ట్రాక్టర్‌ బోల్తా.. 20 మందికి గాయాలు | tractor accident 20 injured | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్‌ బోల్తా.. 20 మందికి గాయాలు

Published Mon, May 8 2017 12:08 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

tractor accident 20 injured

తవిసికొండ (బేతంచెర్ల) : మండల పరిధిలోని తవిసికొండ గ్రామ సమీపాన మలుపు వద్ద ట్రాక్టర్‌ బోల్తా పడి.. 20 మందికి గాయాలయ్యాయి. సి.బెలగళ్‌ మండలం పొలకల్లు గ్రామానికి చెందిన వ్యక్తులు మద్దిలేటి స్వామి దర్శనార్థం ట్రాక్టర్‌లో వచ్చారు. ఆదివారం..తిరుగు ప్రయాణంలో సుమారు 60 మంది ట్రాక్టర్‌లో తవిసికొండ గ్రామం మీదుగా వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. వీరకుమార్, మద్దమ్మ, వెంకటేష్, బాలమద్ది, లక్ష్మీదేవి, వంశీ, చంద్రమ్మ, జోగన్నలతోపాటు మరో 12 మందికి  తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న  బేతంచెర్ల, బనగానపల్లె 108 సిబ్బంది రఫి, కిరణ్‌లు బాధితులను చికిత్స నిమిత్తం వెల్దుర్తి ప్రభుత్వ హాస్సిటల్‌కు తరలించారు. సీఐ కంబగిరి రాముడు సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement