new portal
-
‘చక్షు’కు చెప్పండి!
సాక్షి, హైదరాబాద్: ‘‘హలో.. మీకు లక్కీ లాటరీలో రూ.50 లక్షలు వచ్చాయి.. ఈ మొత్తాన్ని పొందాలంటే మేం చెప్పే బ్యాంకు అకౌంట్ నంబర్‌కు రూ.లక్ష పంపండి.. మిగిలిన మొత్తం మీ సొంతం అవుతుంది..’’ ‘మీ వాట్సప్ నంబర్‌కు వచ్చిన లింక్‌పై క్లిక్ చేసి వివరాలు నమోదు చేయండి.. సర్ఫ్రైజ్ గిఫ్ట్ పొందండి..’’ ‘‘హలో.. బ్యాంకు మేనేజర్‌ను మాట్లాడుతున్నాను.. మీ కేవైసీ అప్డేట్ చేసుకోవాలి. లేదంటే మీ క్రెడిట్‌కార్డు, డెబిట్‌కార్డు బ్లాక్ అయిపోతాయి. మేం అడిగే వివరాలు చెప్పండి..’’ రోజుకో కొత్త తరహా సైబర్ మోసం...సైబర్ నేరగాళ్ల ఎత్తు ఏదైనా.. మూలం మాత్రం మన ఫోన్‌కు వచ్చే కాల్స్.. లేదంటే ఎస్ఎంఎస్లు. సైబర్ నేరగాళ్లు వివిధ ఫోన్ నంబర్ల నుంచి ఫోన్‌కాల్స్, ఎస్ఎంఎస్లు పంపి ఆర్థిక మోసాలకు పాల్పడటం ఇటీవల విపరీతంగా పెరిగింది. ఇలా ఫోన్ నంబర్లను ఉపయోగించి చేస్తున్న మోసాలను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ‘చక్షు’అ్రస్తాన్ని అందుబాటులోకి తెచ్చింది. మోసపూరిత ఫోన్ నంబర్ల వివరాలు ఈ వెబ్ పోర్టల్‌లో నమోదు చేస్తే.. మోసగాళ్ల పనిపడతాయి దర్యాప్తు సంస్థలు. బ్యాంకులకు సైతం ఈ అనుమానాస్పద ఫోన్ నంబర్లు పంపుతారు. ఇలా చేయడం వల్ల సైబర్ నేరగాళ్లు సదరు నంబర్‌తో తెరిచిన బ్యాంకు ఖాతాలను జప్తు చేయడంతోపాటు మరొకరు మోసానికి గురికాకుండా కాపాడతారు. సాధారణ పౌరులు సైతం సైబర్ మోసగాళ్ల సమాచారాన్ని, మోసపూరిత ఫోన్ నంబర్ల సమాచారాన్ని చక్షు పోర్టల్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తేవచ్చు. ఏమిటీ చక్షు పోర్టల్? చక్షు అంటే కన్ను అని అర్థం.. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ అందిస్తున్న సిటిజన్ సెంట్రిక్ సర్విసెస్‌లో చక్షు పేరిట ‘రిపోర్ట్ సస్పెక్టెడ్ ఫ్రాడ్ కమ్యూనికేషన్’కొత్త సేవా పోర్టల్‌ను కేంద్ర కమ్యూనికేషన్స్, ఎల్రక్టానిక్స్ అండ్ ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవలే ప్రారంభించారు. అనుమానిత మోసపూరిత కాల్లు, సందేశాలు వివరాలు ఇందులో నమోదు చేయవచ్చు. చక్షు పోర్టల్ ఎలా వినియోగించాలి.. ♦ https://sancharsaathi.gov.in లింక్ ద్వారా సంచార్ సాథి పోర్టల్‌లోకి లాగిన్ అవ్వాలి. ♦ సిటిజన్ సెంట్రిక్ సర్విసెస్‌లో చక్షు ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. కంటిన్యూ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ♦ మోసపూరిత కమ్యూనికేషన్‌కు సంబంధించిన వివరాలు, ఆ కాల్ లేదా మెసేజ్ వచ్చిన సమయం, ఇతర వివరాలు నమోదు చేయాలి. ♦ ఫిర్యాదు నమోదైన తర్వాత వెరిఫికేషన్ కోసం ఓటీపీని నమోదు చేయాల్సి ఉంటుంది. ఇలా నమోదైన ఫిర్యాదు దర్యాప్తు సంస్థలకు వెళుతుంది. ఏయే అంశాలపై ఫిర్యాదు చేయవచ్చు ♦అనధికారిక కనెక్షన్లు, మనకు వచ్చిన మోసపూరిత నంబర్లు సదరు వ్యక్తులపై ఉన్నాయా లేదా తనిఖీ చేయించవచ్చు. ♦ మనం పోగొట్టుకున్న లేదా చోరీకి గురైన మొబైల్ ఫోన్లను బ్లాక్ చేయడం, ట్రాక్ చేయడం చేయవచ్చు. ♦ అనుమానాస్పద విదేశీ నంబర్లపై ఫిర్యాదు చేయవచ్చు. -
సెలెవిదా వెల్నెస్ పోర్టల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ తయారీ సంస్థ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ తాజాగా సెలెవిదా వెల్నెస్ డైరెక్ట్ టు కంజ్యూమర్ వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచి్చంది. ఈ పోర్టల్ ద్వారా మధుమేహ రోగుల కోసం పలు ఉత్పత్తుల అమ్మకంతోపాటు ఆహార సిఫార్సులు, సమాచారం అందిస్తారు. రెడ్డీస్ ల్యాబొరేటరీస్ 2019 నుంచి సెలెవిదా బ్రాండ్‌లో న్యూట్రాస్యూటికల్స్ తయారీ చేపడుతోంది. దేశవ్యాప్తంగా 18,000 పైచిలుకు పిన్‌కోడ్స్‌కు వీటిని సరఫరా చేస్తోంది. -
బ్యాంకుల్లో మిగిలిపోయిన డిపాజిట్లు.. మీవీ ఉన్నాయా? ఆర్బీఐ పోర్టల్‌లో చెక్ చేయండి..
ముంబై: అన్క్లెయిమ్డ్ డిపాజిట్ల వివరాలను అన్వేషించేందుకు, క్లెయిమ్ చేసుకునేందుకు తోడ్పడేలా కేంద్రీకృత వెబ్ పోర్టల్ ఉడ్గమ్ (అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ – గేట్‌వే టు యాక్సెస్ ఇన్ఫర్మేషన్)ను గురువారం రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రారంభించారు. వివిధ బ్యాంకుల్లో క్లెయిమ్ చేయకుండా ఉండిపోయిన తమ డిపాజిట్లన్నింటి గురించిన వివరాలను కస్టమర్లు ఒకే చోట తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. రిజర్వ్ బ్యాంక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (రెబిట్), ఇండియన్ ఫైనాన్షియల్ టెక్నాలజీ అండ్ అలైడ్ సర్వీసెస్ (ఐఎఫ్‌టీఏఎస్), భాగస్వామ్య బ్యాంకులు కలిసి దీన్ని రూపొందించాయి. ప్రస్తుతం ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ధన్లక్ష్మి బ్యాంక్, సౌతిండియా బ్యాంక్, డీబీఎస్ బ్యాంక్ ఇండియా, సిటీబ్యాంక్ వంటి ఏడు బ్యాంకుల్లోని అన్క్లెయిమ్డ్ డిపాజిట్ల వివరాలు ఈ పోర్టల్‌లో ఉన్నాయి. ఇతర బ్యాంకుల వివరాలను కూడా అక్టోబర్ 15 నాటికి దశలవారీగా అందుబాటులోకి తేనున్నట్లు ఆర్బీఐ తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి దాదాపు రూ. 35,000 కోట్ల అన్క్లెయిమ్డ్ డిపాజిట్లను ప్రభుత్వ రంగ బ్యాంకులు ఆర్బీఐకి బదలాయించాయి. సిసలైన యజమానులు, లబ్ధిదారులకు ఆయా డిపాజిట్లను అందించాలనే ఉద్దేశంతో ఆర్బీఐ పలు చర్యలు తీసుకుంటోంది. ఇదీ చదవండి: గుడ్‌న్యూస్: అత్యధిక వడ్డీ స్కీమ్ గడువు పొడిగింపు -
పశువుల మందులకు వేగంగా ఎన్వోసీ.. ప్రత్యేక పోర్టల్ ఆవిష్కరణ
న్యూఢిల్లీ: వెటర్నరీ ఔషధాలు, టీకాలకు సంబంధించిన దరఖాస్తులను వేగవంతంగా ప్రాసెస్ చేసేందుకు, నో–అబ్జెక్షన్ సర్టిఫికేషన్ (ఎన్వోసీ) జారీ చేసేందుకు కేంద్రం ప్రత్యేకంగా నాంది పేరిట పోర్టల్ ప్రారంభించింది. కేంద్ర మత్స్య, పశు సంవర్ధక, డెయిరీ శాఖ మంత్రి పర్షోత్తం రూపాలా సోమవారం దీన్ని ఆవిష్కరించారు. సాధారణంగా ఔషధాలు, టీకాల దిగుమతి, తయారీ, మార్కెటింగ్ మొదలైన వాటి నియంత్రణ అనేది ఆరోగ్య శాఖలో భాగమైన సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీవో) పరిధిలోకి వస్తుంది. అయితే, వెటర్నరీ ఔషధాలు, టీకాలకు సంబంధించి మత్స్య, పశు సంవర్ధక, డైరీ శాఖతో సంప్రదింపుల తర్వాత అనుమతులు జారీ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ ప్రక్రియ మాన్యువల్‌గా ఉండటంతో జాప్యం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే నాంది (ఎన్వోసీ అప్రూవల్ ఫర్ న్యూ డ్రగ్ అండ్ ఇనాక్యులేషన్ సిస్టం) పోర్టల్‌ను ఆవిష్కరించినట్లు రూపాలా చెప్పారు. తాజా పరిణామంతో ఇకపై సీడీఎస్‌సీవో సుగమ్ పోర్టల్‌లో దాఖలు చేసిన దరఖాస్తును పశు సంవర్ధక, డెయిరీ విభాగానికి పంపిస్తారు. దరఖాస్తుదారు ఆన్లైన్లో అవసరమైన పత్రాలను దాఖలు చేయాలి. పశు సంవర్ధక శాఖలోని సాధికారిక కమిటీ అప్లికేషన్‌ను పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటుంది. అన్నీ సంతృప్తికరంగా ఉంటే ఎన్వోసీని ఆన్లైన్లో జారీ చేస్తారు. -
ఈనామ్ నుంచి ఇండియా విజన్ పోర్ట్‌ఫోలియో
ముంబై: అసెట్ మేనేజ్మెంట్ సంస్థ ఈనామ్ ఏఎంసీ కొత్తగా ఈనామ్ ఇండియా విజన్ పోర్ట్‌ఫోలియో (ఈఐవీపీ)ని ఆవిష్కరించింది. మార్కెట్ క్యాప్, రంగాలతో సంబంధం లేకుండా పటిష్టమైన 15–30 కంపెనీల్లో ఇది ఇన్వెస్ట్ చేస్తుంది. కనీసం రూ. 50 లక్షలు మదుపు చేసే ఇన్వెస్టర్ల కోసం దీన్ని ఉద్దేశించినట్లు సంస్థ సహ వ్యవస్థాపకుడు జితేన్ దోషి తెలిపారు. దీని ద్వారా 1 బిలియన్ డాలర్ల వరకూ సేకరించనున్నట్లు ఆయన వివరించారు. ప్రస్తుతం ఈనామ్ ఏఎంసీ సుమారు 3.48 బిలియన్ డాలర్ల ఆస్తులను (ఏయూఎం) నిర్వహిస్తోంది. -
సామాన్యునికి ప్రభుత్వ పథకాలు మరింత చేరువ
న్యూఢిల్లీ: సామాన్యునికి ఇక ప్రభుత్వ పథకాలు మరింత సులభతరంగా అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. వివిధ మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ శాఖలు నిర్వహిస్తున్న వివిధ పథకాల పంపిణీ కోసం ‘జన్ సమర్థ్’ పేరుతో ఒక ఉమ్మడి పోర్టల్‌ను ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది. కనిష్ట ప్రభుత్వ జోక్యం– గరిష్ట పాలన ప్రయోజనాలకు సంబంధించిన నరేంద్ర మోదీ ప్రభుత్వ దార్శనికతలో భాగంగా, కొత్త పోర్టల్ ప్రారంభం కానున్నట్లు సమాచారం. ప్రారంభంలో 15 క్రెడిట్–లింక్డ్ ప్రభుత్వ పథకాలను లబ్దిదారులకు అందించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్రం స్పాన్సర్ చేస్తున్న పథకాలలో కొన్ని బహుళ సంస్థల ప్రమేయం ఉన్నందున, అనుకూలతలు, అవకాశాలను బట్టి అందించే ప్రయోజనాలు, పథకాల సంఖ్యను విస్తరించడం జరుగుతుందని ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. ఉదాహరణకు, ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన, క్రెడిట్ లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీ స్కీమ్ (సీఎల్సీఎస్ఎస్) వంటి పథకాలు వివిధ మంత్రిత్వ శాఖలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతిపాదిత పోర్టల్ ఈ పథకాలను ఒకే ప్లాట్‌ఫారమ్‌పై తీసుకురావాలని భావిస్తోంది. తద్వారా పథకాల ప్రయోజనాలను లబ్ధిదారులు ఎక్కువ ఇబ్బంది లేకుండా పొందవచ్చు. పోర్టల్ అమలుపై పైలట్ టెస్టింగ్ జరుగుతోందని ఉన్నత వర్గాలు వెల్లడించాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఇతర రుణదాతలు ఈ విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ప్రారంభానికి ముందే ఎటువంటి సమస్యలూ లేకుండా ఈ పోర్టల్‌ను తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. భవిష్యత్తులో ఈ వేదికపై రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర సంస్థలు కూడా తమ పథకాలను అందించడానికి వీలుగా పోర్టల్‌ను రూపొందిస్తున్నట్లు తెలిపారు. సూత్రప్రాయ ఆమోద పొందిన తర్వాత తాజా ప్రతిపాదిత పోర్టల్ ద్వారా కేవలం 7–8 పని దినాలలో రుణం పంపిణీ జరుగుతుందని భావిస్తున్నారు. ‘59 నిముషాల పోర్టల్’తో బహుళ ప్రయోజనాలు కాగా, రుణగ్రహీతలకు సౌకర్యాన్ని అందించడానికి వీలుగా ప్రభుత్వం 2018లో సూక్ష్మ లఘు చిన్న మధ్య తరహా (ఎంఎస్ఎంఈ) పరిశ్రమలు, గృహాలు, ఆటో వ్యక్తిగత రుణాలతో సహా వివిధ రకాల క్రెడిట్ సౌలభ్యత కోసం జ్టి్టp:// pటb ్చౌnటజీn59 ఝజీnu్ట్ఛట. ఛిౌఝ పోర్టల్‌ను ప్రారంభించింది. తద్వారా రుణగ్రహీతల కేవలం 59 నిమిషాల్లో వివిధ ప్రభుత్వ బ్యాంకుల ద్వారా తగిన రుణ ఆమోదాలను పొందే సౌలభ్యత ఏర్పడింది. అంతక్రితం 20–25 రోజుల టర్నరౌండ్ సమయంతో పోలిస్తే 59 నిముషాలకు సంబంధించిన పోర్టల్ రుణ గ్రహీతలకు ఎంతో ప్రయోజనం కల్పించింది. ఈ ప్రక్రియలో మంజూరు దశ వరకు పోర్టల్ మానవ ప్రమేయం లేకుండా రుణ దరఖాస్తులు ప్రాసెస్ అవుతాయి. సూక్ష్మ లఘు చిన్న మధ్య తరహా (ఎంఎస్ఎంఈ) పరిశ్రమల ఏదీ సూత్రప్రాయ ఆమోదం కోసం భౌతికంగా ఎటువంటి పత్రాన్ని సమర్పించాల్సిన అవసరం లేదు. పైగా ఆదాయపు పన్ను రిటర్న్‌లు, జీఎస్టీ డేటా, బ్యాంక్ స్టేట్మెంట్లు మొదలైన అనేక మూలాల నుండి డేటా పాయింట్లను విశ్లేషించడానికి పోర్టల్ అధునాతన అల్గారిథమ్‌లపై ఆధారపడి పనిచేస్తుంది. రుణగ్రహీతల అర్హతను తనిఖీ చేయడానికి మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ (సీజీటీఎంఎస్ఈ) కోసం ప్రభుత్వ క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ ట్రస్ట్‌తో తాజా ప్లాట్‌ఫామ్ అనుసంధానమై ఉంటుంది. పోర్టల్ ప్రారంభించిన మొదటి రెండు నెలల్లో ఎంఎస్ఎంఈ పరిశ్రమలకు చెందిన 1.12 లక్షల రుణ దరఖాస్తులకు ప్రభుత్వ బ్యాంకులు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపాయి. మొత్తం రూ.37,412 కోట్లు మంజూరయ్యాయి. -
ఒక క్లిక్‌తో ఏపీఐఐసీ సేవలు..14 సేవలు అందుబాటులోకి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పే పారిశ్రామికవేత్తలకు ఇకపై ఫైళ్లు పట్టుకొని వారాలు, నెలలు పరిశ్రమల శాఖ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ఆన్లైన్లోనే వారికి అవసరమైన సేవలను సులభంగా పొందవచ్చు. ఇందుకోసం సింగిల్ విండో విధానంలో పారిశ్రామికవేత్తలకు అవసరమైన అన్ని సేవలను ఒకే చోట అందించేలా ఏపీఐఐసీ ఆన్లైన్ వ్యవస్థను అభివృద్ధి చేసింది. ఏపీఐఐసీని పరిశ్రమల శాఖతో అనుసంధానం చేయడం ద్వారా భూమి కోసం దరఖాస్తు దగ్గర నుంచి కంపెనీ వాటాల విక్రయం వరకు అన్ని సేవలను ఒకే క్లిక్‌తో పొందే అవకాశం కల్పించింది. ‘పౌర సేవలు’ పేరుతో ఏపీఐఐసీ అభివృద్ధి చేసిన నూతన పోర్టల్‌ను రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికల వలవన్ సోమవారం మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారదర్శకతకు పెద్దపీట వేస్తూ గడువులోగా పని చేసే సాంకేతిక వ్యవస్థని అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. ఇందుకు కృషి చేసిన ఏపీఐఐసీ ఎండీ సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని అధికారుల బృందానికి అభినందనలు తెలిపారు. www.apindustries.gov.in కు ఏపీఐఐసీ సేవలు అనుసంధానమవడమే కాకుండా పారిశ్రామికవేత్తలకు తక్షణమే ఈ సేవలన్నింటినీ అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. జిల్లా స్థాయిలో పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్లు, ఏపీఐఐసీకి జోనల్ మేనేజర్లు కలిసి పనిచేసి మరిన్ని మంచి ఫలితాలను సాధించాలని ఆకాంక్షించారు. 14 సేవలకూ ఒకటే అప్లికేషన్ సింగిల్ విండో వెబ్సైట్లోకి లాగిన్ అవ్వడం ద్వారా ఏపీఐఐసీకి చెందిన అన్ని సేవలను పొందవచ్చని ఆ సంస్థ వీసీ ఎండీ జవ్వాది సుబ్రమణ్యం తెలిపారు. తొలిదశలో 14 సేవలను అందుబాటులో ఉంచామన్నారు. వీటిలో ఏ సేవ పొందాలన్నా ఆన్లైన్లో ఒకే అప్లికేషన్ ఫామ్ నింపితే సరిపోతుందన్నారు. పరిశ్రమ పేరు మార్చుకోవడం, కేటాయింపుల బదిలీ, ఇతర మార్పులు, లైన్ ఆఫ్ యాక్టివిటీ మార్పు, పరిశ్రమకు చెందిన నియోజకవర్గ మార్పు, అడిషనల్ లైన్ యాక్టివిటీ, ప్లాట్ పరిమితుల అనుమతులు, ప్లాట్ డివిజన్, విభజనల మార్పులు, 5 ఎకరాలలోపు సేల్ డీడ్ ఎగ్జిక్యూషన్ , 5 ఎకరాలపైన సేల్ డీడ్ ఎగ్జిక్యూషన్ విజ్ఞప్తులు, కేటాయించిన ప్లాటుకు ఎన్వోసీ (నో అబ్జెక్షన్ సర్టిఫికెట్), ప్రాజెక్టు అమలుకు గడువు పెంపు, ముందస్తు చెల్లింపుల గడువు పెంపు వంటి 14 సేవలు ఆన్లైన్ ద్వారా పొందవచ్చని చెప్పారు. వీటిని 15 రోజుల నుంచి 45 రోజుల్లో పూర్తిచేయాలన్న లక్ష్యాన్ని కూడా నిర్దేశించారు. ప్రస్తుతం చిన్న పనులకే ఎక్కువ సమయం వృథా అవుతోందని, దాని నియంత్రణ కోసం ఏపీఐఐసీ, పరిశ్రమల శాఖ కలిసి పని చేస్తున్నట్లు సుబ్రమణ్యం తెలిపారు. (చదవండి: సందడిగా కలెక్టరేట్లు.. వేలాది మందితో భారీ ర్యాలీలు..ఊరూరా పండుగ వాతావరణం) -
ఆర్థిక శాఖ అధికారులతో ఇన్ఫోసిస్ చీఫ్ భేటీ
న్యూఢిల్లీ: కొత్త ఆదాయపు పన్ను పోర్టల్ పనితీరు ఎలా ఉందన్న అంశంపై రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ ఇతర సీనియర్ అధికారులు ఇన్ఫోసిస్ మేనేజింగ్ డైరెక్టర్ సలీల్ పరేఖ్‌తో గురువారం ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. పోర్టల్ ద్వారా 2020–21 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకూ 3.5 కోట్ల మందికిపైగా పన్ను చెల్లింపుదారులు ఆదాయపు పన్ను రిటర్న్స్ (ఐటీఆర్) దాఖలు చేసినట్లు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ఇన్ఫోసిస్ అభివృద్ధి చెందిన పోర్టల్’ www.incometax.gov.in పనితీరులో తొలినాళ్లలో తీవ్ర అవాంతరాలు నెలకొనడం తీవ్ర విమర్శలకు దారితీసిన సంగతి తెలిసిందే. పోర్టల్ అభివృద్ధికి 2019లో ఇన్ఫోసిస్‌కు కేంద్ర రూ.4,242 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చింది. 2019 జనవరి నుంచి 2021 జూన్ మధ్య రూ.164.5 కోట్లు చెల్లించింది. కాగా, 2020– 21 ఐటీఆర్ ఫైలింగ్‌కు తుది గడువు డిసెంబర్ 31. -
కొత్త పోర్టల్‌పై 2 కోట్ల ఐటీఆర్‌లు దాఖలు
న్యూఢిల్లీ: ఆదాయపన్ను శాఖ నూతన ఈ ఫైలింగ్ పోర్టల్‌పై 2020–21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 2 కోట్లకు పైగా ఆదాయపన్ను రిటర్నులు (ఐటీఆర్‌లు) దాఖలైనట్టు ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) ప్రకటించింది. కొత్త పోర్టల్ పనితీరు గణనీయంగా మెరుగైనట్టు తెలిపింది. ఇన్ఫోసిస్ అభివృద్ధి చేసిన నూతన పోర్టల్‌పై ఎన్నో సాంకేతిక సమస్యలు లోగడ దర్శనమివ్వడం తెలిసిందే. 2020–21 ఆర్థిక సంవత్సరం రిటర్నులను వీలైనంత ముందుగా నమోదు చేయాలని పన్ను చెల్లింపుదారులను సీబీడీటీ కోరింది. ఈ ఫైలింగ్‌కు వీలుగా అన్ని ఐటీఆర్‌లు అందుబాటులో ఉన్నట్టు పేర్కొంది. దాఖలైన 2 కోట్లకు పైగా ఐటీఆర్‌లలో 86 శాతం.. ఐటీఆర్–1, ఐటీఆర్–4 ఉన్నట్టు, 1.70 కోట్ల ఐటీఆర్‌లు ఈ వెరిఫై పూర్తయినట్టు తెలిపింది. ఇందులో 1.49 కోట్ల ఐటీఆర్‌లు ఆధార్ ఓటీపీ ఆధారంగా ధ్రువీకరించినట్టు వివరించింది. తక్షణ రిఫండ్లకు వీలు కల్పిస్తూ, మరెన్నో సదుపాయాలతో కూడిన కొత్త ఈ ఫైలింగ్ పోర్టల్‌ను ఆదాయపన్ను శాఖ ఈ ఏడాది జూన్ 7న ప్రారంభించింది. సమస్యలు ఎదురవుతున్నట్టు ఎంతో మంది పన్ను చెల్లింపుదారులు ఫిర్యాదు చేయడంతో.. వీటిని పరిష్కరించాలంటూ ఇన్ఫోసిస్‌ను కేంద్ర ఆర్థిక శాఖ కోరింది. -
ఈ–శ్రమ్ పోర్టల్‌లోకి 4 కోట్ల అసంఘటిత కార్మికులు
న్యూఢిల్లీ: ప్రారంభించిన రెండు నెలల్లోపే 4 కోట్ల అసంఘటిత రంగ కార్మికుల పేర్లు ఈ–శ్రమ్ పోర్టల్‌లో నమోదయ్యాయని కేంద్ర కార్మిక ఉపాధి శాఖ ఆదివారం తెలిపింది. నిర్మాణం, దుస్తుల తయారీ, మత్స్య, వ్యవసాయ, రవాణా తదితర రంగాల్లో ఉపాధి పొందుతున్న వారంతా పేర్లు నమోదు చేయించుకున్నారని పేర్కొంది. చాలా రంగాల్లో పెద్ద సంఖ్యలో వలస కార్మికులు కూడా ఉన్నారని తెలిపింది. వీరిలో అత్యధిక భాగం నిర్మాణ, వ్యవసాయ రంగాలకు చెందిన వారేనని పేర్కొంది. ఈ పోర్టల్ ఆధారంగానే అసంఘటిత రంగ కారి్మకులకు అన్ని రకాల సామాజిక భద్రత, ఉపాధి ఆధారిత పథకాల ప్రయోజనాలు అందుతాయని వెల్లడించింది. మొత్తం 4.09 కోట్ల అసంఘటిత రంగ కారి్మకుల్లో 50.02% మంది లబి్ధదారులు మహిళలు కాగా 49.98% మంది పురుషులని వివరించింది. వీరి సంఖ్య ఇంకా పెరుగుతూ పోతోందని కూడా తెలిపింది. నమోదైన వారిలో ఒడిశా, బెంగాల్, ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలవారు ఎక్కువ సంఖ్యలో ఉన్నారని తెలిపింది. నమోదు చేసుకోవాలనుకునే వారు ఈ–శ్రమ్ మొబైల్ అప్లికేషన్‌ను గానీ వెబ్‌సైట్‌ను గాని ఉపయోగించుకోవచ్చని తెలిపింది. ఇంకా, కామన్ సర్వీస్ సెంటర్లు(సీఎస్సీలు), రాష్ట్ర సేవా కేంద్ర, లేబర్ ఫెసిలిటేషన్ సెంటర్లు, గుర్తించిన పోస్టాఫీసులు, డిజిటల్ సేవా కేంద్రాలకు వెళ్లాలని వివరించింది. నమోదైన వారికి దేశవ్యాప్తంగా చెల్లుబాటయ్యే డిజిటల్ ఈ–శ్రమ్ కార్డు అందజేస్తారనీ, వారు తమ వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ–శ్రమ్ కార్డు కలిగిన వారు ప్రమాదవశాత్తు మరణించినా, శాశ్వత అంగవికలత్వం ప్రాపించినా రూ.2 లక్షల పరిహారం అందుతుందనీ, పాక్షిక అంగ వైకల్యమైతే రూ.1 లక్ష సాయం అందుతుందని తెలిపింది. -
ఐటీ పోర్టల్ సమస్యల పరిష్కారంలో పురోగమనం
న్యూఢిల్లీ: కొత్త ఐటీఆర్ పోర్టల్‌లో పలు సాంకేతిక సమస్యలు క్రమంగా పరిష్కారమవుతున్నాయని ఆదాయ పన్ను శాఖ వెల్లడించింది. 2020–21 ఏడాదికి సంబంధించి ఇప్పటిదాకా 1.19 కోట్ల ఐటీఆర్‌లు దాఖలైనట్లు వివరించింది. సెపె్టంబర్ 7 వరకూ 8.83 కోట్ల మంది విశిష్ట ట్యాక్స్‌పేయర్లు పోర్టల్‌లో లాగిన్ అయ్యారని, సెప్టెంబర్‌లో రోజువారీ సగటు లాగిన్ల సంఖ్య 15.55 లక్షలుగా ఉంటోందని పేర్కొంది. కొత్త ఐటీ పోర్టల్ జూన్ 7న అందుబాటులోకి వచి్చనప్పట్నుంచి సాంకేతిక సమస్యలు వెన్నాడుతున్న సంగతి తెలిసిందే. -
కొత్త ఐటీ పోర్టల్‌ను వీడని సమస్యలు.
న్యూఢిల్లీ: ఆదాయ పన్ను శాఖ ఆర్భాటంగా ప్రారంభించిన కొత్త ఐటీ ఫైలింగ్ పోర్టల్‌కు సాంకేతిక సమస్యలు కొనసాగుతున్నాయి. లాగిన్ కావడానికి సుదీర్ఘ కాలం పట్టేస్తుండటంతో పాటు కొన్ని ఫీచర్లు ఇంకా అందుబాటులోకే రాలేదు. కొత్త పోర్టల్‌ను ప్రారంభించినప్పట్నుంచీ సాంకేతిక లోపాలు తలెత్తుతూనే ఉన్నాయని, ఇప్పటికీ వాటిని పూర్తిగా సరిచేయలేదని చార్టర్డ్ అకౌంటెంట్లు తెలిపారు. పన్ను చెల్లింపుదారులు తాము గతంలో ఈ–ఫైలింగ్ చేసిన రిటర్నులను చూసుకోవడానికి కుదరడం లేదని, ఇంకా చాలామటుకు ఫీచర్లకు ’కమింగ్ సూన్ (త్వరలో అందుబాటులోకి వస్తాయి)’ అంటూ పోర్టల్ చూపిస్తోందని వారు పేర్కొన్నారు. లాగిన్ మొదలుకుని ఈ–ప్రొసీడింగ్స్ వంటి కీలకమైన ఫీచర్ల దాకా ఇలాంటి పరిస్థితే ఎదుర్కొనాల్సి వస్తోందని నాంగియా అండ్ కో పార్ట్నర్ శైలేష్ కుమార్ చెప్పారు. దీంతో నిబంధనల ఉల్లంఘన నోటీసులు అందుకుంటున్న వారు వివరణ ఇచ్చేందుకు తగినంత వ్యవధి దొరక్క ఆందోళన చెందుతున్నారని ఆయన తెలిపారు. ‘పన్ను చెల్లింపుదారులు తమ నియంత్రణలో లేని అంశాల కారణంగా పెనాల్టీ పరిణామాలను ఎదుర్కొనాల్సి వచ్చే అవకాశం ఉంది. అంతే కాకుండా ఫారం 15సీఏ/సీబీ లేకపోవడం వల్ల విదేశాలకు నిధులు పంపించే వారు సమస్యలు ఎదుర్కొంటున్నారు‘ అని కుమార్ తెలిపారు. మరోవైపు, ఇటు ట్యాక్స్‌పేయర్లు అటు ట్యాక్స్ నిపుణులకు తీవ్ర అసౌకర్యం కలుగుతున్న నేపథ్యంలో కొత్త పోర్టల్‌ను సత్వరం సరిచేయాల్సిన అవసరం ఉందని ఏఎంఆర్‌జీ అండ్ అసోసియేట్స్ సీనియర్ పార్ట్నర్ రజత్ మోహన్ పేర్కొన్నారు. కొత్త పోర్టల్‌పై అంతా భారీ అంచనాలు పెట్టుకోగా.. చాలా మందకొడిగా పనిచేస్తోందని, యూజ ర్లు చాలా సమస్యలు ఎదుర్కొనాల్సి వస్తోందని డెలాయిట్ ఇండియా పార్ట్నర్ ఆర్తి తెలిపారు. మ్యాన్యువల్‌గా రెమిటెన్స్ ఫారంల ఫైలింగ్.. పోర్టల్‌లో సాంకేతిక సమస్యల నేపథ్యంలో కొన్ని ఫారంలను మ్యాన్యువల్‌గా ఫైలింగ్ చేసేందుకు అనుమతించాలని ఐటీ విభాగం నిర్ణయించింది. విదేశీ రెమిటెన్సులకు అవసరమైన ఫారం 15సీఏ/సీబీని జూన్ 30 దాకా బ్యాంకులకు మాన్యువల్‌గా సమర్పించవచ్చని తెలిపింది. వీటిని తర్వాత ఈ–ఫైలింగ్ పోర్టల్‌లో అప్లోడ్ చేస్తారని ఐటీ విభాగం వివరించింది. -
పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్
ఆదాయపు పన్ను శాఖ అనేక కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ప్రజలు మరింత సులభంగా పన్నుల చెల్లించే విధంగా రేపు (జూన్ 7) కొత్త ఈ-ఫైలింగ్ పోర్టల్‌ను (www.incometax.gov.in) లాంచ్ చేయబోతుంది. ఐటీ రిటర్న్‌లను తక్షణమే అమలు జరిగే విధంగా ఈ కొత్త e-Filing పోర్టల్ రూపొందిస్తున్నట్లు ఆదాయపన్ను శాఖ తెలిపింది. పోర్టల్ తో పాటు మొబైల్ యాప్‌ను కూడా విడుదల చేయనున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్(సీబీడీటీ) ఒక ప్రకటనలో వెల్లడించింది. కొత్త ఈ-ఫైలింగ్ పోర్టల్ పన్ను చెల్లింపుదారుల సౌలభ్యం కోసం అత్యుత్తమ అనుభవాన్ని అందించడానికి ఈ పోర్టల్ తీసుకొస్తున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్స్ (సీబీడీటీ) తెలిపింది. ఆదాయపు పన్ను పోర్టల్‌లో అందుబాటులో ఉండే అన్ని ముఖ్యమైన ఫీచర్లు మొబైల్ యాప్‌లో కూడా అందుబాటులో ఉంటాయి. దీంతో మొబైల్ నెట్‌వర్క్‌తో ఎప్పుడైనా, ఎక్కడైనా యాప్‌ను యాక్సెస్ చేయవచ్చు. దీని వల్ల పన్ను సంబందిత విషయాల్లో అవగాహన లేని వారు కూడా సులభంగా పన్ను చెల్లించేలా రూపోదించినట్లు పేర్కొంది. ఆదాయపు పన్ను రిటర్న్స్(ఐటీఆర్) ఇక నుంచి ధాఖలు చేయడం సులభం. ఐటీఆర్ 1, 4 (ఆన్లైన్, ఆఫ్‌లైన్) ఐటీఆర్ 2(ఆఫ్‌లైన్) కోసం పన్ను చెల్లింపుదారులకు సహాయపడేలా ఇంటరాక్టివ్ ప్రశ్నలతో ఉచిత ఐటీఆర్ తయారీ సాఫ్ట్వేర్ అందుబాటులో ఉంది. పన్ను చెల్లింపుదారుల ప్రశ్నలకు త్వరగా స్పందించడానికి కొత్త కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు సీబీడీటీ తెలిపింది. వీటితో పాటు కొత్త టాక్స్ పేమెంట్ సిస్టమ్ జూన్ 18న ప్రారంభం అవుతుందని సీబీడీటీ తెలిపింది. ఇంటరాక్షన్లు, అప్లోడ్లు, పెండింగ్ యాక్షన్లు ఒకే డ్యాష్ బోర్డుపై కన్పిస్తాయని ఆదాయపు పన్ను శాఖ వివరించింది. చదవండి: Income Tax Return: ఐటీ రిటర్నుల చివరి గడువు తేదీ తెలుసా? -
‘స్పందనే’ ప్రామాణికం
సాక్షి, అమరావతి: స్పందన వినతుల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, కలెక్టర్ల పని తీరుకు ఈ కార్యక్రమాన్ని ప్రామాణికంగా భావిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. పౌరుడు వినతిపత్రం ఇచ్చాక అది పరిష్కారం అయ్యే తీరును నేరుగా అధికారులు, ఉన్నతాధికారులు ట్రాక్ చేయాలని సూచించారు. ఈ ట్రాకింగ్ మెకానిజం చాలా పటిష్టంగా ఉండాలన్నారు. పౌరుల గ్రీవెన్స్‌లను పరిష్కరించకుండా పక్కన పడేసే పరిస్థితి ఉండకూడదని చెప్పారు. నేరుగా సీఎం కార్యాలయ అధికారులు కూడా గ్రీవెన్స్‌ల పరిష్కారంపై ఎప్పటికప్పుడు పరిశీలన, సమీక్ష చేయాలని ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాలే లక్ష్యంగా మరింత ఆధునీకరించిన స్పందన నూతన పోర్టల్‌ను శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన వినతులు.. పరిష్కారానికి అర్హమైనవిగా గుర్తించిన తర్వాత తప్పకుండా వాటిని పరిష్కరించి తీరాల్సిందేనని స్పష్టం చేశారు. నిర్ణీత సమయంలోగా పరిష్కారం కాకపోతే అది ఏస్థాయిలో నిలిచిపోయిందన్నది తెలియాలని, సంబంధిత సిబ్బంది, అధికారికి అలర్ట్స్ వెళ్లాలని సూచించారు. ఒకవేళగ్రీవెన్స్‌ను తిరస్కరిస్తున్నప్పుడు ఎందుకు తిరస్కరిస్తున్నారో కచ్చితంగా కారణం చెప్పగలగాలన్నారు. పటిష్టంగా నవరత్నాల అమలు ► నవరత్నాల్లో ప్రతి పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని, నవరత్న పథకాల సోషల్ ఆడిట్ సమయంలోనే అర్హులైన వారి పేర్లు రాలేదని తెలిసిన వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ► అయినప్పటికీ ఎవరైనా మిగిలిపోయిన పక్షంలో పథకం అమలు చేసిన తేదీ నుంచి నెల రోజుల పాటు వారు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇవ్వాలన్నారు. తర్వాత నెలలో వెరిఫికేషన్ చేసి, మూడో నెలలో వారికి నిధులు విడుదల చేయాలని చెప్పారు. అప్పటితో ఆ స్కీం సంపూర్ణంగా ముగిసినట్టు అవుతుందని తెలిపారు. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు ► దరఖాస్తు చేసిన 90 రోజుల్లో అర్హులైన వారికి కచ్చితంగా ఇంటి స్థలం పట్టా అందాల్సిందేనని సీఎం పునరుద్ఘాటించారు. నిర్ణీత సమయంలోగా ఇంటి స్థలం పట్టా అందించాల్సిన బాధ్యత అధికారులదే అని చెప్పారు. పింఛన్, బియ్యం కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు, ఇతరత్రా అన్నీ కూడా నిర్ణీత వ్యవధిలోగా మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ► సుమారు లక్ష వరకు ఇంటి స్థలాల కోసం మళ్లీ దరఖాస్తులు వచ్చాయని, వాటి పరిశీలన కూడా పూర్తయిందని అధికారులు సీఎంకు వివరించారు. మొత్తం దరఖాస్తులన్నంటినీ కూడా మరోసారి వెరిఫై చేసి, అర్హులకు పట్టాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. ► ఇంటి స్థలాల పట్టాల కోసం కొత్తగా వచ్చిన దరఖాస్తులన్నింటినీ పరిశీలించాలని, వచ్చే నెలలో ఈ దరఖాస్తులకు సంబంధించి రీ వెరిఫికేషన్ పూర్తి చేయాలని ఆదేశించారు. ► ఈ కార్యక్రమంలో ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ నీరబ్ కుమార్ ప్రసాద్, ఐటీ, ఎల్రక్టానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి, సైన్స్ అండ్ టెక్నాలజీ కార్యదర్శి విజయకుమార్, ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ నారాయణ భరత్ గుప్తా, ఆరోగ్యశ్రీ సీఈఓ డాక్టర్ ఎ.మల్లిఖార్జున, ఆరీ్టజీఎస్ సీఈఓ జే విద్యాసాగర్ రెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. స్పందన నూతన పోర్టల్ పనితీరు ఇలా ► పాత పోర్టల్‌లో 2,677 సబ్జెక్టులు, 27,919 ఉప సబ్జెక్టులు ► అప్డేషన్ చేసిన పోర్ట్ల్లో 858 సబ్జెక్టులు, 3,758 ఉప సబ్జెక్టులు ► దీనివల్ల చాలా వరకూ సమయం ఆదా. గ్రామ, వార్డు సచివాలయాలే లక్ష్యంగా రూపకల్పన. పౌరులు నేరుగా ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేసే అవకాశం. ► గ్రామ సచివాలయాలు, కాల్ సెంటర్, వెబ్ అప్లికేషన్, మొబైల్ యాప్, ప్రజా దర్బార్ల ద్వారా వినతులు ఇచ్చే అవకాశం. ► స్వీకరించిన వినతుల్లో అత్యంత తీవ్రమైనవి, తీవ్రమైనవి, సాధారణమైనవిగా వర్గీకరణ. ► వినతి ఏ స్థాయిలో ఉందో తెలుసుకునేందుకు మూడు ఆప్షన్లు. వెబ్ లింక్ ద్వారా, 1902కు కాల్చేసి, గ్రామ సచివాలయాల ద్వారా తెలుసుకునే అవకాశం. ► వినతి పరిష్కారం పట్ల పౌరుడు సంతృప్తి చెందకపోతే తిరిగి మళ్లీ అదే ఫిర్యాదును ఓపెన్ చేసి జిల్లా స్థాయిలో లేదా విభాగాధిపతి స్థాయిలో విజ్ఞప్తి చేయవచ్చు. ► సేవల పట్ల ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ కూడా తీసుకుంటారు. వినతుల పరిష్కారంలో నాణ్యత ఉందా? లేదా? అని తెలుసుకోవడానికి క్రమం తప్పకుండా క్షేత్ర స్థాయిలో సర్వేలు నిర్వహిస్తారు. థర్డ్ పార్టీ ఆడిట్ కూడా జరుగుతుంది. -
అరచేతిలో నెట్వర్క్ సమాచారం
కొత్త పోర్టల్ ను ఆవిష్కరించిన ట్రాయ్ న్యూఢిల్లీ: టెలికం నెట్‌వర్క్‌కు చెందిన సమస్త సమాచారాన్ని మనం ఇప్పుడు ఇంటర్నెట్లో చూడొచ్చు. దీనికోసం టెలికం రెగ్యులేటర్ ‘ట్రాయ్’ ఒక కొత్త పోర్టల్‌ను ప్రారంభించింది. గూగుల్ సెర్చ్‌లో ‘హెచ్‌టీటీపీ://అనలిటిక్స్.ట్రాయ్.గవ్.ఇన్’ అనే యూఆర్ఎల్ను టైప్ చేసి సైట్లోకి వెళ్లొచ్చు. ఇక్కడ మనం కాల్ డ్రాప్స్ ఏ స్థాయిలో ఉన్నాయో చూడొచ్చు. అలాగే మనమున్న ప్రాంతంలోని నెట్వర్క్ కవరేజ్ సహా ఆయా టెలికం కంపెనీల టవర్లు, సేవల నాణ్యత వివరాలను తెలుసుకోవచ్చు. అలాగే పలు ప్రాంతాల్లో నెట్వర్క్ యుటిలైజేషన్ సహా కాల్ డ్రాప్స్ ట్రెండ్ ఎలా ఉందో చూడొచ్చు. తమ తాజా చర్యలు కేవలం మొబైల్ యూజర్లకే కాకుండా టెలికం కంపెనీలకు కూడా ఉపయోగపడతాయి.