Assets auction
-
బ్యాంక్‌నెట్ పోర్టల్ ప్రారంభం
న్యూఢిల్లీ: బ్యాంక్‌లు స్వా«దీనం చేసుకున్న అన్ని రకాల ఆస్తులను ఇక మీదట బ్యాంక్‌నెట్ పోర్టల్ పైనే వేలానికి పెట్టనున్నారు. ఇందుకు వీలుగా నవీకరించిన బ్యాంక్‌నెట్ (బీఏఏఎన్కేఎన్ఈటీ) పోర్టల్‌ను కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి ఎం.నాగరాజు ప్రారంభించారు. అన్ని ప్రభుత్వరంగ బ్యాంక్‌లు (పీఎస్‌బీలు) చేపట్టే ఆస్తుల వేలం సమాచారం ఈ పోర్టల్‌పై ఉంటుందని.. కొనుగోలుదారులు, ఇన్వెస్టర్లకు భిన్న రకాల ఆస్తులను గుర్తించొచ్చని ఆర్థిక శాఖ ప్రకటించింది. ఫ్లాట్లు, ఇళ్లు, ఓపెన్ ప్లాట్లు, వాణిజ్య ప్రాపరీ్టలు, ఇండ్రస్టియల్ ల్యాండ్, బిల్డింగ్లు, షాప్‌లు, వాహనాలు, ప్లాంట్, మెషినరీ, వ్యవసాయ, వ్యవసాయేతర భూముల వేలం సమాచారం పోర్టల్‌పై అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఈ వివరాలన్నీ ఒకే చోట లభించడంతో, విలువైన ఆస్తులను గుర్తించి, వేలంలో పాల్గొనడానికి వీలుంటుందని పేర్కొంది. ప్రభుత్వరంగ బ్యాంక్‌లు రుణాలను వసూలు చేసుకోవడంలో ఈ ప్లాట్‌ఫామ్ గణనీయంగా సాయపడుతుందని నాగరాజు తెలిపారు. కొత్త పోర్టల్‌లోకి ఇప్పటికే 1,22,500 ప్రాపరీ్టలను లిస్ట్ చేసినట్టు చెప్పారు. -
7 బిజినెస్ గ్రూప్‌ల ఆస్తుల వేలం: సెబీ
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఏడు బిజినెస్ గ్రూప్‌లకు చెందిన 17 ఆస్తులను వేలం వేయనున్నట్లు తాజాగా పేర్కొంది. జాబితాలో ఎంపీఎస్, వైబ్‌గ్యోర్ గ్రూప్‌లతోపాటు, టవర్ ఇన్ఫోటెక్ తదితరాలున్నాయి. ఇన్వెస్టర్ల సొమ్ము రికవరీ నిమిత్తం ఈ నెల 28న వేలం నిర్వహించనున్నట్లు సెబీ వెల్లడించింది. ఇందుకు రూ. 51 కోట్ల రిజర్వ్ ధరను నిర్ణయించింది. ఇతర గ్రూప్‌లలో ప్రయాగ్, మల్టీపర్పస్ బియోస్ ఇండియా, వారిస్ ఫైనాన్స్ ఇంటర్నేషనల్, పైలాన్ గ్రూప్‌లున్నట్లు సెబీ ప్రకటించింది. వీటికి సంబంధించిన ప్రాపర్టీలను బ్లాక్ చేస్తున్నట్లు నోటీసు జారీ చేసింది. పశ్చిమ బెంగాల్లో విస్తరించిన ఈ ఆస్తులలో భూములు, పలు అంతస్తుల భవంతులు, ఫ్లాట్లు, వాణిజ్య కార్యాలయాలున్నట్లు తెలియజేసింది. ఆన్లైన్ మార్గంలో నిర్వహించనున్న ఆస్తుల వేలానికి క్విక్‌ఆర్ రియల్టీ విక్రయ సేవలందించనున్నట్లు వెల్లడించింది. ఈ సంస్థలన్నీ నిబంధనలు పాటించకుండా ఇన్వెస్టర్ల నుంచి నిధుల సమీకరణ చేపట్టినట్లు సెబీ వివరించింది. -
శారదా గ్రూప్ ఆస్తుల వేలం
న్యూఢిల్లీ: నిబంధనలకు విరుద్ధంగా చిట్ ఫండ్ తదితర అక్రమ పథకాలను నిర్వహించిన శారదా గ్రూప్ ఆస్తులను వేలం వేయనున్నట్లు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా పేర్కొంది. ఏప్రిల్ 11న నిర్వహించనున్న వేలానికి రూ. 32 కోట్ల రిజర్వ్ ధరను నిర్ణయించింది. ఆస్తులలో కంపెనీకి చెందిన పశ్చిమ బెంగాల్‌లోని భూములు న్నట్లు సెబీ నోటీసులో ప్రకటించింది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 మధ్య ఈవేలం నిర్వహించనున్నట్లు తెలియజేసింది. ఆస్తుల అమ్మకంలో సహకరించేందుకు క్వికార్ రియల్టీని, ఈవేలం నిర్వహణకు సీ1 ఇండియాను ఎంపిక చేసుకుంది. శారదా గ్రూప్ ఆస్తుల వేలానికి 2022 జూన్‌లో కోల్‌కతా హైకోర్టు అనుమతించడంతో సెబీ తాజా చర్యలకు దిగింది. మూడు నెలల్లోగా ప్రక్రియను ముగించవలసిందిగా కోర్టు ఆదేశించింది. శారదా గ్రూప్ 239 ప్రయివేట్ కంపెనీల కన్సార్షియంగా ఏర్పాటైంది. పశ్చిమ బెంగాల్, అస్సామ్, ఒడిషాలలో కంపెనీ నిబంధనలకు విరుద్ధంగా చిట్ ఫండ్ బిజినెస్‌ను చేపట్టింది. 2013 ఏప్రిల్‌లో మూతపడటానికి ముందు 17 లక్షల మంది కస్టమర్ల ద్వారా రూ. 4,000 కోట్లు సమీకరించింది. ముందుగానే శారదా గ్రూప్ ఆస్తులకు సంబంధించి సొంతంగా వివరాలు తెలుసుకోవలసి ఉంటుందని సెబీ స్పష్టం చేసింది. తదుపరి వేలంలో బిడ్స్ దాఖలు చేసుకోమని సూచించింది. -
అప్పు దొరక్క ఆస్తులు అమ్ముకుంటున్న పాకిస్థాన్!
ఇస్లామాబాద్: ఆర్థికంగా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన పాకిస్థాన్‌లో దుర్భర పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో దేశాన్ని సమస్యల నుంచి బయటపడేసేందుకు విదేశాలకు ఆస్తులు అమ్ముకుంటోంది. ఆస్తులు విక్రయించేందుకు ఉన్న అడ్డంకులను తొలగిస్తూ అత్యవసరంగా ఓ ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం. అన్ని ప్రక్రియలను పక్కనపెట్టి.. రెగ్యులేటరీ తనిఖీలను సైతం తొలగించింది. ఎగవేతదారు అనే ముద్ర పడకుండా ఉండేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ మీడియా పేర్కొంది. ‘ఇంటర్ గవర్నమెంటల్ కమర్షియల్ ట్రాన్సాక్షన్స్ ఆర్డినెన్స్-2022’ను గురువారం ఫెడరల్ క్యాబినెట్ ఆమోదించింది. దేశంలోని ప్రభుత్వ ఆస్తులు, ప్రభుత్వ సంస్థల షేర్లను విదేశాలకు విక్రయించటంపై దాఖలయ్యే పిటిషన్లు విచారించకుండా కోర్టులకు సైతం అవకాశం లేదని ద ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ న్యూస్‌పేపర్ వెల్లడించింది. 2.5 బిలియన్ డాలర్ల సమీకరణ.. చమురు, గ్యాస్ కంపెనీలు, ప్రభుత్వ అధీనంలోని విద్యుత్తు కేంద్రాల్లో వాటాను యూఏఈకి విక్రయించేందుకు ఈ అత్యవసర ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. సుమారు 2 బిలియన్ల నుంచి 2.5 బిలియన్ల డాలర్లు వీటి ద్వారా పొందాలని భావిస్తోంది పాకిస్థాన్ ప్రభుత్వం. ఈ ఆర్డినెన్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక సూచనలు చేసింది. అయితే.. ఈ ఆర్డినెన్స్‌పై పాకిస్థాన్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ ఇంకా సంతకం చేయకపోవటం గమనార్హం. గతంలోనూ రుణాలు చెల్లించే స్థితిలో పాకిస్థాన్ లేకపోవటం వల్ల కొత్త రుణాలు ఇచ్చేందుకు ఈ ఏడాది మే నెలలో తిరస్కరించింది యూఏఈ. అయితే.. తమ కంపెనీలు పాక్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించాలని పేర్కొంది. మరోవైపు.. దేశంలోని ఏదైన సంస్థను ప్రైవేటీకరణ చేసేందుకు సుమారు 471 రోజుల సమయం పడుతుందని పాకిస్థాన్ ఆర్థిక మంత్రి మిఫ్తాహ్ ఇస్మాయిల్ ఇటీవల పేర్కొనటం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే.. నిధుల సేకరణకు ప్రభుత్వం రోజుల వ్యవధిలోనే ఒప్పందాలు పూర్తి చేయాలని సూచించారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ(ఐఎంఎఫ్) నుంచి 1.17 బిలియన్ డాలర్ల రుణాలు పొందటంలో విఫలమైంది. ఆర్థిక అంతరాన్ని తగ్గించేందుకు మిత్ర దేశాల నుంచి 4 బిలియన్ డాలర్లు సేకరించాలని ఐఎంఎఫ్ సూచించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆస్తులను విక్రయించి నిధులు సమీకరించేందుకు ప్రయత్నిస్తోంది పాకిస్థాన్. ఇదీ చూడండి: Pakistan: ‘మహిళలు పర్యాటక ప్రదేశాల్లోకి రావొద్దు’ -
ఇక ల్యాంకో ఆస్తుల వేలం?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దాదాపు రూ. 45 వేల కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోయిన ల్యాంకో ఇన్ఫ్రా సంస్థ... కష్టాల నుంచి గట్టెక్కే పరిస్థితి కనిపించటం లేదు. దివాలా పరిష్కార ప్రణాళికలో భాగంగా ఈ సంస్థను కొనుగోలు చేసేందుకు త్రివేణి ఎర్త్‌మూవర్స్ చేసిన ప్రతిపాదనకు ల్యాంకోకు రుణాలిచ్చిన బ్యాంకుల కమిటీ అంగీకరించలేదు. దీంతో పరిష్కారానికి నియమించిన నిపుణులు.. ఈ కంపెనీని మూసివేసి, మిగిలిన ఆస్తుల విక్రయానికి (లిక్విడేషన్) అవసరమైన దరఖాస్తును నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ)లో దాఖలు చేయనున్నారు. నిజానికి లిక్విడేషన్ నుంచి ల్యాంకో బయటపడాలంటే రుణాలిచ్చిన బ్యాంకుల్లో కనీసం 75% త్రివేణీ బిడ్‌కు అనుకూలంగా ఓటేయాలి. కానీ 15 శాతమే అనుకూలంగా ఓటేసినట్లు సమాచారం. బ్యాంకుల నిరాకరణతో పాత ప్రతిపాదనకు మార్పులు చేసి ఈ నెల 1న త్రివేణి మరో బిడ్‌ను వేసింది. చివరి రోజున ఇవ్వడంతో రుణదాతల కమిటీ దీన్ని లోతుగా పరిశీలించలేక తదుపరి నిర్ణయం తీసుకోవాల్సిందిగా ఎన్సీఎల్టీని కోరింది. నేటితో ముగియనున్న గడువు..: ఎన్సీఎల్టీ హైదరాబాద్ బెంచ్ 2017 ఆగస్టులో ల్యాంకో బోర్డు అధికారాలను రద్దు చేసి, దివాలా ప్రక్రియ కు సావన్ గోదియావాలాను నిపుణుడిగా నియమించింది. అయితే త్రివేణి మే 1న చేసిన కొత్త ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు. ఎన్సీఎల్టీ ఇచ్చిన 270 రోజుల గడువు శుక్రవారంతో(మే 4) ముగియనుంది. దీంతో లిక్విడేషన్ లేదా ఇతర పరి ష్కారానికి నిపుణుడు ఎన్సీఎల్టీని ఆశ్రయిం చనున్నట్టు ల్యాంకో ఎక్సే్ఛంజీలకు తెలిపింది. అప్పు ల్లో మునిగిన 12 పెద్ద కంపెనీల్లో ల్యాంకో ఒకటి. రూ.45,000 కోట్లు పలు బ్యాంకులకు బకాయి పడింది. వీటిలో ఐసీఐసీఐకి రూ.7,380 కోట్లు, ఐడీబీఐకి రూ.3,680 కోట్లు చెల్లించాల్సి ఉంది. 75 శాతం దాకా బ్యాంకులకు రానట్టే!! ల్యాంకో లిక్విడేషన్ ప్రక్రియ మొదలై ఒక్కో ఆస్తినీ విక్రయిస్తే... బ్యాంకులకు ఇది బకాయి పడ్డ మొత్తంలో 25 శాతమే తిరిగి రావచ్చన్నది నిపుణుల అంచనా. అలోక్ ఇండస్ట్రీస్, ఏబీజీ షిప్‌యార్డ్ తరహాలో ల్యాంకో విషయంలోనూ బ్యాంకులు 75% రుణాన్ని వదులు కోవాల్సిందేనన్నది వారి అభిప్రాయం. గతవారం ఈ రెండింటికి సంబంధించిన బిడ్లను కూడా తిరస్కరించడం తెలిసిందే. అలోక్ ఇండస్ట్రీస్‌కు రూ.30,000 కోట్ల రుణాలుండగా దీని ఆస్తుల్ని విక్రయిస్తే రూ.4,500 కోట్లే వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇక ఏబీజీ షిప్‌యార్డు కూడా రూ.18,539 కోట్లు బకాయి పడింది. దీని ఆస్తుల్ని విక్రయిస్తే రూ.2,200 కోట్లు మాత్రమే వసూలవుతాయని బ్యాంకులు అంచనా వేస్తున్నాయి. అయితే యూకేకు చెందిన లిబర్టీ హౌస్ ఈ కంపెనీని రూ.5,400 కోట్లకు కొనుగోలు చేస్తామంటూ బిడ్ వేసినా... సదరు కంపెనీకే బోలెడన్ని అప్పులుండటంతో దాని బిడ్ అర్హత పొందే అవకాశాలు కనిపించటం లేదు. ఆఫర్ రూ.1,400 కోట్లు..? త్రివేణి ఎర్త్‌మూవర్స్ సంస్థ ల్యాంకో ఇన్ఫ్రాకు రూ.1,400 కోట్ల నగదు చెల్లించటంతో పాటు రూ.38,000 కోట్ల అప్పులను చెల్లించే బాధ్యతను కూడా తీసుకుంటామని తన బిడ్‌లో పేర్కొన్నట్లు తెలియవచ్చింది. కాగా, ఈ బిడ్‌లో తాను చెల్లిస్తానన్న నగదు మొత్తం చాలా తక్కువగా ఉన్న నేపథ్యంలో ఆస్తుల అమ్మకమే మంచిదనే అభిప్రాయం మార్కెట్ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. దివాలా ప్రక్రియలో భాగంగా కంపెనీ ఆస్తులను కొనుగోలు చేసేందుకు యూఎస్‌కు చెందిన పెన్ ఎనర్జీ, ఇంజెన్ క్యాపిటల్, సోలార్ ల్యాండ్ చైనా, కళ్యాణి డెవలపర్స్, దివ్యశ్రీ డెవలపర్స్, క్యూబ్ హైవేస్ సైతం ఆసక్తి కనబరిచాయి. ల్యాంకో ఆస్తులను ఏకమొత్తంగా కాకుండా విడివిడిగా కొనుగోలు చేసేందుకు ఇవి ముందుకొచ్చాయి. -
బాలచందర్ ఆస్తుల వేలం.. గందరగోళం!
సాక్షి, చెన్నై : లెజెండరీ దర్శకుడు, దాదాసాహెబ్ పాల్కే అవార్డు గ్రహీత.. కే బాలచందర్ ఆస్తుల వేలం వార్త గత రెండు రోజులుగా కోలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అలాంటిదేం జరగబోదని నిర్మాణ సంస్థ.. ఆస్తులను వేలం వేసి తీరతామని యూకో బ్యాంక్ వేర్వేరు ప్రకటనలు విడుదల చేశాయి. దీంతో ఈ వ్యవహారంలో ఇప్పుడు గందరగోళం మొదలైంది. ఆదివారం ప్రముఖ దినపత్రికల్లో దివంగత బాలచందర్ ఆస్తులను వేలం వేయబోతున్నట్లు ప్రకటన వెలువడింది. దీంతో రజనీ కాంత్, కమల్ హాసన్‌లు గురువు కోసం ఏదైనా చేస్తారేమోనని అంతా ఎదురు చూశారు. వారు స్పందించకపోయినప్పటికీ ఆయన నిర్మాణ సంస్థ కవితాలయ మూవీస్ ఓ ప్రకటన విడుదల చేసింది. బాలచందర్ ఆస్తుల వేలం ఉండబోదని తెలిపింది. ‘వ్యాపారంలో భాగంగానే బాలచందర్.. ఇళ్లు, కార్యాలయం డాక్యూమెంట్లు చెన్నైలోని యూకో బ్యాంకులో తాకట్టుపెట్టి రుణం తీసుకున్నారు. ఆయన చనిపోవటంతో రుణంపై వడ్డీ పేరుకుపోయింది. 1.36 కోట్లకు వేలం వేయాలని బ్యాంక్ నిర్ణయించింది. కానీ, ఇప్పటికే చాలా వరకు రుణం తిరిగి చెల్లించాం. మిగతా రుణాన్ని సింగిల్ సెటిల్మెంట్లో చెల్లించేలా మా ప్రతినిధులు బ్యాంక్ అధికారులతో చర్చలు జరుపుతున్నారు’ అని కవితాలయ ప్రతినిధి పేర్కొన్నారు. అయితే బ్యాంక్ మాత్రం ఈ ప్రకటనపై సానుకూలంగా స్పందించలేదు. బాలచందర్ ఇల్లు, కార్యాలయం వేలం వేస్తున్నామని, ఇది కోర్టు పరిధిలో వ్యవహారం కాబట్టి ఇంతకు మించి స్పందించలేమని బ్యాంకు అధికారులు చెప్పటంతో గందరగోళం మొదలైంది. -
సహారా ఆస్తుల వేలం ప్రారంభం
న్యూఢిల్లీ: రెండు గ్రూప్ సంస్థలు ఇన్వెస్టర్లకు డబ్బు పునఃచెల్లింపుల వైఫల్యం కేసుల అంశానికి సంబంధించి సహారా ఆస్తుల వేలం ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా చర్యలకు దిగిన మార్కెట్ రెగ్యులేటర్ సెబీ సూచనల మేరకు, ఎస్బీఐ క్యాప్స్ , హెచ్డీఎఫ్సీ రియల్టీలు పలు సహారా భూములను దశలవారీగా వేలం వేస్తున్న సంగతి తెలిసిందే. రూ.722 కోట్ల రిజర్వ్ ధరకు ఐదు వేర్వేరు ఆస్తులను హెచ్డీఎఫ్సీ రియల్టీ నేడు ఈ-వేలానికి పెట్టింది. ఎస్బీఐ క్యాప్స్ జూలై 7న రూ.470 కోట్ల రిజర్వ్ ధరకు మరో ఐదు భూములను ఈ-ఆక్షన్‌కు పెట్టనుంది. కాగా సోమవారం ఆక్షన్‌కు సంబంధించి వివరాలు తెలియరాలేదు. -
వేలానికి రజనీకాంత్ ఆస్తులు!
సాక్షి, చెన్నై: ‘కొచ్చాడియాన్’ సినిమా నిర్మాణం కోసం తీసుకున్న అప్పు తీర్చని కారణంగా తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ ఆస్తులను బ్యాంక్ వేలం వేయబోతోందనే వార్త తమిళ సినీ పరిశ్రమలో హల్చల్ చేస్తోంది. సినిమా నిర్మాణం కోసం ‘మీడియావన్ గ్లోబల్ ఎంటటైన్మెంట్’లో భాగస్వామి అయిన రజనీకాంత్ భార్య లతారజనీకాంత్ ముంబైలోని ఎగ్జిమ్ బ్యాంక్ నుంచి దాదాపు రూ.20 కోట్లు అప్పు తీసుకున్నారు. తమిళనాడులోని కంచీపురం జిల్లాలో ఉన్న దాదాపు 2.13 ఎకరాల్లో ఉన్న ఆస్తులను అప్పు సమయంలో షూరిటీగా పెట్టారు. తీసుకున్న అప్పుకు గడువు ఈ ఏడాది జూలై 17న ముగిసిందని, వడ్డీతో కలిపి మొత్తం రూ.22కోట్లు దాటడంతో ఆస్తులను వేలం వేస్తామని బ్యాంక్ అధికారులు నోటీసులు పంపారు. దీనిపై లతారజనీకాంత్ మాట్లాడుతూ బ్యాంక్‌కు త్వరలోనే అప్పు చెల్లిస్తామన్నారు. తన భర్తకు ఈ నోటీసుల వ్యవహారానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. మార్చి 31లోగా అప్పు తీర్చే ప్రయత్నాల్లో ఉన్నట్లు మీడియావన్ సంస్థ శుక్రవారం విడుదలచేసిన ఓ ప్రకటనలో తెలిపింది. -
రజనీకాంత్ ఆస్తుల వేలానికి ప్రకటన