
న్యూఢిల్లీ: కొత్త ఐటీఆర్ పోర్టల్‌లో పలు సాంకేతిక సమస్యలు క్రమంగా పరిష్కారమవుతున్నాయని ఆదాయ పన్ను శాఖ వెల్లడించింది. 2020–21 ఏడాదికి సంబంధించి ఇప్పటిదాకా 1.19 కోట్ల ఐటీఆర్‌లు దాఖలైనట్లు వివరించింది. సెపె్టంబర్ 7 వరకూ 8.83 కోట్ల మంది విశిష్ట ట్యాక్స్‌పేయర్లు పోర్టల్‌లో లాగిన్ అయ్యారని, సెప్టెంబర్‌లో రోజువారీ సగటు లాగిన్‌ల సంఖ్య 15.55 లక్షలుగా ఉంటోందని పేర్కొంది. కొత్త ఐటీ పోర్టల్ జూన్ 7న అందుబాటులోకి వచి్చనప్పట్నుంచి సాంకేతిక సమస్యలు వెన్నాడుతున్న సంగతి తెలిసిందే.