న్యూఢిల్లీ: సహారా లైఫ్‌ను తాము విలీనం చేసుకోవడం లేదని ఎస్‌బీఐ లైఫ్ స్పష్టం చేసింది. బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్‌డీఏఐ) ఆదేశాల మేరకు సహారా లైఫ్ ఇన్సూరెన్స్ నిర్వహణలోని పాలసీ దారుల ఆస్తులు, అప్పులను స్వాధీనం చేసుకుంటున్నట్టు తెలిపింది. సహారా లైఫ్ ఇన్సూరెన్స్ ఆర్థిక పరిస్థితులు క్షీణించడంతో సంస్థ జారీ చేసిన పాలసీలు, వాటి ఆస్తులు, అప్పులను స్వాధీనం చేసుకోవాలంటూ గత శుక్రవారం ఐఆర్‌డీఏఐ ఎస్‌బీఐ లైఫ్‌ను ఆదేశించడం గమనార్హం.
మెరుగైన సేవలు అందిస్తామని సహారా లైఫ్ పాలసీదారులకు ఎస్‌బీఐ లైఫ్ అభయమిచ్చింది. ‘‘సహారా లైఫ్ పాలసీలను మా వ్యవస్థతో అనుసంధానించేందుకు వేగవంతమైన చర్యలు మొదలు పెట్టాం. పూర్తి స్థాయి ఏకీకరణకు కొంత సమయం పడుతుంది. సహారా లైఫ్ పాలసీదారులు 1800 267 9090 టోల్ ఫ్రీ నంబర్‌లో లేదా ట్చజ్చిట్చ జీజ్ఛఃటbజీ జీజ్ఛ. ఛిౌ. జీn మెయిల్ ఐడీ ద్వారా సంప్రదించాలని ఎస్‌బీఐ లైఫ్ సూచించింది. సహారా లైఫ్ కొత్తగా పాలసీలను విడుదల చేయరాదని కూడా ఐఆర్‌డీఏఐ ఆదేశించడం గమనార్హం. తగినంత సమయం, తగినన్ని అవకాశాలు కల్పించినప్పటికీ తమ ఆదేశాలను పాటించడంలో., పాలసీదారుల ప్రయోజనాల పరిరక్షణకు నిర్ణయాత్మక చర్యలు తీసుకోవడంలో సహారా లైఫ్ ఇన్సూరెన్స్ విఫలమైందని ఆఆర్‌డీఏఐ తన ఆదేశాల్లో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment