జులై నాలుగున భూముల వేలం | Sahara properties to be auctioned at Rs 722 cr reserve price | Sakshi
Sakshi News home page

జులై నాలుగున భూముల వేలం

Published Thu, Jun 2 2016 2:56 PM | Last Updated on Mon, Sep 4 2017 1:30 AM

జులై నాలుగున భూముల  వేలం

జులై నాలుగున భూముల వేలం


న్యూఢిల్లీ:  ఆన్ లైన్ లో సహారా గ్రూప్‌ ఆస్తుల విక్రయానికి తొలి ముహూర్తం ఖరారైంది.  మార్కెట్ రెగ్యులేటరీ బోర్డ్  సెబీ నియమించిన హెచ్డీఎఫ్సీ రియాల్టీ ఎస్బీఐ క్యాప్  ఇ-వేలానికి రడీ అయ్యింది.  ఆర్ధిక నేరాల ఆరోపణలతో  సహారా గ్రూప్ అధినేత సుబ్రతో రాయ్ (67) కు చెందిన   వివిధ రాష్ట్రాల్లో ఉన్న  అయిదు ఆస్తులను  హెచ్‌డీఎఫ్‌సీ రియాల్టీ ఆధ్వర్యంలో  వేలానికి పెట్టారు.   సుమారు 722 కోట్ల విలువైన  ఈ ఆస్తులను  జులై నాలుగన వేలం వేయడానికి నిర్ణయించారు.  ఈ మేరకు   గురువారం ఒక నోటీసును  విడుదలైంది. జులై నాలుగు ఉదయం 11గం.  రాత్రి 12గ.లకు ఈ  ఇ-వేలం  నిర్వహించబడుతుందని పేర్కొంది.  ఆంధ్ర ప్రదేశ్, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్,  ఉత్తర ప్రదేశ్ లలోని వ్యవసాయ,  వ్యవసాయేతర  భూమిని  వేలం వేయనున్నారు.   ఆసక్తి వున్న వారు జూన్  10న  ఈ సదరు భూమునలు ఆస్తులను తనిఖీ  చేసుకోవచ్చిన తెలిపారు.

సుప్రీంకోర్టు   ఆదేశాల మేరకు  సెబీ సహారా ఆస్తుల వేలానికి   సిద్ధమైంది. సహారా అధిపతి  సుబ్రతో రాయ్ చెల్లించాల్సిన అప్పుల్లో భాగంగా, అన్యాక్రాంతంకాని, తనఖాలోలేని  సహారా ఆస్తులను వేలం వేయాల్సిందిగా  సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (సెబీ) కి  మాండేటరీ  ఆదేశాలను  సుప్రీం జారీ చేసింది.  ఈ  నేపథ్యంలో హెచ్‌డీఎఫ్‌సీ రియాల్టీ, ఎస్‌బీఐ క్యాపిటల్‌ మార్కెట్స్‌ (ఎస్‌బీఐ క్యాప్స్‌)కు  సెబీ నియమించింది.  దేశవ్యాప్తంగా 87సహారా ఆస్తులను ఆన్‌లైన్‌ ద్వారా వేలం వేసే ప్రక్రియను ఆ సంస్థలు ప్రారంభించింది.మరోవైపు తన అనుమతిలేనిదే మార్కెట్ విలువ కంటే 90శాతం కంటే తక్కువకు విక్రయించరాదని  సుప్రీంకోర్టు నిబంధన పెట్టిన  సంగతి తెలిసిందే.   

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement