Customer concern
-
కస్టమర్లకు సకల సౌకర్యాలు!
ఎయిరిండియా తన ఎయిర్‌క్రాఫ్ట్‌లను అప్‌గ్రేడ్ చేయాలని యోచిస్తోంది. యూఎస్, యూరప్‌లు వంటి కీలక అంతర్జాతీయ మార్గాల్లో ప్రయాణించే ప్యాసింజర్లకు మెరుగైన సదుపాయాలు కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా కొత్తగా ఏ350 విమానాల్లో ఫస్ట్-క్లాస్ క్యాబిన్లను ప్రవేశపెట్టాలని సంస్థ భావిస్తోంది. ఈమేరకు సంస్థ చీఫ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఆఫీసర్ రాజేష్డోగ్రా వివరాలు వెల్లడించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘ఎమిరేట్స్, ఖతార్ ఎయిర్వేస్ వంటి మిడిల్ ఈస్ట్ కంపెనీలు ప్రీమియం కస్టమర్లను ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. అందుకు బదులుగా ఎయిరిండియా సర్వీసులవైపు మొగ్గు చూపేలా ప్రీమియం కస్టమర్లకు సకల సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించాం. రానున్న రోజుల్లో సంస్థ తన ఎయిర్‌క్రాఫ్ట్‌లను అప్‌గ్రేడ్ చేయాలని భావిస్తోంది. ముందుగా యూఎస్, యూరప్ వంటి ప్రాంతాలకు వెళ్లే సర్వీసులను అప్‌గ్రేడ్ చేయబోతున్నాం. కొత్తగా ఏ350 విమానాల్లో ఫస్ట్ క్లాస్ సర్వీసులు అందించాలని ప్రణాళికలు సిద్ధం చేశాం. ఏ320 నారో బాడీ ఎయిర్‌క్రాఫ్ట్‌లో క్యాబిన్‌ను విస్తరించే ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. దాంతోపాటు 2025 చివరి నాటికి ఢిల్లీ, ముంబయి, దుబాయ్, లండన్, న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కోలకు ప్రయాణించే కస్టమర్ల కోసం ప్రత్యేక లాంజ్ సౌకర్యాలను ఏర్పాటు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశాం’ అని తెలిపారు.ఇదీ చదవండి: వెహికిల్‌పై కేసుల వివరాలు క్షణాల్లో.. -
ఎస్బీఐ లైఫ్: కస్టమర్లకు గుడ్ న్యూస్
ముంబై: ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ 24/7 ఇన్‌బౌండ్ కాంటాక్ట్ సెంటర్‌ను ప్రారంభించింది. ఎస్బీఐ లైఫ్ ఆఫర్ చేసే పాలసీలకు సంబంధించి అన్ని రకాల విచారణలకు, కొనుగోలుకు ముందు, కొనుగోలు తర్వాత కావాల్సిన సమాచారాన్ని ఈ కాంటాక్ట్ సెంటర్ ద్వారా పొందొచ్చని ప్రకటించింది. ఇందుకోసం ఎలాంటి చార్జీలు పడని 18002679090 టోల్ ఫ్రీ నంబర్‌ను ప్రకటించింది. 24/7 కాంటాక్ట్ సెంటర్ ఏర్పాటు చేసిన తొలి ప్రైవేటు రంగ బీమా సంస్థ తమదేనని తెలిపింది. ఈ కాల్ సెంటర్ ఏడాదిలో అన్ని రోజులు, అన్ని సమయాల్లోనూ సేవలు అందిస్తుంది. (రిటైల్ లీజింగ్ 15 శాతం అధికం) ఇదీ చదవండి: ఆటోసార్లో టాటా టెక్నాలజీస్ న్యూఢిల్లీ: ఇంజనీరింగ్, ప్రొడక్ట్ డెవలప్మెంట్ డిజిటల్ సరీ్వసుల కంపెనీ టాటా టెక్నాలజీస్ తాజాగా ఆటోమోటివ్ ఓపెన్ సిస్టమ్ ఆర్కిటెక్చర్లో (ఆటోసార్) చేరింది. ఇంటెలిజెంట్ మొబిలిటీ కోసం ప్రామాణిక సాఫ్ట్వేర్ ఫ్రేమ్‌వర్క్, ఓపెన్ ఎలక్ట్రికల్, ఎల్రక్టానిక్ వ్యవస్థ అభివృద్ధి, స్థాపనకు వాహన, సాఫ్ట్వేర్ పరిశ్రమలోని ప్రముఖ కంపెనీలతో అంతర్జాతీయంగా ఆటోసార్ వేదిక ఏర్పడింది. బీఎండబ్లు్య, ఫోక్స్‌వ్యాగన్, టయోటా, ఫోర్డ్, జీఎం, దైమ్లర్ క్రిస్లర్, బాష్, సీమెన్స్ వంటి 280కిపైగా సంస్థలు ఇందులో ఉన్నాయి. (పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మ కొత్త వ్యూహం) -
డబ్బులు ఖాళీ... ఖాతాదారుల ఆందోళన
సుండుపల్లి(వైఎస్సార్ జిల్లా): భారతీయ స్టేట్ బ్యాంకులో డబ్బులు లేక ఖాతాదారులకు డబ్బులు ఇవ్వకపోవడంతో మంగళవారం ఉదయం ఖాతాదారులు బ్యాంకు అధికారులతో వాగ్వాదానికి దిగారు. బ్యాంకులో సరిపడా డబ్బులు లేనందున ఒక్కొ ఖాతాదారునికి కేవలం రెండు వేల రూపాయలు మాత్రమే ఇస్తామని బ్యాంకు అధికారులు చెప్పడంతో ఖాతాదారులు ఆందోళనకు దిగారు. బ్యాంకు సిబ్బందితో ఘర్షనకు దిగారు. తమ అవసరాల కోసం దాచుకున్న డబ్బులు తీసుకునేందుకు వీలులేకపోవడం ఏమిటని ప్రశ్నించారు. అన్నింటికీ చార్జీలు వసూలుచేసే బ్యాంకు అధికారులు, తమ డబ్బును ఇవ్వలేమని చేతులు ఎత్తేయడం దారుణమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకు వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఖాతాదారుకు నచ్చచెపేందుకు ప్రయత్నించారు. అయినా వారు శాంతించలేదు, బ్యాంకు ఎదుట ఆందోళనకు దిగారు.