ట్రాక్టర్ బోల్తా: 10 మందికి గాయాలు
కర్లపాలెం: ట్రాక్టర్ బోల్తాపడి పది మందికి గాయాలైన సంఘటన కర్లపాలెం మండలం నక్కలవానిపాలెం అడ్డరోడ్డు వద్ద గురువారం చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... గణపవరం పంచాయతీ చినపులుగువారిపాలెం గ్రామానికి చెందిన మహిళలు ట్రాక్టర్‌పై చెరుకుపల్లి మండలం రాంబొట్లవారిపాలెంలో జరిగిన విందు కార్యక్రమానికి హాజరై తిరిగి చినపులుగువారిపాలెం వస్తున్నారు. వేగంగా వస్తున్న ట్రాక్టర్ పెదగొల్లపాలెం పంచాయతీ నక్కలవానిపాలెం అడ్డరోడ్డు వద్దకు రాగానే అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. ట్రాక్టర్ ట్రక్కు బోల్తాపడటంతో అందులో ప్రయాణిస్తున్న వారిలో పది మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో ముగ్గిరికి మెరుగైన వైద్య సేవలందించేందుకు పొన్నూరు తరలించగా మిగిలిన ఏడుగురిని కర్లపాలెంలోని ప్రైవేటు వైద్యశాలకు తరలించారు.