జీవం ఉనికితో పాటు భూమి ఇతర గ్రహాలకు చాలా భిన్నమైనది. ఇక్కడి వాతావరణం మారుతూ ఉంటుంది. కొన్ని లక్షల సంవత్సరాలలో వాతావరణం తీరుతెన్నులు సంపూర్ణంగా మారుతుంటాయి. ఇలాంటి మార్పులు ఇతర గ్రహాలలో చాలా అరుదుగా కనిపిస్తాయి. ఒకప్పుడు సహారా ఎడారిగా పచ్చగా ఉండేదనడానికి కొన్ని ఆధారాలు లభ్యమయ్యాయి. అయితే ఇలాంటి మార్పు ఎలా సంభవించిందో ఇప్పటివరకు శాస్త్రవేత్తలు తెలుసుకోలేకపోయారు. అయితే తాజా పరిశోధన దీనిపై కొంత క్లారిటీని తీసుకువచ్చింది.
ఎడారిలో నదులు, సరస్సులు
ఆఫ్రికాలోని సహారా ఎడారి 92 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన ప్రపంచంలోనే అతిపెద్ద ఎడారి. కొన్ని వేల సంవత్సరాలకు ఒకసారి ఇది ఇది ఆకుపచ్చగా మారుతుంది. అప్పుడు ఇక్కడ నీటిపై ఆధారపడే జంతువులు, సవన్నా మైదానాలు, నదులు, సరస్సులు కనిపిస్తాయి. నేచర్ కమ్యూనికేషన్స్‌లో ప్రచురితమైన అధ్యయనంలో సహారా ఎడారిలో ఎప్పుడు తడి కాలాలు సంభవిస్తాయి? దీనికి సూర్యుని చుట్టూ తిరిగే భూమి కక్ష్య ఎలాంటి పాత్రను పాత్ర పోషిస్తుందో వివరించారు.
భారీ పర్యావరణ మార్పులలో ఇదొకటి
సహారాలో మంచు యుగం ప్రభావం కూడా కనిపించింది. బ్రిస్టల్, హెల్సింకి విశ్వవిద్యాలయానికి చెందిన వాతావరణ శాస్త్రవేత్త ఎడ్వర్డ్ ఆర్మ్‌స్ట్రాంగ్ విడుదల చేసిన ఒక ప్రకటనలో.. సహారా ఎడారిని సవన్నాలేదా ఫారెస్ట్‌గా మార్చే ప్రక్రియ భూమిపై అత్యంత అద్భుతమైన పర్యావరణ మార్పులలో ఒకటని పేర్కొన్నారు. ఈ సంఘటనలు ఎప్పుడు, ఎలా జరిగాయో వెల్లడించడానికి ఆఫ్రికాలో క్లైమేట్ మోడలింగ్ అధ్యయనం జరిగిందన్నారు.
ఇటువంటి మార్పులు అనివార్యం
చరిత్రలో సహారా ఎడారి పచ్చగా మారుతుందనే వాదనకు మద్దతు ఇచ్చే అనేక ఆధారాలు అందుబాటులో ఉన్నాయి. ఈ అధ్యయనంలో ఈ పచ్చదన ప్రక్రియ సూర్యుని చుట్టూ భూమి కక్ష్యలోని ప్రీసెషన్ ప్రక్రియ ద్వారా నిర్ణయమవుతుందని సూచించారు. భూమి కొన్నిసార్లు దాని సొంత అక్షం మీద కదలినప్పుడు సంభవించే మార్పుల కారణంగా భూమిపై ఏర్పడే రుతువులు దాదాపు ప్రతి 21 వేల కాలచక్రాలకు ప్రభావితం అవుతాయి. ఫలితంగా వర్షపాత పరిస్ధితులు ఏర్పడి ఆఫ్రికా రుతుపవనాలు నియంత్రితమవుతాయి. ఫలితంగా సహారాలో పచ్చదనం వ్యాపిస్తుంది.
ప్రతి 21 వేల సంవత్సరాలకు..
ఉత్తర ఆఫ్రికాలో ప్రతి 21 వేల సంవత్సరాలకు విపరీత వాతావరణమార్పులు సంభవిస్తాయని, వీటిని భూమి తిరిగే కక్ష్య నిర్ణయిస్తుందనేది నిర్ధారించడానికి ఈ అధ్యయనంలో క్లిష్టమైన వాతావరణ నమూనాలను ఉపయోగించారు. ఈ మార్పు ఉత్తర అర్ధగోళంలో, పశ్చిమ ఆఫ్రికాలో రుతుపవన వ్యవస్థ శక్తిని మరింతగా పెంచుతుంది. ఫలితంగా సహారాలో వర్షపాతం విస్తృతంగా వ్యాపిస్తుంది. దీంతో ఎడారిలో పచ్చదనం కనిపిస్తుంది.
12 వేల ఏళ్ల తరువాత..
ఈ అధ్యయనంలో కనుగొన్న ఒక ప్రత్యేక విషయం ఏమిటంటే.. ఉత్తర ఆఫ్రికాలోని తేమతో కూడిన ప్రాంతాలు విపరీత వాతావరణమార్పులకు అంతగా గురికావు. ఎందుకంటే అక్కడి మంచు పలకలు అధిక అక్షాంశాలలో వ్యాపిస్తాయి. ఈ షీట్లు వాతావరణాన్ని చల్లబరుస్తాయి. ఫలితంగా రుతుపవనాల ప్రభావం కనిపించదు. సహారాలో సుమారు 5000 సంవత్సరాల క్రితం వరకు పచ్చదనం ఉండేది. ఇది భూమి కక్ష్య యొక్క వంపు 24.1 డిగ్రీలుగా మారిన సమయంలో జరిగింది. ప్రస్తుతం భూమి వంపు 23.5 డిగ్రీలలో ఉంది. అంటే ఇప్పుడు సహారాలో తదుపరి మార్పు సుమారు 12 వేల సంవత్సరాల తర్వాత కనిపిస్తుంది అప్పుడు మనం సహారా ఎడారి పచ్చగా మారడాన్ని చూడగలుగుతాం.
ఇది కూడా చదవండి: కెనడాలో చోరీ, అఫ్రికాలో ప్రత్యక్ష్యం.. ఈ కార్లు ఎలా వస్తున్నాయబ్బా?
Comments
Please login to add a commentAdd a comment