![SBI Life first Indian private life insurer 24X7 inbound contact centre - Sakshi](/styles/webp/s3/article_images/2023/08/22/sbi%20life.jpg.webp?itok=9a6t10tL)
ముంబై: ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ 24/7 ఇన్‌బౌండ్ కాంటాక్ట్ సెంటర్‌ను ప్రారంభించింది. ఎస్‌బీఐ లైఫ్ ఆఫర్ చేసే పాలసీలకు సంబంధించి అన్ని రకాల విచారణలకు, కొనుగోలుకు ముందు, కొనుగోలు తర్వాత కావాల్సిన సమాచారాన్ని ఈ కాంటాక్ట్ సెంటర్ ద్వారా పొందొచ్చని ప్రకటించింది. ఇందుకోసం ఎలాంటి చార్జీలు పడని 18002679090 టోల్ ఫ్రీ నంబర్‌ను ప్రకటించింది. 24/7 కాంటాక్ట్ సెంటర్ ఏర్పాటు చేసిన తొలి ప్రైవేటు రంగ బీమా సంస్థ తమదేనని తెలిపింది. ఈ కాల్ సెంటర్ ఏడాదిలో అన్ని రోజులు, అన్ని సమయాల్లోనూ సేవలు అందిస్తుంది. (రిటైల్ లీజింగ్ 15 శాతం అధికం)
ఇదీ చదవండి:
ఆటోసార్‌లో టాటా టెక్నాలజీస్
న్యూఢిల్లీ: ఇంజనీరింగ్, ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ డిజిటల్ సరీ్వసుల కంపెనీ టాటా టెక్నాలజీస్ తాజాగా ఆటోమోటివ్ ఓపెన్ సిస్టమ్ ఆర్కిటెక్చర్‌లో (ఆటోసార్) చేరింది. ఇంటెలిజెంట్ మొబిలిటీ కోసం ప్రామాణిక సాఫ్ట్‌వేర్ ఫ్రేమ్‌వర్క్, ఓపెన్ ఎలక్ట్రికల్, ఎల్రక్టానిక్ వ్యవస్థ అభివృద్ధి, స్థాపనకు వాహన, సాఫ్ట్‌వేర్ పరిశ్రమలోని ప్రముఖ కంపెనీలతో అంతర్జాతీయంగా ఆటోసార్ వేదిక ఏర్పడింది. బీఎండబ్లు్య, ఫోక్స్‌వ్యాగన్, టయోటా, ఫోర్డ్, జీఎం, దైమ్లర్ క్రిస్లర్, బాష్, సీమెన్స్ వంటి 280కిపైగా సంస్థలు ఇందులో ఉన్నాయి. (పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మ కొత్త వ్యూహం)
Comments
Please login to add a commentAdd a comment