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవడంతో.. వీటిని తీసుకునే వారు పెరుగుతున్నారు. -
ఏపీలో విద్య.. మహోన్నతం
ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ ఏర్పాటు, సంస్కరణల్లో భాగంగా పాఠ్య ప్రణాళికల్లో సమూల మార్పులు, నైపుణ్యాభివృద్ధికి అప్రెంటీస్ షిప్ తప్పనిసరి, నాలుగేళ్ల హానర్స్ డిగ్రీ కోర్సులు, డిగ్రీ కోర్సుల్లో పూర్తిగా ఆంగ్ల మాధ్యమం, విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధికి స్కిల్‌డెవలప్‌మెంటు వర్సిటీ ఏర్పాటుతో రాష్ట్ర ఉన్నత విద్యా రంగంలో కొత్త శకం మొదలైంది. పార్లమెంటు నియోజకవర్గానికి ఒక నైపుణ్యాభివృద్ధి విద్యా సంస్థ ఏర్పాటు, విద్యార్థులకు శిక్షణ కోసం కాలేజీలతో పరిశ్రమల ఒప్పందం.. ఐటీ సంస్థలు, వర్తక వాణిజ్య సంస్థల అనుసంధానం, పరిశ్రమలకు అవసరమైన అంశాలను ముందుగానే గుర్తించి అందుకు అనుగుణంగా విద్యార్థులకు ఆయా కోర్సుల్లో తర్ఫీదు ఇవ్వడం తదితర కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తుండటం వల్ల ఉన్నత విద్య కొత్త కళ సంతరించుకుంది. సాక్షి, అమరావతి: రెండేళ్లుగా రాష్ట్రంలో ఉన్నత విద్య కొత్తపుంతలు తొక్కుతోంది. వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలతో బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు ఉన్నత చదువులు మరింత చేరువయ్యాయి. ఉన్నత విద్యనభ్యసించే వారికి ఎలాంటి ఆర్థిక భారం లేకుండా ప్రభుత్వమే పూర్తి స్థాయిలో విద్యార్థులకు అండదండలు అందిస్తుండడంతో చేరికల నుంచి అన్ని అంశాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన విద్య అందేలా ఉన్నత విద్యలో ప్రవేశపెట్టిన సంస్కరణలతో విద్యార్థుల్లో నైపుణ్యం, సామర్థ్యం పెరిగి వారి భవిష్యత్తు ఆశావహంగా మారుతోంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలకూ మార్గం సుగమమవుతోంది. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఉన్నత చదువుల పరిస్థితి నిరాశాజనకంగా ఉండింది. అప్పట్లో విద్యార్థులకు ఫీజుల భారం ఎక్కువగా ఉండేది. ప్రభుత్వం నుంచి అందే సహకారం అంతంత మాత్రమే కావడంతో పాటు వసతి, భోజనాలకు తల్లిదండ్రులు అప్పులు చేయాల్సి వచ్చేది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉన్నత విద్య సర్వే నివేదికలోని అంశాలను గమనిస్తే చంద్రబాబు హయాంలో ఉన్నత విద్య ఎంతలా కునారిల్లిపోయిందో స్పష్టమవుతుంది. 2015–16 నుంచి 2019–20 వరకు అయిదేళ్ల కాలంలో.. తొలి నాలుగేళ్లూ చంద్రబాబు హయాంలో దుస్థితిని కళ్లకు కట్టినట్లు చూపిస్తుండగా 2019–20లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక క్రమేణా పరిస్థితి మెరుగు పడుతున్న అంశాన్ని స్పష్టం చేస్తోంది. ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిన అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రభావంతో ఉన్నత విద్య పరుగులు తీస్తోంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టే తదుపరి ఉన్నత విద్యా సర్వే కార్యక్రమాలు కోవిడ్ కారణంగా ముందుకు సాగకపోవడం వల్ల ఆ నివేదికలు పూర్తి కాలేదు. అవీ పూర్తయితే రాష్ట్రంలో ఉన్నత విద్యలోని విప్లవాత్మకత దేశ వ్యాప్తంగా మరింతగా ప్రస్ఫుటం అయ్యేందుకు ఆస్కారం ఉంటుంది. చేరికల్లో పెరుగుదల చంద్రబాబు హయాంలో ఎలాంటి ప్రోత్సాహకాలు లేనందున ఉన్నత విద్యలో చేరికలు తక్కువగానే ఉన్నాయి. దేశంలో కాలేజీల్లో సగటు ఎన్రోల్మెంటుకు ఏపీ చాలా దూరంలో ఉండింది. ఈ ప్రభుత్వం వచ్చాక మెల్లమెల్లగా పరిస్థితులు మెరుగు పడుతున్నాయి. 2015–16లో దేశంలో ఉన్నత విద్యలో చేరికల గరిష్ట నిష్పత్తి జాతీయ స్థాయిలో 24.5 శాతం కాగా ఏపీలో 30.08 శాతంగా ఉంది. 2019–20లో జాతీయ గరిష్ట చేరికల నిష్పత్తి 27.1 శాతం కాగా ఏపీలో 35.2 శాతానికి చేరింది. ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్న నేపథ్యంలో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో 70 నుంచి 90 శాతానికి పెరిగేలా చూడాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల అధికారులకు లక్ష్యాలను నిర్దేశించారు. కాలేజీల్లో సగటు చేరికలు జాతీయ స్థాయిలో 2015–16లో 721గా ఉండగా ఏపీలో 494 మందిగా ఉంది. అదే 2019–20లో జాతీయ సగటు 680 కాగా ఏపీలో 524కు చేరింది. ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మహిళలకు వెన్నుదన్నుగా గతంలో టీడీపీ ప్రభుత్వం విద్యార్థుల చదువులకు అందించే ప్రోత్సాహం అంతంత మాత్రంగా ఉండడంతో ఆర్థిక భారం మోయలేక అనేక మంది ఉన్నత విద్యకు దూరం అయ్యారు. ప్రస్తుత ప్రభుత్వం జగనన్న విద్యాదీవెన కింద పూర్తి ఫీజు రీయంబర్స్‌మెంటుతో పాటు వసతి సదుపాయాల కోసం జగనన్న వసతి దీవెన కింద ఏటా రూ.20 వేల వరకు అందిస్తోంది. దీంతో విద్యార్థులకు ఆర్థికంగా ఎలాంటి భారం లేకుండా వారు చదువుకోవడానికి అనువైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఫలితంగా కాలేజీల్లో చేరికలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, విద్యార్థినుల చేరికలూ క్రమేణా మెరుగు పడుతున్నాయి. మహిళల చేరికలను గమనిస్తే పీజీ కోర్సుల్లో 2015–16లో బాలురు 1,40,943 మంది ఉండగా బాలికలు 1,07,697 మంది ఉన్నారు. అదే అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ) కోర్సుల్లో బాలురు 7,42,513 కాగా, బాలికలు 5,86,407గా ఉన్నారు. 2019–20 నాటికి పీజీలో 1,12,024 మంది బాలురు కాగా, బాలికలు 1,05,816 మంది ఉన్నారు. యూజీ కోర్సుల్లో బాలురు 7,98,084 మంది కాగా, బాలికలు 6,96,983 మంది ఉన్నారు. గతంలో కన్నా బాలికల చేరికల శాతం మెరుగు పడింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు అన్ని రకాలుగా సాయం అందుతుండడంతో వారి చేరికలు గణనీయంగా పెరిగాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల చేరికలు ఇలా.. సంవత్సరం మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ 2015–16 17,24,538 2,64,142 71,700 6,92,790 2016–17 17,99,433 3,00,767 75,663 7,26,750 2017–18 16,97,282 2,73,702 73,655 7,08,530 2018–19 17,60,830 2,90,802 78,687 7,65,507 2019–20 18,97,149 3,16,573 88,231 8,37,454 దేశంలో 2015–16 నుంచి 2019–20 వరకు ఉన్నత విద్య స్థితిగతులు ఇలా.. ►ఉన్నత విద్యలో 3.85 కోట్ల మంది చదువుతున్నారు. వీరిలో 1.96 కోట్ల మంది బాలురు. 1.89 కోట్ల మంది బాలికలు. మొత్తం చేరికల్లో బాలికలు 49 శాతంగా ఉన్నారు. ►దేశంలో 16.6 శాతం కాలేజీల్లో 100 కన్నా తక్కువ మంది విద్యార్థులున్నారు. 4 శాతం కాలేజీల్లో మాత్రమే 3 వేల మందికి మించి చేరికలున్నాయి. ►దేశంలో 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉన్న వారిలో ఉన్నత విద్యలో చదువుతున్న వారు (గ్రాస్ ఎన్రోల్మెంటు రేషియో–జీఈఆర్) 27.1 శాతం ఉన్నారు. జనాభా సంఖ్య ప్రకారం బాలురు 26.9 శాతం కాగా, బాలికల చేరికలు 27.3 శాతంగా ఉంది. ►జాతీయ సగటుతో పోలిస్తే ఎస్సీల్లో 23.4 శాతం, ఎస్టీల్లో 18 శాతం మంది ఉన్నత విద్యలో చేరుతున్నారు. ►79.5 శాతం మేర చేరికలు అండర్ గ్రాడ్యుయేషన్లోఉండగా, పీహెచ్డీ స్థాయికి వచ్చే సరికి అది 0.5 శాతం మాత్రమే ఉంటోంది. ఎక్కువ మంది విద్యార్థులు బీఏలో ఉండగా తదుపరి చేరికలు బీఎస్సీ, బీకాంలలో ఉన్నాయి. ఆర్ట్స్, హ్యూమానిటీస్, సోషల్ సైన్సెస్‌లో 32.7 శాతం మంది, సైన్సులో 16 శాతం మంది, కామర్స్‌లో 14.9 శాతం మంది, ఇంజనీరింగ్‌లో 12.6 శాతం మంది చేరుతున్నారు. ►మొత్తం కాలేజీల్లో 78.6 శాతం ప్రైవేట్ సెక్టార్లో ఉన్నాయి. వైద్య విద్యకు అత్యధిక ప్రాధాన్యం ప్రజల ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం.. ఈ దిశగా ప్రజలందరికీ నాణ్యమైన సత్వర వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా కొత్తగా 16 వైద్య కళాశాలల నిర్మాణానికి వేగంగా చర్యలు తీసుకుంటోంది. స్థలాల సేకరణ, డిజైన్లు, మౌలిక వసతులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే ఆదేశించారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఒక బోధన కళాశాల, ఒక నర్సింగ్ కళాశాల ఉండేలా చర్యలు తీసుకున్నారు. తద్వారా రాష్ట్ర విద్యార్థులు ఎంతో మందికి ఎంబీబీఎస్, నర్సింగ్ కోర్సుల సీట్లు అదనంగా రానున్నాయి. వీటితో పాటు పీజీ వైద్య సీట్లు కూడా పెరుగుతున్నాయి. కాగా, యువతలో నైపుణ్యాభివృద్ధికి సంబంధించి ప్రత్యేకంగా యూనివర్సిటీని ఏర్పాటు చేస్తుండటం విశేషం. -
అగ్ని ప్రమాదాలకు మూడు ప్రామాణిక పాలసీలు
న్యూఢిల్లీ: అగ్ని ప్రమాదాలు, వాటి కారణంగా ఏర్పడే ఇతర ప్రమాదాల నష్టాన్ని భర్తీ చేసే ప్రామాణిక బీమా పాలసీలను కనీసం మూడింటిని ప్రవేశపెట్టాలని అన్ని సాధారణ బీమా సంస్థలను ఐఆర్డీఏఐ ఆదేశించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న ‘స్టాండర్డ్ ఫైర్ అండ్ స్పెషల్ పెరిల్స్’(ఎస్ఎఫ్ఎస్పీ) స్థానంలో.. ‘భారత్ గృహ రక్ష’, భారత్ సూక్ష్మ ఉద్యమ్ సురక్ష, భారత్ లఘు ఉద్యమ్ సురక్ష పాలసీలను ప్రవేశపెట్టాలని ఐఆర్డీఏఐ(బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ) తన ఆదేశాల్లో పేర్కొంది. ఏప్రిల్ 1 నుంచి సాధారణ బీమా సంస్థలు వీటిని తప్పకుండా ఆఫర్ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఇల్లు, ఇంట్లోని వస్తువుల కవరేజీకి ఉద్దేశించినది భారత్ గృహ రక్ష పాలసీ. ఇంటితో పాటు ఇంట్లో వస్తువులకూ ఆటోమేటిక్‌గా బీమాలో 20 శాతం కవరేజీ (గరిష్టంగా రూ.10 లక్షలు) లభిస్తుంది. ఇంతకుమించి విలువైన వస్తువులు ఇంట్లో ఉంటే వాటిని ప్రపోజల్ పత్రంలో పేర్కొనడం ద్వారా మరింత కవరేజీని పొందొచ్చు. భారత్ సూక్ష్మ ఉద్యమ్ సురక్ష అన్నది సంస్థల కోసం ప్రత్యేకించినది. రూ.5 కోట్ల వరకు రిస్క్ కవర్‌ను ఇందులో భాగంగా ఆఫర్ చేయాల్సి ఉంటుంది. భారత్ లఘు ఉద్యమ్ సురక్ష పాలసీ.. రూ.5 కోట్లకు మించి రూ.50 కోట్ల వరకు సంస్థల కోసం బీమా కవరేజీని ఆఫర్ చేస్తుంది. -
వచ్చే ఏడాది పాలసీల వెల్లువ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బీమా కంపెనీల నుంచి వచ్చే ఏడాది పాలసీలు వెల్లువలా వచ్చిపడతాయని ఇండియా ఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ తెలిపింది. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏ) చొరవతో వినూత్న పాలసీలు రానున్నాయని ఇండియాఫస్ట్ డిప్యూటీ సీఈవో రుషభ్ గాంధీ బుధవారమిక్కడ మీడియాకు తెలిపారు. పాలసీదారులకు అనుకూలంగా ఉండేలా కంపెనీలు వీటిని రూపొందిస్తున్నాయని చెప్పారు. మూడు పాలసీలకు తాము దరఖాస్తు చేశామన్నారు. గత ఆర్థిక సంవత్సరం మాదిరిగా 2019–20లో కంపెనీ సుమారు రూ.3,200 కోట్ల వ్యాపారం అంచనా వేస్తోందని తెలిపారు. ఇందులో నూతన వ్యాపారం రూ.1,000 కోట్లు ఆశిస్తున్నట్టు వెల్లడించారు. కాగా, సాండ్‌బాక్స్ పేరుతో ఐఆర్డీఏ ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం ఉన్న పాలసీలకు భిన్నంగా.. కస్టమర్లకు అనుకూలంగా ఉండే పాలసీలను రూపొందించేలా బీమా కంపెనీలను ప్రోత్సహిస్తోంది. సాండ్‌బాక్స్ కింద అనుమతి పొందిన బీమా ప్లాన్‌కు తొలుత నియంత్రణ పరంగా కొంత వెసులుబాటు ఉంటుంది. పరిమిత కాలానికి, పరిమిత సంఖ్యలో పాలసీలను కంపెనీలు విక్రయించాల్సి ఉంటుంది. ఫలితాలనుబట్టి అట్టి ప్లాన్‌ను కొనసాగించాలా లేదా అన్నది ఐఆర్డీఏ నిర్ణయిస్తుంది. -
ఎన్‌బీఎఫ్‌సీలకు కొత్తగా ఎల్‌సీఆర్
న్యూఢిల్లీ: బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు (ఎన్బీఎఫ్సీ) సంబంధించి లిక్విడిటీ కవరేజీ రేషియో (ఎల్‌సీఆర్)ను ఆర్బీఐ తీసుకురానుంది. డిపాజిట్లు తీసుకునే అన్ని ఎన్బీఎఫ్సీలతోపాటు, రూ.5,000 కోట్ల ఆస్తులున్న ప్రతీ ఎన్బీఎఫ్సీ కూడా ఈ విధానం పరిధిలోకి రానుంది. ఈ మేరకు ఆర్బీఐ నూతన మార్గదర్శకాలను రూపొందించింది. ఇందుకు సంబంధించి ముసాయిదా మార్గదర్శకాలను శుక్రవారం విడుదల చేసింది. ఎన్బీఎఫ్సీ రంగంలో లిక్విడిటీ సమస్యలకు ముగింపు పలకడం, ఐఎల్ఎఫ్ఎస్ తరహా సంక్షోభాల నివారణ కోసం ఆర్బీఐ ఈ చర్యలను చేపట్టింది. ఎల్‌సీఆర్ విధానానికి ఎన్బీఎఫ్సీ రంగం సాఫీగా మారేందుకు వీలుగా... 2020 ఏప్రిల్ నుంచి 2014 ఏప్రిల్ వరకు నాలుగేళ్ల కాలంలో అంచలంచెలుగా అమలు చేయాలన్నది ఆర్బీఐ ప్రణాళిక. ‘‘ఎన్బీఎఫ్సీలు తప్పనిసరిగా తగినంత అధిక నాణ్యత కలిగిన లిక్విడ్ ఆస్తులను (హెచ్క్యూఎల్ఏ) కలిగి ఉండాలి. తీవ్రమైన నిధుల లభ్యత సమస్య ఏర్పడినప్పుడు ఈ ఆస్తులను 30 రోజుల అవసరాలకు సరిపడా నగదుగా మార్చుకోవచ్చు’’ అని ఆర్బీఐ ముసాయిదా మార్గదర్శకాల్లో తెలియజేసింది. 60 శాతం ఎల్‌సీఆర్ ‘‘2020 ఏప్రిల్ 1 నుంచి ఎల్‌సీఆర్ నిబంధనలకు ఎన్బీఎఫ్సీలు కట్టుబడి ఉండాలి. కనీసం 60 శాతంగా ఎల్‌సీఆర్ ఉండాలి. క్రమంగా 2024 ఏప్రిల్ నాటికి ఈ కవరేజీని 100 శాతానికి చేరాల్సి ఉంటుంది’’అని ఆర్బీఐ పేర్కొంది. ఎన్బీఎఫ్సీ రంగంలో ఇటీవలి పరిణామాల విశ్లేషణ తర్వాతే ఈ మార్గదర్శకాలను తీసుకొచ్చినట్టు తెలిపింది. ఇక అప్లికేషన్ ఆఫ్ జనరిక్ అస్సెట్ లయబిలిటీ మేనేజ్మెంట్ (ఏఎల్ఎమ్) తదితర ఇతర మార్గదర్శకాలు కూడా ఈ ముసాయిదాలో ఉన్నాయి. ఎన్బీఎఫ్సీ ఉన్నత స్థాయి యాజమాన్యంతో కూడిన అస్సెట్ లయబిలిటీ మేనేజ్మెంట్ కమిటీ (ఏఎల్సీవో)ని కూడా ఆర్బీఐ ప్రతిపాదించింది. లిక్విడిటీ రిస్క్ నిర్వహణ కోసం దీన్ని సూచించింది. ఎన్బీఎఫ్సీ రుణ కార్యకలాపాలపై ఇబ్బందులు ఎదురైతే ఎదుర్కొనేందుకు అత్యవసర నిధి ప్రణాళికను కూడా రూపొందించుకోవాలని పేర్కొంది. -
ఉదారవాదుల గుండెల్లో గుబులు
నరేంద్రమోదీకి హృదయపూర్వకంగా స్వాగతం చెప్పిన ఉదారవాదులు పునరాలోచనలో పడినట్టు కనిపిస్తున్నారు. మన్మోహన్సింగ్ రెండోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపైన వెల్లువలా వచ్చిపడిన అవినీతి ఆరోపణలు ఉదారవాదులకు ఆగ్ర హం కలిగించాయి. పార్లమెంటులోనూ, ఎలక్ట్రానిక్ మీడి యాలోనూ, వార్తాపత్రికలలోనూ, జనసామాన్యంలోనూ కుంభకోణాలపైన తర్జనభర్జన జరుగుతుంటే మన్మోహన్ సింగ్ అంతులేని మౌనం పాటించడం, సోనియా గాంధీ స్పందన ఏమిటో తెలియకపోవడం, రాహుల్‌గాంధీ ఒకటి రెండు సందర్భాలలో నాట కీయంగా అవినీతి వ్యతిరేకతను ప్రదర్శించడానికే పరిమితం కావడంతో ఆగ్రహానికి అవమానం తోడై ఉదారవాద హృదయాలను దహించడం ప్రారంభించింది. భారతీయ జనతాపార్టీ (భాజపా) ప్రధాని అభ్యర్థిగా నరేంద్రమోదీ ఎంపిక కావ డం, భీష్మ, ద్రోణ, కృపాచార్యులను పూర్వపక్షం చేసిన మోదీ దేశవ్యాప్తంగా వంద లాది బహిరంగసభలలో కోట్లాది ప్రజలను ఉద్దేశించి అత్యంత శక్తిమంతంగా, ప్రభావ వంతంగా ప్రసంగించడం, ఆర్థిక సంస్కరణలను వేగవంతం చేయడం, స్వచ్ఛమైన, సమర్థమైన పరిపాలన, పరిశుభ్రతకు పెద్దపీట, విద్యారంగంలో పెనుసంస్కరణల వంటి వాగ్దానాలు తనదైన శైలిలో ధాటిగా, నిస్సంకోచంగా చేయడంతో నిజంగానే దేశానికి ‘అచ్ఛేదిన్’ (మంచి రోజులు) వచ్చేశాయని సంతోషించారు. తొలి అడుగులలో విశ్వాసం ఇరవై సంవత్సరాల సంకీర్ణ సంక్షోభాల అనంతరం భాజపా స్వయంగా లోక్‌సభలో మెజారిటీ పార్టీగా అవతరించడంతో మోదీ ఎన్నికల వాగ్దానాల అమలు నల్లేరు మీద బండిలాగా సాగుతుంది కదా అనుకున్నారు. మహారాష్ట్రలో శివసేనను అంకెకు తీసుకురావడం, హర్యానాలో జాట్ కాకుండా పంజాబీకి ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించడం గమనించినవారికి మోదీ మామూలు రాజకీయవేత్త కారనీ, తన ఆధి క్యాన్నీ, ఆధిపత్యాన్నీ స్పష్టంగా చాటడం ద్వారా దేశానికి బలమైన నాయకత్వం ప్రసా దించడానికి ప్రయత్నిస్తున్న అసాధారణ నాయకుడనీ, ఇందిరాగాంధీ తర్వాత మళ్ళీ అంతటి శక్తిశాలి అనీ మీడియా ప్రశంసిస్తుంటే ఏకీభవిస్తూ ఆనందించారు. మతకలహాలు జరిగినప్పుడు, కొందరు సాధువులూ, సాధ్వీమణులూ ఇతర మతాల గురించి అడ్డగోలుగా మాట్లాడినప్పుడూ, ‘ఘర్వాప్సీ’ అంటూ మతమార్పి డులను తిరగదోడుతూ అలజడి సృష్టించినప్పుడూ ఉదారవాదులు కలత చెందారు. అంతలోనే ఈ ధోరణులను గర్హిస్తున్నట్టు మోదీ పరోక్షంగానో, ప్రత్యక్షంగానో ప్రకటిం చినప్పుడు ఊరట చెందారు. గుజరాత్లో లాగానే దేశం అంతటా అభివృద్ధీ, మత వాదం సమాంతరంగా సాగుతాయంటూ వామపక్ష మేధావులు చేస్తున్న హెచ్చ రికలను పెడచెవిన పెట్టారు. అభివృద్ధికే మోదీ అంకితభావంతో కృషి చేస్తారనీ, మత వాదాన్ని ప్రోత్సహించరనీ తమకు తాము నచ్చజెప్పుకున్నారు. కొత్త సీసాలో పాత సారా చందమేనా? కార్మిక చట్టాలకు సవరణ తెచ్చినప్పుడు పరిశ్రమలు వృద్ధి చెందాలన్నా, పెట్టుబడులు విరివిగా రావాలన్నా కార్మిక చట్టాలను సరలీకరించడం అవసరమే కదా అనుకు న్నారు. ‘జన్‌ధన్’ యోజనతో పేదవారి ఖాతాలలో డబ్బు జమచేయాలని తలబోసే ప్రధాని కార్మికుల కడుపుకొడతారని భావించడం అన్యాయమని కూడా భావించారు. భూసేకరణ చట్టాన్ని సవరించి గ్రామసభలు జరపకుండానే, రైతుల సమ్మతిలేకుండా భూములు స్వాధీనం చేసుకోవడాన్ని చట్టబద్ధం చేస్తూ రాష్ట్రపతి చేత సుగ్రీవాజ్ఞ (ఆర్డి నెన్స్) జారీచేయించినప్పుడు జైరాంరమేష్, జయంతీ నటరాజన్‌ల హయాంలో పర్యా వరణ పరిరక్షణ పేరుమీద అనుమతులు ఇవ్వకుండా నిలిపివేసిన అనేక ప్రాజెక్టులకు సత్వరం అనుమతులు రాకపోతే ఉపాధికల్పన ఎట్లా సాధ్యం అవుతుంది, నిరుద్యోగ నిర్మూలన ఎట్లా కుదురుతుందంటూ ప్రశ్నించుకొని సమాధానం చెప్పుకున్నారు. ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి దాని స్థానంలో నీతి ఆయోగ్ (విధాన సంఘం) ను నెలకొల్పినప్పుడు దీనికోసం ఇంత సన్నాహక ప్రచారం (బిల్డప్) అవసరమా అని విసుక్కున్నారు. స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగ మధ్యంలో ప్రధాని మోదీ ప్రణాళికా సంఘం కాలం చెల్లిందనీ, రద్దు చేసి దాని స్థానంలో అద్భుతమైన వ్యవస్థను ఏర్పాటు చేస్తానని ప్రకటించినప్పుడు మంచిదే కదా అనుకున్నారు. ప్రణాళికా సంఘం సోషలిస్ట్ భావజాలానికి ప్రతీక (సోవియెట్ యూనియన్ నుంచి అరువు తెచ్చుకున్న ఆలోచన) కనుక దానికి బదులు విపణి చోదక ఆర్థిక వ్యవస్థకు సంకేతప్రాయంగా సరికొత్త వ్యవస్థను ఆవిష్కరిస్తారని ఎదురు చూశారు. తీరా నీతి ఆయోగ్‌లో పేరు మారింది తప్ప ఎడమ చేయి బదులు వామహస్తం అనడం మినహా అంత గొప్ప మార్పు ఏమీ కనిపించకపోవడంతో ఆశాభంగం చెందారు. జాతీయాభివృద్ధి మండలి స్థానంలో ముఖ్యమంత్రులతో కూడా మండలిని ఏర్పాటు చేయడం వల్ల సమాఖ్యభావన అమలులోకి వస్తుందనే అభిప్రాయంతో ఏకీభవించడం కష్టం. ఫైనాన్స్ కమిషన్ నిధుల కేటాయింపు చేసిన తర్వాత నీతి ఆయోగ్ నుంచి రాష్ట్రాలకు నిధులు అదనంగా అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉండవు. మోదీ శకం ప్రారంభమై దాదాపు ఏడు నెలలు గడచిన తర్వాత, ఇన్ని అను భవాలు ఎదురైన అనంతరం ఉదారవాదులకు అకస్మాత్తుగా ఒక అనుమానం వచ్చింది. ‘స్వచ్ఛ భారత్’ వంటి నినాదాలూ, ‘మేక్ ఇన్ ఇండియా’ వంటి ఉద్బోధలూ, ఆత్మ విశ్వాసం ఉట్టిపడే ఆశ్వాసనలూ పక్కన పెడితే ఇంతవరకూ మోదీ ప్రభుత్వం ఒక్క కార్యక్రమాన్ని కూడా కాలపరిమితితో ప్రకటించలేదని అర్థమైంది. 2019 కల్లా స్వచ్ఛభారత్ స్వప్నం సాకారం అవుతుందని చెప్పారు కానీ ఈ లోగా ఫలానా సంవత్సరానికల్లా ఫలానా పనులు చేస్తామంటూ చెప్పలేదు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులను ఆకర్షించారు కానీ ప్రభుత్వం తరఫున ఏమి చేయబోయేదీ ఇంకా స్పష్టం కాలేదు. ఇంతకాలం ప్రజలకు అందింది ఏమంటే గంభీరమైన, ఆశాజనకమైన, విశ్వాసభరితమైన, అందమైన ప్రకటనలు. చాలా వేగంగా పరిశుభ్రంగా ముందుకు దూసుకుపోతామన్న విశ్వాసం. అంతకుమించి నికరంగా జరిగింది ఇంత వరకూ ఏమీలేదు. జన్‌ధన్ యోజన యూపీఏ సర్కార్ మనీట్రాన్స్‌ఫర్ స్కీమ్‌కి హిందీ పేరు. మొన్నటి వరకూ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడుగా పనిచేసిన మాంటెక్‌సింగ్ అహ్లూవాలియా ప్రణాళికా సంఘం ప్రమేయంతో ఆవిష్కరించే కేంద్ర పథకాలకు ఇంగ్లిష్ పేర్లో, జాతీయ నాయకులతో వచ్చే పేర్లో పెట్టేవారు. వాటిని మార్చడానికి ఎవ్వరూ ప్రయత్నించేవారు కాదు. ఇప్పడు మోదీ సర్కార్ పేర్లలో భారతీయత ఉట్టిపడేలా చూసుకుంటున్నది. విషయం మాత్రం దాదాపుగా పాతదే. అయినా ఫర్వాలేదనుకున్నారు ఉదారవాదులు. మౌనం మూర్తీభవించిన వ్యక్తి స్థానంలో హాయిగా, కర్ణపేయంగా, జనరంజకంగా, సాధికారికంగా మాట్లాడే వ్యక్తి ప్రధాని పదవిలోకి వచ్చారు. ‘రైట్‌మ్యాన్, రైట్‌టైమ్, రైట్ప్లేస్’ అంటూ ఇంగ్లిష్ పత్రి కలు కీర్తించినట్టు సకాలంలో యూపీఏ అనే తలభారం వదిలి మోదీత్వం రూపంలో కొత్త వెలుగు దేశ ప్రజల జీవితాలలో ప్రవేశించిందనే అభిప్రాయం కలిగింది. భాజపా నాయకత్వంలోని ఎన్డీఏ-2 ప్రభుత్వంలో అవినీతి జరుగుతున్నట్టు ఆరోపణలు ఇంతవరకూ వినిపించలేదు. కుంభకోణాల, కుంభకర్ణుల ప్రభుత్వం పోయి అవినీతి మకిలి లేని ప్రభుత్వం వచ్చినందుకు సంతోషమే కదా. ప్రభుత్వోద్యోగులు ఎన్నడూ లేని విధంగా ఉదయం తొమ్మిది, పది గంటల మధ్య కార్యాలయాలకు చేరుకుం టున్నారు. సాయంత్రం ఆరు నుంచి ఏడు మధ్య వరకూ ఉంటున్నారు. పని ఇదివర కటి కంటే ఎక్కువ చేస్తున్నారో లేదో తెలియదు. ఈ ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ (ప్రాథ మిక సదుపాయాలు-రోడ్లు, విద్యుత్, వగైరాలకు) అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. అధికంగా పీపీపీ (ప్రైవేట్ పబ్లిక్ పార్టిసిపేషన్)పైనే ఆధారపడుతున్నది. అంబానీలూ, అదానీలూ షరా మామూలే. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుతున్నప్పటికీ డీజిల్, పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకం పెంచివేసింది. డబ్బు లేదు ప్రభుత్వం దగ్గర. అయి నప్పటికీ పట్టణ ప్రాంతాలలో ఎదిగివస్తున్న మధ్యతరగతి ప్రయోజనాలకు భంగం కలగకుండా, కార్పొరేట్లకు సానుకూలంగా వ్యవహరిస్తూ, వాటికి అడ్డంకులు తొల గిస్తూ సంపద సృష్టికి దోహదం చేయాలన్నది మోదీ ప్రభుత్వ స్థూల విధానంలాగా కనిపిస్తున్నది. రైతుల ఆత్మహత్యలు పట్టవేం! కానీ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికీ, రైతుల సంక్షేమానికీ, దళితులూ, ఆదివాసీలూ, మైనారిటీల అభివృద్ధికీ ప్రాధాన్యం ఇస్తున్న దాఖలా కనిపించడం లేదు. ముఖ్యంగా రైతుల ఆత్మహత్యలు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో కొనసాగుతున్నప్పటికీ పార్లమెంటులో కానీ, మంత్రిమండలి సమావేశాలలో కానీ వాటి ప్రస్తావనలేదు. వ్యవసాయాన్ని గిట్టుబాటు వ్యాసంగం చేయడం ఎట్లా అన్న దాని మీద సమాలోచన లేదు. దళితులకూ, ఆదివాసులకూ మేలుచేయాలన్న సంక ల్పం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నాయకత్వంలో కనిపిస్తున్నది కానీ కేంద్ర ప్రభు త్వంలో కానీ, భాజపా పాలనలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలలో కానీ అటువంటి స్పృహ కనిపించడం లేదు. ఈ వర్గాలలో అత్యధికులు ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ పట్ల విధేయత ఉన్నవారే. వారి హృదయాలను గెలుచుకోవడానికి మోదీ ప్రభుత్వం బృహత్ ప్రయ త్నం చేయాలి. ప్రకటనలతో పొద్దు పుచ్చలేరు.. రైతుల ప్రయోజనాలను పట్టించుకునే స్వభావం మోదీ ప్రభుత్వానికి ఉన్నదని నమ్మకం కలిగించే పని ఏదీ జరగలేదు. పైగా రైతులతో మమేకమయ్యే దేవెగౌడ, ములాయంసింగ్, లాలూప్రసాద్, శరద్ యాదవ్ వంటి నాయకులు ఏకతాటిపైకి వస్తున్నారు. దిగుబడులు తగ్గి, ధాన్యం రేట్లు తగ్గిపోయి, మద్దతు ధరలు కూడా చాలక నానా అగచాట్లు పడుతున్న అన్నదాతలు ఇప్పటికే ఆగ్రహంతో ఊగిపోతున్నారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలను పట్టించుకోకపోతే ఆంధ్రప్రదేశ్‌లో రైతుల భూములను వారి అభీష్టానికి విరుద్ధంగా స్వాధీనం చేసుకునే ప్రయత్నం జరుగు తోంది. మొత్తం మీద కోపంతో ఉన్న రైతులను వీధులలోకి రప్పించడానికి అవస రమైన శక్తియుక్తులు జనతాపరివార్‌కు ఉన్నాయి. రైతు ఉద్యమానికి జనతా పరివార్ ఎప్పుడు పిలుపునిస్తే అప్పుడు మోదీ సర్కార్ హనీమూన్ (‘అచ్ఛేదిన్’) ముగిసి నట్టూ, కష్టాలు ఆరంభమైనట్టూ లెక్క. వాగ్దానాలూ, ఆకర్షణీయమైన ప్రకటనలూ విని సంతోషించే సమయం ముగిసింది. బడాపారిశ్రామిక సంస్థలకూ, ఆశ్రీత పారిశ్రామిక, వ్యాపార సంస్థలకూ అను కూలమనే ముద్ర మోదీ ప్రభుత్వంపైన పడుతున్నది. అదే సమయంలో రైతులకూ, కార్మికులకూ వ్యతిరేకి అనే పేరు వస్తున్నది. మైనారిటీల సమస్య ఎట్లాగూ ఉంది. ఈ సంకేతాలను గమనించి సవరణ చర్యలు తీసుకుంటే మోదీ సర్కార్‌కు ప్రజల సహ కారం ఇతోధికంగా లభిస్తుంది. సమాజంలో బడుగువర్గాలనూ, సమస్యలతో సత మతం అవుతున్న వర్గాలనూ పట్టించుకొని వారికి సహాయం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదన్న విశ్వాసం కల్పించడం నేటి అవసరమని ఉదారవాదులు భావి స్తున్నారు. వీరు కనుక మద్దతు ఉపసంహరించుకుంటే మోదీ వ్యతిరేక శక్తుల శక్తి పెరుగుతుంది. -murthykondubhatla@gmail.com -
ఇంకా అందని పింఛన్లు
ఏడో తేదీ వ చ్చినా ఊసేలేదు ఉత్తర్వులు రాలేదంటున్న అధికారులు నేడు హైదరాబాదులో సదస్సు 3.13 లక్షల మంది లబ్ధిదారుల ఎదురుచూపులు మచిలీపట్నం : ప్రతినెలా ఒకటో తేదీనే పింఛను ఇచ్చే ఆనవాయితీకి బ్రేక్ పడుతోంది. కొత్త ప్రభుత్వం కొత్త విధానాలు అవలంబిస్తుండటంతో ఈ నెల పింఛను వస్తుందో రాదోననే అనుమానాలు లబ్ధిదారులు వ్యక్తం చేస్తున్నారు. జూలై ఏడో తేదీ వచ్చినా గ్రామాల్లో, పట్టణాల్లో పింఛను అందజేసే కమ్యూనిటీ సర్వీస్ ప్రొవైడర్ల (సీఎస్పీ) జాడ కనబడటం లేదు. పింఛను ఇస్తారనే ఆశతో పింఛనుదారులు పడిగాపులు పడుతున్నారు. జిల్లాలో మొత్తం 3,13,028 మంది పింఛనుదారులు ఉన్నారు. వీరికి సుమారుగా రూ.12 కోట్ల 18 లక్షల 79 వేల 700 ప్రతినెలా చెల్లించాల్సి ఉంది. 1,25,350 వృద్ధాప్య, 4,946 చేనేత, 44,838 వికలాంగ, 1,15,686 వితంతు, 1,935 కల్లుగీత కార్మికుల, 20,273 మంది అభయహస్తం పింఛన్ల లబ్ధిదారులు ఉన్నారు. అభయహస్తం, వికలాంగ పింఛన్ల లబ్ధిదారులకు నెలకు రూ.500, మిగిలినవారికి నెలకు రూ.200 చొప్పున పింఛను అందుతోంది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే పింఛను సొమ్మును పెంచుతామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. అధికారం చేపట్టాక అక్టోబరు నుంచి పెంచిన పింఛన్లను అందజేస్తామని మాట మార్చారు. ఇవన్నీ ఇలా ఉంటే ఈ నెల ఫించను సొమ్మును లబ్ధిదారులకు అందజేయాలని ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులూ రాలేదని డీఆర్డీఎ పీడీ ఎం.రజనీకాంతారావు తెలిపారు. పింఛన్ల మంజూరు తదితర అంశాలపై మంగళవారం హైదరాబాద్‌లో వర్క్‌షాప్ నిర్వహిస్తున్నారని, ఈ సమావేశంలో తగు నిర్ణయం తీసుకునే అవకాశముందని ఆయన చెప్పారు. ఉత్తర్వులు లేవు... పింఛన్ల సొమ్ము మంజూరైతే ఆయా మండలాలకు లబ్ధిదారుల వివరాలు, అక్విటెన్స్ను డౌన్లోడ్ చేసుకోవాలంటూ ప్రతి మండల కార్యాలయానికి ఉత్తర్వులు వచ్చేవని, ఈ నెలలో అలాంటిదేమీ జరగలేదని పలువురు ఎంపీడీవోలు తెలిపారు. గత రెండు నెలల వ్యవధిలో ఫినో మిషన్లకు సంబంధించి ఆన్లైన్ సర్వీసును మార్చడంతో సిగ్నల్ అందక పలు ఇబ్బందులు పడ్డామని, ఈ నెలలో పింఛన్లు ఎప్పుడిస్తారో తెలియడం లేదని పలువురు లబ్ధిదారులు వాపోతున్నారు. పింఛను వస్తే మందు బిళ్లల ఖర్చుకైనా పనికొస్తాయనే ఆశతో ఉన్నామని పలువురు వృద్ధులు అంటున్నారు.