బ్యాంక్‌లు స్వాదీనం చేసుకున్న ఆస్తుల వేలం
ఇక్కడే వేలం ప్రారంభించిన కేంద్ర ఆర్థిక శాఖ
న్యూఢిల్లీ: బ్యాంక్‌లు స్వా«దీనం చేసుకున్న అన్ని రకాల ఆస్తులను ఇక మీదట బ్యాంక్‌నెట్ పోర్టల్ పైనే వేలానికి పెట్టనున్నారు. ఇందుకు వీలుగా నవీకరించిన బ్యాంక్‌నెట్ (బీఏఏఎన్‌కేఎన్‌ఈటీ) పోర్టల్‌ను కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి ఎం.నాగరాజు ప్రారంభించారు. అన్ని ప్రభుత్వరంగ బ్యాంక్‌లు (పీఎస్‌బీలు) చేపట్టే ఆస్తుల వేలం సమాచారం ఈ పోర్టల్‌పై ఉంటుందని.. కొనుగోలుదారులు, ఇన్వెస్టర్లకు భిన్న రకాల ఆస్తులను గుర్తించొచ్చని ఆర్థిక శాఖ ప్రకటించింది.
ఫ్లాట్‌లు, ఇళ్లు, ఓపెన్ ప్లాట్‌లు, వాణిజ్య ప్రాపరీ్టలు, ఇండ్రస్టియల్ ల్యాండ్, బిల్డింగ్‌లు, షాప్‌లు, వాహనాలు, ప్లాంట్, మెషినరీ, వ్యవసాయ, వ్యవసాయేతర భూముల వేలం సమాచారం పోర్టల్‌పై అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఈ వివరాలన్నీ ఒకే చోట లభించడంతో, విలువైన ఆస్తులను గుర్తించి, వేలంలో పాల్గొనడానికి వీలుంటుందని పేర్కొంది. ప్రభుత్వరంగ బ్యాంక్‌లు రుణాలను వసూలు చేసుకోవడంలో ఈ ప్లాట్‌ఫామ్ గణనీయంగా సాయపడుతుందని నాగరాజు తెలిపారు. కొత్త పోర్టల్‌లోకి ఇప్పటికే 1,22,500 ప్రాపరీ్టలను లిస్ట్ చేసినట్టు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment