ఐటీఆర్ రిటర్న్స్ గడువుకు సంబంధించి చక్కర్లు కొడుతున్న ఫేక్ న్యూస్ ఆదాయపు పన్ను శాఖ క్లారిటీ ఇచ్చింది. ఐటీఆర్ ఈ-ఫైలింగ్ తేదీని ఆగస్టు 31 వరకు పొడిగించినట్లు ఓ వార్త క్లిప్పింగ్ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతోంది. ఈ వార్త ఫేక్ అని ఆదాయపు పన్ను శాఖ పేర్కొంది.
2023-24 ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్ ఫైల్ చేయడానికి చివరి తేదీ జూలై 31 అని స్పష్టం చేసింది. ఈ మేరకు ‘ఎక్స్’ ద్వారా వెల్లడించింది. “ఐటీఆర్ ఈ-ఫైలింగ్ తేదీ పొడిగింపునకు సంబంధించి సందేశ్ న్యూస్ పేరుతో న్యూస్ క్లిప్పింగ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నట్లు మాకు తెలిసింది. ఇది ఫేక్ న్యూస్. ఇన్‌కమ్ ట్యాక్స్ ఇండియా అధికారిక వెబ్‌సైట్/పోర్టల్ నుంచి వచ్చే అప్‌డేట్‌లను మాత్రమే అనుసరించాలని పన్ను చెల్లింపుదారులకు సూచిస్తున్నాం’’ అని వివరించింది.
అదే విధంగా ఆదాయపు పన్ను రీఫండ్‌లకు సంబంధించి చేస్తున్న స్కామ్ గురించి కూడా ఐటీ శాఖ హెచ్చరించింది. “తమ రీఫండ్ కోసం ఎదురు చూస్తున్న వారికి, ఒక కొత్త రకమైన స్కామ్ ఆందోళనలు లేవనెత్తింది. ట్యాక్స్ రీఫండ్ పేరుతో స్కామర్లు ఎస్‌ఎంఎస్‌లు, మెయిల్ పంపుతూ ట్యాక్స్ పేయర్స్ బ్యాంకు ఖాతాల్లోని సొమ్మును హరించడానికి ప్రయత్నిస్తున్నారు’’ అని అప్రమత్తం చేసింది.
కాగా 22 జూలై వరకు 4 కోట్ల ఐటీఆర్‌లు దాఖలైనట్లు ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఇది గత ఏడాది ఇదే కాలంలో దాఖలు చేసిన రిటర్న్‌లతో పోలిస్తే 8% ఎక్కువ. జూలై 16న రోజువారీ దాఖలు చేసిన ఐటీఆర్‌ల సంఖ్య 15 లక్షలు దాటింది. గడువు తేదీ సమీపిస్తుండటంతో రోజువారీ ఫైలింగ్స్ మరింత పెరుగుతాయని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment