ప్రకటనలిస్తే ప్రయోజనం ఉండదు
ఇన్వెస్టర్లను వెతికే విషయమై సెబీపై సహారా ఫైర్
న్యూఢిల్లీ: మదుపరులను గుర్తించేందుకు పత్రికా ప్రకటనలిస్తే సరిపోదని సహారా గ్రూప్ తాజాగా మార్కెట్ రెగ్యులేటర్- సెబీకి స్పష్టం చేసింది. సహారాలో ఇన్వెస్ట్ చేసిన చాలామంది దేశంలో మారుమూల ప్రాంతాల్లో ఉన్నారని పేర్కొంటూ... బాండ్ హోల్డర్లను గుర్తించేందుకు కావాలంటే తామూ తమ సహాయాన్ని అందిస్తామని ఆఫర్ చేసింది. సెబీ హోల్ టైమ్ మెంబర్ ఎస్.రామన్ గురువారం మాట్లాడుతూ, దేశంలో నల్లధనం పెద్ద ఎత్తున నకిలీ, మోసపూరిత పథకాల్లోకి మళ్లుతోందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సహారా ఉదంతాన్ని ప్రస్తావించారు. దీంతో కంపెనీ ఈ ప్రకటన చేసింది.