సహారాకు సుప్రీం ఆదేశం
న్యూఢిల్లీ: సహారా మొత్తం ఆస్తుల వివరాలను సీల్డ్ కవర్‌లో తెలియజేయాలని సహారా గ్రూప్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. మదుపరులకు చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించగలరా? లేదా అన్న అంశం నిర్థారించడానికి ఇది అవసరమని చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. సహారా చీఫ్ సుబ్రతారాయ్‌కి బెయిల్ మంజూరుకు రూ.10,000 కోట్ల చెల్లింపులకు సంబంధించి తమ ఆదేశాల పాటించేంతవరకూ పెరోల్‌కు వీలు ఉండబోదని స్పష్టం చేసింది. ప్రస్తుతం గ్రూప్ 66 ప్రాపర్టీలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయని, తద్వారా రూ.6,000 కోట్లు వసూలయ్యే అవకాశం ఉందని వస్తున్న సంకేతాలను ప్రస్తావించిన సుప్రీం కోర్టు..బెయిల్‌కు ఈ మొత్తం సరిపోయినా... ఇన్వెస్టర్ల చెల్లింపులకు తగిన మొత్తం గ్రూప్ వద్దా ఉందా? లేదా? అన్నది ప్రస్తుతం కీలకమని పేర్కొంది.
ఆస్తుల వివరాలు తెలపండి
Published Thu, Apr 28 2016 2:28 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM
Advertisement