వేలానికి 'సహారా' ఆస్తులు!
న్యూఢిల్లీః సహారా ఆస్తుల వేలానికి హెచ్ డీ ఎఫ్ సీ రియాల్టీ, ఎస్పీఐ క్యాపిటల్ మార్కెట్లు నిర్ణయించినట్లు స్టాక్ మార్కెట్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి) తెలిపింది. సహారా గ్రూప్ నకు చెందిన ఆస్తులనుంచి రిజర్వ్ ధర 1,192 కోట్లు వద్ద పదింటిని వేలానికి పెడుతున్నట్లు వెల్లడించింది. డిపాజిట్లు పేరుతో ప్రజల్ని నమ్మించి మోసం చేసిన సహారా గ్రూప్ వ్యవహరంలో ప్రస్తుత ఆస్తుల వేలంతో బాధితులకు త్వరలో న్యాయం జరిగేట్లు కనిపిస్తోంది.
హెచ్ డీ ఎఫ్ సీ రియాల్టీ, ఎస్పీఐ క్యాపిటల్ మార్కెట్లు సహారా గ్రూప్ లోని పది ఆస్తులను అమ్మకానికి పెట్టినట్లు సెబి తెలిపింది. హెచ్ డీ ఎఫ్ సీ రియాల్టీ, ఎస్ బీఐ క్యాపిటల్ మార్కెట్లు అమ్మకాలు ఈ ఆక్షన్ ద్వారా జూలై 4న ఉదయం 11 నుంచి 12 గంటల మధ్య, తిరిగి జూలై 7న ఉదయం 10.30 నుంచి 11.30 మధ్య వేలం నిర్వహించనున్నట్లు తెలిపింది. సహారా ఆస్తుల అమ్మకాలను చేపట్టి, బాధితులకు వెంటనే డిపాజిట్లు చెల్లించాలన్న సుప్రీంకోర్టు నిర్దేశాల మేరకు అమ్మకాలను ప్రారంభించేందుకు హెచ్ డీ ఎఫ్ సీ రియాల్టీ 721,96 కోట్ల రిజర్వ్ ధర వద్ద ఐదు ప్రాపర్టీలను ఆన్లైన్ లో అమ్మేందుకు నిర్ణయించినట్లు గురువారం ప్రచురించిన ఓ పబ్లిక్ నోటీస్ ద్వారా తెలుస్తోంది.
సహారా గ్రూప్ నకు సంబంధించిన ఆస్తులు ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఛత్తీస్ ఘఢ్, ఆంధ్రప్రదేశ్ ల లో ఉన్నాయి. వీటిలో వ్యవసాయ, వ్యవసాయేతర భూముల అమ్మకాలకోసం ఎస్ బీఐ క్యాపిటల్ మార్కెట్స్, సహారాకు సంబంధించిన ఐదు ప్రాపర్టీలను 470.04 కోట్ల రిజర్వ్ ధర వద్ద ఆన్టైన్ వేలం నిర్వహించనున్నట్లు జూన్ 10న ఓ ప్రత్యేక పబ్లిక్ నోటీసును ప్రచురించనున్నట్లు తెలిపింది. అలాగే గుజరాత్, ఉత్తర ప్రదేశ్ లోని ఆస్తుల పాటకోసం బిడ్డర్స్ జూన్ 8,9 తేదీలలో ఆన్లైన్ లో పరిశీలించవచ్చని తెలిపింది.