ఎయిరిండియా తన ఎయిర్‌క్రాఫ్ట్‌లను అప్‌గ్రేడ్ చేయాలని యోచిస్తోంది. యూఎస్, యూరప్‌లు వంటి కీలక అంతర్జాతీయ మార్గాల్లో ప్రయాణించే ప్యాసింజర్లకు మెరుగైన సదుపాయాలు కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా కొత్తగా ఏ350 విమానాల్లో ఫస్ట్-క్లాస్ క్యాబిన్‌లను ప్రవేశపెట్టాలని సంస్థ భావిస్తోంది. ఈమేరకు సంస్థ చీఫ్ కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ ఆఫీసర్ రాజేష్‌డోగ్రా వివరాలు వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘ఎమిరేట్స్, ఖతార్ ఎయిర్‌వేస్ వంటి మిడిల్ ఈస్ట్ కంపెనీలు ప్రీమియం కస్టమర్లను ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. అందుకు బదులుగా ఎయిరిండియా సర్వీసులవైపు మొగ్గు చూపేలా ప్రీమియం కస్టమర్లకు సకల సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించాం. రానున్న రోజుల్లో సంస్థ తన ఎయిర్‌క్రాఫ్ట్‌లను అప్‌గ్రేడ్ చేయాలని భావిస్తోంది. ముందుగా యూఎస్, యూరప్ వంటి ప్రాంతాలకు వెళ్లే సర్వీసులను అప్‌గ్రేడ్ చేయబోతున్నాం. కొత్తగా ఏ350 విమానాల్లో ఫస్ట్ క్లాస్ సర్వీసులు అందించాలని ప్రణాళికలు సిద్ధం చేశాం. ఏ320 నారో బాడీ ఎయిర్‌క్రాఫ్ట్‌లో క్యాబిన్‌ను విస్తరించే ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. దాంతోపాటు 2025 చివరి నాటికి ఢిల్లీ, ముంబయి, దుబాయ్, లండన్, న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కోలకు ప్రయాణించే కస్టమర్ల కోసం ప్రత్యేక లాంజ్ సౌకర్యాలను ఏర్పాటు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశాం’ అని తెలిపారు.
ఇదీ చదవండి: వెహికిల్‌పై కేసుల వివరాలు క్షణాల్లో..
Comments
Please login to add a commentAdd a comment