న్యూఢిల్లీ: రెండు గ్రూప్ సంస్థలు ఇన్వెస్టర్లకు డబ్బు పునఃచెల్లింపుల వైఫల్యం కేసుల అంశానికి సంబంధించి సహారా ఆస్తుల వేలం ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా చర్యలకు దిగిన మార్కెట్ రెగ్యులేటర్ సెబీ సూచనల మేరకు, ఎస్‌బీఐ క్యాప్స్ , హెచ్‌డీఎఫ్‌సీ రియల్టీలు పలు సహారా భూములను దశలవారీగా వేలం వేస్తున్న సంగతి తెలిసిందే. రూ.722 కోట్ల రిజర్వ్ ధరకు ఐదు వేర్వేరు ఆస్తులను హెచ్‌డీఎఫ్‌సీ రియల్టీ నేడు ఈ-వేలానికి పెట్టింది. ఎస్‌బీఐ క్యాప్స్ జూలై 7న రూ.470 కోట్ల రిజర్వ్ ధరకు మరో ఐదు భూములను ఈ-ఆక్షన్‌కు పెట్టనుంది. కాగా సోమవారం ఆక్షన్‌కు సంబంధించి వివరాలు తెలియరాలేదు.