న్యూఢిల్లీ: కొత్త ఆదాయపు పన్ను పోర్టల్ పనితీరు ఎలా ఉందన్న అంశంపై రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ ఇతర సీనియర్ అధికారులు ఇన్ఫోసిస్ మేనేజింగ్ డైరెక్టర్ సలీల్ పరేఖ్‌తో గురువారం ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. పోర్టల్ ద్వారా 2020–21 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకూ 3.5 కోట్ల మందికిపైగా పన్ను చెల్లింపుదారులు ఆదాయపు పన్ను రిటర్న్స్ (ఐటీఆర్) దాఖలు చేసినట్లు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ఇన్ఫోసిస్ అభివృద్ధి చెందిన పోర్టల్’ www.incometax.gov.in పనితీరులో తొలినాళ్లలో తీవ్ర అవాంతరాలు నెలకొనడం తీవ్ర విమర్శలకు దారితీసిన సంగతి తెలిసిందే. పోర్టల్ అభివృద్ధికి 2019లో ఇన్ఫోసిస్‌కు కేంద్ర రూ.4,242 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చింది. 2019 జనవరి నుంచి 2021 జూన్ మధ్య రూ.164.5 కోట్లు చెల్లించింది. కాగా, 2020– 21 ఐటీఆర్ ఫైలింగ్‌కు తుది గడువు డిసెంబర్ 31.
Comments
Please login to add a commentAdd a comment