turned
-
బ్యాంకును కొల్లగొట్టిన పిల్లలు!
పిల్లలకు ఆటలంటే ఎంతో ఇష్టమనే సంగతి మనందరికీ తెలిసిందే. కొందరు పిల్లలు ఇండోర్ గేమ్స్‌ను ఇష్టపడతారు. మరికొందరు పిల్లలు బయట ఆడుకుంటారు. అయితే టైమ్ పాస్ కోసం బ్యాంకును కొల్లగొట్టిన చిన్నారులు కూడా ఉన్నారు. ఈ ఆసక్తికర ఉదంతం ఎప్పుడు ఎక్కడ జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. నకిలీ పిస్తోళ్లతో దొంగ, పోలీసు ఆట ఆడే వయసు కలిగిన ముగ్గురు చిన్నారులు బ్యాంకు దోపిడీకి పాల్పడ్డారు. ఈ పిల్లల వయస్సు కేవలం 11, 12, 16 ఏళ్లేనని తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. అమెరికాలోని టెక్సాస్‌లో ఈ వింత కేసు వెలుగు చూసింది. ఆడిటీ సెంట్రల్ నివేదిక ప్రకారం ముగ్గురు బాలులు కలిసి టెక్సాస్‌లోని హ్యూస్టన్‌లోని స్థానిక బ్యాంకును దోచుకున్నారు. మార్చి 14న గ్రీన్‌పాయింట్ ప్రాంతంలోని వెల్స్ ఫార్గో బ్యాంక్‌కు వెళ్లి క్యాషియర్‌కు బెదిరింపు నోట్ ఇచ్చారని పోలీసులు తెలిపారు. తరువాత వారు బ్యాంకులోని డబ్బు కొల్లగొట్టి, అక్కడి నుంచి పారిపోయారు. పోలీసులు సీసీటీవీని పరిశీలించగా చిన్నారులు బ్యాంకు దోపిడీకి పాల్పడ్డారని తెలిసి ఆశ్చర్యపోయారు. రిటైర్డ్ జువెనైల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ జడ్జి మైక్ ష్నైడర్ మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి కేసును చూడటం ఇదే మొదటిసారన్నారు. హారిస్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం చిన్నారులు దోపిడీకి పాల్పడిన సమయంలో క్యాషియర్‌కు తుపాకీ చూపించలేదు. అయితే వారు తమ వద్ద ఆయుధం ఉందని పేర్కొంటూ క్యాషియర్‌కు బెదిరింపు నోట్ ఇచ్చారు. తరువాత డబ్బు తీసుకుని అక్కడి నుంచి ఉడాయించారు. ఈ సంఘటన తర్వాత ఈ ముగ్గురు దొంగల(పిల్లల) చిత్రాలతో కూడిన పోస్టర్లను పోలీసులు వివిధ ప్రదేశాలలో అతికించారు. ఈ పోస్టర్లను చూసిన ఆ చిన్నారుల తల్లిదండ్రులు వారిని పోలీసులకు అప్పగించారు. -
సహారా ఎడారిలో పచ్చదనం? వేల ఏళ్లకు కనిపించే దృశ్యం?
జీవం ఉనికితో పాటు భూమి ఇతర గ్రహాలకు చాలా భిన్నమైనది. ఇక్కడి వాతావరణం మారుతూ ఉంటుంది. కొన్ని లక్షల సంవత్సరాలలో వాతావరణం తీరుతెన్నులు సంపూర్ణంగా మారుతుంటాయి. ఇలాంటి మార్పులు ఇతర గ్రహాలలో చాలా అరుదుగా కనిపిస్తాయి. ఒకప్పుడు సహారా ఎడారిగా పచ్చగా ఉండేదనడానికి కొన్ని ఆధారాలు లభ్యమయ్యాయి. అయితే ఇలాంటి మార్పు ఎలా సంభవించిందో ఇప్పటివరకు శాస్త్రవేత్తలు తెలుసుకోలేకపోయారు. అయితే తాజా పరిశోధన దీనిపై కొంత క్లారిటీని తీసుకువచ్చింది. ఎడారిలో నదులు, సరస్సులు ఆఫ్రికాలోని సహారా ఎడారి 92 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన ప్రపంచంలోనే అతిపెద్ద ఎడారి. కొన్ని వేల సంవత్సరాలకు ఒకసారి ఇది ఇది ఆకుపచ్చగా మారుతుంది. అప్పుడు ఇక్కడ నీటిపై ఆధారపడే జంతువులు, సవన్నా మైదానాలు, నదులు, సరస్సులు కనిపిస్తాయి. నేచర్ కమ్యూనికేషన్స్‌లో ప్రచురితమైన అధ్యయనంలో సహారా ఎడారిలో ఎప్పుడు తడి కాలాలు సంభవిస్తాయి? దీనికి సూర్యుని చుట్టూ తిరిగే భూమి కక్ష్య ఎలాంటి పాత్రను పాత్ర పోషిస్తుందో వివరించారు. భారీ పర్యావరణ మార్పులలో ఇదొకటి సహారాలో మంచు యుగం ప్రభావం కూడా కనిపించింది. బ్రిస్టల్, హెల్సింకి విశ్వవిద్యాలయానికి చెందిన వాతావరణ శాస్త్రవేత్త ఎడ్వర్డ్ ఆర్మ్‌స్ట్రాంగ్ విడుదల చేసిన ఒక ప్రకటనలో.. సహారా ఎడారిని సవన్నాలేదా ఫారెస్ట్‌గా మార్చే ప్రక్రియ భూమిపై అత్యంత అద్భుతమైన పర్యావరణ మార్పులలో ఒకటని పేర్కొన్నారు. ఈ సంఘటనలు ఎప్పుడు, ఎలా జరిగాయో వెల్లడించడానికి ఆఫ్రికాలో క్లైమేట్ మోడలింగ్ అధ్యయనం జరిగిందన్నారు. ఇటువంటి మార్పులు అనివార్యం చరిత్రలో సహారా ఎడారి పచ్చగా మారుతుందనే వాదనకు మద్దతు ఇచ్చే అనేక ఆధారాలు అందుబాటులో ఉన్నాయి. ఈ అధ్యయనంలో ఈ పచ్చదన ప్రక్రియ సూర్యుని చుట్టూ భూమి కక్ష్యలోని ప్రీసెషన్ ప్రక్రియ ద్వారా నిర్ణయమవుతుందని సూచించారు. భూమి కొన్నిసార్లు దాని సొంత అక్షం మీద కదలినప్పుడు సంభవించే మార్పుల కారణంగా భూమిపై ఏర్పడే రుతువులు దాదాపు ప్రతి 21 వేల కాలచక్రాలకు ప్రభావితం అవుతాయి. ఫలితంగా వర్షపాత పరిస్ధితులు ఏర్పడి ఆఫ్రికా రుతుపవనాలు నియంత్రితమవుతాయి. ఫలితంగా సహారాలో పచ్చదనం వ్యాపిస్తుంది. ప్రతి 21 వేల సంవత్సరాలకు.. ఉత్తర ఆఫ్రికాలో ప్రతి 21 వేల సంవత్సరాలకు విపరీత వాతావరణమార్పులు సంభవిస్తాయని, వీటిని భూమి తిరిగే కక్ష్య నిర్ణయిస్తుందనేది నిర్ధారించడానికి ఈ అధ్యయనంలో క్లిష్టమైన వాతావరణ నమూనాలను ఉపయోగించారు. ఈ మార్పు ఉత్తర అర్ధగోళంలో, పశ్చిమ ఆఫ్రికాలో రుతుపవన వ్యవస్థ శక్తిని మరింతగా పెంచుతుంది. ఫలితంగా సహారాలో వర్షపాతం విస్తృతంగా వ్యాపిస్తుంది. దీంతో ఎడారిలో పచ్చదనం కనిపిస్తుంది. 12 వేల ఏళ్ల తరువాత.. ఈ అధ్యయనంలో కనుగొన్న ఒక ప్రత్యేక విషయం ఏమిటంటే.. ఉత్తర ఆఫ్రికాలోని తేమతో కూడిన ప్రాంతాలు విపరీత వాతావరణమార్పులకు అంతగా గురికావు. ఎందుకంటే అక్కడి మంచు పలకలు అధిక అక్షాంశాలలో వ్యాపిస్తాయి. ఈ షీట్లు వాతావరణాన్ని చల్లబరుస్తాయి. ఫలితంగా రుతుపవనాల ప్రభావం కనిపించదు. సహారాలో సుమారు 5000 సంవత్సరాల క్రితం వరకు పచ్చదనం ఉండేది. ఇది భూమి కక్ష్య యొక్క వంపు 24.1 డిగ్రీలుగా మారిన సమయంలో జరిగింది. ప్రస్తుతం భూమి వంపు 23.5 డిగ్రీలలో ఉంది. అంటే ఇప్పుడు సహారాలో తదుపరి మార్పు సుమారు 12 వేల సంవత్సరాల తర్వాత కనిపిస్తుంది అప్పుడు మనం సహారా ఎడారి పచ్చగా మారడాన్ని చూడగలుగుతాం. ఇది కూడా చదవండి: కెనడాలో చోరీ, అఫ్రికాలో ప్రత్యక్ష్యం.. ఈ కార్లు ఎలా వస్తున్నాయబ్బా? -
‘హార్మోనియం’ను నెహ్రూ, ఠాగూర్ ఎందుకు వ్యతిరేకించారు? రేడియోలో 3 దశాబ్దాల నిషేధం వెనుక..
హార్మోనియం.. భారతదేశంలో ప్రసిద్ధి చెందిన సంగీత వాయిద్య పరికరం. ఇది నిజంగా భారత దేశానికి చెందినదేనా? అనే సందేహం చాలామందిలో దశాబ్దాలుగా ఉంది. అయితే కొందరు ఇది భారతీయులదేనని గాఢంగా నమ్ముతుంటారు. 1900ల ప్రారంభంలో స్వాతంత్ర్య పోరాటం ఊపందుకున్నప్పుడు భారతీయ శాస్త్రీయ సంగీతానికి హార్మోనియం అనువైనదా కాదా అనే చర్చ జరిగింది. మహాత్మా గాంధీ చేపట్టిన స్వదేశీ ఉద్యమంలో పలువురు హార్మోనియం భారతీయులది కాదంటూ వ్యతిరేకించారు. 1940లో ఆల్ ఇండియా రేడియో పాశ్చాత్య సంగీత విభాగ అధిపతి అందించిన కథనానికి స్పందనగా దాదాపు మూడు దశాబ్దాలపాటు ‘ఆకాశవాణి’లో హార్మోనియం నిషేధించారు. ఈ నిషేధం 1971లో పాక్షికంగా ఎత్తివేశారు. అనంతర కాలంలో ఈ నిషేధాన్ని పూర్తిగా తొలగించారు. ఫ్రెంచ్ ఆవిష్కర్త హార్మోనియం పేటెంట్ హార్మోనియం 1700లలో ఐరోపాలో ఆవిర్భవించింది. అనేక మార్పులకు లోనైన తర్వాత ఇది భారతదేశానికి చేరువయ్యింది. దీని మొదటి నమూనాను కోపెన్హాగన్ విశ్వవిద్యాలయానికి చెందిన ఫిజియాలజీ ప్రొఫెసర్ క్రిస్టియన్ గాట్లీబ్ క్రాట్జెన్స్టెయిన్ రూపొందించారని చెబుతారు. దీని తరువాత హార్మోనియంలో అనేక మార్పులు వచ్చాయి. 1842లో అలెగ్జాండ్రే డెబెన్ అనే ఫ్రెంచ్ ఆవిష్కర్త హార్మోనియం డిజైన్‌కు పేటెంట్ పొంది, దానికి 'హార్మోనియం' అని పేరు పెట్టారు. హార్మోనియంను 19వ శతాబ్దం చివరలో పాశ్చాత్య వ్యాపారులు, మిషనరీలు భారతదేశానికి తీసుకువచ్చారు. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ వెబ్సైట్ ప్రకారం భారతీయ చేతి వాయిద్యంగా మారిన హార్మోనియంను 1875లో కోల్‌కతాలో ద్వారకానాథ్ ఘోష్ రూపొందించారు. అన్ని రాగాలను సరిగ్గా పలికించలేదని.. 1915 నాటికి భారతదేశం హార్మోనియంల రూపకల్పనలో అగ్రగామిగా మారింది. అలాగే ఈ వాయిద్యం భారతీయ సంగీతంలో అంతర్భాగంగా మారింది. హార్మోనియంలో 12 స్వరాలు, 22 శృతులను పలికించవచ్చని చెబుతారు. అయితే భారతీయ శాస్త్రీయ సంగీత విద్వాంసులలోని ఒక విభాగం హార్మోనియం అన్ని రాగాలను సరిగ్గా పలికించలేదని, అన్ని శాస్త్రీయ స్వరాలను పరిపూర్ణంగా పలికించే సామర్థ్యాన్ని కలిగి లేదని ఎత్తి చూపింది. దీని గురించి ప్రఖ్యాత హార్మోనియం ప్లేయర్ రవీంద్ర కటోటి మాట్లాడుతూ పరిమితి అనేది విశ్వవ్యాప్త వాస్తవం. ప్రతి స్వరానికి, ప్రతి పరికరానికి దాని పరిమితులు ఉంటాయన్నారు. ఠాగూర్ వాదన ఇదే.. హార్మోనియం భారతీయమా కాదా, ఇది భారతీయ సంగీతానికి సరిపోతుందా లేదా అనే చర్చ నడుస్తున్నప్పుడు బహుముఖ ప్రజ్ఞాశాలి, నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ వాయిద్య పరికరం భారతీయతకు సరిపోదన్నారు. ఇది గమకాలను పలికించలేదన్నారు. ఈ నేపధ్యంలోనే ఆకాశవాణిలో హార్మోనియంను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఒక సాహితీవేత్త కోల్‌కతాలోని ఆల్ ఇండియా రేడియోకి లేఖ రాశారు. ఆల్ ఇండియా రేడియో పాశ్చాత్య సంగీత విభాగం అధిపతి జాన్ ఫోల్డ్స్ భారతీయ శాస్త్రీయ సంగీతానికి ఎంతో అవసరమైన మైక్రోటోన్ల విషయంలో హార్మోనియం మ్యూట్‌గా ఉందని తన కథనాలలో వివరించారు. కంట్రోలర్ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్గా ఉన్న లియోనెల్ ఫీల్డెన్.. ఫోల్డ్స్ వాదనతో ఏకీభవించారు. దీంతో 1940, మార్చి 1న ఆల్ ఇండియా రేడియో హార్మోనియంను నిషేధించింది. స్వాతంత్య్రానంతరం కూడా.. సంగీత విద్వాంసుడు అభిక్ మజుందార్ ఈ అంశం గురించి మాట్లాడుతూ.. కళా చరిత్రకారుడు ఆనంద్ కుమారస్వామి, స్వాతంత్ర్య సమరయోధునిగా జవహర్లాల్ నెహ్రూ కూడా హార్మోనియం భారతీయతకు చెందినది కాదన్నారు. స్వాతంత్య్రానంతరం కూడా ఈ వాయిద్య పరికరంపై నిషేధం కొనసాగిందని, సమాచార ప్రసార శాఖ మంత్రి బివి కేస్కర్, విద్వాంసుడైన గాయకుడు విఎన్ భత్ఖండే విద్యార్థి దీనికి కారణమని తెలిపారు. ఇది కూడా చదవండి: మూత్రం ఆపుకోలేని పిల్లాడిపై పోలీసుల ప్రతాపం.. జైలుకు తరలించి.. -
టీవి స్టార్‌గా పేరు తెచ్చుకుంటూనే.. ఎంట్రపెన్యూర్‌గా రాణిస్తున్న ఆష్క
నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (ఎన్ఎస్డీ) స్టూడెంట్ అయిన ఆష్క గొరాదియకు బాలీవుడ్లో బ్రేక్ రాలేదు. అయితే ఆ అసంతృప్తి ఆమె మాటల్లో ఎప్పుడూ తొంగి చూసేది కాదు. ప్రతి అడుగులో ఆత్మవిశ్వాసం కనిపించేది. ఆ ఆత్మవిశ్వాసమే ఆమెను వ్యాపార రంగం వైపు నడిపించింది. ‘రెనీ కాస్మెటిక్స్’తో ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఘనవిజయాన్ని సాధించింది.. బాల నటిగా కెరీర్ మొదలు పెట్టింది ఆష్క గొరాదియ. తన ప్రయాణంలో రకరకాల సవాళ్లు, కష్టాలు ఎదురైనా వెనక్కి తగ్గలేదు. వాటివల్ల పోరాటం ఎలా చేయాలో తనకు తెలిసింది. హిందీ సినిమాల్లో నటిస్తున్న కాలంలోనే హాలీవుడ్ కలలతో అమెరికా వెళ్లింది. అక్కడ పెద్దగా అవకాశాలు రాకపోవడంతో తిరిగి ఇండియాకు వచ్చింది. బాలీవుడ్ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసి, ఎన్నో టీవి సీరియల్స్‌లో నటించి ‘టీవి స్టార్’గా పేరు తెచ్చుకున్న ఆష్క ఎంటర్‌ప్రెన్యూర్‌గా ప్రయాణం మొదలుపెట్టాలనుకుంది. అయితే అది అంత తేలిక కాదనేది తనకు తెలియని విషయమేమీ కాదు. తన కళ్ల ముందే ఎన్నో అనుభవాలు ఉన్నాయి. అయితే అవేమీ తనకు అడ్డు కాలేదు. మొదటి అడుగుగా సొంతంగా ప్రొడక్షన్ కంపెనీ మొదలుపెట్టిన ఆష్క ఎన్నో సక్సెస్ఫుల్ టీవీ షోలు చేసింది. ఆ తరువాత ట్రావెలర్స్ కోసం ఒక మొబైల్ యాప్ వెంచర్‌ను లాంచ్ చేసింది. ఆ తరువాత స్నేహితులతో కలిసి ప్రారంభించిన ‘రెనీ కాస్మెటిక్స్’ ఆమెను స్టార్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా మార్చింది.ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఆష్క ఘనవిజయం ఎంతోమంది ఔత్సాహికులకు స్ఫూర్తి ఇచ్చింది. ఎంటర్‌ప్రెన్యూర్‌గా రాణించాలనుకునే వారికి ఆమె చెప్పిన కొన్ని సలహాలు.. కల కనాలి... ముందుకదలాలి: ఒకరి నుంచి స్ఫూర్తి పొందిన తరువాత కల శ్రీకారం చుట్టుకుంటుంది. అయితే అది సాకారం కావాలంటే ఆచరణలోకి రావాలి. పనికి సంబంధించి స్థాయిని పెంచుకుంటూ పోవాలి. అంకింతభావం ప్లస్ కష్టం: నటన అయినా వ్యాపారమైనా సక్సెస్ కావాలంటే అంకితభావంతో పాటు బాగా కష్టపడాలి. ఒకవేళ విజయం సాధించకపోయినా మనం కన్న కలకు దూరం కావద్దు. ఓటమి నేర్పే పాఠాలతో ముందుకు వెళ్లాలి. సానుకూల ఆలోచనలకు ప్రాధాన్యత ఇవ్వాలి. రిస్క్‌కు భయపడితే రిస్క్: ఈతకొట్టడానికి నీళ్లలోకి దిగిన తరువాత నీళ్లకు భయపడితే ఎలా! వ్యాపారం అన్నాక రిస్క్ ఉంటుంది. అంతమాత్రాన వెనక్కి తగ్గనవసరం లేదు. మూస ఆలోచనలకు భిన్నంగా కొత్తగా ఆలోచిస్తే విజయం మన చెంతకు నడిచొస్తుంది. కోవిడ్ కల్లోల సమయంలో ఎన్నో వ్యాపారాలలాగే మా వ్యాపారం కూడా దెబ్బతింది. ‘ఇక నీకు నటనే దిక్కు’ అనేవాళ్లు. అయితే నేనెప్పుడూ నమ్మకం కోల్పోలేదు. మంచిరోజులు వస్తాయని గట్టిగా నమ్మాను. అది నిజమైంది. నెట్వర్క్: నటనకైనా, వ్యాపారానికైనా పదిమందితో పరిచయం ముఖ్యం. ఈవెంట్స్, వర్క్‌షాప్‌లకు హాజరుకావడంతో పాటు ఆన్లైన్ కమ్యూనిటీలతో టచ్‌లో ఉండాలి. సామాజిక సంబంధాల ద్వారా కొత్త విషయాలు తెలుస్తాయి. ఆలోచన పరిధి విస్తరిస్తుంది. ముందుకు వెళ్లడానికి కావాల్సిన ధైర్యం లభిస్తుంది. యుఎస్పీ: ‘మా బ్రాండ్ ఇది’ అని మాత్రమే కాదు ‘మా యూఎస్పీ ఇది’ అని గర్వంగా చెప్పుకోగలగాలి. మా బ్రాండ్ విషయానికి వస్తే హై–క్వాలిటీ, గతంలో ఎప్పుడూ చూడని ప్యాకేజీ, పాకెట్–ఫ్రెండ్లీ ప్రైస్ అనేవి మా యూఎస్పీ. మార్కెట్ ప్లేస్‌లకు వెళుతూ ఎప్పటికప్పుడు ట్రెండ్స్ తెలుసుకోవాలి. ఆష్కకు నటన, యోగా, పోల్ డ్యాన్స్, ట్రావెల్ అంటే ఇష్టం. ఇక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది వాటికంటే రెండు రెట్లు ఎక్కువ ఇష్టమైనది. సినిమాలు, టీవీ సీరియల్స్‌లో ఆష్క‘బిజినెస్ ఉమన్’ పాత్ర ధరించలేదు. అయితే నిజ జీవితంలో మాత్రం ఆమె ‘బిజినెస్ ఉమన్’గా అద్భుత విజయాన్ని సాధించింది. ‘ది బాస్ లేడీ’ అని స్నేహితులతో పిలిపించుకుంటోంది. (చదవండి: పద్నాలుగేళ్లకే ఎలన్ మస్క్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా..) -
రైతుగా మారిన ఎర్రబెల్లి దయాకర్ రావు
-
పిల్లలకు ‘ఆల్ ద బెస్ట్’ చెప్పిన ఎమ్మెల్యే రోజా
-
ట్రాక్టర్ బోల్తా: 10 మందికి గాయాలు
కర్లపాలెం: ట్రాక్టర్ బోల్తాపడి పది మందికి గాయాలైన సంఘటన కర్లపాలెం మండలం నక్కలవానిపాలెం అడ్డరోడ్డు వద్ద గురువారం చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... గణపవరం పంచాయతీ చినపులుగువారిపాలెం గ్రామానికి చెందిన మహిళలు ట్రాక్టర్‌పై చెరుకుపల్లి మండలం రాంబొట్లవారిపాలెంలో జరిగిన విందు కార్యక్రమానికి హాజరై తిరిగి చినపులుగువారిపాలెం వస్తున్నారు. వేగంగా వస్తున్న ట్రాక్టర్ పెదగొల్లపాలెం పంచాయతీ నక్కలవానిపాలెం అడ్డరోడ్డు వద్దకు రాగానే అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. ట్రాక్టర్ ట్రక్కు బోల్తాపడటంతో అందులో ప్రయాణిస్తున్న వారిలో పది మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో ముగ్గిరికి మెరుగైన వైద్య సేవలందించేందుకు పొన్నూరు తరలించగా మిగిలిన ఏడుగురిని కర్లపాలెంలోని ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. -
మిషన్ గులాభీగా మారిన మిషన్ కాకతీయ
-
7 జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు ఏర్పాట్లు
-
బడిని బార్లా మార్చిన గురుడు