న్యూఢిల్లీ: ఎస్‌బీఐ లాభం జూన్ త్రైమాసికంలో గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్‌లో బ్యాంకు 2.1 శాతం వాటాను జూన్ క్వార్టర్‌లో విక్రయించడం ద్వారా రూ.1,540 కోట్లను సమకూర్చుకుంది. దీంతో బ్యాంకు స్టాండలోన్ లాభం రూ.4,189 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో లాభం రూ.2,312 కోట్లుగా ఉంది. వాటాల విక్రయం అనంతరం ఎస్‌బీఐ లైఫ్‌లో ఎస్‌బీఐ వాటా 55.60 శాతానికి తగ్గింది. ఇక బ్యాంకు స్టాండలోన్ ఆదాయం రూ.70,653 కోట్ల నుంచి రూ.74,458 కోట్లకు వృద్ధి చెందింది. నిర్వహణ లాభం 36 శాతం పెరిగి రూ.18,061 కోట్లుగా ఉంటే, వడ్డీ ఆదాయం సైతం రూ.62,638 కోట్ల నుంచి 6 శాతం వృద్ధితో రూ.66,500 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్ మాత్రం 3.24 శాతం నుంచి 3.01 శాతానికి తగ్గిపోయింది.
తగ్గిన మొండిబకాయిలు..
బ్యాంకు స్థూల నిరర్ధక ఆస్తులు (ఎన్‌పీఏలు) గతేడాది ఇదే త్రైమాసికంలో 7.53 శాతంగా ఉంటే, తాజాగా 5.44 శాతానికి క్షీణించాయి. అదే విధంగా నికర ఎన్‌పీఏలు కూడా 3.07 శాతం నుంచి 1.8 శాతానికి పరిమితమయ్యాయి. ఎన్‌పీఏలకు చేసిన కేటాయింపులు కూడా రూ.9,420 కోట్లకు పరిమితమయ్యాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఎన్‌పీఏలకు బ్యాంకు రూ.11,648 కోట్లను పక్కన పెట్టడం గమనార్హం. ముఖ్యంగా కరోనా కారణంగా ఎగవేతలను దృష్టిలో ఉంచుకుని రూ.1,836 కోట్లను కేటాయించింది. ప్రొవిజన్ కవరేజీ రేషియో 86.32 శాతానికి చేరింది. సీఏఆర్ 13.40 శాతానికి పెరిగింది.
సబ్సిడరీలతో కలసి చూస్తే..
కన్సాలిడేటెడ్‌గా ఎస్‌బీఐ నికర లాభం 62 శాతం దూసుకుపోయింది. రూ.4,776 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో నికర లాభం రూ.2,950 కోట్లుగా ఉంది. కన్సాలిడేటెడ్ ఆదాయం రూ.83,274 కోట్ల నుంచి రూ.87,984 కోట్లకు పెరిగింది. ఈ కాలంలో రుణ వృద్ధి 6.58 శాతంగా నమోదైంది. ప్రధానంగా రిటైల్ విభాగంలో (వ్యక్తిగత రుణాలు) 12.85 శాతం, విదేశీ బ్రాంచ్‌ల ద్వారా 11 శాతం మేర అధిక రుణాలు పంపిణీ చేసింది.
నిధుల సమస్య లేదు..
మూలధన నిధుల పరంగా అదనపు మద్దతు సాయం, క్షీణిస్తున్న నగదు ప్రవాహాల రూపంలో తమకు సవాళ్లు ఎదురుకావచ్చని పేర్కొంది.
ఎస్‌బీఐ లాభాల ఖాతా
Published Sat, Aug 1 2020 5:53 AM | Last Updated on Sat, Aug 1 2020 5:53 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment