Sahara
-
సహారాలో భారీ వర్షాలు.. ఆశ్చర్యపరుస్తున్న దృశ్యాలు
రబాత్: ఎడారిలో నీటి మడుగులు ఏర్పడేంత వర్షాలు కురుస్తాయని మీరు ఎప్పుడైనా విన్నారా? మొరాకోలోని సహారా ఎడారిలో అకస్మాత్తుగా వచ్చిన వరదలు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఈత చెట్లు, ఇసుక దిబ్బల మధ్య నీటి మడుగులు ఏర్పడి, అరుదైన దృశ్యాలను మన కళ్లముందు ఉంచాయి.ఆగ్నేయ మొరాకోలోని ఎడారుల్లో అత్యంత అరుదుగా వర్షాలు కురుస్తాయి. అయితే సెప్టెంబరులో ఈ ప్రాంతంలో వార్షిక సగటు కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందని మొరాకో ప్రభుత్వం తెలిపింది. రాజధాని రబాత్‌కు దక్షిణంగా 450 కిలోమీటర్ల దూరంలో ఉన్న టాగౌనైట్ అనే గ్రామంలో 24 గంటల వ్యవధిలో 100 మి.మీ. కంటే అధిక వర్షపాతం నమోదైంది.విషయం తెలుసుకున్న పర్యాటకులు ఈ ఎడారి ప్రాంతాలను చూసేందుకు ఇక్కడికి తరలివస్తున్నారు. ఇక్కడి ఈత చెట్ల మధ్య ఏర్పడిన నీటి మడుగులను చూసి తెగ ఆశ్చర్యపోతున్నారు. తమ కళ్లను తామే నమ్మలేకపోయామంటూ వారు చెబుతున్నారు. గడచిన 50 సంవత్సరాలలో మొదటిసారిగా, ఇక్కడ అత్యధిక వర్షపాతం నమోదైందని మొరాకో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మెటియోరాలజీకి చెందిన హుస్సేన్ యూఅబెబ్ తెలిపారు.ఈ ప్రాంతంలో వరుసగా ఆరేళ్ల పాటు కరువు తాండవించింది. దీంతో రైతులు తమకున్న కాస్త పొలాలను బీడుగా వదిలివేయవలసి వచ్చింది. అయితే ఇప్పుడు కురిసిన భారీ వర్షాలు ఎడారి దిగువన ఉన్న భూగర్భజలాల నిల్వలను తిరిగి నింపడంలో సహాయపడతాయని భావిస్తున్నారు. కాగా భారీ వర్షాల కారణంగా అల్జీరియాలో 20 మందికి పైగా జనం మృత్యువాత పడ్డారు. పలు పంటలు దెబ్బతిన్నాయి. దీంతో ప్రభుత్వం అత్యవసర సహాయ నిధులను విడుదల చేయాల్సి వచ్చింది. జగోరా- టాటా మధ్య 50 ఏళ్లుగా ఎండిపోయిన ఇరికి సరస్సు నీటితో నిండుగా ఉండటాన్ని నాసా ఉపగ్రహ చిత్రాలు చూపిస్తున్నాయి. ఇది కూడా చదవండి: నవరాత్రుల్లో గర్బా నృత్యం ఎందుకు చేస్తారో తెలుసా..! -
‘ఎవరు చనిపోయినా అవి మాత్రం ఆగవు’
సహారా గ్రూప్ సంస్థల ఛైర్మన్ సుబ్రతారాయ్ ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. అయితే గతంలో సహారా గ్రూప్ నేరాలకు పాల్పడిన నేపథ్యంలో ప్రభుత్వం విచారణ జరుపుతోంది. రాయ్ మరణంతో ఆ దర్యాప్తు పరిస్థితికి సంబంధించి బాధితుల్లో ఆందోళన మొదలైంది. దాంతో పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకు కేంద్ర సహాయమంత్రి ఇంద్రజిత్ సింగ్ సమాధానమిచ్చారు. సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐవో)సహా కంపెనీల చట్టం కింద చేస్తున్న మరే ఇతర విచారణలైనాసరే ఎవరో ఒకరు చనిపోయారని ఆగబోవు అంటూ సోమవారం పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. నవంబర్ 14న సహారా గ్రూప్ చీఫ్ సుబ్రతా రాయ్ మరణించిన నేపథ్యంలో ఈ మేరకు లోక్‌సభలో కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ ఓ లిఖితపూర్వక సమాధానంగా తెలిపారు. 2018 అక్టోబర్ 31న సహారా గ్రూప్‌నకు చెందిన సహారా హౌజింగ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, సహారా క్యూ షాప్ యూనిక్ ప్రోడక్ట్స్ రేంజ్ లిమిటెడ్, సహారా క్యూ గోల్డ్ మార్ట్ లిమిటెడ్ సంస్థలపై ఎస్ఎఫ్ఐవో దర్యాప్తును ప్రారంభించిన విషయం తెలిసిందే. 2020 అక్టోబర్ 7న సహారా గ్రూప్‌నకే చెందిన మరో ఆరు సంస్థలపై దర్యాప్తులకు ఆదేశించినట్టు మంత్రి ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ కేసులో సహారా ఇండియా రియల్ ఎస్టేట్ కార్పొరేషన్ లిమిటెడ్, సహారా హౌజింగ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌లను ఉద్దేశించి సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ అనుసరిస్తుందని, కోర్టు ఆదేశాల మేరకే బాధితులకు రిఫండ్ జరుగుతుందని తెలియజేశారు. ఇదీ చదవండి: ఆ దేశంలోనే అధిక ద్రవ్యోల్బణం ..! ‘డ్రాగన్’ కంపెనీలపై.. దేశంలో 53 చైనా సంస్థలున్నాయని లోక్‌సభకు ఇంద్రజిత్ సింగ్ తెలిపారు. అయితే ఈ సంస్థలు యాప్‌ల ద్వారా రుణాలస్తూ వ్యాపార కార్యకలాపాలను నిర్వర్తిస్తున్నాయా? లేదా అనే అంశం గురించి మాత్రం సమాచారం లేదని చెప్పారు. ఇక ఈ ఏడాది మే నెలలో సెంటర్ ఫర్ ప్రాసెసింగ్ యాక్సిలరేటెడ్ కార్పొరేట్ ఎగ్జిట్ (సీ-పేస్)ను ఏర్పాటు చేసిన దగ్గర్నుంచి దేశంలో 7,700లకుపైగా కంపెనీలు స్వచ్చంధంగా తమ వ్యాపారాలను మూసివేశాయని తెలిపారు. -
Subrata Roy : వేల కోట్ల ‘సహారా గ్రూప్’ డిపాజిట్లపై కేంద్రం కీలక నిర్ణయం!
కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాయ్(75) మంగళవారం ముంబయిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మరణం తర్వాత సహారా కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సహారా -సెబీ అకౌంట్స్‌లో ఉన్న అన్‌క్లయిమ్డ్ నిధుల మొత్తాన్ని ప్రభుత్వ అకౌంట్‌కు (Consolidated Fund of India) ట్రాన్స్ఫర్ చేయాలనే అంశంపై కేంద్రం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది ది ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం.. 11ఏళ్ల క్రితం సహారా గ్రూప్ సామాన్యుల నుంచి సేకరించిన రూ.25 వేల కోట్లకు పైగా డిపాజిట్లను సెబీకి అందించింది. అందులో తమ డబ్బులున్నాయని, అందుకు సహారా ఇచ్చిన రిసిప్ట్‌లను సెబీకి (ప్రత్యేక వెబ్ పోర్టల్‌లో) అప్లయ్ చేసుకుంటే.. వాటిని పరిశీలించిన సెబీ కేవలం రూ.138.07 కోట్లని తిరిగి వెనక్కి ఇచ్చింది. సెబీ నుంచి కేంద్ర బ్యాంక్ అకౌంట్‌కు ఇప్పుడు సెబీ వద్ద ఆ మిగిలిన మొత్తాన్ని పెట్టుబడిదారులకు రీఫండ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వ బ్యాంక్ అకౌంట్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాకు మార్చేందుకు కేంద్రం అన్వేషిస్తుందని ఈ అంశంపై సంబంధం ఉన్న ఓ అధికారి పేర్కొన్నారు. అన్‌క్లయిమ్డ్ డిపాజిట్లన్నీ ప్రజా సంక్షేమానికే అయితే, సెబీ అకౌంట్ నుంచి ప్రభుత్వ అకౌంట్‌కు నిధులు ట్రాన్స్ఫర్ చేసిన అనంతరం కేంద్రం నిజమైన డిపాజిటర్లను గుర్తించి, వారికి తిరిగి డబ్బులు చెల్లించనుంది. మిగిలిన అన్ క్లయిమ్డ్ డిపాజిట్లను ప్రజా సంక్షేమం కోసం కేంద్రం వినియోగించాలని భావిస్తున్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదిక హైలెట్ చేసింది. వేల కోట్ల డిపాజిట్లు సహారా నుంచి సెబీకి సెబీ ఈ ఏడాది మార్చి 31 నాటికి 17,526 దరఖాస్తులకు గాను 48,326 ఖాతాల్లో రూ.138 కోట్లు జమ చేసింది. సహారా గ్రూప్ నుండి రికవరీ చేసి.. ఆయా ప్రభుత్వరంగ బ్యాంకుల్లో జమ చేసిన మొత్తం రూ.25,163 కోట్లుగా ఉంది. ప్రత్యేక పోర్టల్ నిజమైన డిపాజిటర్ల చట్టబద్ధమైన బకాయిలకు సంబంధించి రూ.5,000 కోట్లు సెంట్రల్ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్‌కు బదిలీ చేసింది. ఈ మొత్తాన్ని రానున్న 9 నెలల్లో 10 కోట్ల మంది మదుపరులకు తిరిగి చెల్లిస్తామని కేంద్రం అప్పట్లో తెలిపింది. ఇందులో భాగంగా హోం మంత్రి అమిత్ షా ఈ ఏడాది జులై నెలలో పోర్టల్‌ను ప్రారంభించారు. సహారా గ్రూప్‌నకు చెందిన కోపరేటివ్ సొసైటీలు అయిన సహారా క్రెడిట్ కోపరేటివ్ సొసైటీ లిమిటెడ్, సహరాయణ్ యూనివర్సల్ మల్టీపర్పస్ కోపరేటివ్ సొసైటీ లిమిటెడ్, హమారా ఇండియా క్రెడిట్ కోపరేటివ్ సొసైటీ లిమిటెడ్, స్టార్స్ మల్టీపర్పస్ కోపరేటివ్ సొసైటీలకు చెందిన మదుపరులకు ఈ మొత్తాలు చెల్లిస్తున్నాయి. చదవండి👉 డొక్కు స్కూటర్‌పై సుబ్రతా రాయ్ జీవితం ఎలా మొదలైంది? చివరికి అనాధలా -
ప్రశ్నార్థకంగా సహారా రూ. 25 వేల కోట్లు
న్యూఢిల్లీ: సహారా గ్రూప్ అధినేత సుబ్రతో రాయ్ మరణించడంతో సహారా–సెబీ ఖాతాలోని రూ. 25,000 కోట్ల అంశం తాజాగా మరోసారి తెరపైకి వచ్చింది. రెండు గ్రూప్ సంస్థలు సమీకరించిన నిధులను సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఇన్వెస్టర్లకు వాపసు చేసేందుకు సహారా గ్రూప్ ఈ నిధులను సెబీ ఖాతాల్లో జమ చేసింది. వివరాల్లోకి వెడితే.. సహారా ఇండియా రియల్ ఎస్టేట్ కార్పొరేషన్ (ఎస్‌ఐఆర్‌ఈఎల్), సహారా హౌసింగ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ (ఎస్‌హెచ్‌ఐసీఎల్) దాదాపు 3 కోట్ల మంది ఇన్వెస్టర్ల నుంచి నిబంధనలకు విరుద్ధంగా సమీకరించిన నిధులను వాపసు చేయాలంటూ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ 2011లో ఆదేశించింది. 2012లో సుప్రీం కోర్టు కూడా సెబీ ఉత్తర్వులను సమర్థ్ధిస్తూ, 15 శాతం వడ్డీతో ఇన్వెస్టర్ల సొమ్మును తిరిగివ్వాలని ఆదేశాలు జారీ చేసింది. 95 శాతం మందికి రిఫండ్ చేసేశామని సహారా గ్రూప్ తెలియజేసినా, ఆ వాదనలను తోసిపుచ్చి రూ. 24,000 కోట్లు సెబీ ప్రత్యేక ఖాతాల్లో జమ చేయాలంటూ ఉత్తర్వులు ఇచి్చంది. ప్రస్తుతం ఈ ఖాతాల్లో మొత్తం రూ. 25,000 కోట్లు ఉన్నాయి. ఈ 11 ఏళ్లలో సహారా గ్రూప్‌లో భాగమైన రెండు సంస్థల ఇన్వెస్టర్లకు సెబీ రూ. 138 కోట్లు వాపసు చేసింది. చాలా మటుకు ఇన్వెస్టర్ల వివరాలు సరిగ్గా లేకపోవడం, క్లెయిమ్‌లు రాకపోవడంతో మిగతా నిధులన్నీ సెబీ దగ్గరే ఉన్నాయి. అనారోగ్యంతో సుబ్రతో రాయ్ మరణించిన నేపథ్యంలో పంపిణీ చేయని ఈ సొమ్ము పరిస్థితి ఏమిటనేది చర్చనీయాంశంగా మారినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. -
127 ట్రక్కుల్లో 3 కోట్ల పత్రాలు.. సెబీకి పంపిన సుబ్రతా రాయ్.. కారణం ఇదేనా?
సహారా గ్రూప్ ఛైర్మన్ సుబ్రతా రాయ్ అనారోగ్యంతో మంగళవారం కన్నుమూశారు. ఆయన మరణం దాదాపు మూడు కోట్ల మంది పెట్టుబడిదారులు చేసిన మదుపుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. సహారా ఇండియా గ్రూప్ సంస్థ వెబ్సైట్ ప్రకారం.. ఈ సంస్థకు 9 కోట్ల మంది పెట్టుబడిదారులు, వినియోగదారులు ఉన్నారు. రూ.2.59 లక్షల కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. వేల క్యాంపస్‌లు, 30,970 ఎకరాల భూములు ఉన్నట్లు సహారా ఇండియా వెబ్సైట్ చెబుతోంది. సెబీ చర్యల కారణంగా సుబ్రతా రాయ్ నిర్మించుకున్న సామ్రాజ్యం పతనం అవడం మొదలైంది. సహారా సంస్థ రియల్ఎస్టేట్ పెట్టుబడుల కోసమంటూ మూడు కోట్ల మందికి పైగా పెట్టుబడిదారుల నుంచి సుమారు రూ.25వేల కోట్ల రూపాయలను సమీకరించడంపై కేసు నమోదైంది. 2011లో ఇన్వెస్టర్ల డబ్బును తిరిగి చెల్లించాలని సహారా ఇండియా రియల్ ఎస్టేట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎస్‌ఐఆర్‌ఈఎల్), సహారా హౌసింగ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎస్‌హెచ్‌ఐసీఎల్) అనే రెండు సంస్థలను సెబీ ఆదేశించింది. అందుకు సంబంధించిన వివరాలు అడిగిన నేపథ్యంలో సహారా గ్రూప్ నుంచి 127 ట్రక్కులను సెబీ కార్యాలయానికి పంపి సుబ్రతా రాయ్ వార్తల్లో నిలిచారు. ఆ ట్రక్కుల్లో మూడు కోట్ల దరఖాస్తు పత్రాలు, రెండు కోట్ల రిడంప్షన్ ఓచర్లు ఉన్నాయి. నిర్ణత గడువులోగా రూ.10 వేల కోట్ల బకాయిలు చెల్లించకపోతే 2014 మార్చి 4న సుబ్రతా రాయ్ జైలుకి వెళ్లారు. రూ.5 వేల కోట్లు నగదు రూపంలో, మిగతా రూ.5 వేల కోట్లు బ్యాంకు గ్యారంటీ రూపంలో హామీ ఇస్తేనే ఆయన విడుదల సాధ్యమవుతుందని కోర్టు స్పష్టం చేసింది. రాయ్ రెండేళ్ల జైలు జీవితం అనంతరం పెరోల్‌పై విడుదలయ్యారు. ఇదీ చదవండి: ‘ఎక్స్’ సమాచారాన్ని నమ్మలేం.. జిమ్మీ వేల్స్ ఆసక్తికర వ్యాఖ్యలు సెబీకు దాదాపు రూ.25వేల కోట్లు డిపాజిట్ చేసినట్లు గతంలో సుబ్రతారాయ్ ప్రకటించారు. కానీ కంపెనీ పెట్టుబడిదారులకు సెబీ తిరిగి సొమ్ము చెల్లించలేదని రాయ్ ఆరోపించారు. సెబీ వెల్లడించిన వివరాల ప్రకారం.. 2023 మార్చి 31 నాటికి పెట్టుబడిదారులకు ఇచ్చేందుకు మొత్తం రూ.25,163 కోట్లు నిర్ణయించినప్పటికీ రూ.138 కోట్లు మాత్రమే తిరిగి చెల్లించింది. రెండు సహారా గ్రూపు సంస్థలు ఇన్వెస్టర్ల నుంచి భారీగా డబ్బు సేకరించేటప్పుడు వివిధ నిబంధనలను ఉల్లంఘించారు. మార్చి 31 నాటికి తమకు 20వేల కంటే తక్కువ దరఖాస్తులు వచ్చాయి. 17500 దరఖాస్తులకు సంబంధించిన డబ్బును వాపసు చేశామని సెబీ తెలిపింది. సరైన రుజువులు సమర్పించని కారణంగా మిగతావాటిని చెల్లించలేదని వివరించింది. సెబీ లేవనెత్తిన ప్రశ్నలపై బాండ్ హోల్డర్ల నుంచి ఎలాంటి ప్రతిస్పందన రాకపోవడంతో వాటిని నిలిపేసినట్లు సమాచారం. -
సుబ్రతా రాయ్ కుటుంబం విదేశాల్లో ఎందుకు ఉంటోంది?
సహారా ఇండియా గ్రూప్ చైర్మన్ సహారాశ్రీ సుబ్రతా రాయ్ సహారా ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన స్థాపించిన సహారాగ్రూప్ నేడు హౌసింగ్, ఎంటర్టైన్మెంట్, మీడియా, రిటైల్, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తోంది. ఆయన జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. సుబ్రతా రాయ్ సహారా భార్య, పిల్లలు ప్రస్తుతం విదేశాలలో ఉంటున్నారు. సుబ్రతా రాయ్‌కు భార్య స్వప్నా రాయ్, ఇద్దరు కుమారులు సీమాంతో, సుశాంతో రాయ్ ఉన్నారు. ఆయన తన కుమారుల పెళ్లిళ్లకు రూ.550 కోట్లు ఖర్చు చేశారని చెబుతుంటారు. వీరి వివాహాలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. మీడియాకు తెలిసిన వివరాల ప్రకారం సుబ్రతారాయ్ భార్య, కుమారుడు సుశాంతో భారత పౌరసత్వాన్ని వదులుకున్నారు. సుబ్రతా రాయ్ కుటుంబం ఆగ్నేయ ఐరోపాలోని బాల్కన్ దేశమైన నార్త్ మాసిడోనియా పౌరసత్వం తీసుకుంది. భారత చట్టాల నుంచి నుంచి తప్పించుకునేందుకే వారు నార్త్ మాసిడోనియా పౌరులుగా మెలుగుతున్నట్లు సమాచారం. సుబ్రతా రాయ్‌పై ‘సెబీ’ కేసు నడుస్తోంది. పెట్టుబడిదారులకు డబ్బు తిరిగి ఇవ్వలేదనే ఆరోపణలు అతనిపై ఉన్నాయి. సుబ్రతా రాయ్‌కి మాసిడోనియన్ ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉన్నాయనే వార్తలు వినిపిస్తుంటాయి. సుబ్రతా రాయ్ పలుమార్లు మాసిడోనియా రాష్ట్ర అతిథి హోదాను కూడా అందుకున్నారు. సుబ్రతారాయ్ భార్య స్వప్నా రాయ్‌పై 2017లో లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. అయితే ఆమె తరపున దాఖలయిన పిటిషన్లో.. ఆమె చట్టాన్ని గౌరవించే మహిళ అని, రిపబ్లిక్ ఆఫ్ మాసిడోనియా పౌరురాలు అని, ఆమెకు నేర చరిత్ర లేదని పేర్కొన్నారు. సహారా ఇండియా ఫ్యామిలీ ఛైర్మన్ భార్యగా ఆమెకు ఎల్ఓసీ జారీ చేశారు. మాసిడోనియాలో మూడు బడా వ్యాపారాలను ప్రారంభించాలని సహారా గ్రూప్ యోచిస్తున్నట్లు సమాచారం. అందులో ఒకటి డెయిరీ, రెండవది లాస్ వెగాస్ తరహాలో సెవెన్ స్టార్ హోటల్, మూడవది ఫిల్మ్ ప్రొడక్షన్ కోసం ఇండోర్ సెటప్. వీటికి మాసిడోనియా ప్రభుత్వం నుంచి కూడా సాయం అందుతున్నదని తెలుస్తోంది. ఉత్తర మాసిడోనియాలో పౌరసత్వం పొందడం చాలా సులభం. 4 లక్షల యూరోలు పెట్టుబడిగా పెడితే అక్కడి పౌరసత్వం దక్కుతుంది. దీంతో పాటు వారి సంస్థలో 10 మంది స్థానికులకు కూడా ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇలాంటి షరతులను నెరవేర్చిన వారు మాసిడోనియన్ పౌరసత్వం పొందవచ్చు. ఇది కూడా చదవండి: సహారా చైర్మన్ సుబ్రతా రాయ్ కన్నుమూత Sahara Group Managing Worker and Chairman Subrata Roy passes away due to cardiorespiratory arrest: Sahara Group pic.twitter.com/ugUdBrxiSp — ANI (@ANI) November 14, 2023 -
ఉద్యోగులకు టాటా స్టీల్ భారీ షాక్.. 800 మంది తొలగింపు
న్యూఢిల్లీ: నిర్మాణాత్మక పోటీతత్వం, లాభదాయకతలో భాగంగా టాటా స్టీల్ కీలక నిర్ణయం తీసుకుంది. నెదర్లాండ్స్‌లో 800 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నట్లు తెలిపింది. వీరిలో 300 మంది తాత్కాలిక సిబ్బంది ఉన్నారు. టాటా స్టీల్ యూరప్ నుండి రెండు స్వతంత్ర కంపెనీలుగా టాటా స్టీల్ యూకే, టాటా స్టీల్ నెదర్లాండ్స్‌ను వేరు చేసే ప్రక్రియను 2021 అక్టోబరులో టాటా స్టీల్ పూర్తి చేసింది. నెదర్లాండ్స్‌లో కంపెనీకి ఏటా ఏడు మిలియన్ టన్నుల సామర్థ్యంగల తయారీ ప్లాంట్ ఉంది. -
సహారా చైర్మన్ సుబ్రతా రాయ్ కన్నుమూత
సహారా ఇండియా గ్రూప్ చైర్మన్ సహారాశ్రీ సుబ్రతా రాయ్ సహారా మంగళవారం ముంబైలో తుది శ్వాస విడిచారు. ఆయన చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన భౌతికకాయాన్ని బుధవారం లక్నోలోని సహారా షహర్‌కు తరలించనున్నారు. అక్కడ అభిమానులు ఆయనకు నివాళులు అర్పించనున్నారు. రాయ్ మృతికి వ్యాపార, రాజకీయ రంగ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. సహారా గ్రూప్ ఒక ప్రకటన విడుదల చేస్తూ.. ‘సహారా ఇండియా పరివార్ మేనేజింగ్ వర్కర్, చైర్మన్ సుబ్రతా రాయ్ సహారా మృతికి విచారం తెలియజేస్తున్నాం. దూరదృష్టి కలిగి, అందరికీ స్ఫూర్తిదాయకమైన వ్యక్తి అయిన సహారాశ్రీ సుబ్రతా రాయ్ గుండెపోటుతో మంగళవారం రాత్రి 10.30 గంటలకు కన్నుమూశారు. రాయ్ క్యాన్సర్‌తో పోరాడుతున్నారని’ దానిలో పేర్కొంది. నవంబర్ 12న ఆయన ఆరోగ్యం క్షీణించడంతో కోకిలా బెన్ ఆసుపత్రిలో చేరారు. సుబ్రతా రాయ్ సహారా 1948, జూన్ 10న జన్మించారు. సహారా ఇండియా పరివార్‌ను స్థాపించారు. బీహార్‌లోని అరారియా జిల్లాలో జన్మించిన సుబ్రతా రాయ్ కోల్‌కతాలోని హోలీ చైల్డ్ స్కూల్లో ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. ఆ తర్వాత గోరఖ్‌పూర్‌లోని ప్రభుత్వ సాంకేతిక సంస్థలో మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా చేశారు. సహారాశ్రీగా పేరొందిన ఆయన తన వ్యాపారాన్ని 1978లో గోరఖ్‌పూర్ నుండి ప్రారంభించారు. 2012లో ఇండియా టుడే మ్యాగజైన్ భారతదేశంలోని 10 మంది ధనవంతులలో సుబ్రతా రాయ్ పేరును చేర్చింది. నేడు సహారా గ్రూప్.. హౌసింగ్, ఎంటర్టైన్మెంట్, మీడియా, రిటైల్, ఫైనాన్షియల్ సర్వీసెస్ వంటి వివిధ రంగాలలో ప్రముఖ పాత్ర పోషిస్తోంది. సహారాశ్రీ మృతికి సమాజ్‌వాదీ పార్టీ సంతాపం వ్యక్తం చేసింది. ఎక్స్(ట్విట్టర్) మాధ్యమంగా ఒక పోస్ట్‌లో సమాజ్‌వాదీ పార్టీ సుబ్రతా రాయ్ మృతికి సంతాపం తెలిపింది. సహరాశ్రీ సుబ్రతా రాయ్ మరణం చాలా బాధాకరమని పేర్కొంది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని కల్పించాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. ఇది కూడా చదవండి: ఒబెరాయ్ గ్రూప్ ఛైర్మన్ కన్నుమూత सहाराश्री सुब्रत रॉय जी का निधन, अत्यंत दुःखद। ईश्वर उनकी आत्मा को शांति दें। शोकाकुल परिजनों को ये असीम दुःख सहने का संबल प्राप्त हो। भावभीनी श्रद्धांजलि ! pic.twitter.com/QO6vAjriAv — Samajwadi Party (@samajwadiparty) November 14, 2023 -
సహారా ఎడారిలో పచ్చదనం? వేల ఏళ్లకు కనిపించే దృశ్యం?
జీవం ఉనికితో పాటు భూమి ఇతర గ్రహాలకు చాలా భిన్నమైనది. ఇక్కడి వాతావరణం మారుతూ ఉంటుంది. కొన్ని లక్షల సంవత్సరాలలో వాతావరణం తీరుతెన్నులు సంపూర్ణంగా మారుతుంటాయి. ఇలాంటి మార్పులు ఇతర గ్రహాలలో చాలా అరుదుగా కనిపిస్తాయి. ఒకప్పుడు సహారా ఎడారిగా పచ్చగా ఉండేదనడానికి కొన్ని ఆధారాలు లభ్యమయ్యాయి. అయితే ఇలాంటి మార్పు ఎలా సంభవించిందో ఇప్పటివరకు శాస్త్రవేత్తలు తెలుసుకోలేకపోయారు. అయితే తాజా పరిశోధన దీనిపై కొంత క్లారిటీని తీసుకువచ్చింది. ఎడారిలో నదులు, సరస్సులు ఆఫ్రికాలోని సహారా ఎడారి 92 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన ప్రపంచంలోనే అతిపెద్ద ఎడారి. కొన్ని వేల సంవత్సరాలకు ఒకసారి ఇది ఇది ఆకుపచ్చగా మారుతుంది. అప్పుడు ఇక్కడ నీటిపై ఆధారపడే జంతువులు, సవన్నా మైదానాలు, నదులు, సరస్సులు కనిపిస్తాయి. నేచర్ కమ్యూనికేషన్స్‌లో ప్రచురితమైన అధ్యయనంలో సహారా ఎడారిలో ఎప్పుడు తడి కాలాలు సంభవిస్తాయి? దీనికి సూర్యుని చుట్టూ తిరిగే భూమి కక్ష్య ఎలాంటి పాత్రను పాత్ర పోషిస్తుందో వివరించారు. భారీ పర్యావరణ మార్పులలో ఇదొకటి సహారాలో మంచు యుగం ప్రభావం కూడా కనిపించింది. బ్రిస్టల్, హెల్సింకి విశ్వవిద్యాలయానికి చెందిన వాతావరణ శాస్త్రవేత్త ఎడ్వర్డ్ ఆర్మ్‌స్ట్రాంగ్ విడుదల చేసిన ఒక ప్రకటనలో.. సహారా ఎడారిని సవన్నాలేదా ఫారెస్ట్‌గా మార్చే ప్రక్రియ భూమిపై అత్యంత అద్భుతమైన పర్యావరణ మార్పులలో ఒకటని పేర్కొన్నారు. ఈ సంఘటనలు ఎప్పుడు, ఎలా జరిగాయో వెల్లడించడానికి ఆఫ్రికాలో క్లైమేట్ మోడలింగ్ అధ్యయనం జరిగిందన్నారు. ఇటువంటి మార్పులు అనివార్యం చరిత్రలో సహారా ఎడారి పచ్చగా మారుతుందనే వాదనకు మద్దతు ఇచ్చే అనేక ఆధారాలు అందుబాటులో ఉన్నాయి. ఈ అధ్యయనంలో ఈ పచ్చదన ప్రక్రియ సూర్యుని చుట్టూ భూమి కక్ష్యలోని ప్రీసెషన్ ప్రక్రియ ద్వారా నిర్ణయమవుతుందని సూచించారు. భూమి కొన్నిసార్లు దాని సొంత అక్షం మీద కదలినప్పుడు సంభవించే మార్పుల కారణంగా భూమిపై ఏర్పడే రుతువులు దాదాపు ప్రతి 21 వేల కాలచక్రాలకు ప్రభావితం అవుతాయి. ఫలితంగా వర్షపాత పరిస్ధితులు ఏర్పడి ఆఫ్రికా రుతుపవనాలు నియంత్రితమవుతాయి. ఫలితంగా సహారాలో పచ్చదనం వ్యాపిస్తుంది. ప్రతి 21 వేల సంవత్సరాలకు.. ఉత్తర ఆఫ్రికాలో ప్రతి 21 వేల సంవత్సరాలకు విపరీత వాతావరణమార్పులు సంభవిస్తాయని, వీటిని భూమి తిరిగే కక్ష్య నిర్ణయిస్తుందనేది నిర్ధారించడానికి ఈ అధ్యయనంలో క్లిష్టమైన వాతావరణ నమూనాలను ఉపయోగించారు. ఈ మార్పు ఉత్తర అర్ధగోళంలో, పశ్చిమ ఆఫ్రికాలో రుతుపవన వ్యవస్థ శక్తిని మరింతగా పెంచుతుంది. ఫలితంగా సహారాలో వర్షపాతం విస్తృతంగా వ్యాపిస్తుంది. దీంతో ఎడారిలో పచ్చదనం కనిపిస్తుంది. 12 వేల ఏళ్ల తరువాత.. ఈ అధ్యయనంలో కనుగొన్న ఒక ప్రత్యేక విషయం ఏమిటంటే.. ఉత్తర ఆఫ్రికాలోని తేమతో కూడిన ప్రాంతాలు విపరీత వాతావరణమార్పులకు అంతగా గురికావు. ఎందుకంటే అక్కడి మంచు పలకలు అధిక అక్షాంశాలలో వ్యాపిస్తాయి. ఈ షీట్లు వాతావరణాన్ని చల్లబరుస్తాయి. ఫలితంగా రుతుపవనాల ప్రభావం కనిపించదు. సహారాలో సుమారు 5000 సంవత్సరాల క్రితం వరకు పచ్చదనం ఉండేది. ఇది భూమి కక్ష్య యొక్క వంపు 24.1 డిగ్రీలుగా మారిన సమయంలో జరిగింది. ప్రస్తుతం భూమి వంపు 23.5 డిగ్రీలలో ఉంది. అంటే ఇప్పుడు సహారాలో తదుపరి మార్పు సుమారు 12 వేల సంవత్సరాల తర్వాత కనిపిస్తుంది అప్పుడు మనం సహారా ఎడారి పచ్చగా మారడాన్ని చూడగలుగుతాం. ఇది కూడా చదవండి: కెనడాలో చోరీ, అఫ్రికాలో ప్రత్యక్ష్యం.. ఈ కార్లు ఎలా వస్తున్నాయబ్బా? -
సహారా డబ్బులు వెనక్కి ఇస్తున్నారు..వెంటనే ఇలా క్లయిమ్ చేసుకోండి
న్యూఢిల్లీ: సహారా గ్రూప్ నాలుగు కోపరేటివ్‌ల పరిధిలో నాలుగు కోట్ల డిపాజిటర్లకు డబ్బులు చెల్లించడం మొదలైంది. మొదటి విడత కింద ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున 112 మంది చిన్న ఇన్వెస్టర్లకు చెల్లింపులను కేంద్ర హోంశాఖ, సహకార శాఖల మంత్రి అమిత్‌షా శుక్రవారం ప్రారంభించారు. సీఆర్సీఎస్ సహారా రిఫండ్ పోర్టల్‌పై ఇప్పటి వరకు 18 లక్షల మంది డిపాజిటర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నట్టు షా చెప్పారు. సహారా డిపాజిటర్ల చెల్లింపులకు వీలుగా సీఆర్సీఎస్–సహారా పోర్టల్‌ను కేంద్ర సహకార శాఖ జూలై 18న ప్రారంభించడం గమనార్హం. నమోదు చేసుకున్న ఇన్వెస్టర్లు అందరికీ తొలి విడతలో రూ.10వేల చొప్పున చెల్లించనున్నారు. ఆడిట్ పూర్తయిన తర్వాత రెండో విడత నిధులను బదిలీ చేస్తామని అమిత్‌షా తెలిపారు. ‘‘రానున్న రోజుల్లో డిపాజిటర్లు అందరూ తమ నిధులను పొందుతారని మీకు భరోసా ఇస్తున్నా’’అని ప్రకటించారు. సహార వంటి ఘటనలు జరిగినప్పుడల్లా సహకార సంస్థల పట్ల నమ్మకం కుదేలవుతున్నట్టు పేర్కొన్నారు. ఇన్వెస్టర్ల డబ్బులు సురక్షితంగా ఉన్నాయని, వాటిని తిరిగి వారికి అందిస్తామని భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. సహారా డిపాజిటర్లు గత 12–15 ఏళ్ల నుంచి తమ డబ్బులు పొందలేకపోయారని, ఇందుకు సహారా యాజమాన్యం విఫలం కావడం, కోర్టుల్లో వ్యాజ్యాలతో జాప్యం జరిగినట్టు చెప్పారు. సెబీ–సహారా ఫండ్ నుంచి రూ.5,000 కోట్లను సహకార శాఖ పొందడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినట్టు అమిత్‌షా వివరించారు. సీబీఐ, ఆదాయపన్ను శాఖ తదితర కేంద్ర ప్రభుత్వం సంస్థలను ఒకేతాటిపైకి తీసుకొచ్చి.. నిధులపై ముందుగా చిన్న ఇన్వెస్టర్లకు తొలుత హక్కు ఉండాలంటూ సుప్రీంకోర్టును కోరినట్టు గుర్తు చేశారు. సహారా గ్రూపు నాలుగు కోపరేటివ్‌ల పరిధిలోని 10 కోట్ల మంది ఇన్వెస్టర్లకు వచ్చే తొమ్మిది నెలల్లో వారి డబ్బులు తిరిగి పొందేలా చర్యలు తీసుకుంటామని ఈ ఏడాది మార్చి 29న కేంద్రం ప్రకటించడం గమనార్హం. ఇక సహారా డబ్బుల్ని ఎలా క్లయిమ్ చేసుకోవాలంటే? ♦ ముందుగా mocrefund.crcs.gov.in. పోర్టల్‌కి వెళ్లాలి ♦ ఆధార్ కార్డ్ నెంబర్ సాయంతో డిపాజిటర్ లాగిన్ అవ్వాలి ♦ అనంతరం మీ వద్ద ఉన్న సహారా బాండ్ పేపర్లని, ఇతర పత్రాలని అప్లోడ్ చేయాలి. ♦ అప్లోడ్ చేసిన పత్రాలని 30 రోజుల్లోగా ధృవీకరిస్తారు. ♦ అనంతరం 15 రోజుల్లో అధికారులు దీనిపై చర్యలు తీసుకుంటారు ♦ తర్వాత ఎస్ఎంఎస్ ద్వారా వెరిఫికేషన్ పూర్తయినట్లు ఇన్వెస్టర్లకు సమాచారం అందిస్తారు. ♦ ఎస్ఎంఎస్ వచ్చిందంటే మీ ఆన్లైన్ క్లెయిమ్ ఆమోదం పొందినదని అర్థం. ♦ తర్వాత పెట్టుబడి మొత్తం ఖాతాకు బదిలీ అవుతుంది. ♦ క్లెయిమ్ని ధృవీకరించిన తేదీ నుంచి 45 రోజుల తర్వాత మొత్తం బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. -
సహారా డిపాజిటర్లకు గుడ్‌న్యూస్: చెల్లింపుల ప్రక్రియ షురూ.. ఫస్ట్ వారికే..
న్యూఢిల్లీ: సహారా గ్రూప్‌నకు చెందిన నాలుగు కోఆపరేటివ్ సొసైటీల్లో ఇరుక్కుపోయిన దాదాపు రూ. 5,000 కోట్ల మొత్తాన్ని తిరిగి డిపాజిటర్లకు అందజేసే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రారంభించింది. దీనితో చాలా కాలంగా తమ కష్టార్జితం కోసం ఎదురుచూస్తున్న కోట్ల మంది చిన్న ఇన్వెస్టర్లకు ఊరట లభించనుంది. ఇందుకోసం సీఆర్సీఎస్–సహారా రీఫండ్ పోర్టల్‌ను కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా ప్రారంభించారు. దీనితో ఒక కోటి మంది డిపాజిటర్లకు ప్రయోజనం చేకూరగలదని ఆయన పేర్కొన్నారు. ముందుగా రూ. 10,000 వరకు ఇన్వెస్ట్ చేసిన కోటి మంది ఇన్వెస్టర్లకు చెల్లింపులు జరపనున్నట్లు మంత్రి చెప్పారు. నాలుగు సొసైటీల (సహారా క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ, సహారాయాన్ యూనివర్సల్ మల్టీపర్పస్ సొసైటీ, హమారా ఇండియా క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ, స్టార్స్ మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీ) మొత్తం డేటా సీఆర్సీఎస్–సహారా రీఫండ్ పోర్టల్‌లో ఉందని, దాని ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇందుకోసం ఇన్వెస్టరు ఆధార్ కార్డు వారి మొబైల్ నంబరు, బ్యాంకు ఖాతాలకు అనుసంధానమై ఉండాలని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న 45 రోజుల్లోగా వారికి రావాల్సిన సొమ్ము వారి ఖాతాల్లో జమవుతుందని చెప్పారు. రూ. 5,000 కోట్ల చెల్లింపులు పూర్తయిన తర్వాత ఇతర ఇన్వెస్టర్లకు చెందిన డబ్బును కూడా తిరిగి చెల్లించేందుకు అనుమతుల కోసం సుప్రీం కోర్టును కోరనున్నట్లు ఆయన తెలిపారు. సహారా–సెబీ రిఫండ్ ఖాతా నుంచి రూ. 5,000 కోట్ల మొత్తాన్ని సెంట్రల్ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ (సీఆర్సీఎస్)కు బదలాయించాలంటూ గతంలో సుప్రీం కోర్టు ఆదేశించింది. నాలుగు సహకార సంఘాలకు చెందిన 10 కోట్ల మంది ఇన్వెస్టర్లకు 9 నెలల్లోగా డిపాజిట్ మొత్తాలను వాపసు చేస్తామంటూ మార్చి 29న కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. -
సహారా లైఫ్ విలీనం కాదు.. పాలసీల బదిలీ
న్యూఢిల్లీ: సహారా లైఫ్‌ను తాము విలీనం చేసుకోవడం లేదని ఎస్బీఐ లైఫ్ స్పష్టం చేసింది. బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) ఆదేశాల మేరకు సహారా లైఫ్ ఇన్సూరెన్స్ నిర్వహణలోని పాలసీ దారుల ఆస్తులు, అప్పులను స్వాధీనం చేసుకుంటున్నట్టు తెలిపింది. సహారా లైఫ్ ఇన్సూరెన్స్ ఆర్థిక పరిస్థితులు క్షీణించడంతో సంస్థ జారీ చేసిన పాలసీలు, వాటి ఆస్తులు, అప్పులను స్వాధీనం చేసుకోవాలంటూ గత శుక్రవారం ఐఆర్డీఏఐ ఎస్బీఐ లైఫ్‌ను ఆదేశించడం గమనార్హం. మెరుగైన సేవలు అందిస్తామని సహారా లైఫ్ పాలసీదారులకు ఎస్బీఐ లైఫ్ అభయమిచ్చింది. ‘‘సహారా లైఫ్ పాలసీలను మా వ్యవస్థతో అనుసంధానించేందుకు వేగవంతమైన చర్యలు మొదలు పెట్టాం. పూర్తి స్థాయి ఏకీకరణకు కొంత సమయం పడుతుంది. సహారా లైఫ్ పాలసీదారులు 1800 267 9090 టోల్ ఫ్రీ నంబర్లో లేదా ట్చజ్చిట్చ జీజ్ఛఃటbజీ జీజ్ఛ. ఛిౌ. జీn మెయిల్ ఐడీ ద్వారా సంప్రదించాలని ఎస్బీఐ లైఫ్ సూచించింది. సహారా లైఫ్ కొత్తగా పాలసీలను విడుదల చేయరాదని కూడా ఐఆర్డీఏఐ ఆదేశించడం గమనార్హం. తగినంత సమయం, తగినన్ని అవకాశాలు కల్పించినప్పటికీ తమ ఆదేశాలను పాటించడంలో., పాలసీదారుల ప్రయోజనాల పరిరక్షణకు నిర్ణయాత్మక చర్యలు తీసుకోవడంలో సహారా లైఫ్ ఇన్సూరెన్స్ విఫలమైందని ఆఆర్డీఏఐ తన ఆదేశాల్లో పేర్కొంది. -
సహారా రియల్టీకి సెబీ భారీ షాక్!
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా సహారా గ్రూప్ రియల్టీ కంపెనీ, సంస్థ చీఫ్ సుబ్రతా రాయ్, తదితరుల బ్యాంకు, డీమ్యాట్ ఖాతాల అటాచ్‌మెంట్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఐచ్చికంగా పూర్తి మార్పిడికి వీలయ్యే డిబెంచర్ల(ఓఎఫ్సీడీలు) జారీలో నిబంధనల ఉల్లంఘనపై రూ. 6.42 కోట్ల రికవరీకిగాను సెబీ చర్యలు తీసుకుంది. ఈ జాబితాలో సహారా ఇండియా రియల్ ఎస్టేట్(సహారా కమోడిటీ సర్వీసెస్) కార్పొరేషన్, సుబ్రతా రాయ్, అశోక్ రాయ్ చౌధరీ, రవి శంకర్ దూబే, వందనా భార్గవ ఉన్నారు. వీరి నుంచి వడ్డీ, వ్యయాలు, ఇతర ఖర్చులతో కలిపి రూ.6.42 కోట్ల రికవరీకి సెబీ తాజా ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యక్తులు, సంస్థకు సంబంధించిన ఎలాంటి డెబిట్లను అనుమతించవద్దంటూ బ్యాంకులు, డిపాజిటరీలు, మ్యూచువల్ ఫండ్స్‌కు నోటీసు ద్వారా తెలియజేసింది. కేవలం క్రెడిట్లకు అనుమతించింది. అంతేకాకుండా ఈ డిఫాల్టర్లకు చెందిన లాకర్లతోసహా అన్ని ఖాతాలనూ అటాచ్ చేయమంటూ అన్ని బ్యాంకులనూ ఆదేశించింది. చదవండి: Meesho Shopping Survey: ఆన్లైన్ షాపింగ్ అంటే ఆ ఒక్కరోజే, ఎగబడి కొనేస్తున్నారు! -
మా 25వేల కోట్లను ఇన్వెస్టర్లకు ఇవ్వండి, లేదంటే తిరిగి మాకే ఇచ్చేయండి!
లక్నో: మార్కెట్ రెగ్యులేటర్ సెబీని సహారా ఇండియా పరివార్ ఒక ప్రకటనలో ఘాటుగా విమర్శించింది. సహారాకు చెందిన రూ.25,000 కోట్లు ప్రస్తుతం సెబీ వద్ద ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తూ, అందులో గడచిన తొమ్మిది సంవత్సరాల్లో కేవలం రూ.125 కోట్లనే ఇన్వెస్టర్లకు చెల్లిందని పేర్కొంది. మిగిలిన డబ్బును ఎందుకు చెల్లించలేకపోతోందని ప్రశ్నించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక బాధిత కంపెనీగా సహారా మిగులుతోందని విమర్శించింది. అక్రమంగా వసూలు చేశారంటూ తమ వద్ద నుంచి డిపాజిట్ చేయించుకున్న రూ.25,000 కోట్లను ఇన్వెస్టర్లు అందరికీ చెల్లింపులు చేయాలని లేదా ఆ మొత్తాలను తమకు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేసింది. తద్వారా తామే తమ డిపాజిట్‌దారులకు డబ్బు చెల్లించుకుంటామని స్పష్టం చేసింది. సెబీ వద్ద సహారా డబ్బు డిపాజిట్‌కు సంబంధించి అత్యున్నత న్యాయస్థానం– సుప్రీంకోర్టు అసలు లక్ష్యం నెరవేరడం లేదని పేర్కొంది. -
కేసీఆర్ బండారం బయటపెడతాం: బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: సహారా ఫైల్ కదిలించి, కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ చేసిన వ్యవహారాన్ని బయటపెడతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడుతూ, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతి, భూకబ్జాలపై త్వరలో చిట్టా విప్పుతామని చెప్పారు. హుజూరాబాద్ స్థానానికి ఈటల రాజీనామా చేస్తే అక్కడ బీజేపీ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. బెంగాల్లో బీజేపీ కార్యకర్తలకు దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ కార్యకర్తలు అండగా ఉంటారని బండి సంజయ్ పేర్కొన్నారు. బెంగాల్లో బీజేపీ కార్యాలయాలు, కార్యకర్తలపై దాడులకు నిరసనగా దేశవ్యాప్తంగా చేపట్టిన దీక్షలో భాగంగా బుధవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బండి దీక్ష చేశారు. ఆయనతోపాటు పలువురు పార్టీ నేతలు దీక్షలో పాల్గొని, నోటికి నల్ల రిబ్బన్ కట్టుకొని నిరసన తెలియజేశారు. అనంతరం సంజయ్ మాట్లాడుతూ, బెంగాల్‌ను బంగ్లాదేశీయులకు అప్పగించే కుట్ర జరుగుతోందని, ఎన్నికల ఫలితాల తరువాత 18 మంది బీజేపీ కార్యకర్తలు హత్యకు గురయ్యారని తెలిపారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇప్పటికైనా విధ్వంసాన్ని ఆపకపోతే దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ కార్యకర్తలు బెంగాల్లో కరసేవ చేసే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. ( చదవండి: ‘కేసీఆర్ బయటకు రా.. ప్రజల కష్టాలు చూడు’ ) -
సహార గ్రూప్ యాంబీ వ్యాలీ వేలం కొనసాగుతుంది
-
యాంబీ వ్యాలీ ఆస్తుల వేలం
న్యూఢిల్లీ: మహారాష్ట్రలోని సహారా గ్రూప్‌కు చెందిన యాంబీ వ్యాలీ ఆస్తుల వేలం ప్రక్రియ కొనసాగుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఏప్రిల్ 19న హామీ ఇచ్చిన విధంగా రూ.750 కోట్లను సెబీ–సహారా రిఫండ్ అకౌంట్లో డిపాజిట్ చేయడంలో సహారా గ్రూప్ వైఫల్యం చెందడం తాజా సుప్రీం స్పష్టీకరణల నేపథ్యం. యాంబీ వేలం ఆస్తులు కొన్నింటిని విక్రయించి, రూ.750 కోట్లను మే 15 నాటికి డిపాజిట్ చేస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చడంలో సహారా గ్రూప్ విఫలమయ్యిందని చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. కేసు తదుపరి విచారణను జూలై 12వ తేదీకి వాయిదా వేసింది. సెబీ తరఫు న్యాయవాది అరవింద్ దత్తార్ ఈ సందర్భంగా సుప్రీంకు సహారా చెల్లించాల్సిన నిధుల వివరాలను తెలిపారు. దీని ప్రకారం– చెల్లించాల్సిన అసలు రూ.25,781.23 కోట్లు. ఇందులో దాదాపు రూ.14,357 కోట్లను సహారా ఇప్పడికే డిపాజిట్ చేసింది. వడ్డీతో కలుపుకుని దాదాపు రూ.18,187 కోట్లు డిపాజిట్ చేసింది. యాంబీ వ్యాలీ ఆస్తుల విక్రయాల ద్వారా మిగిలిన మొత్తాన్ని పొందాలని సుప్రీంకోర్టు ఆదేశాలు నిర్దేశిస్తున్నాయి. -
యాంబీ వ్యాలీ వేలానికి సహకరించట్లేదు..!
న్యూఢిల్లీ: మహారాష్ట్రలోని ప్రతిష్టాత్మక యాంబీ వ్యాలీ వేలానికి సహారా సహకరించడం లేదని పేర్కొంటూ సహారాపై సుప్రీంకోర్టులో మార్కెట్ రెగ్యులేటర్ సెబీ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. సత్వరం ఈ పిటిషన్‌పై విచారణ జరపాలని జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని బెంచ్‌ని సెబీ న్యాయవాది కోరారు. మంగళవారం నుంచీ వేలం ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉన్నా సహారా సహకరించకపోవడం వల్ల ఆలస్యం అవుతోందని వివరించారు. అయితే కేసును విచారిస్తున్న బెంచ్‌లోని మరో ఇరువురు న్యాయమూర్తులతో చర్చించి, పిటిషన్ విచారణ తదుపరి తేదీని తెలుపుతామని జస్టిస్ గొగోయ్ చెప్పారు. కేసును విచారిస్తున్న త్రిసభ్య ధర్మాసనంలో సభ్యులైన ప్రధాన న్యాయమూర్తి మిశ్రా, జస్టిస్ శిక్రీలు వేర్వేరు బెంచ్‌ల్లో (కాంబినేషన్లలో) ఉన్న నేపథ్యంలో జస్టిస్ గొగోయ్ ఈ విషయం తెలిపారు. సహారా సంస్థలు రెండు ఇన్వెస్టర్లకు దాదాపు రూ. 37,000 కోట్లు చెల్లించాల్సిన కేసులో యాంబీ వ్యాలీ వేలానికి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. -
యాంబీ వ్యాలీ వేలం
కొనసాగించాల్సిందే: సుప్రీం న్యూఢిల్లీ: మహారాష్ట్ర పుణెలోని రూ.34,000 కోట్ల యాంబీ వ్యాలీ వేలాన్ని నిలిపివేయాలని సహారా చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది. షెడ్యూల్ ప్రకారం, వేలం నిర్వహించడానికి అధికారిక లిక్విడేటర్‌కు అనుమతి ఇచ్చింది. యాంబీవ్యాలీలో తన 26 శాతం వాటాను రాయల్ పార్ట్నర్స్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్‌కు విక్రయించి 1.6 బిలియన్ డాలర్లు సమీకరించుకోడానికి అనుమతించాలని, అప్పటి వరకూ వ్యాలీ జప్తును నిలిపివేయాని అత్యున్నత న్యాయస్థానానికి సహారా విజ్ఞప్తి చేసింది. అయితే దీన్ని చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తిరస్కరిస్తూ, తగిన ఒప్పందం ద్వారా నిధులు సమీకరించి, డిపాజిట్ చేస్తే, తదుపరి తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని స్పష్టం చేసింది. రెండు గ్రూప్ సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా ఇన్వెస్టర్ల నుంచి నిధులు వసూలు చేయటమే కాక... పునఃచెల్లింపుల్లో విఫలమైన కేసులో యాంబీ వ్యాలీ వేలానికి ఇంతక్రితం బాంబే హైకోర్టు అధికారిక లిక్విడేటర్‌ను నియమిస్తూ, సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. చెల్లించాల్సిన మొత్తం రూ.24,000 కోట్ల నిధుల్లో మిగిలిన దాదాపు రూ.9,000 కోట్ల చెల్లింపులకు 18 నెలల సమయాన్ని ఇప్పటికే సహారా కోరింది. అయితే వడ్డీతో కలిపి దాదాపు రూ.35,000 కోట్ల బకాయిలు ఉన్నాయని మార్కెట్ రెగ్యులేటర్ సెబీ సుప్రీంకోర్టుకు తెలిపింది. -
యాంబీ వ్యాలీ వేలం నిలిపివేయండి!
సుప్రీంకు సహారా అభ్యర్థన న్యూఢిల్లీ: యాంబీ వ్యాలీ ఆస్తి వేలాన్ని నిలిపేయాలని సహారా చీఫ్ సుబ్రతో రాయ్ బుధవారం సుప్రీంకోర్టును అభ్యర్థించారు. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు. రెండు గ్రూప్ సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా ఇన్వెస్టర్ల నుంచి నిధులు వసూలు చేయటమే కాక... పునః చెల్లింపుల్లో విఫలమైన కేసులో రూ.34,000 కోట్ల యాంబీ వ్యాలీ వేలానికి ఇంతక్రితం బాంబే హైకోర్టు అధికారిక లిక్విడేటర్‌ను నియమిస్తూ, సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. ఆగస్టు 14న ఇందుకు సంబంధించి లిక్విడేటర్ నోటీసు ప్రచురించాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే సహారా తాజా పిటిషన్ దాఖలు చేసింది. చెల్లింపుల ప్రణాళికను సుప్రీం ముందు సహారా ఉంచుతున్నందున మహారాష్ట్ర పూనే జిల్లాలో ఉన్న ఈ ఆస్తి వేలం నిలిపివేయాలని రాయ్ కోరారు. అయితే కేసు విచారణ తేదీని తరువాత నిర్ణయిస్తామని జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ తెలిపింది. చెల్లించాల్సిన మొత్తం రూ.24,000 కోట్ల నిధుల్లో మిగిలిన దాదాపు రూ.9,000 కోట్ల చెల్లింపులకు 18 నెలల సమయాన్ని ఇప్పటికే సహారా కోరింది. అయితే వడ్డీతో కలిపి దాదాపు రూ.35,000 కోట్ల బకాయిలు ఉన్నాయన్నది సెబీ వాదన. -
ప్లీజ్: యాంబీ వ్యాలీ వేలాన్ని ఆపండి
సహారా గ్రూపుకు ఎంతో ప్రతిష్టాత్మకమైన ఆస్తి యాంబీ వ్యాలీ సిటీ. పుణేకు దగ్గర్లో ఉన్న ఈ ప్రాపర్టీలో లగ్జరీ రిసార్ట్స్ నుంచి ఎయిర్‌పోర్టు వరకు అన్నీ ఉన్నాయి. ఈ ఆస్తి మరికొన్ని రోజుల్లో సహారా చేజారిపోతుంది. దీని వదులుకోవడం ఇష్టం లేని సహారా గ్రూపు, యాంబీ వ్యాలీ వేలాన్ని ఆపండంటూ సుప్రీంకోర్టును కోరింది. యాంబీ వ్యాలీ వేలాన్ని ఆపాలని కోరుతూ సహారా గ్రూపు బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటరీ సెబీ వద్ద నగదును రీఫండ్ చేసే విషయంలో కొంత పరిస్థితి అనుకూలించిందని సహారా పేర్కొంది. సహారా అభ్యర్థనను టాప్ కోర్టు త్వరలోనే విచారించనుంది. సహారాకు చెందిన యాంబీ వ్యాలీ ప్రాపర్టీని విక్రయించే ప్రక్రియను ప్రారంభించాలంటే, గత నెలలో బొంబై హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. నగదును రీఫండ్ చేసే విషయంలో సహారా గ్రూప్ తమ ఆదేశాలను పాటించకపోవడంతో సుప్రీం యాంబీ వ్యాలీని అమ్మడం ప్రారంభించాలని పేర్కొంది. అంతేకాక సెప్టెంబర్ 7 వరకు సెబీ వద్ద రూ.1500 కోట్లను డిపాజిట్ చేయాలని కూడా ఆదేశించింది. లేకపోతే తదుపరి చర్యలు చాలా సీరియస్‌గా ఉంటాయని హెచ్చరించింది. 8900 ఎకరాల్లో యాంబీ వ్యాలీ విస్తరించి ఉంది. ఈ ఆస్తి విలువ రూ.39వేల కోట్లు. ఈ ఏడాది ఏప్రిల్‌లోనే తొలుత యాంబీ వ్యాలీ ప్రాజెక్టును అమ్మాలని కోర్టు ఆదేశించింది. గతనెల జూలై 25న జరిగిన విచారణలో, యాంబీ వ్యాలీ వేలం ప్రక్రియను సహారా చీఫ్ లాయర్ తీవ్రంగా వ్యతిరేకించారు. బ్యాలెన్స్ రూ.9000 కోట్లను చెల్లించడానికి 18 నెలల సమయం కోరారు. సహారా గ్రూప్‌కు చెందిన రెండు సంస్థలు సహారా రియల్ ఎస్టేట్ కార్పొరేషన్ లిమిటెడ్, సహారా హౌజింగ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌లు ఇన్వెస్టర్లకు రూ.24వేల కోట్లు చెల్లించడం విఫలయ్యాయి. ఈ కేసు కింద 2014 మార్చిలో సహారా గ్రూప్ అధినేత సుబ్రతారాయ్ అరెస్టు అయ్యారు. అయితే గతేడాది మే నెలలో తన తల్లి మరణించడంతో పెరోల్‌పై బయటికి వచ్చిన ఆయన, తన పెరోల్ గడువును ఇప్పటివరకు పొడిగించుకుంటూ పోతూనే ఉన్నారు. -
సహారాకు ‘శాట్’ షాక్!
ఫండ్ లైసెన్స్ రద్దుపై సెబీ ఉత్తర్వుల కొట్టివేతకు నో... సుప్రీంకు వెళ్లడానికి 6వారాల గడువు! ముంబై: తన మ్యూచువల్ ఫండ్ లైసెన్స్‌ను రద్దుచేస్తూ, సెబీ ఇచ్చిన ఉత్తర్వులను సవాలుచేస్తూ, సహారా దాఖలు చేసుకున్న పిటిషన్‌ను శుక్రవారం సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (శాట్) తోసిపుచ్చింది. అయితే ఈ అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి ఆరు వారాల గడువును మంజూరు చేసింది. సహారా మ్యూచువల్ ఫండ్ ‘సర్టిఫికెట్ ఆఫ్ రిజిస్ట్రేషన్’ను రద్దు చేస్తూ జూలై 2015లో ఉత్తర్వులు ఇచ్చింది. ఇన్వెస్టర్ల నుంచి ఎటువంటి నిధులూ ఫండ్ హౌస్‌ను సేకరించరాదని ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యాపార నిర్వహణకు సంస్థకు సామర్థ్యం లేదని గుర్తించిన తరువాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత ఉత్తర్వుల్లో తెలిపింది. అప్పటి బిజినెస్ మొత్తాన్ని మరొక ఫండ్ హౌస్‌కు బదలాయించాలనీ స్పష్టంచేసింది. లేదా అప్పటికే సమీకరించిన నిధులను తిరిగి ఇన్వెస్టర్లకు చెల్లించేయాలని ఆదేశించింది. ఇరు వర్గాల వాదనలూ విన్న శాట్,.. ఇన్వెస్టర్ల ప్రయోజనాల పరిరక్షణకు తగిన అన్ని చర్యలూ తీసుకునే అధికారాలు సెబీకి ఉంటాయని శాట్ తన రూలింగ్‌లో స్పష్టం చేసింది. రెండు గ్రూప్ సంస్థలు ఇన్వెస్టర్ల నుంచి నిబంధనలకు వ్యతిరేకంగా భారీ నిధుల (దాదాపు రూ. 25,000 కోట్లు) సమీకరణ, తిరిగి చెల్లింపుల్లో వైఫల్యం అంశాన్నీ శాట్ ప్రస్తావించింది. సహారా లైఫ్ టేకోవర్‌పై ఐఆర్డీఏ సూచనలు.. జులై 31 నుంచి సహారా ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్‌ను టేకోవర్ చేయాల్సిందిగా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ కు బీమా నియంత్రణ సంస్థ ఐఆర్డీఏఐ సూచించింది. సహారా లైఫ్‌ను టేకోవర్ చేయాలంటూ 6 బీమా సంస్థలకు ఐఆర్డీఏ లేఖ రాయగా.. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ముందుకొచ్చింది. -
సహారా 710 కోట్లు డిపాజిట్!
♦ జూలై 15లోపు రూ.552 కోట్ల చెక్కు ♦ నగదుగా మారాలని సుప్రీం ఆదేశం న్యూఢిల్లీ: సహారా చీఫ్ సుబ్రతారాయ్... సెబీ–సహారా అకౌంట్లో రూ.710.22 కోట్లు డిపాజిట్ చేశారు. అయితే ఈ మొత్తంలో రూ.552.21 కోట్లకు సంబంధించిన చెక్కు జూలై 15వ తేదీలోపు తప్పనిసరిగా నగదుగా మారాలని (రియలైజేషన్) అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. లేదంటే తగిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని స్పష్టం చేసింది. నిజానికి ఇందుకు మరింత గడువు (జూలై 15 తరువాత) కావాలన్న రాయ్ విజ్ఞప్తిని సుప్రీం తోసిపుచ్చింది. అసల్లో బకాయి రూ.9,000 కోట్లు... జూన్ 15 లోపు రూ.1,500 కోట్లు చెల్లిస్తాననీ, అటు తర్వాత సరిగ్గా నెల రోజులకు రూ.552.22 కోట్లు చెల్లిస్తాననీ రాయ్ ఇంతక్రితమే కోర్టుకు హామీ ఇచ్చారు. అయితే జూన్ 15 నాటికి రూ.790.18 కోట్లు మాత్రమే చెల్లించారు. మిగిలిన రూ.709.82 కోట్ల చెల్లింపులకు జూలై 4వ తేదీ వరకూ గడువు కోరారు. ఇందుకు కోర్టు అనుమతించింది. తాజాగా డిపాజిట్ చేసిన మొత్తం తరువాత, చెల్లించాల్సిన అసలు రూ.24,000 కోట్లలో ఇంకా రూ.9,000 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని సుప్రీం పేర్కొంది. యాంబీ వేలం దిశలో మరో ముందడుగు... కాగా సహారా యాంబీ వ్యాలీలో ఆస్తుల వేలానికి సంబంధించి బాంబే హైకోర్ట్ అధికారిక లిక్విడేటర్ వినోద్‌శర్మ సిద్ధం చేసిన నియమ, నిబంధనావళికి అత్యున్నత న్యాయస్థానం ఆమోదముద్ర వేసింది. చెల్లించాల్సిన మొత్తం చెల్లించలేకపోతే యాంబీ వ్యాలీలో సహారా గ్రూప్‌కు ఉన్న రూ.34,000 కోట్ల విలువైన ఆస్తులను వేలం వేయాలని సుప్రీంకోర్టు ఇంతక్రితమే ఆదేశించింది. మదుపరులకు రెండు సహారా సంస్థలు (సహారా ఇండియా రియల్టీ కార్పొరేషన్, సహారా హౌసింగ్) రూ.24,000కు పునఃచెల్లింపుల వైఫల్యం కేసులో ఇరువురు కంపెనీల డైరెక్టర్లతోపాటు దాదాపు రెండేళ్లు జైలులో ఉన్న రాయ్, తల్లి మరణంతో గత ఏడాది మే 6న పెరోల్‌పై బయటకు వచ్చారు. అయితే సుప్రీం ఆదేశాలతో నిర్దేశిత సమయాల్లో చెల్లించాల్సిన మొత్తంలో కొద్దికొద్దిగా చెల్లిస్తూ, రాయ్ పెరోల్‌పై కొనసాగుతున్నారు. -
యాంబీ వ్యాలీని వేలం వేయండి
-
యాంబీ వ్యాలీని వేలం వేయండి
♦ నిర్దేశిత రూ.5వేల కోట్లు డిపాజిట్ చేయనందుకు ఇది తప్పదు ♦ సహారా గ్రూప్‌నకు సుప్రీంకోర్టు ఆదేశం ♦ 28న వ్యక్తిగతంగా హాజరవ్వాలని సుబ్రతా రాయ్‌కి ఆదేశాలు న్యూఢిల్లీ: మహారాష్ట్రలో సహారాకు చెందిన దాదాపు రూ.34,000 కోట్ల విలువైన ప్రతిష్టాత్మక యాంబీ వ్యాలీని వేలం వేయాలంటూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 17లోగా సెబీ– సహారా రీఫండ్ అకౌంట్లో రూ.5,092.6 కోట్లు జమ చేయాల్సిందేనని, ఇందుకు సంబంధించి గడువు పొడిగించే ప్రసక్తే లేదని సహారా గ్రూప్‌నకు గత నెలన్నరగా సుప్రీంకోర్టు స్పష్టం చేస్తూ వస్తోంది. ఒకవేళ నిర్దేశిత మొత్తం డిపాజిట్ చేయని పక్షంలో దాదాపు రూ. 34,000 కోట్లు విలువ చేసే సహారా గ్రూప్ ప్రాజెక్టు ’యాంబీ వ్యాలీ’ని వేలం వేయాలంటూ ఆదేశాలు ఇవ్వక తప్పని పరిస్థితి నెలకొంటుందని హెచ్చరించింది. అయితే గడువు పెంపునకు సహారా వేసిన పిటిషన్‌ను సైతం సుప్రీం ఈ నెల 7న తోసిపుచ్చింది. అంతక్రితం ఫిబ్రవరి 6న యాంబీ వ్యాలీ జప్తునకు సుప్రీం ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే తాజా పరిణామం చోటుచేసుకుంది. కోర్టు ఉత్తర్వులతో ఆటలొద్దు..! యాంబీ వ్యాలీని వేలం వేయాలని, ఈ అంశంపై ప్రత్యక్షంగా తనకు రిపోర్ట్ చేయాలని బాంబే హైకోర్డ్ అధికార లిక్విడేటర్‌కు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 28న వ్యక్తిగతంగా హాజరవ్వాలని కూడా సహారా చీఫ్ సుబ్రతారాయ్‌కు జస్టిస్ దీపక్ మిశ్రా, రాజన్ గొగోయ్, ఏకే సిక్రీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఉత్తర్వులతో ఆటలు వద్దని సైతం ధర్మాసనం రాయ్‌ని హెచ్చరించింది. 48 గంటల్లోగా ఆస్తులకు సంబంధించిన వివరాలన్నిటినీ అధికారిక లిక్విడేటర్‌కు అందజేయాలని సహారా, ఆ గ్రూప్ చీఫ్ రాయ్ అలాగే సెబీలకు అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. సహారా గ్రూప్‌లో భాగమైన రెండు సంస్థలు ఇన్వెస్టర్లకు రూ. 24,000 కోట్లు తిరిగివ్వాల్సిన కేసును సుప్రీంకోర్టు విచారిస్తున్న సంగతి తెలిసిందే. వడ్డీతోసహా ఈ మొత్తం రూ.37,000 కోట్లుగా సెబీ పేర్కొంటోంది. ఈ కేసులో దాదాపు రెండేళ్లు తీహార్ జైలులో గడిపిన రాయ్, తల్లి మరణం అనంతరం పెరోల్‌పై విడుదలయ్యారు. అనంతరం సుప్రీంకోర్టు నిర్దేశాలకు అనుగుణంగా కొంత మొత్తాలు డిపాజిట్ చేస్తూ, ‘పెరోల్ పొడిగింపు’ ఉత్తర్వులు పొందుతున్నారు. -
రూ. 5,000 కోట్లు కట్టండి.. లేదంటే యాంబీ వ్యాలీ వేలం
సహారా సుబ్రతా రాయ్‌కు సుప్రీంకోర్టు స్పష్టీకరణ న్యూఢిల్లీ: హామీ ఇచ్చిన విధంగా ఏప్రిల్ 17వ తేదీ నాటికి రూ.5,092.6 కోట్లు డిపాజిట్ చేయకపోతే, రూ.39,000 కోట్ల విలువచేసే పూణేలోని ప్రతిష్టాత్మక యాంబీ వ్యాలీ వేలం వేయక తప్పదని సహారాకు అత్యున్నత న్యాయస్థానం– సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. న్యూయార్క్‌లోని ప్లాజా హోటల్లో సహారా వాటాను 550 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేయడానికి సిద్ధపడిన ఇంటర్నేషనల్ రియల్లీ సంస్థ ఈ డీల్ విషయంలో విశ్వసనీయతను నిరూపించుకోడానికి తొలుత రూ.750 కోట్లను సెబీ– సహారా రిఫండ్ అకౌంట్లో డిపాజిట్ చేయాలని కూడా జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. తనఖాలోని ఆస్తుల జాబితాను అందజేయాలని జస్టిస్ రాజన్ గొగోయ్, ఏకే సిక్రీలతో కూడా కూడిన త్రిసభ్య ధర్మాసనం ఇప్పటికే సహారాకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. రెండు సహారా గ్రూప్ సంస్థలు మదుపరుల నుంచి మార్కెట్ నిబంధనలకు విరుద్ధంగా దాదాపు రూ.24,000 కోట్ల సమీకరణ, పునఃచెల్లింపుల్లో వైఫల్యం కేసులో దాదాపు రెండేళ్లు సహారా చీఫ్ తీహార్ జైలులో ఉన్నారు. తల్లి మరణంతో పెరోల్‌పై విడుదలైన ఆయన, అటు తర్వాత సుప్రీం నిర్దేశాల మేరకు కొంత మొత్తాల్లో నిధులు డిపాజిట్ చేస్తూ... పెరోల్‌పై కొనసాగుతున్నారు. ఇన్వెస్టర్లకు చెల్లించాల్సిన మొత్తంపై 2016 అక్టోబర్ 31 వరకూ సహారా గ్రూప్ వడ్డీసహా రూ.47,669 కోట్లు చెల్లించాల్సి ఉందని ఫిబ్రవరిలో కేసు వాదనల సందర్భంగా సెబీ న్యాయవాది ప్రతాప్ వేణుగోపాల్ న్యాయస్థానానికి తెలిపారు. -
6 లోగా... 600 కోట్లు కట్టాల్సిందే!
• గడువు పెంచం; కట్టకుంటే మళ్లీ జైలుకు • సహారాకు సుప్రీం కోర్టు స్పష్టీకరణ న్యూఢిల్లీ: సహారా చీఫ్ సుబ్రతోరాయ్ మళ్లీ తీవ్ర ఇబ్బందుల్లో పడుతున్నట్లు కనిపిస్తోంది. పెరోల్ పొడిగింపునకు చెల్లించాల్సిన రూ.600 కోట్లను ఫిబ్రవరి 6వ తేదీలోగా చెల్లించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గడువును ఎంతమాత్రం పొడిగించేది లేదంటూ... డిపాజిట్ చేయలేకపోతే జైలుకు వెళ్లక తప్పదని పేర్కొంది. ఇప్పటికే ఎక్కువ ఉదారత...: ‘‘ఇప్పటికే ఇతర లిటిగెంట్ ఎవ్వరి విషయంలోనూ చూపనంత సానుకూల వైఖరిని మీ పట్ల ఈ కోర్టు ప్రదర్శించింది. మీరు డిపాజిట్ చెల్లించకుంటే, తిరిగి జైలుకు వెళ్లాల్సి ఉంటుంది’’ అని జస్టిస్ దీపక్ మిశ్రా, రాజన్ గొగోయ్, ఏకే సిక్రీలతో కొత్తగా ఏర్పాటయిన త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. పెరోల్ పొడిగింపునకు రాయ్ తరఫు న్యాయవాది పదేపదే అభ్యర్థించిన నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం ఈ విధంగా స్పందించింది. -
‘మోదీకి సహారా లంచం, ఇదే రుజువు’
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆరోపణ న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ప్రధానమంత్రి నరేంద్రమోదీ లక్ష్యంగా ఆరోపణలు గుప్పించారు. సహారా కంపెనీ నుంచి ప్రధాని మోదీ లంచాలు తీసుకున్నారని, అందుకే ఈ కేసులో సహారాతోపాటు తనను తాను కాపాడుకుంటున్నారని అన్నారు. తనకు వ్యతిరేకంగా దర్యాప్తు జరగకుండా మోదీ అడ్డుకోవడం ఆయన లంచం తీసుకున్నారనడానికి రుజువు అని కేజ్రీవాల్ అభివర్ణించారు. ’సహారాకే కాదు మోదీకి కూడా దర్యాప్తు జరగకుండా రక్షణ లభించింది. సహారా కంపెనీ నుంచి ఆయన లంచాలు తీసుకున్నారు. అందుకే తనకు వ్యతిరేకంగా దర్యాప్తు జరగకుండా మోదీ ప్రయత్నిస్తున్నారు. ఆయన లంచాలు తీసుకున్నారనడానికి ఇదు రుజువు’ అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. 2014 నవంబర్‌లో సహారా కంపెనీపై జరిపిన ఐటీ దాడుల్లో దొరికిన డైరీల్లో పలువురు నాయకులకు ముడుపులు ముట్టజెప్పినట్టు ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ డైరీల ఆధారంగానే మోదీ వ్యక్తిగత అవినీతికి పాల్పడ్డారని, లంచాలు తీసుకున్నారని గతంలో కేజ్రీవాల్, రాహుల్ గాంధీ ఆరోపించారు. అయితే, ఈ డైరీల్లలోని విషయాల ఆధారంగా దర్యాప్తు చేపట్టలేమంటూ ఆదాయపన్నుశాఖ తాజాగా ఉత్తర్వులు జారీచేసిందని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ కథనాన్ని షేర్ చేసిన కేజ్రీవాల్.. మోదీ తనపై దర్యాప్తు జరగకుండా అడ్డుకుంటున్నారని, అందుకే ఇదే నిదర్శనమని ఆరోపించారు. Not Sahara but Modi ji who gets immunity. He recd bribes from Sahara. Modiji scuttling all enquiries against him. Proves he took bribes https://t.co/92OZxKAebY — Arvind Kejriwal (@ArvindKejriwal) January 5, 2017 -
అంత డబ్బు ఎక్కడిదో చెప్పండి
♦ కస్టమర్లకు రూ.25,000 కోట్లు చెల్లించేశామన్న సహారా వాదనపై సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం ♦ రుజువు చూపిస్తే... కేసు మూసేస్తామని సూచన న్యూఢిల్లీ: మదుపరులకు చెల్లించాల్సిన రూ.25,000 కోట్లు చెల్లించేశామన్న సహారా గ్రూప్ వాదనపై సుప్రీంకోర్టు శుక్రవారం తీవ్రంగా స్పందించింది. అసలు అంతడబ్బు కేవలం రెండు నెలల్లో ఎలా సమకూరిందో చెప్పాలని సహారా తరఫు న్యాయవాది కపిల్ సిబల్‌ను ప్రశ్నించింది. దీనికి రుజువు చూపిస్తే... కేసు మూసేస్తామనీ చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని జస్టిస్ ఏఆర్ దావే, జస్టిస్ ఏకే సిక్రీలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఇంత పెద్ద మొత్తం ఆకాశం నుంచి ఊడిపడదుకదా? అని ప్రశ్నిస్తూ ఇది తనకు మింగుడుపడని అంశమని పేర్కొంది. ‘‘మీకు (సహారా గ్రూప్) అంత డబ్బు ఎలా వచ్చింది?. ఇతర కంపెనీల నుంచి పొందారా లేక ఇతర స్కీమ్‌ల నుంచి సంపాదించారా? బ్యాంక్ అకౌంట్ల నుంచి విత్‌డ్రా చేశారా? లేదా ఆస్తులు ఏవైనా అమ్మారా?. వీటిలో ఏదో మార్గం నుంచి మీరు డబ్బును సమీకరించి ఉండి ఉండాలి. డబ్బు ఆకాశం నుంచి రాలి పడదుకదా?. మీ క్లెయింట్‌కు డబ్బు చెల్లించే సామర్థ్యం ఉందన్న విషయంలో మాకు సందేహాలు లేకపోవచ్చు. కానీ డబ్బు ఎలా వచ్చిందనేదే ఇక్కడ ముఖ్యం. ఈ డాక్యుమెంట్లు చూపించండి. తగిన డాక్యుమెంట్లు చూపిస్తే... కేసునూ మూసేస్తాం’’ అని బెంచ్ వ్యాఖ్యానించింది. కేసు తదుపరి విచారణను సెప్టెంబర్ 16వ తేదీకి వాయిదా వేసింది. అసలు తాము ఇన్వెస్టర్లకు డబ్బు చెల్లించేశామని, మదుపుదారులను గుర్తించడంలో మార్కెట్ రెగ్యులేటర్ సెబీ వైఫల్యం చెందుతోందని సహారా న్యాయవాది కపిల్ సిబల్ వాదన నేపథ్యంలో సుప్రీం కోర్టు తాజా కీలక వ్యాఖ్యలు చేసింది. రుణ సమీకరణకు అడ్డంకులు ఉండవు... కాగా రూ.10,000 కోట్లు చెల్లించి సహారా చీఫ్ రాయ్ మధ్యంతర బెయిల్ పొందడానికి విదేశీ రుణం సమీకరించుకోడానికి అనుమతించాలన్న సహారా పిటిషన్‌ను పరిశీలించి, తగిన స్పందనను తెలియజేయాలని సైతం సెబీకి ఈ సందర్బంగా సుప్రీంకోర్టు సూచించింది. నిధుల సమీకరణకు ఎప్పుడూ అత్యున్నత న్యాయస్థానం అడ్డంకులు సృష్టించలేదన్నది గమనార్హమని పేర్కొంది. బ్రిటన్ రూబిన్ బ్రదర్స్ నుంచి నిధులు సమీకరించుకోడానికి అనుమతించాలని సహారా తన తాజా పిటిషన్లో సుప్రీంకోర్టును కోరింది. సహారా చీఫ్ సుబ్రతారాయ్ పెరోల్‌ను సెప్టెంబర్ 16 వరకూ సుప్రీంకోర్టు గతంలో పొడిగించింది. అయితే తదుపరి వాయిదాలోపు రూ.300 కోట్లను మార్కెట్ రెగ్యులేటర్ సెబీ వద్ద డిపాజిట్ చేయాలని, లేదంటే తిరిగి జైలుకు పంపవలసి వస్తుందని అప్పట్లో స్పష్టం చేసింది. రెండు గ్రూప్ సంస్థలు- మార్కెట్ నిబంధనలకు విరుద్ధంగా మదుపరుల నుంచి సేకరించిన డబ్బు దాదాపు రూ.25,000 కోట్లను తిరిగి చెల్లించడంలో విఫలమయిన కేసులో దాదాపు రెండేళ్లు తీహార్ జైలులో ఉన్న రాయ్, ఇటీవలే తల్లి మరణంతో పెరోల్‌పై బయటకు వచ్చారు. బెయిల్‌కోసం చెల్లించాల్సిన రూ.10,000 కోట్లకు సంబంధించి... సుప్రీం ఆదేశాల మేరకు కొంత మొత్తం చొప్పున చెల్లిస్తూ, పెరోల్‌పై కొనసాగుతున్నారు. జూలై 11వ తేదీ ఆదేశాల మేరకు ఆగస్టులో నిర్దేశిత రూ.300 కోట్లు చెల్లించడంతో ఆయన సెప్టెంబర్ 16 వరకూ పెరోల్ గడువు పొడిగింపు ఉత్తర్వ్యును పొందగలిగారు. -
సెబీకి రూ.300 కోట్లు చెల్లిస్తాం
సుప్రీంకు సహారా వెల్లడి న్యూఢిల్లీ: మార్కెట్ రెగ్యులేటర్ సెబీకి రూ.300 కోట్లు చెల్లిస్తామని సహారా చీఫ్ సుబ్రతారాయ్ శుక్రవారం సుప్రీంకోర్టుకు విన్నవించారు. అయితే ఈ మొత్తాన్ని బ్యాంక్ గ్యారెంటీగా పరిగణించాలని కోరారు. సెప్టెంబర్ 16 లోపు రూ.300 కోట్ల చెల్లింపు షరతుపై రాయ్ ప్రస్తుతం పెరోల్‌పై ఉన్నారు. రెండు గ్రూప్ సంస్థలు మదుపరులకు డబ్బు (వడ్డీతో కలిపి దాదాపు రూ.36,000 కోట్లు) పునఃచెల్లింపుల వైఫల్యం కేసులో సహారా చీఫ్ దాదాపు రెండేళ్లు తీహార్ జైలులో గడిపారు. ఆయన బెయిల్ మంజూరుకు రూ.10,000 కోట్లు చెల్లించాలని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఇందులో రూ.5,000 కోట్లను బ్యాంక్ గ్యారెంటీగా సమర్పించాల్సి ఉంది. తల్లి మృతి నేపథ్యంలో పెరోల్‌పై బయటకు వచ్చిన రాయ్, బెయిల్ పొందడానికి చెల్లించాల్సిన రూ.10,000 కోట్లలో కొంత నిర్దిష్ట మొత్తాలను వాయిదాల రూపంలో చెల్లిస్తూ.. పెరోల్‌పై కొనసాగుతున్నారు. -
హోటళ్ల ధర తగ్గించేందుకు ప్రయత్నాలు: సహారా
న్యూఢిల్లీ: విదేశాల్లో ఉన్న మూడు హోటళ్ల ధరను పడగొట్టడానికి ‘దురుద్దేశ ప్రయత్నాలు’ జరుగుతున్నాయని సహారా గ్రూప్ పేర్కొంది. కొన్ని సంస్థలు తగిన తమ బిడ్డింగ్ ధరను తగ్గించుకున్న నేపథ్యంలో సహారా తాజా ప్రకటన విడుదల చేసింది. సహారాకు విదేశాల్లో ఉన్న మూడు హోటళ్లలో ఒకటి లండన్‌లో (గ్రాస్‌వీనర్) ఉండగా, మరో రెండు న్యూయార్క్‌లో (న్యూయార్క్ ప్లాజా, డ్రీమ్ డౌన్‌టౌన్) ఉన్నాయి. 3 అసోసియేట్స్ కన్సార్షియం చేసిన 1.3 బిలియన్ డాలర్ల ఆఫర్‌ను ఇటీవల సహారా తోసిపుచ్చింది. తాజా ఆఫర్‌ను ‘హోటళ్ల రేటు తగ్గించే ప్రయత్నంగా’’గా సహారా అప్పట్లో పేర్కొంది. -
ప్రకటనలిస్తే ప్రయోజనం ఉండదు
ఇన్వెస్టర్లను వెతికే విషయమై సెబీపై సహారా ఫైర్ న్యూఢిల్లీ: మదుపరులను గుర్తించేందుకు పత్రికా ప్రకటనలిస్తే సరిపోదని సహారా గ్రూప్ తాజాగా మార్కెట్ రెగ్యులేటర్- సెబీకి స్పష్టం చేసింది. సహారాలో ఇన్వెస్ట్ చేసిన చాలామంది దేశంలో మారుమూల ప్రాంతాల్లో ఉన్నారని పేర్కొంటూ... బాండ్ హోల్డర్లను గుర్తించేందుకు కావాలంటే తామూ తమ సహాయాన్ని అందిస్తామని ఆఫర్ చేసింది. సెబీ హోల్ టైమ్ మెంబర్ ఎస్.రామన్ గురువారం మాట్లాడుతూ, దేశంలో నల్లధనం పెద్ద ఎత్తున నకిలీ, మోసపూరిత పథకాల్లోకి మళ్లుతోందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సహారా ఉదంతాన్ని ప్రస్తావించారు. దీంతో కంపెనీ ఈ ప్రకటన చేసింది. -
సెప్టెంబర్ 16 వరకూ సుబ్రతారాయ్ పెరోల్ పొడిగింపు
న్యూఢిల్లీ: సహారా చీఫ్ సుబ్రతారాయ్ పెరోల్‌ను సెప్టెంబర్ 16 వరకూ సుప్రీంకోర్టు పొడిగించింది. అయితే తదుపరి వాయిదాలోపు రూ.300 కోట్లను మార్కెట్ రెగ్యులేటర్ సెబీ వద్ద డిపాజిట్ చేయాలని, లేదంటే తిరిగి జైలుకు పంపవలసి వస్తుందని స్పష్టం చేసింది. రెండు గ్రూప్ సంస్థలు- మార్కెట్ నిబంధనలకు విరుద్ధంగా మదుపరుల నుంచి సేకరించిన డబ్బు దాదాపు రూ.25,000 కోట్లను తిరిగి చెల్లించడంలో విఫలమయిన కేసులో దాదాపు రెండేళ్లు తీహార్ జైలులో ఉన్న రాయ్, ఇటీవలే తల్లి మరణంతో పెరోల్‌పై బయటకు వచ్చారు. బెయిల్‌కోసం చెల్లించాల్సిన రూ.10,000 కోట్లకు సంబంధించి... సుప్రీం ఆదేశాల మేరకు కొంత మొత్తం చొప్పున చెల్లిస్తూ, పెరోల్‌పై కొనసాగుతున్నారు. జూలై 11వ తేదీ ఆదేశాల మేరకు నిర్దేశిత రూ.300 కోట్లు చెల్లించడంతో ఆయన తాజా పెరోల్ గడువు పొడిగింపు ఉత్తర్వ్యును పొందగలిగారు. -
సహారా రాయ్‌కి పెరోల్ పొడిగింపు
♦ మిగిలిన రూ.300 కోట్లు కడతారా..? లేక జైలుకెళతారా? ♦ సుబ్రతారాయ్‌ను ప్రశ్నించిన సుప్రీంకోర్టు ధర్మాసనం ♦ సహారా ఆస్తుల విక్రయంపై ఆంక్షల తొలగింపు న్యూఢిల్లీ : సహారా అధినేత సుబ్రతారాయ్‌కు మరి కొంత ఊరట లభించింది. ఆయనకు గతంలో మంజూరు చేసిన పెరోల్ గడువును ఆగస్ట్ 3వ తేదీ వరకు పొడిగిస్తూ సుప్రీంకోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు, సహారా కేసులో జైలు పాలైన కంపెనీ డైరక్టర్లు రవిశంకర్ దూబే, అశోక్రాయ్చౌదరిలకు సైతం పెరోల్ మంజూరు చేసింది. రూ.500 కోట్లు కోర్టుకు జమ చేస్తానన్న హామీ మేరకు మిగిలిన రూ.300 కోట్లను కోర్టుకు జమ చేస్తారా...? లేక తిరిగి జైలుకు వెళతారా? అని రాయ్‌ని చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్ ఆధ్వర్యంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. మాతృమూర్తి మరణంతో మానవీయ కోణంలో సుబ్రతారాయ్‌కు సుప్రీంకోర్టు ఈ ఏడాది మే నెలలో జైలు నుంచి తాత్కాలిక విముక్తి కల్పించిన విషయం తెలిసిందే. అయితే, ఇందులో ఆయన రూ.200 కోట్లను మాత్రమే డిపాజిట్ చేశారు. కాగా, మిగిలిన రూ.300 కోట్లను డిపాజిట్ చేసేందుకు ఈ ఏడాది చివరి వరకు గడువివ్వాలని సుబ్రతారాయ్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ కోర్టును అభ్యర్థించారు. ఇప్పటికే చాలా సమయం ఇచ్చామని ధర్మాసనం గుర్తు చేసింది. అయితే, ఆస్తుల విక్రయానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన ధర్మాసనం రీసీవర్‌ను నియమించి సహారాకు చెందిన అన్ని ఆస్తులను అప్పగిస్తూ ఎందుకు నిర్ణయం తీసుకోకూడదు? అని ఎదురు ప్రశ్నించింది. తమ సహనాన్ని పరీక్షించవద్దంటూ సున్నితంగా హెచ్చరించింది. ఇన్వెస్టర్లకు రూ.36వేల కోట్లను తిరిగి చెల్లించాలన్న తమ ఆదేశాలను గుర్తు చేసింది. ఆదేశాల అమలులో విఫలమైతే రాయ్‌తో పాటు మరో ఇద్దరు డైరక్టర్లను తిరిగి తిహార్ జైలుకు పంపిస్తామని హెచ్చరించింది. అంతకుముందు రూబెన్ బ్రదర్స్ నుంచి తీసుకున్న 2.4 కోట్ల పౌండ్లు (సుమారు రూ.200కోట్లు) సెబీ-సహారా ఖాతాకు బదిలీ చేసేందుకు అనుమతించాలన్న సిబల్ అభ్యర్థనను ధర్మాసనం ఆమోదించింది. సహారా గ్రూపునకు సైతం ఊరట రాయ్‌తోపాటు సహారా గ్రూపునకు కూడా సుప్రీంకోర్టు వెసులుబాటు కల్పించింది. సహారా గ్రూపునకు చెందిన ఇతర ఆస్తుల విక్రయ, హక్కుల బదిలీకి అనుమతించింది. దీని ద్వారా రూ.5వేల కోట్ల మేర నిధులు సమీకరించి బ్యాంకు గ్యారంటీ కింద సమర్పించేందుకు ఓ అవకాశం ఇచ్చింది. బెయిల్ కోసం సమర్పించాల్సిన రూ.5వేల కోట్లకు ఇది అదనం. లోగడ 19 ఆస్తులను మాత్రమే విక్రయిచేందుకు సుప్రీంకోర్టు అనుమతించిన విషయం తెలిసిందే. మ్యూచువల్ పండ్స్, బంగారంపై డిపాజిట్లు, ఎన్ఎస్ఈలో వాటాలను నగదుగా మార్చుకునేందుకు సైతం సుప్రీంకోర్టు అనుమతి జారీ చేసింది. -
సహారా ఆస్తుల వేలం ప్రారంభం
న్యూఢిల్లీ: రెండు గ్రూప్ సంస్థలు ఇన్వెస్టర్లకు డబ్బు పునఃచెల్లింపుల వైఫల్యం కేసుల అంశానికి సంబంధించి సహారా ఆస్తుల వేలం ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా చర్యలకు దిగిన మార్కెట్ రెగ్యులేటర్ సెబీ సూచనల మేరకు, ఎస్బీఐ క్యాప్స్ , హెచ్డీఎఫ్సీ రియల్టీలు పలు సహారా భూములను దశలవారీగా వేలం వేస్తున్న సంగతి తెలిసిందే. రూ.722 కోట్ల రిజర్వ్ ధరకు ఐదు వేర్వేరు ఆస్తులను హెచ్డీఎఫ్సీ రియల్టీ నేడు ఈ-వేలానికి పెట్టింది. ఎస్బీఐ క్యాప్స్ జూలై 7న రూ.470 కోట్ల రిజర్వ్ ధరకు మరో ఐదు భూములను ఈ-ఆక్షన్‌కు పెట్టనుంది. కాగా సోమవారం ఆక్షన్‌కు సంబంధించి వివరాలు తెలియరాలేదు. -
వేలానికి 'సహారా' ఆస్తులు!
న్యూఢిల్లీః సహారా ఆస్తుల వేలానికి హెచ్ డీ ఎఫ్ సీ రియాల్టీ, ఎస్పీఐ క్యాపిటల్ మార్కెట్లు నిర్ణయించినట్లు స్టాక్ మార్కెట్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి) తెలిపింది. సహారా గ్రూప్ నకు చెందిన ఆస్తులనుంచి రిజర్వ్ ధర 1,192 కోట్లు వద్ద పదింటిని వేలానికి పెడుతున్నట్లు వెల్లడించింది. డిపాజిట్లు పేరుతో ప్రజల్ని నమ్మించి మోసం చేసిన సహారా గ్రూప్ వ్యవహరంలో ప్రస్తుత ఆస్తుల వేలంతో బాధితులకు త్వరలో న్యాయం జరిగేట్లు కనిపిస్తోంది. హెచ్ డీ ఎఫ్ సీ రియాల్టీ, ఎస్పీఐ క్యాపిటల్ మార్కెట్లు సహారా గ్రూప్ లోని పది ఆస్తులను అమ్మకానికి పెట్టినట్లు సెబి తెలిపింది. హెచ్ డీ ఎఫ్ సీ రియాల్టీ, ఎస్ బీఐ క్యాపిటల్ మార్కెట్లు అమ్మకాలు ఈ ఆక్షన్ ద్వారా జూలై 4న ఉదయం 11 నుంచి 12 గంటల మధ్య, తిరిగి జూలై 7న ఉదయం 10.30 నుంచి 11.30 మధ్య వేలం నిర్వహించనున్నట్లు తెలిపింది. సహారా ఆస్తుల అమ్మకాలను చేపట్టి, బాధితులకు వెంటనే డిపాజిట్లు చెల్లించాలన్న సుప్రీంకోర్టు నిర్దేశాల మేరకు అమ్మకాలను ప్రారంభించేందుకు హెచ్ డీ ఎఫ్ సీ రియాల్టీ 721,96 కోట్ల రిజర్వ్ ధర వద్ద ఐదు ప్రాపర్టీలను ఆన్లైన్ లో అమ్మేందుకు నిర్ణయించినట్లు గురువారం ప్రచురించిన ఓ పబ్లిక్ నోటీస్ ద్వారా తెలుస్తోంది. సహారా గ్రూప్ నకు సంబంధించిన ఆస్తులు ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఛత్తీస్ ఘఢ్, ఆంధ్రప్రదేశ్ ల లో ఉన్నాయి. వీటిలో వ్యవసాయ, వ్యవసాయేతర భూముల అమ్మకాలకోసం ఎస్ బీఐ క్యాపిటల్ మార్కెట్స్, సహారాకు సంబంధించిన ఐదు ప్రాపర్టీలను 470.04 కోట్ల రిజర్వ్ ధర వద్ద ఆన్టైన్ వేలం నిర్వహించనున్నట్లు జూన్ 10న ఓ ప్రత్యేక పబ్లిక్ నోటీసును ప్రచురించనున్నట్లు తెలిపింది. అలాగే గుజరాత్, ఉత్తర ప్రదేశ్ లోని ఆస్తుల పాటకోసం బిడ్డర్స్ జూన్ 8,9 తేదీలలో ఆన్లైన్ లో పరిశీలించవచ్చని తెలిపింది. -
జులై నాలుగున భూముల వేలం
న్యూఢిల్లీ: ఆన్ లైన్ లో సహారా గ్రూప్ ఆస్తుల విక్రయానికి తొలి ముహూర్తం ఖరారైంది. మార్కెట్ రెగ్యులేటరీ బోర్డ్ సెబీ నియమించిన హెచ్డీఎఫ్సీ రియాల్టీ ఎస్బీఐ క్యాప్ ఇ-వేలానికి రడీ అయ్యింది. ఆర్ధిక నేరాల ఆరోపణలతో సహారా గ్రూప్ అధినేత సుబ్రతో రాయ్ (67) కు చెందిన వివిధ రాష్ట్రాల్లో ఉన్న అయిదు ఆస్తులను హెచ్డీఎఫ్సీ రియాల్టీ ఆధ్వర్యంలో వేలానికి పెట్టారు. సుమారు 722 కోట్ల విలువైన ఈ ఆస్తులను జులై నాలుగన వేలం వేయడానికి నిర్ణయించారు. ఈ మేరకు గురువారం ఒక నోటీసును విడుదలైంది. జులై నాలుగు ఉదయం 11గం. రాత్రి 12గ.లకు ఈ ఇ-వేలం నిర్వహించబడుతుందని పేర్కొంది. ఆంధ్ర ప్రదేశ్, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్, ఉత్తర ప్రదేశ్ లలోని వ్యవసాయ, వ్యవసాయేతర భూమిని వేలం వేయనున్నారు. ఆసక్తి వున్న వారు జూన్ 10న ఈ సదరు భూమునలు ఆస్తులను తనిఖీ చేసుకోవచ్చిన తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సెబీ సహారా ఆస్తుల వేలానికి సిద్ధమైంది. సహారా అధిపతి సుబ్రతో రాయ్ చెల్లించాల్సిన అప్పుల్లో భాగంగా, అన్యాక్రాంతంకాని, తనఖాలోలేని సహారా ఆస్తులను వేలం వేయాల్సిందిగా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) కి మాండేటరీ ఆదేశాలను సుప్రీం జారీ చేసింది. ఈ నేపథ్యంలో హెచ్డీఎఫ్సీ రియాల్టీ, ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్ (ఎస్బీఐ క్యాప్స్)కు సెబీ నియమించింది. దేశవ్యాప్తంగా 87సహారా ఆస్తులను ఆన్లైన్ ద్వారా వేలం వేసే ప్రక్రియను ఆ సంస్థలు ప్రారంభించింది.మరోవైపు తన అనుమతిలేనిదే మార్కెట్ విలువ కంటే 90శాతం కంటే తక్కువకు విక్రయించరాదని సుప్రీంకోర్టు నిబంధన పెట్టిన సంగతి తెలిసిందే. -
సహారా ‘కృతజ్ఞత’ యాత్ర...
సహారా ఉద్యోగులు, ఇన్వెస్టర్లకు కృతజ్ఞతలు తెలిపే ‘అభార్ యాత్ర’ ను సహారా ఇండియా పరివార్ చైర్మన్, ఎండీ సుబ్రతా రాయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లోని శిల్ప కళా వేదికలో జరిగిన కార్యక్రమంలో వేల మంది సహారా ఉద్యోగులను ఉద్దేశించి సుబ్రతా రాయ్ ప్రసంగించారు. -
సహారా చీఫ్ కు మరింత ఊరట!
♦ జూలై 11 వరకూ పెరోల్‌ను పొడిగించిన సుప్రీం కోర్టు ♦ సెబీకి రూ. 200 కోట్లు డిపాజిట్ చేయాలని ఆదేశం... న్యూఢిల్లీ: సహారా గ్రూప్ చీఫ్ సుబ్రతా రాయ్‌కు సుప్రీం కోర్టులో మరింత ఊరట లభించింది. తల్లి మరణం కారణంగా అంతిమ సంస్కారాలకు హాజరయ్యేందుకు వీలుకల్పిస్తూ చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్‌తో కూడిన ధర్మాసనం నాలుగు వారాలపాటు పెరోల్‌ను మంజూరు చేసిన సంగతి తెలిసిందే. దీంతో రాయ్‌తో పాటు గ్రూప్ డెరైక్టర్ అశోక్ రాయ్ చౌదరిలు ఈ నెల 6న జైలు నుంచి విడుదలయ్యారు. ఇప్పుడు ఈ పెరోల్‌ను జూలై 11 వరకూ పొడిగించేందుకు కోర్టు బుధవారం అంగీకరించింది. అయితే, స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి రాయ్, చౌదరిలు రూ.200 కోట్లు చెల్లించేందుకు వీలుగా ఈ వెసులుబాటు ఇస్తున్నట్లు సుప్రీం పేర్కొంది. సహారా గ్రూప్ కంపెనీలు ఇన్వెస్టర్ల నుంచి అక్రమంగా డిపాజిట్లు సమీకరించిన కేసులో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సుబ్రతా రాయ్ 2014 మార్చి నుంచి తీహార్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. కాగా, జూలై 11కల్లా రూ200 కోట్లు గనుక డిపాజిట్ చేయకపోతే మళ్లీ తీహార్ జైలుకి వెళ్లాల్సి వస్తుందని ధర్మాసనం తన ఆదేశాల్లో పేర్కొంది. పెరోల్‌పై బయట ఉన్న సమయంలో రాయ్, చౌదరిలు సహారా ఆస్తుల అమ్మకానికి వీలుగా ఔత్సాహిక కొనుగోలుదార్లను కలవొచ్చని సుప్రీం పేర్కొంది. అయితే, దేశంలోపలే ఉండటంతో పాటు పోలీస్ ఎస్కార్ట్లోనే ఎక్కడికైనా వెళ్లాలని స్పష్టం చేసింది. మరోపక్క, సహారా ఆస్తుల వేలానికి సంబంధించి సెబీ తన చర్యలను కొనసాగించవచ్చని ధర్మాసనం పేర్కొంది. బ్యాంక్ గ్యారంటీగా చెల్లించాల్సిన రూ.5,000 కోట్లు, బెయిల్ కోసం అదనంగా కట్టాల్సిన రూ.5,000 కోట్లను సమీకరించేందుకుగాను సహారా ఇతర ఆస్తుల అమ్మకం ప్రక్రియను చేపట్టవచ్చని సుప్రీం సూచించింది. -
సహారా చీఫ్ కు నాలుగు వారాల పెరోల్
తల్లి అంత్యక్రియల్లో పాల్గొనే వెసులుబాటు న్యూఢిల్లీ: సహారా చీఫ్ సుబ్రతారాయ్ తల్లి ఛహాబీ రాయ్ (95) శుక్రవారం ఉదయం లక్నోలో మృతిచెందారు. తల్లి అంత్యక్రియలు నిర్వహించేందుకు వీలు కల్పిస్తూ... సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఆయనకు నాలుగువారాల పెరోల్ మంజూరు చేసింది. మార్కెట్ నిబంధనలకు విరుద్ధంగా ఇన్వెస్టర్ల నుంచి సహారా గ్రూప్ సంస్థలు రెండు రూ.25,000 కోట్లు వసూలు చేయడం... వడ్డీతో సహా ఈ మొత్తం రూ.35,000 కోట్లు దాటిన వైనం, తిరిగి చెల్లించడంలో వైఫల్యం, మార్కెట్ రెగ్యులేటర్ సెబీ కేసు నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆయన 2014 మార్చి 4 నుంచీ తీహార్ జైలులో ఉన్నారు. ఆయన బెయిల్‌కు రూ.10,000 కోట్లు చెల్లించాలని సుప్రీంకోర్టు జారీచేసిన ఆదేశాల అమల్లో సహారా విఫలమవుతోంది. ఆస్తుల అమ్మకం ద్వారా నిధులు సమకూర్చుకోవడంలో వైఫల్యం అవుతుండడంతో ఇటీవలే ఈ బాధ్యతలనూ సుప్రీంకోర్టు సెబీకి అప్పగించింది. ఈ నేపథ్యంలో తల్లి తుదిశ్వాస విడవడంతో, ఆమె అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వీలుకల్పిస్తూ... రాయ్‌కి పెరోల్ మంజూరు చేయాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు రాయ్ న్యాయవాది కపిల్ సిబల్ ఒక పిటిషన్‌ను దాఖలు చేశారు. చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ ఏఆర్ దావే, జస్టిస్ ఏకే శిక్రీలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను ఆమోదించింది. రాయ్‌తోపాటు జైలులో ఉన్న సహారా డెరైక్టర్ అశోక్ రాయ్ చౌదరికి కూడా సుప్రీం పెరోల్ మంజూరు చేసింది. కాగా ఈ నాలుగువారాలూ రాయ్ పోలీస్ ప్రొటెక్టివ్ కస్డడీలో ఉంటారని పెరోల్ మంజూరు సందర్భంగా కోర్టు స్పష్టం చేసింది. అంతక్రితం పారిపోవడానికి తన క్లెయింట్ ప్రయత్నం చేయడంటూ న్యాయవాది కపిల్ సిబల్ సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చారు. -
ఆస్తుల వివరాలు తెలపండి
సహారాకు సుప్రీం ఆదేశం న్యూఢిల్లీ: సహారా మొత్తం ఆస్తుల వివరాలను సీల్డ్ కవర్లో తెలియజేయాలని సహారా గ్రూప్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. మదుపరులకు చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించగలరా? లేదా అన్న అంశం నిర్థారించడానికి ఇది అవసరమని చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. సహారా చీఫ్ సుబ్రతారాయ్‌కి బెయిల్ మంజూరుకు రూ.10,000 కోట్ల చెల్లింపులకు సంబంధించి తమ ఆదేశాల పాటించేంతవరకూ పెరోల్‌కు వీలు ఉండబోదని స్పష్టం చేసింది. ప్రస్తుతం గ్రూప్ 66 ప్రాపర్టీలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయని, తద్వారా రూ.6,000 కోట్లు వసూలయ్యే అవకాశం ఉందని వస్తున్న సంకేతాలను ప్రస్తావించిన సుప్రీం కోర్టు..బెయిల్‌కు ఈ మొత్తం సరిపోయినా... ఇన్వెస్టర్ల చెల్లింపులకు తగిన మొత్తం గ్రూప్ వద్దా ఉందా? లేదా? అన్నది ప్రస్తుతం కీలకమని పేర్కొంది. -
సహారా ఆస్తుల అమ్మకంలో ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ సంస్థల సాయం!
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా... సహారా ఆస్తుల అమ్మకంలో మార్కెట్ రెగ్యులేటర్ సెబీ- ఎస్బీఐ క్యాప్, హెచ్డీఎఫ్సీ రియల్టీ సహాయాన్ని తీసుకోనుందని వార్తలు వస్తున్నాయి. అమ్మకానికి సంబంధించి ఆస్తుల గుర్తింపు, వాటికి విలువ కట్టడం, అమ్మకం ప్రక్రియ వంటి అంశాల్లో సెబీకి ఎస్బీఐ క్యాప్, హెచ్డీఎఫ్సీ రియల్టీ సహాయం చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇందుకు సంబంధించి అధికారికంగా ఎటువంటి ప్రకటనా వెలువడలేదు. బుధవారం ఈ కేసు సుప్రీంకోర్టు ముందుకు తదుపరి విచారణకు వస్తున్న నేపథ్యంలో ఈ వార్తలు వెలువడ్డం గమనార్హం. సహారా డిపాజిట్ చేసిన ఆస్తుల టైటిల్ డీడ్స్ ఆదారంగా వాటి అమ్మకపు ప్రక్రియను ప్రారంభించాలని గత నెల్లో సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇందుకు ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీఎన్ అగర్వాల్ పర్యవేక్షణలో ఈ కార్యకలాపాలు జరగాలని పేర్కొంది. అవసరమైతే సంబంధిత నిపుణత సంస్థల సహాయాన్నీ తీసుకోవచ్చని సూచించింది. ఇన్వెస్టర్ల సొమ్ము తిరిగి చెల్లించే ప్రక్రియను ప్రస్తుతం జస్టిస్ అగర్వాల్ సమీక్షిస్తున్నారు. సహారా దాదాపు 86 ప్రోపర్టీల టైటిల్ డీడ్స్‌ను సెబీకి డిపాజిట్ చేసింది. -
ఆస్తుల అమ్మకంపై సహారా కొత్త ప్రతిపాదన
న్యూఢిల్లీ: తమ చీఫ్ సుబ్రతా రాయ్‌ని జైలు నుంచి విడిపించడానికి సహారా కొత్త ప్రతిపాదనను సుప్రీంకోర్టుకు వివరించింది. బెయిల్ మొత్తానికి సంబంధించి ఆస్తుల విక్రయంపై సహారా సమర్పించిన తాజా ప్రతిపాదనపై చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ ఏఆర్ దావే, జస్టిస్ ఏకే సిక్రీలతో కూడిన ధర్మాసనం మార్కెట్ రెగ్యులేటర్ సెబీ స్పందనను కోరింది. నాలుగు వారాల్లో దీనికి సమాధానం తెలపాలని సూచించింది. తాజా ప్రతిపాదనను సహారా తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ కోర్టు ముందు ఉంచారు. దీని ప్రకారం ముంబైలో హోటల్- సహారా స్టార్, అలాగే ఫార్మూలా 1లో 42 శాతం వాటాలు, నాలుగు విమానాల అమ్మకానికి చర్చలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో లండన్‌లోని గ్రాసోవర్ హౌస్ హోటల్, న్యూయార్క్ ప్లాజా, డ్రీమ్ న్యూయార్క్ హోటల్స్ విక్రయాలకూ చర్చలు జరుగుతున్నాయి. గ్రాసోవర్ హౌస్ హోటల్ విక్రయ చర్చలు స్టార్ ఆఫ్ కతార్‌తో జరుగుతున్నాయని, రూ.2,300 కోట్లు వెచ్చించడానికి ఆ సంస్థ సిద్ధమవుతోందని సిబాల్ కోర్టుకు తెలిపారు. అమెరికాలో హోటళ్ల రీఫైనాన్స్ విషయంపై ఒక రష్యా బ్యాంకుతో చర్చలు జరుగుతున్నట్లు వెల్లడించారు. బెంగళూరులో తన ఆస్తుల అమ్మకానికి కూడా సహారా కోర్టు అనుమతి కోరుతోంది. 2014 మార్చి 4 నుంచీ సహారా చీఫ్ తీహార్ జైలులో ఉన్నారు. ఇన్వెస్టర్లకు రూ.36,000 కోట్ల పునఃచెల్లింపుల కేసులో ఆయన బెయిల్‌కు రూ.10,000 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. రాయ్‌తో పాటు రెండు కంపెనీల డెరైక్టర్లు రవి శంకర్ దుబే, అశోక్ రాయ్ చౌదరిలు కూడా జైలులో గడుపుతున్నారు. -
140 ఎకరాల సహారా భూమి వేలం
- సుబ్రతా రాయ్ బెయిలు కేసు - కోర్టులోనే 2 రియల్టీ దిగ్గజాల పోటీ బిడ్లు - రూ.150 కోట్ల ఆఫర్ న్యూఢిల్లీ: సహారాకు మరో ఎదురుదెబ్బ. ఆ గ్రూప్ సంస్థ ఆస్తులకు రెండు రియల్టీ దిగ్గజ సంస్థలు పోటీపోటీ బిడ్లు వేసిన వైనం సోమవారం స్వయంగా సుప్రీం... కోర్టు హాలులోనే చోటుచేసుకుంది. చీఫ్ సుబ్రతారాయ్ బెయిల్‌కు రూ.10,000 కోట్లు డిపాజిట్ చేయాల్సిన అంశంపై జరిగిన వాదోపవాదనల సమయంలో ఈ బిడ్డింగ్ ప్రక్రియ చోటుచేసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా రెండు సహారా గ్రూప్ సంస్థలు నిధుల సమీకరణకేసులో, ఏడాదిన్నర నుంచీ రాయ్ తీహార్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. బిడ్డింగ్ విధానం...గోరఖ్‌పూర్‌లోని సహారా గ్రూప్‌కి చెందిన 140 ఎకరాల స్థలానికి సంమృద్ధి డెవలపర్స్రూ.64 కోట్లకు, గోరఖ్‌పూర్ రియల్టీ కంపెనీరూ.110 కోట్లకు ఆఫర్లు దాఖలు చేశాయి. రెండు కంపెనీలూ ఆఫర్‌ను పెంచుకుంటూ పోయాయి. చివరకు రూ.150 కోట్లకు రెండు కంపెనీలూ బిడ్ చేశాయి. రెండు కంపెనీలు ‘తమ విశ్వసనీయత’ నిరూపణలో భాగంగా... మొత్తం బిడ్‌లో 25 శాతం జూలై 31వ తేదీ లోపు సెబీ-సహారా అకౌంట్లో డిపాజిట్ చేయాలని జస్టిస్ టీఎస్ ఠాకూర్, ఏఆర్ దావే, జస్టిస్ ఏకే సిక్రిలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. తదుపరి విచారణను ఆగస్టు 3వ తేదీకి వాయిదా వేసింది. ప్రపంచంలో ఏ కంపెనీ అంత డబ్బు చెల్లించలేదు... కేసు విచారణ సందర్భంగా సహారా చెల్లించాల్సిన మొత్తంపై మరోసారి వాడివేడి వాదనలు జరిగాయి. 18 నెలల్లో రూ.36,000 కోట్లు చెల్లించాలంటూ.. ఇంతక్రితం ఇచ్చిన రూలింగ్‌ను సవరించాలని సహారా గ్రూప్ న్యాయవాది కపిల్ సిబల్ కోరారు. ప్రపంచంలోని ఏ సంస్థా అంత మొత్తం సొమ్మును చెల్లించలేదని ఈ సందర్భంగా అన్నారు. అయితే ఈ వాదనలను సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం తోసిపుచ్చింది. ఇదిలావుండగా, తమ(సహారా) విదేశీ హోటళ్ల జప్తునకు జేటీఎస్ ట్రేడింగ్ సంస్థ దాఖలు చేసిన సివిల్ పిటిషన్‌ను తోసిపుచ్చాలని న్యూయార్క్ సుప్రీంకోర్టుకు సహారా విజ్ఞప్తి చేసింది. -
గ్రాస్‌వీనర్‌కు బిడ్డింగ్ వేయడం లేదు: సహారా
న్యూఢిల్లీ: గ్రాస్‌వీనర్ హోటల్ కొనుగోలుపై వస్తున్న వార్తలకు తెర దించుతూ, లండన్‌లోని తమ గ్రాస్‌వీనర్ హోట ల్ అమ్మకపు వేలంలో (బిడ్డింగ్) తాము పాల్గొనడం లేదని సహారా గ్రూప్ స్పష్టంచేసింది. ఇచ్చిన రుణాలను చెల్లించక పోవడంతో బ్యాంకు ఆఫ్ చైనా సహారాకు చెందిన గ్రాస్‌వీనర్ హోటల్‌తోపాటు మరో రెండు విదేశీ హోటళ్లను అమ్మకానికి ఉంచిన విషయం తెలిసిందే. 2010-12 మధ్యకాలంలో 1.55 బిలియన్ డాలర్లు వెచ్చించి సహారా గ్రూప్ కొనుగోలు చేసిన ఈ ప్రాపర్టీల మొత్తం ప్రస్తుతం 2.2 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉండొచ్చు. -
హోటల్ కోసం సహారాగ్రూప్ భారీ బిడ్
-
సుప్రీంకు విన్నవించిన అంశాలపై ‘మీడియా’లో చర్చ సరికాదు: సహారా
న్యూఢిల్లీ: తమ చీఫ్ సుబ్రతోరాయ్ విడుదల బెయిల్‌కు రూ.10,000 కోట్ల సమీకరణ అంశాలపై సుప్రీంకోర్టు ముందు పేర్కొన్న అంశాలపై బహిరంగ చర్చ, మీడియా ఊహాగానాలు సరికాదని సహారా పేర్కొంది. ఆయా అంశాలు పూర్తిగా కోర్టు పరిధిలో ఉన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని పేర్కొంది. సహారా నిధుల సమీకరణపై పెద్ద ఎత్తున సందేహాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో కంపెనీ ఈ ప్రకటన చేసింది. నిధుల సమీకరణకు సుప్రీంకోర్టుకు తాజాగా సంస్థ ఒక ప్రతిపాదనను తెలియజేసింది. చైనా బ్యాంక్ నుంచి సహారా ఆస్తుల తనఖా విడుదలకు స్పెయిన్ బ్యాంక్ బీబీవీఏ రుణం అందించనుందన్నది దీని సారాంశం. అయితే తమ వద్ద ఇటువంటి ప్రతిపాదన ఏదీ లేదని బీబీవీఏ పేర్కొన్నట్లు స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ నుంచి వార్తలు వెలువడుతున్నాయి. ఇక హెచ్ఎస్బీసీ రూ.5,000 కోట్లకు బ్యాంకు గ్యారెంటీ ఇవ్వనుందని సహారా పేర్కొంటున్నప్పటికీ, ఆ బ్యాంకు నుంచి సైతం ఈ మేరకు ఎటువంటి ప్రకటనా వెలువడలేదు. హెచ్ఎస్బీసీ ప్రతినిధి అసలు దీనిపై ఎటువంటి వ్యాఖ్యా చేయడానికి నిరాకరించగా, పేరు తెలపడానికి ఇష్టపడని మరో అధికారి అసలు ఇటువంటి ప్రతిపాదనే తమ వద్ద లేదని పేర్కొన్నారు. విదేశాల్లోని ఆస్తుల అమ్మకం, బెయిల్‌కు నిధుల సమీకరణకు సోమవారం అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మూడు నెలల సమయం ఇచ్చింది. -
మిరాచ్ మోసంపై ఎఫ్ఐఆర్: సహారా
న్యూఢిల్లీ: విదేశాల్లోని తమ మూడు హోటళ్ల (న్యూయార్క్‌లోని ప్లాజా, డ్రీమ్ హోటల్స్ - లండన్‌లోని గ్రాస్‌వీనర్) వాటాల విక్రయ వ్యవహారంలో తమను ఘోరంగా మోసం చేసిన కేసులో అమెరికా సంస్థ మిరాచ్ కేపిటల్, ఆ సంస్థ అధికారులపై క్రిమినల్, సివిల్ పరమైన న్యాయ చర్యలను ప్రారంభించినట్లు సహారా ప్రతినిధి ఒకరు తెలిపారు. రుణానికి సంబంధించి బ్యాంక్ ఆఫ్ అమెరికా లేఖ విషయంలో ఫోర్జరీ, మోసం వ్యవహారంలో తమ ఫిర్యాదుపై మిరాచ్పై ఎఫ్ఐఆర్ నమోదయినట్లు కూడా పేర్కొంది. కాగా తమ చీఫ్ సుబ్రతారాయ్‌ని తీహార్ జైలు నుంచి బయటకు తీసుకువచ్చేందుకు సంబంధించి బెయిల్‌కు రూ.10,000 కోట్ల సమీకరణలపై కూడా కొత్త మార్గాలపై దృష్టి పెట్టినట్లు ప్రతినిధి పేర్కొన్నారు. మేము సైతం - మిరాచ్: కాగా సహారా న్యాయపరమైన చర్యలపై పంపిన ఈ-మెయిల్ ప్రశ్నలకు మిరాచ్ కేపిటల్ సమాధానం ఇచ్చింది. తాను సైతం సహారాపై న్యాయపరమైన చర్యలకు సిద్ధం అవుతున్నట్లు తెలిపింది. త్వరలో ఇందుకు సంబంధించి ఒక వివరణాత్మక ప్రకటన విడుదల చేస్తామని పేర్కొంది. -
ఇక ప్రత్యామ్నాయాలు వెతకండి
సహారాకు సుప్రీంకోర్టు ఆదేశం ⇒ మరోవైపు లోన్ ఒప్పంద ప్రక్రియ నిలిచిపోయినట్లు మిరాచ్ ప్రకటన ⇒ అయితే మూడు హోటళ్లను కొనడానికి ఇప్పటికీ సిద్ధమని స్పష్టీకరణ న్యూఢిలీ/న్యూయార్క్: సహారా గ్రూప్ చీఫ్ సుబ్రతారాయ్ బెయిల్ వ్యవహారం, విదేశాల్లో ఆ గ్రూప్ హోటళ్ల విక్రయానికి సంబంధించి బుధవారం రెండు వేర్వేరు పరిణామాలు చోటుచేసుకున్నాయి. అందులో ముఖ్యమైనది- సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ. బెయిల్ విషయంలో నిధుల సమీకరణకు ప్రత్యామ్నాయాలను అన్వేషించాలని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా సహారాకు సూచించింది. ఇక సహారాకు 2 బిలియన్ డాలర్ల రుణ ప్యాకేజీతో వార్తల్లోకి వచ్చిన అమెరికా సంస్థ మిరాచ్ క్యాపిటల్ ఆ గ్రూప్ (సహారా) ఆస్తులను కొనడానికి ఇప్పటికీ సిద్ధమని మరోసారి ప్రకటించింది. దాదాపు రూ.20,000 కోట్ల మొత్తాన్ని ఇన్వెస్టర్లకు తిరిగి చెల్లింపుల కేసులో సుబ్రతారాయ్, ఆయన సహచరులు ఇరువురు 2014 మార్చి నుంచీ తీహార్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. తాజా పరిణామాల్లోకి వెళితే... సుప్రీం సూచనలు... బెయిల్‌కు రూ. 10,000 కోట్లు సమీకరించడానికి ఉద్దేశించి హోటళ్ల (న్యూయార్క్‌లోని ప్లాజా, డ్రీమ్ హోటల్స్- లండన్‌లోని గ్రాస్‌వీనర్) వాటాల విక్రయం విషయంలో మిరాచ్ కేపిటల్‌తో రుణ ఒప్పందం ప్రతిపాదన నీరుగారిపోయిన నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సహారా న్యాయవాది గణేష్, అలాగే ఈ కేసులో (సుప్రీంకోర్టుకు సలహాదారుగా) స్వతంత్ర న్యాయవాది శేఖర్ నపాడేకు కీలక సూచన చేసింది. ఇక ఆస్తుల అంశాలపై తగిన ప్రత్యామ్నాయ సూచనలు ఇవ్వాలని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి ప్రత్యామ్నాయ మార్గాలను వెతకాలని చెప్పింది. డీల్ విషయంలో జరిగిన పరిమాణాలన్నింటినీ సీనియర్ న్యాయవాది శేఖర్ నపాడే, సహారా న్యాయవాది గణేష్ అంతకుముందు సుప్రీంకోర్టుకు తెలియజేశారు. తాము మిరాచ్ చేతుల్లో ఘోరంగా మోసపోయినట్లు సహారా తెలిపింది. అయితే ఆయా అంశాలన్నింటినీ లిఖిత పూర్వకంగా సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ డీల్‌పై ఫిబ్రవరి 20న సుప్రీంకోర్టు తన రూలింగ్‌ను ఇచ్చే అవకాశం ఉందని న్యాయనిపుణులు పేర్కొంటున్నారు. కాగా విదేశాల్లోని తమ మూడు హోటళ్ల విక్రయానికి విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) 1999 కింద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తగిన క్లియరెన్సులను మంజూరు చేసిందని సహారా బుధవారం కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టుకు తెలియజేసింది. డీల్ రద్దు: మిరాచ్ మిరాచ్ కేపిటల్ తాజా ప్రకటన చేస్తూ, సహారా తో తమ లోన్ డీల్ కథ ముగిసిపోయినట్లేనని స్పష్టం చేసింది. డీల్ (డబ్బు సమీకరణ ప్రణాళికల ఖరారు నిమిత్తం) కుదర్చడానికి సంబంధించి సహారా తమకు ఇచ్చిన ఫీజు 2.62 మిలియన్ అమెరికా డాలర్ల మొత్తాన్ని తిరిగి సెబీ-సహారా ఫండ్‌కు చెల్లించినట్లు కూడా వెల్లడించింది. ఈ డీల్ ప్రక్రియలో తమకు దాదాపు 1.75 మిలియన్ డాలర్లు ఖర్చయినప్పటికీ, ఫీజు మొత్తాన్ని తిరిగి జమ చేసేసినట్లు పేర్కొంది. ఫీజు తిరిగి చెల్లింపుల విషయాన్ని తెలియజేస్తూ, ఈ కేసులో సుప్రీంకు సలహాలను అందిస్తున్న స్వతంత్ర న్యాయవాదికి, సెబీకి, సహారా ప్రతినిధులకు తమ సీఈఓ సారాంశ్ శర్మ లేఖలు రాసినట్లు తెలిపింది. అయితే మూడు హోటళ్ల కొనుగోలకు 2.05 బిలియన్ డాలర్ల ఆఫర్‌తో తమ ఇన్వెస్టర్లు ఇప్పటికీ సిద్ధంగా ఉన్నట్లూ స్పష్టం చేసింది. అసలు ఆస్తులు అమ్మడానికి సహారాకు ఇష్టం లేదని మరోసారి పేర్కొన్న మిరాచ్, ఈ విషయంలో సుప్రీంకోర్టు, సెబీసహా తమ సంస్థ, ఇన్వెస్టర్ల విలువైన సమావేశాన్ని అంతా సహారా వృథా చేస్తోందని విమర్శించింది. ఈ విషయాన్ని పరిశీలించాలని సుప్రీంకోర్టుకు విన్నవించుకుంటున్నట్లు తెలిపింది. ఈ డీల్ ప్రక్రియ నిజానికి ఫిబ్రవరి 20వ తేదీలోగా ముగియాల్సి ఉంది. డీల్ ప్రక్రియ నిలిచిపోయిన నేపథ్యంలో ఇక సుప్రీం తదుపరి సూచనల కోసం వేచిచూస్తామని మిరాచ్ పేర్కొంది. -
సుబ్రతారాయ్‌కు మళ్లీ నిరాశే
న్యూఢిల్లీ: సహారా గ్రూప్ చీఫ్ సుబ్రతారాయ్‌కు నిరాశే ఎదురయ్యింది. బెయిల్ లేదా పెరోల్‌పై రాయ్‌ని విడుదల చేసే ప్రసక్తే లేదని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం మంగళవారం స్పష్టం చేసింది. నిబంధనలకు వ్యతిరేకంగా రెండు గ్రూప్ కంపెనీలు మదుపుదారుల నుంచి దాదాపు రూ.24 వేల కోట్లు వసూలు చేసిన కేసులో- గడచిన ఐదు నెలల నుంచీ రాయ్ తీహార్ జైలులో కస్టడీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో బెయిల్ పొందాలంటే రూ.10 వేల కోట్లు చెల్లించాలని సుప్రీం ఆదేశించిన సంగతి తెలిసిందే. రూ.10,000 కోట్లలో తొలుత కొంత మొత్తం చెల్లించి రెగ్యులర్ బెయిల్‌పై విడుదలై, అటు తర్వాత మిగిలిన మొత్తాలను చెల్లించే విధంగా వెసులుబాటు ఇవ్వాలని సుప్రీం కోర్టును సహారా కోరుతోంది. అయితే ఇందుకు న్యాయమూర్తులు అంగీకారం తెలపలేదు. పెరోల్‌కు సైతం తాజాగా అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. వెసులుబాటు బాట..! కాగా న్యూయార్క్, లండన్లలో ఉన్న లగ్జరీ హోటెల్స్సహా దేశంలోని తొమ్మిది ఆస్తులను విక్రయానికి మాత్రం సుప్రీం సరే అంది. అయి తే జైలు వెలుపల ఎక్కడైనా ఇందుకు సంబంధించి కొనుగోలుదారులతో లావాదేవీలను జరపడానికి వీలుగా ఉదయం 10 గంటల నుంచీ సాయంత్రం 4 గంటల వరకూ సమయం కేటాయిస్తామని హామీ ఇచ్చింది. షియోమి ఆర్డర్ల వెల్లువతో ఫ్లిప్‌కార్ట్ వెబ్సైట్ క్రాష్ ముంబై: ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ వెబ్సైట్ మంగళవారం మరోసారి క్రాష్ అయింది. చైనా యాపిల్‌గా పేరొందిన షియోమి కంపెనీ ‘ఎంఐ3’ చౌక స్మార్ట్ఫోన్ల ఆన్లైన్ అమ్మకాలకు బుకింగ్స్ ప్రారంభించిన సందర్బంగా ఒకేసారి ఆర్డర్లు వెల్లువెత్తడంతో పోర్టల్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తి మొరాయించినట్లు సమాచారం. చైనా యాపిల్‌గా పేరొందిన షియోమి కంపెనీ.. భారత్‌లో తాజాగా తమ ఎంఐ3 స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఆన్లైన్ విక్రయాలకోసం ప్రత్యేకంగా ఫ్లిప్‌కార్ట్‌తో ఈ కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఏడాది మే14న కూడా ‘మోటో ఇ’ మొబైల్ ఆన్లైన్ విక్రయాల ప్రారంభం సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ సైట్ ఇదేవిధంగా క్రాష్ కావడం తెలిసిందే. కాగా, క్రాష్ వార్తల నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్ సిబ్బంది వెబ్సైట్లో సమస్యలను కొద్దిసేపటితర్వాత చక్కదిద్దినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. -
నో డేట్ ఫర్ డేట్స్
గంగి గోవు పాలు గరిటెడైన ను చాలు... అన్నాడు వేమన! మంచి ఖర్జూరాలు రెండు తిన్న చాలు... అంటోంది వైద్యం! ఖర్జూరం... ఎడారులలోని ఒయాసిస్సుల దగ్గర పండి... ఒంటెల మీద ప్రయాణించి... మానవ సమాజంలోకి ప్రవే శించి... మన నాలుకల మీద కూర్చుని... తియ్య తియ్యగా... రంజు రంజుగా నడయాడుతూ... మనకి శక్తి నిచ్చి... మన చేత తైతక్కలాడిస్తూ... తన రాజసాన్ని నిలుపుకుంటోంది... ఖజురహో శిల్పంలా ఎడారిలో ఠీవిగా నిలబడుతోంది! ఎన ర్జీ సలాడ్, బొబ్బట్లు, ఖీర్, పికిల్, షేక్... ఎలా కావాలంటే అలా మలుచుకుని... తయారుచేసుకుని... ఆస్వాదించండి... 365 డేస్ దొరికే డేట్స్‌కి ప్రత్యేకమైన డేట్ లేదు... 24x7 దొరుకుతూనే ఉంటాయి..! ఖర్జూరం షేక్ కావలసినవి: ఖర్జూరాలు - 100 గ్రా. (సన్నగా తరగాలి); పాలు - 2 కప్పులు; వెనిలా ఐస్‌క్రీమ్ - 4 స్కూపులు; మీగడ - 8 టీ స్పూన్లు (చిక్కగా చిలకాలి); చెర్రీలు - 4 (ముక్కలుగా తరగాలి) తయారీ: మిక్సీలో కప్పు పాలు, ఖర్జూరం ముక్కలు వేసి మెత్తగా పేస్ట్‌లా చేయాలి మిగిలిన ఒక కప్పు పాలు, వెనిలా ఐస్‌క్రీమ్ జత చేసి మరో మారు మిక్సీ తిప్పాలి తయారైన మిశ్రమాన్ని పొడవుగా ఉండే గ్లాసులలో పోసి, పావు గంటసేపు ఫ్రిజ్‌లో ఉంచాలి రెండు టీ స్పూన్ల మీగడ, చెర్రీ ముక్కలతో అలంకరించి, వెంటనే అందించాలి. ఖర్జూరాల ఊరగాయ కావలసినవి: సన్నగా తరిగిన ఖర్జూరాలు - కప్పు; ఆవాలు - అర టీ స్పూను; అల్లం వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూను; మిరప్పొడి - 2 టీ స్పూన్లు; ఇంగువ - పావు టీ స్పూను; చింతపండు గుజ్జు - టేబుల్ స్పూను; కరివేపాకు - 3 రెమ్మలు; నూనె - టీ స్పూను; ఉప్పు - తగినంత తయారీ: బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు వేసి చిటపటలాడించాలి కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకదాని తరవాత ఒకటి వేసి వేయించాలి అర కప్పు నీళ్లు, ఖర్జూరం ముక్కలు వేయాలి నీళ్లు మరుగుతుండగా మంట తగ్గించి మూత పెట్టి ఉడికించాలి ఖర్జూరాలు బాగా ఉడికిన తర్వాత ఉప్పు, మిరప్పొడి, చింతపండు గుజ్జు వేసి బాగా కలపాలి చివరగా ఇంగువ వేసి బాగా కలిపి దించేయాలి బాగా చల్లారిన తర్వాత గాలి చొరని డబ్బాలోకి తీసుకుని, ఫ్రిజ్‌లో నిల్వ చేయాలి ఆపిల్ - డేట్స్ ఖీర్ కావలసినవి: ఆపిల్ - 1 (సన్నగా తరగాలి); పంచదార - టీ స్పూను; పాలు - రెండున్నర కప్పులు (ఫ్యాట్ తక్కువ ఉన్నవి); సన్నగా తరిగిన ఖర్జూరాలు - కప్పు; గార్నిషింగ్ కోసం: వాల్నట్స్ - టేబుల్ స్పూను (సన్నగా తరగాలి); ఆపిల్ - చిన్న ముక్క (సన్నగా తరగాలి) తయారీ: నాన్‌స్టిక్ పాత్రలో... ఆపిల్ ముక్కలు, పంచదార, మూడు టేబుల్ స్పూన్ల నీళ్లు వేసి సన్న మంట మీద ఆపకుండా కలుపుతూ, కొద్దిసేపు ఉడికించి దించేయాలి చల్లారాక ఫ్రిజ్‌లో ఉంచాలి ఒక పాత్రలో పాలు, ఖర్జూరం తరుగు వేసి బాగా కలిపి స్టౌ మీద ఉంచి సన్నని మంట మీద పది నిముషాలు ఆపకుండా కలుపుతూ ఉడికించి దించేయాలి చల్లారాక ఫ్రిజ్‌లో ఉంచి తీయాలి సర్వ్ చేసే ముందు ఉడికించిన ఆపిల్ మిశ్రమాన్ని, ఖర్జూరం మిశ్రమానికి జత చేసి నెమ్మదిగా కలపాలి వాల్నట్స్ తరుగు, ఆపిల్ ముక్కలతో అలంకరించి చల్లచల్లగా అందించాలి. డేట్స్ ఎనర్జీ సలాడ్ కావలసినవి: క్యాలీఫ్లవర్ తరుగు - అర కప్పు; సన్నగా తరిగిన ఖర్జూరాలు - అర కప్పు; అరటిపండు - 1 (చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి); కమలాపండు - 1 (తొనలు తీయాలి); ఆపిల్స్ - 2 (తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి); నిమ్మరసం - అర టేబుల్ స్పూను; సన్నగా ముక్కలు చేసిన నిమ్మ తొనలు - అర టీ స్పూను; నూనె - అర టేబుల్ స్పూను; వెనిగర్ - అర టేబుల్ స్పూను; ఉప్పు - తగినంత; మిరియాల పొడి - తగినంత కమలాపండ్ల డ్రెసింగ్ కోసం... గట్టి పెరుగు - ముప్పావు కప్పు; కమలాపండ్ల రసం - 4 టీ స్పూన్లు; ఆవ పొడి - అర టీ స్పూను; పంచదార పొడి - అర టీ స్పూను; ఉప్పు - తగినంత తయారీ: ఒక పాత్రలో గట్టి పెరుగు, కమలాపండ్ల రసం, ఆవ పొడి, పంచదార పొడి, ఉప్పు అన్నీ వేసి బాగా కలిపి సుమారు అరగంట సేపు ఫ్రిజ్‌లో ఉంచాలి ఒక పాత్రలో సన్నగా తరిగిన క్యాలీఫ్లవర్కి కొద్దిగా నీళ్లు జత చేసి, ఆవిరి మీద ఐదు నిమిషాలు ఉడికించి, చల్లార్చాలి నూనె, వెనిగర్, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలిపి ఊరనివ్వాలి ఒక పాత్రలో ఉడికించిన క్యాలీ ఫ్లవర్, సన్నగా తరిగిన ఖర్జూరాలు, అరటిపండు ముక్కలు, కమలాపండు తొనలు, ఆపిల్ ముక్కలు, నిమ్మరసం, సన్నగా తరిగిన నిమ్మ తొనలు, నూనె, వెనిగర్, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలపాలి తయారుచేసి ఉంచుకున్న కమలాపండ్ల డ్రెసింగ్ వేసి చల్లగా అందించాలి ఖర్జూరం బొబ్బట్లు కావలసినవి: గోధుమపిండి - కప్పు పాలు - 4 టేబుల్ స్పూన్లు గింజలు తీసి సన్నగా తరిగిన ఖర్జూరాలు - ముప్పావు కప్పు నువ్వులు - 2 టేబుల్ స్పూన్లు (వేయించి మెత్తగా పొడి చేయాలి) బ్రౌన్ సుగర్ - పావు కప్పు (సూపర్ మార్కెట్లో దొరుకుతుంది) పాలు - 2 టేబుల్ స్పూన్లు గోధుమ పిండి - కొద్దిగా (చపాతీలకు అద్దడానికి) నెయ్యి - టీ స్పూను (కరిగించాలి) తయారీ: ఒక పాత్రలో గోధుమపిండి, పాలు వేసి, తగినన్ని నీళ్లు జత చేస్తూ చపాతీ పిండిలా కలిపి పైన మూత ఉంచి సుమారు గంట సేపు నాననివ్వాలి పిండిని ఉండలుగా చేసుకుని ఒక్కోదానిని చపాతీలా వత్తాలి ఒక పాత్రలో ఖర్జూరం తరుగు, నువ్వుల పొడి, బ్రౌన్ సుగర్, పాలు వేసి కలిపి చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి ముందుగా ఒత్తి ఉంచుకున్న చపాతీలో ఖర్జూరం మిశ్రమాన్ని తగినంత పరిమాణంలో ఉంచాలి నాలుగు వైపులా మూసేసి, పిండి అద్ది, చపాతీలా ఒత్తాలి అంచులను చేతితో జాగ్రత్తగా పల్చగా వచ్చేలా ఒత్తాలి స్టౌ మీద పెనం ఉంచి, ఒక్కో బొబ్బట్టు వేసి చుట్టూ నెయ్యి వేసి బాగా కాల్చి, రెండవ వైపు తిప్పాలి రెండో వైపు కూడా నెయ్యి వేసి కాల్చి తీసేయాలి వేడివేడిగా అందించాలి ఇందులో క్యాల్షియమ్, ఐరన్ అధికంగా ఉంటాయి. ఎండు ఖర్జూరంలో ప్రతి 100 గ్రాములకు ఖర్జూరం చెట్లు సుమారు 10 - 20 మీటర్ల ఎత్తువరకూ పెరుగుతాయి. తాటి చెట్ల మాదిరిగానే వీటిలోనూ ఆడ చెట్లు, మగ చెట్లు వేర్వేరుగా ఉంటాయి. ఆడ చెట్లు మాత్రమే ఫలాలనిస్తాయి. ఈ చె ట్లను పండ్ల కోసమే కాకుండా నీడ, పశువుల మేత, కలప, ఆయుధాలు, తాళ్లు... కోసం సుమేరియన్లు పెంచినట్లుగా చరిత్ర చెబుతోంది. 5 - 8 ఏళ్ల వయసు వచ్చేసరికి ఖర్జూరపు చెట్లు కాపుకొస్తాయి. శక్తి - 280 కిలో క్యాలరీలు పిండి పదార్థాలు - 75 గ్రా. చక్కెర - 60 గ్రా. పీచుపదార్థాలు - 8 గ్రా. కొవ్వు పదార్థాలు - 0.4 గ్రా. మాంసకృత్తులు - 2.5 గ్రా. నీళ్లు - 21 గ్రా. విటమిన్‘సి’ - 0.4 గ్రా. ఒక పండుఖర్జూరంలో శక్తి - 23 కిలో క్యాలరీలు కొవ్వు పదార్థాలు - 0.03 గ్రా. పిండి పదార్థాలు - 6.23 గ్రా. మాంసకృత్తులు - 0.2 గ్రా. ఖర్జూరాలను ఒకప్పుడు అత్యధికంగా సాగు చేసిన దేశం ఇరాక్. ప్రపంచవ్యాప్తంగా 80 శాతం ఖర్జూరం పంట ఇక్కడే పండేది. ఇక్కడి నాణేల మీద, స్టాంపుల మీద ఖర్జూరపు చెట్ల బొమ్మలు కనిపిస్తాయి. ప్రపంచంలోకెల్లా అత్యధికంగా ఏటా 11 లక్షల టన్నుల ఖర్జూరాల్ని ఉత్పత్తి చేస్తూ ఈజిప్టు ప్రథమ స్థానంలో వుంది. సహారా వాసులు మూడింట రెండొంతుల ఆదాయాన్ని ఈ పంట నుంచే పొందుతున్నారు. ఏ పండైనా పండుగా ఉన్నప్పుడే రుచిగా ఉంటుంది. కాని ఖర్జూరం ఎండినా రుచిగానే ఉంటుంది. ఎండు ఖర్జూరాలను వేసవిలో వడ దెబ్బ నుండి కాపాడుకోవడానికి ఉపయోగిస్తారు. రంజాన్ మాసంలో ఈ పండ్లతోనే ఉపవాస దీక్ష విరమిస్తారు. మహమ్మద్ ప్రవక్తకు ఇది ఎంతో ఇష్టమైన ఆహార ంగా పవిత్ర ఖురాన్ చెబుతోంది. ఆయన ఇంటికి కలపనిచ్చింది కూడా ఖర్జూరం చెట్లేనని చెబుతారు. లేత ఆకుల్ని కూరగా వండుతారు, ఖర్జూరపు మొగ్గల్ని సలాడ్లలో వాడతారు. కరవు సమయాల్లో వీటి విత్తనాల్ని పొడి చేసి గోధుమపిండిలో కలిపి రొట్టె చేసుకుని తింటారు. -
సుప్రీంలో సహారా చీఫ్‌కు చుక్కెదురు
న్యూఢిల్లీ: సహారా చీఫ్ సుబ్రతా రాయ్‌కు మళ్లీ చుక్కెదురైంది. తనను గృహనిర్బంధంలో ఉంచాలన్న సుబ్రతా రాయ్ విన్నపాన్ని సుప్రీం కోర్టు తిరస్కరించింది. కాగా తొమ్మిది నగరాల్లో ఉన్న స్థిరాస్తులను విక్రయించడానికి కోర్టు సహారా గ్రూప్‌కు అనుమతిచ్చింది. సహారా ఆస్తులకు సంబంధించి టైటిల్ డీడ్స్ అందజేయాల్సిందిగా సర్వోన్నత న్యాయస్థానం సెబీని అదేశించింది. డబ్బు సమకూర్చుకోవడానికి సహారా ఆస్తులను విక్రయించనుంది. నిబంధనలకు విరుద్ధంగా సమీకరించిన వేల కోట్ల నిధులను ఇన్వెస్టర్లకు తిరిగి చెల్లించని వివాదంలో.. సుబ్రతా రాయ్‌తో పాటు మరో ఇద్దరు డెరైక్టర్లను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సుబ్రతా రాయ్‌కు బెయిల్ మంజూరు కాకపోవడంతో తీహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. -
ఆమోదయోగ్య ప్రతిపాదనతో రండి
న్యూఢిల్లీ: సహారా చీఫ్ సుబ్రతారాయ్, గ్రూప్ కంపెనీల డెరైక్టర్లు ఇరువురు బెయిల్‌కు రూ.10,000 కోట్ల చెల్లింపులపై తగిన ఆమోదయోగ్య ప్రతిపాదనతో రావాలని సుప్రీంకోర్టు కొత్త బెంచ్ సోమవారం సూచించింది. కేసులో నెలకొన్న ప్రతిష్టంభన వల్ల ఎవ్వరికీ ప్రయోజనం ఉండబోదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. లక్నోలో రాయ్‌ని గృహ నిర్బంధం కింద ఉంచాలన్న విజ్ఞప్తిని మాత్రం జస్టిస్ టి.ఎస్.ఠాకూర్, జస్టిస్ ఎ.కె.సిక్రిలతో కూడిన బెంచ్ తోసిపుచ్చింది. న్యాయమూర్తులు జె.ఎస్. కేహార్, కె.ఎస్. రాధాకృష్ణన్‌లతో కూడిన ధర్మాసనం 2012 నుంచి సహారా కేసును విచారించింది. అయితే, ఈ నెల 14న రాధాకృష్ణన్ రిటైర్ కావడం, కేహార్ స్వచ్ఛందంగా తప్పుకోవడంతో కొత్త బెంచ్‌ను ఏర్పాటు చేశారు. లండన్, న్యూయార్క్‌లో ఉన్న హోటెల్స్సహా తన ఆస్తుల అమ్మకానికి సహారా సిద్ధమని సహారా సుప్రీంకోర్టుకు తెలపడం మరో ముఖ్య విషయం. కొత్త బెంచ్ వద్ద ప్రాథమిక స్థాయిలో జరిగిన విచారణ ప్రతిష్టంభనను తొలగించే దిశలో కొంత సానుకూలంగా ఉన్నట్లు పేర్కొన్న బెంచ్, తాజా ప్రతిపాదనతో ముందుకు రావాలని సూచించింది. వచ్చే వారం కేసు తదుపరి విచారణ జరగనుంది. 75 రోజల నుంచి తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న రాయ్‌ని విడుదల చేయాల్సి ఉందని అంతకుముందు సీనియర్ అడ్వకేట్ రాజీవ్ ధావన్ వాదించారు. లక్నోలో ఆయనను హౌస్ అరెస్ట్ కింద ఉంచాలని సైతం విజ్ఞప్తి చేశారు. అయితే ఈ విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. -
సహారా కేసులో మలుపు
న్యూఢిల్లీ: సహారా కేసులో హఠాత్ పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు విచారణ నుంచి సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనంలో ఒకరైన జస్టిస్ జేఎస్ కేహార్ తప్పుకున్నారు. సుప్రీంకోర్టు డిప్యూటీ రిజిస్ట్రార్ రాకేష్ శర్మ ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విలేకరుల సమావేశంలో చదివి వినిపించారు. దీనిప్రకారం ఇకపై ఈ కేసు విచారణ ప్రక్రియ నుంచి తప్పుకుంటున్నట్లు తెలుపుతూ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి జస్టిస్ జేఎస్ కేహార్ మే 6న ఒక సమాచారం పంపారు. ఇది మే 7న చీఫ్ జస్టిస్ ముందుకు వచ్చింది. దీనితో కొత్త బెంచ్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అయితే ఈ కొత్త బెంచ్‌లో న్యాయమూర్తులు ఎవరనే విషయంపై మాత్రం వివరాలను తాజా ప్రకటన తెలియజేయలేదు. ఈ కేసును విచారిస్తున్న ద్విసభ్య ధర్మాసనంలోని మరో న్యాయమూర్తి జస్టిస్ రాధాకృష్ణన్ మే 14న పదవీ విరమణ చేసిన నేపథ్యంలో, మరో న్యాయమూర్తి సైతం సహారా విచారణ ప్రక్రియ నుంచి తప్పుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. తీవ్ర ఒత్తిడి...! తనను నిర్బంధించడం అక్రమం, అన్యాయం, రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతమని, సెబీ కోర్టు ధిక్కరణ పిటిషన్ పెండింగులో ఉండగానే తనను జ్యుడీషియల్ కస్టడీకి ఎలా పంపుతారని సహారా చీఫ్ సుబ్రతారాయ్ దాఖలు చేసిన హెబియస్ కార్పస్ రిట్ పిటిషన్‌ను న్యాయమూర్తులు రాధాకృష్ణన్, కేహార్లు మే 6వ తేదీన బెంచ్ తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. అదే రోజు ఈ కేసు విచారణ నుంచి ఇకపై తప్పుకుంటున్నట్లు జస్టిస్ కేహార్ సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్‌కు సమాచారం పంపడం విశేషం. నిర్బంధానికి సంబంధించి ఇచ్చిన రూలింగ్‌ను తప్పుబడుతూ దాఖలైన రిట్ పిటిషన్‌ను ఆ తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులే ఎలా విచారిస్తారని సైతం సహారా చీఫ్ సుబ్రతారాయ్ తరఫు న్యాయవాది రామ్‌జత్మలానీ అంతక్రితం వాదించడం ఇక్కడ ప్రస్తావనాంశం. ఈ అంశంపై రూలింగ్ ఇచ్చిన సందర్భంగా న్యాయమూర్తి రాధాకృష్ణన్ చేసిన వ్యాఖ్యలకు కీలక ప్రాధాన్యత సంతరించుకుంది. సహారా కేసులో బెంచ్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నట్లు రాధాకృష్ణన్ వ్యాఖ్యానించారు. -
రాయ్ విడుదలకు తాజా ప్రతిపాదన
న్యూఢిల్లీ: తమ చీఫ్ సుబ్రతారాయ్, ఇరువురు డెరైక్టర్లను జ్యుడీషియల్ కస్టడీ నుంచి విడిపించడానికి ఇప్పటికే పలు ప్రతిపాదనలు చేసి సుప్రీంకోర్టు ఆమోదం పొందలేకపోయిన సహారా, గురువారం మరో కొత్త ప్రతిపాదన ముందుకు తెచ్చింది. దీనిప్రకారం నాలుగు రోజుల్లో సంస్థ రూ.2,500 కోట్లు చెల్లిస్తుంది. 60 రోజుల్లో మరో రూ.2,500 కోట్లు చెల్లింపులు జరుపుతుంది. తదుపరి 90 రోజుల్లో రూ.5,000 కోట్ల బ్యాంక్ గ్యారెంటీని ఇస్తుంది. అయితే గురువారం సమయం లేకపోవడంతో, ఈ ప్రతిపాదనను సోమవారం పరిశీలిస్తామని రాయ్ తరఫు సీనియర్ న్యాయవాదులు రామ్‌జత్మలానీ, ధావన్‌కు సుప్రీం తెలిపింది. కాగా డబ్బు సమీకరణకు సంబంధించి డీఫ్రీజ్ చేయాలని కోరుతున్న గ్రూప్ కంపెనీల బ్యాంక్ అకౌంట్ నంబర్లనూ సుప్రీంకు సహారా న్యాయవాదులు సమర్పించినట్లు వార్తలు వచ్చినప్పటికీ... ఇవి ధృవపడాల్సి ఉంది. మదుపరుల నుంచి నిబంధనలకు విరుద్ధంగా డబ్బు వసూలు చేసిన వ్యవహారంలో... మార్చి 4 నుంచి తీహార్ జైలులో ఉన్న రాయ్, డెరైక్టర్ల బెయిల్‌కు రూ.10,000 కోట్లను చెల్లించాలని జస్టిస్ రాధాకృష్ణన్ నేతృత్వంలోని సుప్రీం ద్విసభ్య ధర్మాసనం ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే. -
ఇప్పుడు కొంత.. 3 వారాల్లో కొంత
హైదరాబాద్: సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ముందు గురువారం సహారా గ్రూప్ తాజా ప్రతిపాదన తెచ్చింది. తమ చీఫ్ సుబ్రతారాయ్, రెండు గ్రూప్ కంపెనీలకు చెందిన డెరైక్టర్లను జ్యుడీషియల్ కస్టడీ నుంచి విడుదలకు రూ.10,000 కోట్లు చెల్లించడం తక్షణం కష్టమని పేర్కొంటూనే ఇందుకు బదులుగా మరో తాజా ప్రతిపాదన చేసింది. తక్షణం రూ.2,500 కోట్లు చెల్లిస్తామని, మిగిలిన అంతే మొత్తాన్ని (మరో రూ.2,500 కోట్లు) 21 రోజుల్లో చెల్లిస్తామని పేర్కొంది. బ్యాంక్ గ్యారంటీగా మరో రూ.5,000 కోట్లు సమకూర్చుకోవడానికి 60-90 రోజుల సమయం ఇవ్వాలని కోరింది. ఈ మేరకు ఇంతక్రితం మార్చి 26న ఇచ్చిన ఉత్తర్వులను సవరించాలని రాయ్ తరఫు న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు. అయితే ఈ ప్రతిపాదనను పిటిషన్ రూపంలో దాఖలు చేయాలని, తదనంతరం దీనిని పరిశీలిస్తామని సహారా తరఫు న్యాయవాదులకు ధర్మాసనం సూచించింది. కేసు తదుపరి విచారణ ఏప్రిల్ 9న జరగనుంది. రాయ్ న్యాయవాదుల సమాచారం ప్రకారం రూ. 2,500 కోట్లు చెల్లించిన అనంతరం, స్తంభింపజేసిన కొన్ని అకౌంట్లను తిరిగి డీఫ్రీజ్ చేయడానికి ఆమోదించడంతోపాటు, రాయ్‌ని జైలులో కాకుండా, గృహ నిర్బంధంలో ఉంచడానికీ అనుమతించాలని ధర్మాసనానికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. దీనివల్ల బ్యాలెన్స్ డబ్బు సమకూర్చుకోవడానికి వీలవుతుందని విన్నవించినట్లు వెల్లడించారు. ఉత్తర్వులు పాటించేందుకే జైలు...: కాగా అంతకుముందు ఈ కేసుకు సంబంధించి ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. రాయ్, అలాగే ఇరువురు డెరైక్టర్లను జైల్లో పెట్టడానికి కారణాన్ని ఈ సందర్భంగా సుప్రీం న్యాయమూర్తులు రాధాకృష్ణన్, జగదీష్ సింగ్ కేహార్లు వివరించారు. మదుపరుల నుంచి మార్కెట్ నిబంధనలకు విరుద్ధంగా వసూలు చేసిన రూ.24,000 కోట్ల డబ్బు మొత్తం వడ్డీతోసహా తిరిగి చెల్లించాలన్న తన ఆదేశాలను పాటించేలా చేయడమే తాజా నిర్బంధానికి కారణంగా ధర్మాసనం తెలిపింది. సెబీ ధిక్కార పిటిషన్లకు, ఈ నిర్బంధానికి సంబంధం లేదని స్పష్టం చేసింది. సెబీ దాఖలు చేసిన ధిక్కార పిటిషన్లు విచారణ దశలోనే ఉన్నాయని పేర్కొంటూ, దీనిపై తీర్పు ఏమిటన్నది విచారణ ముగింపు(ధిక్కరణపై), డబ్బు తిరిగి చెల్లింపుల (మదుపరులకు) అనంతరం వెలువరిస్తామని సూచించింది. ‘2014 ఆగస్టు 31, ఆతర్వాత ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులు అమలయ్యేలా చూడటమే మార్చి 4న మేము జారీ చేసిన జ్యుడీషియల్ కస్టడీ ఉత్తర్వుల ఉద్దేశం. సెబీ దాఖలు చేసిన ధిక్కరణ పిటిషన్లపై శిక్షకాదు’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. రూ.10,000 కోట్ల బెయిల్ బాండ్ విషయాన్ని కోర్టు ప్రస్తావిస్తూ, వాస్తవంగా చెల్లించాల్సిన మొత్తంలో ఇది కొంతేనన్న విషయాన్ని సహారా గుర్తెరగాలని బెంచ్ పేర్కొంది. -
పదివేల కోట్లంటే కష్టం... 2,500 అయితే...
-
దుమ్ము... దుమ్ము ... దుమ్ దుమ్ దుమ్ దుమ్ దుమ్ము...
ఆస్తమా పేషంట్లూ ఇంట్లోనే ఉండండి! ఎలర్జీలున్న వాళ్లూ బయటకి రాకండి. మామూలు వాళ్లూ కళ్లద్దాల్లేకుండా బైక్ ఎక్కకండి!! ఇంగ్లండ్ ఇప్పుడు తన ప్రజలందరికీ జారీ చేసిన హెచ్చరిక ఇది. లండన్, సౌత్ ఇంగ్లండ్, మిడ్ లాండ్స్, వేల్స్ వంటి ప్రాంతాల్లో ఇప్పటికే ప్రమాదకర పరిస్థితులున్నాయని ప్రభుత్వం చెబుతోంది. ఆఫ్రికాలోని సహారా ఎడారిలో మొదలైన ఈ ధూళి తుఫాను ఆఫ్రికా దేశాలను చుట్టబెట్టింది. నెమ్మదిగా యూరప్ మీద పడింది. ఇప్పటికే పారిస్, బ్రసెల్స్ వంటి ప్రాంతాల్లో ఆఫ్రికా దుమ్ము దుమ్ము రేపుతోంది. ఇక లండన్ వరకూ వచ్చేస్తోంది. ఈ దుమ్ము, ఇప్పటికే ప్రధాన నగరాల్లో ఉన్న వాహన కాలుష్యం కలిసి లవ్వాడేసుకుంటున్నాయి. దీంతో ముందు ఏముందో కనపడని పరిస్థితి ఉంది. ఇప్పుడు లండన్ నగరానికి కూడా ఆఫ్రికన్ దుమ్ము వచ్చేస్తే పరిస్థితి ఏమవుతుందోనని బ్రిటన్ ఇప్పుడు కంగారు పడుతోంది. ఇప్పుడు ఉత్తర దిశగా దుమ్ము వ్యాపిస్తోంది. ఇప్పుడు బ్రిటన్ 'ఉత్తరం ఊపి కొట్టింది. దక్షిణం దంచి కొట్టింది. ఇక ఏమవుతుందో' అని కలవరపడుతోంది. -
సుప్రీంకోర్టు ముందు చేతులెత్తేసిన సహారా గ్రూప్
న్యూఢిల్లీ : సహారా గ్రూప్ సుప్రీంకోర్టు ముందు చేతులెత్తేసింది. ఇప్పటికిప్పుడు రూ.10వేల కోట్లు చెల్లించలేమని ఆ సంస్థ న్యాయస్థానానికి తెలిపింది. తక్షణమే రూ.2.500 కోట్లు మాత్రమే చెల్లించగలమని ఈ మేరకు తమ అశక్తతను అత్యున్నత న్యాయస్ధానానికి తెలియజేసింది. మూడు వారాల తర్వాత మరో రూ.2.500 కోట్లు చెల్లిస్తామని సహారా గ్రూప్ గురువారం విన్నవించింది. మార్చి 4వ తేదీ నుంచీ సహారా గ్రూప్ సుబ్రతారాయ్, గ్రూప్ కంపెనీల డెరైక్టర్లు ఇరువురు- రవి శంకర్ దుబే, అశోక్ రాయ్ చౌదరిలు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. కస్టడీలో ఉన్న రాయ్, ఇరువురు డెరైక్టర్ల విడుదలకు రూ.5 వేల కోట్లు కోర్టుకు డిపాజిట్ చేయాలని, మరో రూ.5 వేల కోట్లకు సెబీ మార్చుకోదగిన విధంగా బ్యాంక్ గ్యారెంటీ సమర్పించాలని ద్విసభ్య ధర్మాసనం గతనెలలో ఆదేశించింది. దాంతో సుబ్రతారాయ్,రవి శంకర్ దుబే, అశోక్ రాయ్ చౌదరిలు మరికొద్దిరోజులు జ్యుడీషియల్ కస్టడీలోనే కొనసాగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. -
తక్షణం అంత మొత్తాన్ని చెల్లించలేం: సహారా
న్యూఢిల్లీ: సహారా గ్రూప్ సుబ్రతారాయ్, గ్రూప్ కంపెనీల డెరైక్టర్లు ఇరువురు- రవి శంకర్ దుబే, అశోక్ రాయ్ చౌదరిలు జ్యుడీషియల్ కస్టడీలోనే మరికొద్దిరోజులు కొనసాగే పరిస్థితులు కనబడుతున్నాయి. సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఆదేశాలకు అనుగుణంగా వీరి బెయిల్‌కు రూ.10,000 కోట్లు చెల్లించాల్సి రావడం తక్షణం తమకు సాధ్యమయ్యేది కాదని, అంతమొత్తాన్ని ఇప్పటికిప్పుడు సమీకరించలేమని సహారా పేర్కొంది. ఈ మేరకు తమ అశక్తతను అత్యున్నత న్యాయస్ధానానికి తెలియజేసింది. మార్చి 4వ తేదీ నుంచీ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న రాయ్, ఇరువురు డెరైక్టర్ల విడుదలకు రూ.5 వేల కోట్లు కోర్టుకు డిపాజిట్ చేయాలని, మరో రూ.5 వేల కోట్లకు సెబీ మార్చుకోదగిన విధంగా బ్యాంక్ గ్యారెంటీ సమర్పిం చాలని ద్విసభ్య ధర్మాసనం బుధవారం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ రూలింగ్‌పై తమ స్పందనను సహారా గురువారం కోర్టుకు తెలియజేసింది. తదుపరి కేసు విచారణ ఏప్రిల్ 3కు వాయిదా పడింది. తీవ్ర వాదోపవాదనలు... తనను జైలు పాలు చేయడం తగదని, ఇది రాజ్యాంగ విరుద్ధమని గతంలో సహారా చీఫ్ సుబ్రతారాయ్ దాఖలు చేసిన హెబియస్ కార్పస్ రిట్ పిటిషన్‌పై గురువారం సహారా-సెబీ న్యాయవాదుల మధ్య తీవ్ర వాదోపవాదనలు జరిగాయి. జస్టిస్ కేఎస్ రాధాకృష్ణన్, జస్టిస్ జేఎస్ కేహార్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందు రాయ్ తరఫు సీనియర్ న్యాయవాది రామ్ జత్మలానీ తన వాదనలు వినిపించారు. బెంచ్ ఈ కేసు విషయంలో పక్షపాతంతో వ్యవహరిస్తోందని అన్నారు. ఒక రూలింగ్ ఇచ్చిన ధర్మాసనమే... ఆ రూలింగ్ తప్పని వేసిన రిట్ పిటిషన్‌ను ఎలా విచారిస్తుందని ప్రశ్నించారు. తాను చేసిన తప్పేమిటో తెలియకుండా ఏ వ్యక్తినైనా ఎలా జైలుపాలు చేయగలమని పేర్కొన్నారు. సెబీ దాఖలు చేసిన ధిక్కరణ పిటిషన్లు పెండింగులో ఉండగానే రాయ్‌ని జైలుకు పంపడం తీవ్ర తప్పిదమని అన్నారు. తాత్కాలిక బెయిల్ పొందడానికి రూ.10,000 కోట్ల భారీ మొత్తం చెల్లించాలన్న షరతుసైతం సమంజసం కాదని అన్నారు. అంతా పక్షపాతంగా ఉందన్న తన క్లయింట్ ఆందోళనను ప్రస్తుత బెంచ్ గౌరవించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కేసును ప్రస్తుత బెంచ్ విచారించడం తగదని, మరో ధర్మాసనం ముందుకు బదిలీచేయాలని న్యాయమూర్తులకు విజ్ఞప్తి చేశారు. సీనియర్ అడ్వకేట్ రాజీవ్ ధావన్ కూడా ఇదే విధమైన విజ్ఞప్తి చేశారు. రాయ్‌ని జైలుకు పంపుతూ ఇచ్చిన రూలింగ్‌ను సవరించాలని కోరారు. ధర్మాసనం రూలింగ్‌నే తప్పుపట్టాల్సిన పరిస్థితి చాలా అరుదుగా ఉత్పన్నమవుతుందని సైతం పేర్కొన్నారు. అయితే ఈ పిటిషన్ అసలు చెల్లనేరదని సెబీ తరఫు న్యాయవాదులు వాదించారు. రాయ్ తరఫు న్యాయవాదుల వాదనలను వారు పూర్తిగా వ్యతిరేకించారు. వాదనలు ఇంకా ముగియకపోవడంతో తదుపరి విచారణను ధర్మాసనం ఏప్రిల్ 3కు వాయిదా వేసింది. -
10 వేల కోట్లివ్వు... బెయిల్ తీసుకో...
-
సహారా చీఫ్‌కు దక్కని బెయిల్
న్యూఢిల్లీ: బెయిల్ కోసం సహారా గ్రూప్ చీఫ్ సుబ్రతా రాయ్ చేసిన అభ్యర్థనను సుప్రీం కోర్టు గురువారం తిరస్కరించింది. ఇన్వెస్టర్లకు రూ.20 వేల కోట్లు వాపసు చేయడానికి సంబంధించి కొత్త ప్రతిపాదనల దాఖలులో సహారా గ్రూప్ విఫలం కావడంతో బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చింది. ప్రస్తుతం రూ.2,500 కోట్లు చెల్లిస్తామనీ, మిగిలిన మొత్తాన్ని వాయిదాల పద్ధతిలో అందిస్తామన్న సహారా ప్రతిపాదనను న్యాయస్థానం గతంలో మాదిరిగానే తిరస్కరించింది. సొమ్ము తిరిగి చెల్లించడంపై కొత్త ప్రతిపాదనతో వస్తేనే బెయిల్ అభ్యర్థనను పరిశీలిస్తామని జస్టిస్ కేఎస్ రాధాకృష్ణన్, జస్టిస్ జేఎస్ ఖేహార్‌లతో కూడిన బెంచ్ తేల్చిచెప్పింది. బెయిల్ పిటిషన్‌పై గురువారం రెండు గంటలపాటు విచారణ కొనసాగింది. కుటుంబంతో కలసి హోలీ వేడుకలు నిర్వహించుకునేందుకు వీలుగా సుబ్రతాకు బెయిల్ మంజూరు చేయాలని సహారా గ్రూప్ అడ్వొకేట్ రామ్ జెఠ్మలానీ అభ్యర్థించారు. అయితే, తాము గతంలో ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా సొమ్ము చెల్లించడానికి సంబంధించి సహారా నుంచి లిఖిత పూర్వక ప్రతిపాదనలేవీ రానందున థ్యంలో బెయిల్ అభ్యర్థనను పరిశీలించజాలమని కోర్టు తేల్చిచెప్పింది. సుబ్రతా ఈ నెల 4 నుంచి తీహార్ జైలులో ఉన్న సంగతి విదితమే. హోలీని కుటుంబంతో కలసి జరుపుకునేందుకు, తీవ్ర అనారోగ్యంతో ఉన్న తల్లితో కొంత సమయం గడిపేందుకు రాయ్‌కు బెయిల్ ఇవ్వాలని జెఠ్మలానీ విన్నవించారు. ‘మీ ప్రతిపాదన ఏమిటని మేం పదే పదే అడుగుతున్నాం. మీరు ఎంత చెల్లించగలరో చెప్పండి. తాళం చెవి(సమస్యకు పరిష్కారం) మీ చేతుల్లోనే ఉంది.’ అని కోర్టు వ్యాఖ్యానించింది. రాయ్ మాత్రమే డబ్బును సమకూర్చగలరనీ, ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నందువల్ల ధన సేకరణకు సంస్థకు ఎవరూ సహాయపడరనీ జెఠ్మలానీ తెలిపారు. శుక్రవారం తన వాదనను కొనసాగించలేనని జెఠ్మలానీ అశక్తతను వ్యక్తంచేయడం, తర్వాతి వారమంతా హోలీ సెలవులు కావడంతో బెయిల్ పిటిషన్ విచారణను కోర్టు ఈ నెల 25వ తేదీకి వాయిదా వేసింది. -
సహారా ప్రతిపాదనకు సుప్రీంకోర్టు నో...
న్యూఢిల్లీ: మదుపరులకు వచ్చే 16 నెలల్లో చెల్లింపులు జరిపేస్తామంటూ సహారా చేసిన ఒక ప్రతిపాదనను సుప్రీంకోర్టు శుక్రవారం తిరస్కరించింది. సహారా చేసిన తాజా ప్రతిపాదన అవమానకరమైనదని పేర్కొన్న జస్టిస్ కేఎస్ రాధాకృష్ణన్, జస్టిస్ జేఎస్ కేల్కర్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం, గౌరవప్రదమైన ప్రణాళికతో ముందుకురావాలని సూచిం చింది. తదుపరి విచారణను 11వ తేదీకి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో సహారా చీఫ్ సుబ్రతారాయ్ తదుపరి విచారణ వరకూ తీహార్ జైలులోనే గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిబంధనలకు విరుద్ధంగా సహారాగ్రూప్ సంస్థలు రెండు రూ.24,000 కోట్లు సమీకరించాయన్నది కేసులో ప్రధానాంశం. ఈ నిధులు పునఃచెల్లింపుల్లో విఫలం కావడంతో మార్కెట్ రెగ్యులేటర్ సెబీ సహారాపై ధిక్కార పిటిషన్లను దాఖలు చేసింది. దాదాపు రెండేళ్ల సుదీర్ఘ విచారణ ప్రక్రియ అనంతరం సుప్రీం ఆదేశాల ప్రకారం సహారా చీఫ్ జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. ప్రతిపాదన ఏమిటి? కేసు విచారణకు ప్రత్యేక బెంచ్‌ని ఏర్పాటు చేయాలని సహారా విజ్ఞప్తి చేసింది. దీనితో ప్రత్యేకంగా ఏర్పాటైన బెంచ్ ముందు సహారా న్యాయవాదులు ఒక ప్రతిపాదన చేస్తూ, 3 రోజుల్లో రూ.2,500 కోట్లు చెల్లించడానికి గ్రూప్ సిద్ధమని పేర్కొన్నారు. మిగిలిన మొత్తం రూ.14,900 కోట్లను 2015 జూలైనాటికి 5 విడతల్లో చెల్లిస్తామని గ్రూప్ హామీ ఇస్తోందని తెలిపింది. అయితే ఈ దశలో మార్కెట్ రెగ్యులేటర్ సెబీ న్యాయవాది తన వాదనలను వినిపిస్తూ, వడ్డీతోసహా గ్రూప్ చెల్లించాల్సింది దాదాపు రూ.34,000 కోట్లని పేర్కొన్నారు. ప్రస్తుతం చెల్లింపులకు అంగీకరిస్తున్న రూ.17,400 కోట్లు కాదని కోర్టు దృష్టికి తెచ్చారు. దీనితో సహారా ప్రతిపాదనను సుప్రీం ధర్మాసనం తిరస్కరించింది. గౌరవప్రదమైన ప్రతిపాదనతో రావాలని సూచించింది. కాగా, ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 మధ్య ప్రతిరోజూ రాయ్‌ని సహారా ఫైనాన్షియల్ కన్సల్టెంట్లు, న్యాయవాదులు కలుసుకునేందుకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపింది. -
సుబ్రతో రాయ్ అరెస్ట్‌కు రంగం సిద్ధం
-
మ్యాచ్‌కు రూ. 1.92 కోట్లు
చెన్నై: దాదాపు పదేళ్లపాటు భారత క్రికెట్ జట్టుతో మమేకమైన సహారా గ్రూప్ లోగో ఇకపై ఆటగాళ్ల జెర్సీలపై కనిపించదు. సహారా స్థానంలో స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ జట్టు నూతన స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. మూడేళ్లపాటు బీసీసీఐతో ఈ ఒప్పందం కొనసాగుతుంది. అయితే సహారా.. స్టార్ ఇండియా కన్నా ఎక్కువ మొత్తంతో వేలంలో పాల్గొన్నప్పటికీ గత విభేదాల దృష్ట్యా బోర్డు సహారా బిడ్‌ను పరిగణనలోకి తీసుకోలేదు. ‘బీసీసీఐ, ఐసీసీ, ఏసీసీ ఈవెంట్స్‌లో ఆడే భారత జట్టు స్పాన్సర్షిప్ హక్కులను స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ దక్కించుకుంది. ఇవి జనవరి 1, 2014 నుంచి మార్చి 31, 2017 వరకు అమల్లో ఉంటాయి. ఈ హక్కుల కోసం పోటీలో ఉన్న ఏడు బిడ్లను పరిశీలించాం. ఈ సోమవారం మధ్యాహ్నం 3 గంటల వరకు బిడ్స్‌ను ఆహ్వానించాం. చివరికి పోటీలో స్టార్, సహారా ఇండియా ఫైనాన్షియల్ కార్పొరేషన్ నిలిచాయి. దీంట్లో సహారా బిడ్ ఆమోదయోగ్యం కాదని గుర్తించాం. అలాగే స్టార్ గ్రూప్ 2018 వరకు భారత క్రికెట్ ప్రసార, ఇంటర్నెట్, మొబైల్ హక్కులను కూడా కలిగి ఉంటుంది. ఈ ఏడాది అక్టోబర్ నుంచి వచ్చే మార్చి 31 వరకు బీసీసీఐ అంతర్జాతీయ, దేశవాళీ మ్యాచ్‌లకు స్టార్ గ్రూప్ టైటిల్ స్పాన్సర్‌గా ఇప్పటికే వ్యవహరిస్తోంది’ అని బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ తెలిపారు. అధికారిక టీమ్ స్పాన్సర్ హోదాలో స్టార్ గ్రూప్ తమ లోగోను పురుషుల జాతీయ జట్టు, అండర్-19 పురుషుల జట్టు, ‘ఎ’ జట్టు, మహిళల జట్టు ఆటగాళ్ల జెర్సీలపై కలిగి ఉంటుంది. అయితే స్టార్‌తో ఏర్పరుచుకున్న ఒప్పందం ద్వారా తమకు ఎంత మొత్తం సమకూరేదీ బీసీసీఐ వెల్లడించలేదు. ద్వైపాక్షిక సిరీస్‌లలో భారత్ ఆడే ఒక్కో మ్యాచ్‌కు రూ.కోటీ 92 లక్షలు ఇవ్వనున్నట్టు సమాచారం. ఐసీసీ ఆధ్వర్యంలో జరిగే మల్టీనేషనల్ టోర్నీలలో భారత్ ఆడే మ్యాచ్‌లకు మాత్రం రూ. 61 లక్షల చొప్పున చెల్లిస్తారు. మ్యాచ్‌కు కనీస ధర తగ్గించిన బోర్డు మూడేళ్ల క్రితం బీసీసీఐ తమ ఒక్కో మ్యాచ్‌కు కనీస ధరను రూ.2.5 కోట్లుగా నిర్ణయించింది. అప్పట్లో పోటీకి వచ్చిన ఎయిర్టెల్ (రూ.2.89 కోట్లు)ను అధిగమించి సహారా ఒక్కో మ్యాచ్‌కు రికార్డు స్థాయిలో రూ.3.34 కోట్లు చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఆర్థిక ప్రపంచంలో మారిన పరిస్థితులకు అనుగుణంగా ఈసారి బీసీసీఐ తమ కనీస ధరను తగ్గించుకుని రూ. కోటీ 50 లక్షలుగా నిర్ణయించింది. ఇప్పుడు ఒక్కో మ్యాచ్‌కు బోర్డు గతంతో పోలిస్తే రూ.కోటీ 42 లక్షల ఆదాయం కోల్పోనుంది. ముందే ఎందుకు వద్దనలేదు: సహారా జట్టు స్పాన్సర్షిప్ వ్యవహారమంతా లోపభూయిష్టంగా ఉందని సహారా గ్రూప్ ధ్వజమెత్తింది. తమతో విభేదాల దృష్ట్యానే బిడ్ నుంచి పక్కకు తప్పించారని ఆరోపించింది. ‘మాతో గొడవ ఉందనుకుంటే ప్రారంభంలోనే మాపై ఎందుకు అనర్హత వేటు వేయలేదు. ఇదంతా ముందే అనుకున్న వ్యవహారంగా స్పష్టంగా తేలిపోయింది. బీసీసీఐ ప్రతీ మ్యాచ్‌కు మేం రూ.2.35 కోట్లు, ఐసీసీ మ్యాచ్‌కు రూ.91 లక్షలు ఇస్తామని బిడ్ వేశాం. ఓవరాల్‌గా మా మొత్తం బిడ్ రూ.252 కోట్లుగా ఉంది. స్టార్ మాత్రం రూ.203 కోట్లు మాత్రమే ఇస్తామంది’ అని సహారా కార్పొరేట్ కమ్యూనికేషన్స్ హెడ్ అభిజిత్ ఆరోపించారు. ఐపీఎల్ నుంచి పుణే వారియర్స్ జట్టును బీసీసీఐ తొలగించినప్పటి నుంచి సహారాకు, బోర్డుకు పడటం లేదు. -
పరస్పర ఆమోదనీయ యంత్రాంగం!
న్యూఢిల్లీ: సహారా గూప్ సంస్థలు రెండు నిబంధనలకు విరుద్ధంగా ఇన్వెస్టర్ల నుంచి వసూలు చేసిన సొమ్ములో రూ.19,000 కోట్లను చెల్లించడంపై సుప్రీంకోర్టు శుక్రవారం కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ నిధుల చెల్లింపులకు సంబంధించి ఒక యంత్రాంగానికి రూపకల్పన చేయాలని మార్కెట్ రెగ్యులేటర్ సెబీ, సహారా గ్రూప్‌లకు సూచించింది. కేసుకు సంబంధించి రూ.20,000 కోట్ల బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చేందుకు సిద్ధమేనా? అని సైతం గ్రూప్ సంస్థలను సుప్రీంకోర్టు ఈ సందర్భంగా ప్రశ్నించింది. ఆయా అంశాలపై సెబీ, సహారా గ్రూప్‌లు పరస్పర ఆమోదనీయ అంగీకారానికి రావడానికి వీలుగా కేసు తదుపరి విచారణను అక్టోబర్ 28వ తేదీకి వాయిదా వేసింది. పూర్వాపరాలకు వెళితే- దాదాపు రూ.19,000 కోట్ల నిధుల చెల్లింపుల్లో విఫలం కావడంపై సహారా గ్రూప్‌పై సెబీ దాఖలు చేసిన మూడు కోర్టు ధిక్కార పిటిషన్లు శుక్రవారం సుప్రీంకోర్టు ముందు విచారణకు వచ్చాయి. నిధుల చెల్లింపులకు సంబంధించి తన స్థిరాస్తిని పూచీకత్తుగా ఉంచేందుకు సుబ్రతారాయ్ నేతృత్వంలోని గ్రూప్ ఈ సందర్భంగా అంగీకరించింది. అయితే ఈ విషయంలో సెబీ కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేసింది. సేల్‌డీడ్, ఆస్తుల విలువలను ప్రశ్నించింది. కంపెనీనే ప్రతిపాదిత పూచీకత్తు ఆస్తిని విక్రయించి, రెగ్యులేటర్‌కు ఆ సొమ్మును చెల్లించాలని సెబీ న్యాయవాది పేర్కొన్నారు. దీనితో ఈ మొత్తం వ్యవహారంపై పరస్పర ఆమోదనీయమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడానికి సుప్రీంకోర్టు సమయం ఇచ్చింది. ఇటీవల లండన్‌లో గ్రూప్ కొనుగోలు చేసిన రూ. 256 కోట్ల స్థిరాస్తి అంశం ఈ సందర్భంగా సుప్రీంకోర్టులో ప్రస్తావనకు వచ్చింది. మీడియాలో వచ్చిన ఈ వార్తలే నిజమైతే- కేసులో సెబీకి చెల్లించాల్సిఉన్న నిధుల మొత్తం చెల్లించే సామర్థ్యం సహారాకు ఉన్నట్లేనని కోర్టు వ్యాఖ్యానించింది. పూర్వాపరాలు... సహారా గ్రూపులు రెండు- ఎస్‌ఐఆర్‌ఈసీ (సహారా ఇండియా రియల్టీ), ఎస్‌ఐహెచ్‌ఐసీ (సహారా ఇండియా హౌసింగ్ ఇన్వెస్ట్మెంట్) మార్కెట్ నిబంధనలకు విరుద్దంగా ఇన్వెస్టర్ల నుంచి రూ.24,000 కోట్లను వసూలు చేశాయన్నది ఈ కేసులో ప్రధానాంశం. ఈ కేసులో గత ఆగస్టు 31న సుప్రీం రూలింగ్ ఇస్తూ, 2012 నవంబర్ ముగింపునకు ఈ మొత్తాలను 15 శాతం వడ్డీతో సెబీకి రిఫండ్ చేయాలని ఆదేశించింది. అయితే ఇందులో సంస్థ విఫలం కావడంతో గడువును పెంచింది. దీని ప్రకారం తక్షణం రూ.5,120 కోట్ల తక్షణం చెల్లించాలని, రూ.10,000 కోట్లను జనవరి మొదటి వారంకల్లా చెల్లించాలని, మిగిలిన సొమ్మును ఫిబ్రవరి మొదటివారంలోపు చెల్లించాలని పేర్కొంది. డిసెంబర్ 5న రూ.5,120 కోట్ల డ్రాఫ్ట్‌ను చెల్లించిన సహారా- ఆపై మొత్తాల చెల్లింపుల్లో విఫలమయ్యింది. కోర్టులో సెబీ ధిక్కరణ పిటిషన్లను ఎదుర్కొంటోంది.