resolved
-
Nepal: చారిత్రక ఆధారాలతో సరిహద్దు సమస్యకు పరిష్కారం: పీఎం ఓలి
నేపాల్ నూతన ప్రధానిగా ఎన్నికైన కేపీ శర్మ ఓలి భారత్‌తో సరిహద్దు సమస్య పరిష్కారానికి కట్టుబడివుంటామని ప్రకటించారు. తాజాగా జరిగిన నేపాల్ ప్రతినిధుల సభలో ఎంపీ దీపక్ బహదూర్ సింగ్ అడిగిన ప్రశ్నకు నేపాల్ పీఎం ఓలి సమాధానమిస్తూ చారిత్రక వాస్తవాలు, ఆధారాల ఆధారంగా సరిహద్దు సమస్యను పరిష్కరిస్తామని పేర్కొన్నారు.‘చుచ్చే నక్సా’ (మ్యాప్)లో చేర్చిన దార్చులాలోని లిపులెక్, కాలాపానీ, లింపియాధుర భూమిని నేపాల్ ఎప్పుడు ఉపయోగించుకుంటుందని ఎంపీ సింగ్ ప్రశ్నించారు. దీనికి ఓలి స్పందిస్తూ ‘సుగౌలీ ఒప్పందం, వివిధ పటాలు, చారిత్రక వాస్తవాలు, ఆధారాల ఆధారంగా, నేపాల్ ప్రభుత్వం భారత ప్రభుత్వంతో చర్చలు జరిపి, దౌత్యం ద్వారా సరిహద్దు సమస్యను పరిష్కరించడానికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు. 1816 నాటి 'సుగౌలీ ఒప్పందం' ప్రకారం లిపులెక్, కాలాపానీ, లింపియాధుర ప్రాంతాలతో పాటు కాళీ నదికి తూర్పున ఉన్న భూమి అంతా నేపాల్‌కు చెందుతుంది.ప్రధాని కేపీ శర్మ ఓలి 275 మంది సభ్యుల ప్రతినిధుల సభలో 188 ఓట్లను సాధించి విశ్వాస పరీక్షలో విజయం సాధించారు. దీనికి ముందు ఓలీకి చెందిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్-యూనిఫైడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్ (సీపీఎన్-ఎంయూఎల్) నేపాల్ మాజీ ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండకు చెందిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్-మావోయిస్ట్ పార్టీకి మద్దతు ఉపసంహరించుకుంది. దీని తర్వాత పార్లమెంటులో జరిగిన విశ్వాస పరీక్షలో ఓడిపోవడంతో పుష్పకమల్ దహల్ ప్రచండ ప్రధాని పదవికి రాజీనామా చేశారు. -
జీ, ఇండస్ఇండ్ మధ్య సెటిల్మెంట్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం ఇండస్ఇండ్ బ్యాంకుతో అన్ని రకాల వివాదాలనూ పరిష్కరించుకున్నట్లు మీడియా దిగ్గజం జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్(జీల్) తాజాగా వెల్లడించింది. రెండు పార్టీలు ఇందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. జీల్‌కు వ్యతిరేకంగా చేపట్టిన దివాలా చర్యలపై ఫిబ్రవరి 24న జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ) నిలిపివేసింది. ఇండస్ఇండ్ బ్యాంక్ ఫిర్యాదు మేరకు స్టే ఇచ్చింది. ఈ నేపథ్యంలో రెండు పార్టీలు అన్ని రకాల వివాదాలకూ తెరదించే బాటలో సెటిల్మెంట్ కుదుర్చుకున్నట్లు జీల్ పేర్కొంది. కాగా.. రూ. 83 కోట్ల రుణ చెల్లింపులలో విఫలంకావడంతో జీల్‌పై దివాలా చర్యలు తీసుకోమని అభ్యర్థిస్తూ గతేడాది ఫిబ్రవరిలో ఇండస్ఇండ్.. ఎన్సీఎల్టీ ముంబై బెంచ్‌ను ఆశ్రయించింది. ఫిర్యాదును స్వీకరించిన ఎన్సీఎల్టీ.. సంజీవ్ కుమార్ జలాన్‌ను తాత్కాలిక రిజల్యూషన్ ప్రొఫెషనల్‌గా ఎంపిక చేసింది. (అచ్చం యాపిల్ స్మార్ట్‌వాచ్ అల్ట్రాలానే : ధర మాత్రం రూ. 1999లే!) తదుపరి ఎన్సీఎల్టీ ఆదేశాలను వ్యతిరేకిస్తూ జీల్ ఎండీ, సీఈవో పునీత్ గోయెంకా ఎన్సీఎల్ఏటీలో ఫిర్యాదు చేశారు. ఆపై ఎన్సీఎల్ఏటీ ఈ అంశాలపై స్టే ఇచ్చింది. ఎస్సెల్ గ్రూప్ మల్టీసిస్టమ్ ఆపరేటర్ సిటీ నెట్వర్క్స్ తీసుకున్న రుణాల వైఫల్యం దీనికి నేపథ్యంకాగా.. ఈ రుణాలకు జీల్ గ్యారంటర్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. (హయ్యస్ట్ సాలరీతో మైక్రోసాఫ్ట్‌లో జాబ్ కొట్టేసిన అవని మల్హోత్రా) -
వీడిన చిన్నారి ఇందు మృతి మిస్టరీ
-
AP: సత్వరమే ఫిర్యాదుల పరిష్కారం
సాక్షి, అమరావతి: ప్రభుత్వ వైద్య సేవల్లో ఏవైనా సమస్యలు తలెత్తితే ప్రజలు ఫిర్యాదు చేయడానికి వీలుగా ప్రవేశపెట్టిన 104 కాల్‌సెంటర్ చక్కగా పనిచేస్తోంది. సత్వరమే ఫిర్యాదులను పరిష్కరిస్తోంది. ఈ ఏడాది జూన్‌లో 104 కాల్ సెంటర్‌ను వైద్య శాఖ ఏర్పాటు చేయగా ఇప్పటివరకు 6,336 ఫిర్యాదులు అందాయి. ఇందులో 5,918 ఫిర్యాదులను నిర్దేశిత సమయంలోగా పరిష్కరించారు. మరో 235 ఫిర్యాదులు నిర్దేశిత సమయానికి కొంత ఆలస్యంగా పరిష్కారమయ్యాయి. కాల్సెంటర్లో 30 మంది సిబ్బంది 24/7 పనిచేస్తున్నారు. వీరు కాల్ సెంటర్‌కు వచ్చిన సమస్యలు, ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారు. చదవండి: ఏపీ బడిబాటలో యూపీ ఐదు సేవలపై ఫిర్యాదులకు.. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి వైద్య రంగంపై రాష్ట్ర ప్రభుత్వం రూ.వేల కోట్లు ఖర్చు చేస్తోంది. అయితే ఒకటి రెండు చోట్ల అధికారుల ఉదాసీన వైఖరి, క్షేత్ర స్థాయి సిబ్బంది, ఆస్పత్రుల యాజమాన్యాల నిర్లక్ష్యంతో ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వైద్య సేవలను పొందడంలో ఎక్కడైనా సమస్యలు, ఇబ్బందులు తలెత్తితే ప్రజలు ఫిర్యాదు చేయడానికి 104 ఫిర్యాదుల కాల్ సెంటర్‌ను అందుబాటులోకి తెచ్చారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ–ఆరోగ్య ఆసరా, 104 మొబైల్ మెడికల్ యూనిట్స్ (ఎంఎంయూ), 108 అంబులెన్స్, వైఎస్సార్ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్, మహాప్రస్థానం ఈ ఐదు సేవలపై ఫిర్యాదులు స్వీకరించడం ప్రారంభించారు. కాల్ సెంటర్‌కు వచ్చిన ఫిర్యాదులను తీవ్రతను బట్టి ఎంత సమయంలోగా పరిష్కరించాలి.. పరిష్కరించడానికి బాధ్యులు ఎవరనే దానిపై స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్వోపీ)ని రూపొందించారు. 104 కాల్ సెంటర్ సేవలను ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యం, ఇతర సేవలపై ఫిర్యాదుల స్వీకారం దిశగా విస్తరించనున్నారు. ఈ మేరకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఉన్నత స్థాయిలో పర్యవేక్షణ.. కాల్‌సెంటర్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదు, వాటి పరిష్కారంపై డ్యాష్‌బోర్డ్ ద్వారా ఉన్నత స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. కాల్‌సెంటర్‌కు వచ్చిన ఫిర్యాదులను ఎస్‌వోపీలో నిర్దేశిత సమయంలోగా పరిష్కరించడానికి కృషి చేస్తున్నామని వైఎస్సార్ ఆరోగ్యశ్రీ డిప్యూటీ ఈవో మధుసూదన్‌రెడ్డి తెలిపారు. ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లోని హెల్ప్ డెస్క్‌లు, 104 ఎంఎంయూ, 108 అంబులెన్స్, మహాప్రస్థానం వాహనాలపై ఫిర్యాదుల నంబర్‌ను ఏర్పాటు చేశామన్నారు. ప్రజలకు ఏవైనా సమస్యలు తలెత్తితే ఆ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫిర్యాదులు ఇలా చేయొచ్చు.. ►ఐదు సేవల్లో ఏదైనా సమస్యపై ఫిర్యాదు చేయాలనుకుంటే తొలుత 104కు కాల్ చేయాలి. ►కాల్ చేసిన వెంటనే వైద్య సేవలపై ఫిర్యాదుల కోసం 1, సమాచారం కోసం 2 నొక్కాలని ఐవీఆర్ఎస్ సూచిస్తుంది. ►అప్పుడు ఫిర్యాదులు చేయాల్సినవారు 1 నొక్కాలి. ►అనంతరం కాల్ సెంటర్లోని ఎగ్జిక్యూటివ్ ఫిర్యాదు స్వీకరిస్తారు. -
ఐటీ పోర్టల్ సమస్యల పరిష్కారంలో పురోగమనం
న్యూఢిల్లీ: కొత్త ఐటీఆర్ పోర్టల్‌లో పలు సాంకేతిక సమస్యలు క్రమంగా పరిష్కారమవుతున్నాయని ఆదాయ పన్ను శాఖ వెల్లడించింది. 2020–21 ఏడాదికి సంబంధించి ఇప్పటిదాకా 1.19 కోట్ల ఐటీఆర్‌లు దాఖలైనట్లు వివరించింది. సెపె్టంబర్ 7 వరకూ 8.83 కోట్ల మంది విశిష్ట ట్యాక్స్‌పేయర్లు పోర్టల్‌లో లాగిన్ అయ్యారని, సెప్టెంబర్‌లో రోజువారీ సగటు లాగిన్ల సంఖ్య 15.55 లక్షలుగా ఉంటోందని పేర్కొంది. కొత్త ఐటీ పోర్టల్ జూన్ 7న అందుబాటులోకి వచి్చనప్పట్నుంచి సాంకేతిక సమస్యలు వెన్నాడుతున్న సంగతి తెలిసిందే. -
ఇండిగో సంక్షోభానికి తెర : షేరు జూమ్
సాక్షి, ముంబై: బడ్జెట్ ధరల విమానయాన సంస్థ ఇండిగో ప్రమోటార్ల వివాదానికి తెరపడినట్టు తెలుస్తోంది. ప్రధాన విభేదాలు పరిష్కరించుకనే దిశగా ప్రమోటర్లు రాహుల్ భాటియా, రాకేష్ గంగ్వాల్ సుముఖంగా ఉన్నట్టు సమాచారం. వివాదాన్ని పరిష్కరించే దిశగా ఇరువురు కృషి చేస్తున్నట్టు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. దీనిపై సీఎన్బీసీతో మాట్లాడుతూ కొనసాగుతున్న బోర్డు చర్చలపై వ్యాఖ్యానించడానికి గంగ్వాల్ ఇష్టపడలేదు. అయితే ,తాము సమస్యలను పరిష్కరించగలమని ఆశిస్తున్నానన్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. జూలై 19, 20 తేదీలలో రెండు రోజుల జరిగిన బోర్డు సమావేశంలో ఈ మేరకు ఒక రాజీ కుదిరింది. ముఖ్యంగా గంగ్వాల్ ప్రధాన డిమాండ్ బోర్డు విస్తరణ. మరింతమంది ఇండిపెండెంట్ డైరెక్టర్లను చేర్చుకోవాలని, వీరిలోఒక మహిళా ఉండాలన్న గంగ్వాల్ డిమాండ్ ఇండిగో బోర్డు ఆమోదించింది. నలుగురు స్వతంత్ర డైరెక్టర్లతో సహా బోర్డును గరిష్టంగా పదిమందికి విస్తరించాలని నిర్ణయించింది. ఇందుకు సంస్థ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ సవరించనున్నారు. ఈ సవరణ రాబోయే వార్షిక సర్వసభ్య సమావేశంలో వాటాదారుల ఆమోదానికి లోబడి ఉండనుంది. మరోవైపు ఈ వార్తలు స్టాక్‌మార్కెట్ ఇన్వెస్టర్లను బాగా ఉత్సాహపర్చింది. బేర్ మారెట్లో ఇండిగో కౌంటర్లో కొనుగోళ్లకు మొగ్గు చూపారు. దీంతో 2 శాతం లాభాలతో ఇండిగో ఎట్రాక్టివ్‌గా ఉంది. కాగా ఇండిగో సంస్థలో కార్పోరేట్ పాలన నిబంధనలకు అనుగుణంగా జరగడం లేదని, ఇండిగో నుంచి భాటియా ఐజీఈ గ్రూప్‌లోని ఇతర యూనిట్లకు అక్రమ లావాదేవీలు జరుగుతున్నాయని గంగ్వాల్ సెబీకి జులై 9న లేఖ రాశారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్రమోదీ జోక్యం చేసుకోవాలని కూడా కోరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇండిగోలో గంగ్వాల్ 37 శాతం, భాటియా గ్రూప్‌నకు 38 శాతం వాటా ఉంది. -
సమస్యలు పరిష్కారమయ్యేవరకు పోరాటం
టీయూడబ్ల్యూజే(ఐజేయూ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాంనారాయణ ఖమ్మం మామిళ్లగూడెం : జర్నలిస్టుల సమస్యలు పరిష్కారమయ్యేవరకు పోరాటం విరమించేదిలేదని టీయూడబ్ల్యూజేæ(ఐజేయూ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు కట్టెకోల రాంనారాయణ స్పష్టం చేశారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి సోమవారం ఖమ్మం కలెక్టరేట్ ఎదుట ఉన్న ధర్నా చౌక్‌లో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు గడిచినా అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వలేదన్నారు. రెండేళ్లలో అనేకమంది కొత్త జర్నలిస్టులు వచ్చారని, అక్రిడిటేషన్ కార్డులు లేక వారు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. జిల్లాలో మెరుగైన వైద్యం అందక 18మంది జర్నలిస్టులు మరణించారని గుర్తుచేశారు. హెల్త్‌కార్డుల ద్వారా అన్ని కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. పోరాటం చేసి ఇళ్ల స్థలాల కేటాయింపు జీఓ సాధిస్తే, తెలంగాణ ప్రభుత్వం దాన్ని నిలుపుదల చేసిందని విమర్శించారు. డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. జిల్లా అధ్యక్షుడు ప్రసేన్ మాట్లాడుతూ ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలన్నారు. ధర్నాకు వివిధ రాజకీయ పక్షాలు, జర్నలిస్టు సంఘాలు సంఘీభావం తెలిపాయి. సీపీఎం జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్‌రావు, టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు ఐతగాని జనార్దన్, ఫొటోగ్రాఫర్స్, వీడియో గ్రాఫర్సు అసోసియేషన్, వివిధ ప్రజాసంఘాల నేతలు మద్దతు ప్రకటించారు. ధర్నా చౌక్ నుంచి జెడ్పీ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ డీఎస్ లోకేష్‌కుమార్‌కు వినతి పత్రం అందజేశారు. టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా కార్యదర్శి ఏనుగు వెంకటేశ్వరావు, నాయకులు సామినేని మురారి, తాళ్లూరి మురళీకృష్ణ, వింజం వెంకటనర్సయ్య, వనం వెంకటేశ్వర్లు, మాధవరావు, బట్టు శ్రీనివాస్, కల్లొజి శ్రీనివాసరావు, బీవీ రమణరెడ్డి, రాజు, సుధాకర్, నాగేశ్వరావు, రాంబాబు, సత్యనారాయణచారి, రవి తదితరులు పాల్గొన్నారు.