explain
-
బ్రెడ్‌ని ఫ్రిజ్‌లో పెడుతున్నారా? వైద్యులు ఏం చెబుతున్నారంటే?
బ్రెడ్‌ని మిగతా ఆహార పదార్థాల్లానే ఫ్రిజ్‌లో పెడుతుంటారు చాలమంది. అయితే ఇలా ఫ్రిజ్‌లో పెట్టిన బ్రెడ్‌ని ఆహారంగా తీసుకోవడం మంచిదంటున్నారు వైద్యులు. పైగా ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిందటూ చాలా షాకింగ్ విషయాలు చెబుతున్నారు. ఎలా ప్రిజ్‌లో ఉంచిన నిల్వ బ్రెడ్ మంచిది? ఎలా ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది? నిజానికి బ్రెడ్ వంటివి ఎక్కువ తీసుకోవద్దని డాక్టర్లు చెబుతుంటారు. వాటిలో గ్లూకోజ్ కంటెంట్ ఎక్కువ ఉంటుందని, పైగా బేక్ చేసే బేకరీ పదార్థాలని అస్సలు వద్దనే చెబుతారు. అలాంటిది ప్రిజ్‌లో నిల్వ ఉంచిన బ్రెడ్‌ని మాత్రం తీసుకుంటే మంచిదని వైద్యులు ఎలా చెబుతున్నారు?. పైగా పరిశోధనలో ఇలాంటి బ్రెడ్ తీసుకున్న వారిలో మంచి ఫలితం కనిపించిందంటూ ఆశ్చర్యకర విషయాలు చెబుతున్నారు పోషకాహార నిపుణుడు డాక్టర్ అమీ షా. ఎందువల్ల మంచిందంటే..? తాజా వైట్ బ్రెడ్ కంటే నిల్వ ఉంచిన బ్రెడ్ మంచిది. అదికూడా ఫ్రిజ్‌లో నిల్వ ఉన్నది మంచిదని అంటున్నారు. ఇలా ఫ్రీజర్‌లో నిల్వ ఉండటం వల్ల గ్లైసమిక్ ఇండిక్స్ తగ్గి ఆరోగ్యకరమైన స్టార్చ్‌గా మారుతుందని చెబుతున్నారు. ఇలా నిల్వ ఉండటం వల్ల శరీరానికి అవసరమైన గట్ బ్యాక్టీరియా దీని వల్ల లభిస్తుందని చెబుతున్నారు. ఈ విషయమై 2008లో జరిపిన పరిశోధనలో చాలా ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయని షా చెప్పారు. ఈ మేరకు ఆక్స్ఫర్డ్ బ్రూక్స్ యూనివర్సిటీ పరిశోధన బృందం దీని గురించి సుమారు 22 నుంచి 59 ఏళ్ల వయస్సు ఉన్న పదిమంది పురుషులు, మహిళలపై అధ్యయనం చేసినట్లు తెలిపారు. వారికి ఇంట్లో తయారు చేసిన బ్రెడ్, మార్కెట్లో దొరికే బ్రెడ్లను వేర్వేరుగా నిల్వ చేసి ఇచ్చారు. కొందరికి తాజా బ్రెడ్ ఇవ్వగా, మరికొందరికి నిల్వ చేసింది ఇచ్చారు. మిగతా వారికి నిల్వ ఉంచి, రోస్ట్ చేసింది ఇచ్చారు. తాజాగా ఇంట్లో తయారుచేసిన బ్రెడ్‌తో పోలిస్తే, బ్రెడ్‌ను నిల్వ చేసి రోస్ట్ చేసినప్పుడూ బ్లడ్‌లో గ్లూకోజ్ స్థాయిలు గణనీయంగా తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అదే విధంగా మార్కెట్లో కొన్న వైట్ బ్రెడ్‌తో పోలిస్తే బ్రెడ్‌ని రోస్ట్ చేసిందే బెటర్ అని తేలింది. అలాగే ఈ బ్రెడ్‌ని కూడా నిల్వ చేసి రోస్ట్ చేసి తీసుకుంటే గ్లూకోజ్ లెవెల్స్ తక్కువగా ఉంటాయని చెప్పారు. దీన్ని ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యానికి కూడా మంచిదని అన్నారు. ఇలా ఈ నిల్వ ఉండటం వల్ల వాటిలో కిణ్వన ప్రక్రియ జరిగి శరీరానికి అవసరమయ్యే మంచి బ్యాక్టీరియా అంది షుగర్ సంబంధిత సమస్యలు ఉత్పన్నం కాకుండా చేస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అయితే ఇంకెందుకు ఆలస్యం వైట్ బ్రెడ్‌ని తినేందుకు జంకకండి. చక్కగా తెచ్చుకుని ఒక రాత్రి ఫ్రిజ్‌లో పెట్టి రోస్ట్ చేసుకుని హాయిగా ఆస్వాదించండి. View this post on Instagram A post shared by Dr. Amy Shah (@fastingmd) (చదవండి: మసాలా దినుసులు ఘాటు పోకూడదంటే..ఇలా స్టోర్ చేయండి!) -
ఫుడ్ అలెర్జీ ఎందుకు వస్తుందో తెలుసా?
ఇంతవరకు ఎన్నో రకాల అలెర్జీలు చూశాం. కొన్ని రకాల ఎలర్జీలు చూస్తే మరీ ఇంత ఘోరంగా ఉంటాయా! అని ఆశ్చర్యపోతారు. అవి ఎంత జుగుప్సకరంగా ఉంటాయంటే..వామ్మో ఈ రేంజ్లో ఉంటుందా అలెర్జీ అన్నంత భయం వేస్తుంది. అలసు సడెన్‌గా ఇలా అలెర్జీలు ఎలా వస్తాయనే దానిపై శాస్త్రవేత్తలు పరిశోధన చేయగా చాలా షాకింగ్ విషయాలే వెల్లడించారు వివరాల్లోకెళ్తే..సీఫుడ్ ఎలర్జీ ఉన్నవారు వాటి వాసన చూసినా అనారోగ్యానికి గురవ్వుతారని అంటున్నారు. అంతేకాదు ఒక వేళ్ల ఆహారంగా తింటే ఎలా అనారోగ్యానికి గుర్వవ్వుతారో అలానే వాసన చూసి అవ్వుతారని చెప్పారు. అంతేకాదు ఈ విధంగా ఎందుకు జరుగుతుంది? ఇలా అలెర్జీకి దారితీసేందుకు ప్రధాన కారణం ఏంటన్న? దాని గురించి చాలా షాకింగ్ విషయాలే వెల్లడించారు శాస్త్రవేత్తలు. ఈ మేరకు అలర్జీపై యేల్ స్కూల్ ఆఫ్ మెడసిన్ వైద్య పరిశోధకులు అధ్యయనం నిర్వహించారు. ఇందుకు ప్రధాన కారణం రోగ నిరోధక వ్యవస్థే కీలకమని వెల్లడించారు. దీనికి సంబంధించిన పరిశోధన నేచర్ జర్నల్‌లో ప్రచురితమయ్యింది. పరిశోధన ప్రకారం..ఏదైన పడని ఆహారం లేదా ఫుడ్ ఎలర్జీ ఉన్నవారిలో సడెన్‌గా సంభవించే మార్పుల్లో రోగ నిరోధక వ్యవస్థే కీలకపాత్ర పోషిస్తుందని అధ్యయనంలో తేలింది. రోగనిరోధక వ్యవస్థే శరీరంలో మార్పులను నియంత్రిస్తుందని ఈ పరిశోధనలో వెల్లడయ్యింది. ఈ మేరకు యూల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ప్రొఫెసర్ మాట్లాడతూ..మన శరీరానికి హాని చేసే విషపదార్థాలకు వ్యతిరేకంగా మన మెదడు రక్షణాత్మక చర్యలను తీసుకునేలా ఈ రోగనిరోధక వ్యవస్థే ప్రేరేపిస్తుందని కనుగొన్నామన్నారు. ఈ రోగ నిరోధక వ్యవస్థ కమ్యూనికేషన్ లేకుండా మెదడు పర్యావరణంలో సంభావ్య ప్రమాదాల గురించి శరీరాన్ని హెచ్చరించ లేదని కూడా తెలిపారు. అందుకోసం కొన్ని ఎలుకలపై అధ్యయనం నిర్వహించినట్లు తెలిపారు. కోడి గుడ్లలో ఉండే ఓవా అనే ప్రోటీన్‌కు అలెర్జీ ప్రతిచర్యలు ఉంటాయని గుర్తించారు. దీంతో పరిశోధకులు ఎలుకలకు ఈ ఓవాతో కలిపిన నీటిని ఇవ్వగా..వాటిలో కొన్ని ఎలుకలు ఆ నీటిని నివారించేందుకు మొగ్గు చూపుతాయి. మరికొన్ని ఆ నీటిని ఇష్టపడటం గమనించారు. కొన్ని ఎలుకలు నెలల తరబడి గుడ్డు ఓవా నీటి పట్ల విముఖతను చూపించాయి. ఈ రోగనిరోధక వ్యవస్థలో వేరియబుల్స్‌ను మార్చడం ద్వారా ఎలుకల్లో ఈ విముఖత ప్రవర్తనను మార్చగలమా అనే దిశగా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. అంటే రోగనిరోధక వ్యవస్థ ద్వారా ఉత్పత్తి చేయబడిన ఇమ్యునోగ్లోబులిన్ (IgE) ప్రతిరోధకాలను నిరోధించినట్లయితే ఈ గుడ్డు ఓవా నీటికి అలెర్జీ ఉన్న ఎలుకలకు ఆ ప్రోటీన్ పట్ల ఉన్న విరక్తిని కోల్పోతాయని కనుగొన్నారు. ఇక్కడ ఒక కమ్యూనికేటర్ లేకుండా ఇదంతా జరగదని గుర్తించారు. దీని అర్థం రోగనిరోధక వ్యవస్థను ఉత్పత్తి చేసే IgE ప్రతిరోధకాలు మెదడుని మాస్ట్ కణాల విడుదలను ప్రేరేపించేలా కమ్యూనికేట్ చేస్తుందని. తద్వారా ఎలుకలు విరక్తి ప్రవర్తన లేదా ఇన్ఫెక్షన్ రావడం జరుగుతుందని చెప్పారు. అంతేగాదు జంతువులకు పర్యావరణంలో ఎదురయ్యే ప్రమాదాలను నివారించేలా రోగనిరోధక వ్యవస్థ ఎల అభివృద్ధి చెంది ఉందో ఈ పరిశోధన వివరించిందన్నారు శాస్త్రవేత్తలు. (చదవండి: జస్ట్ చెమటతోనే డయాబెటిస్‌ని గుర్తించే సరికొత్త సాంకేతిక పరికరం!) -
సహారా ఎడారిలో పచ్చదనం? వేల ఏళ్లకు కనిపించే దృశ్యం?
జీవం ఉనికితో పాటు భూమి ఇతర గ్రహాలకు చాలా భిన్నమైనది. ఇక్కడి వాతావరణం మారుతూ ఉంటుంది. కొన్ని లక్షల సంవత్సరాలలో వాతావరణం తీరుతెన్నులు సంపూర్ణంగా మారుతుంటాయి. ఇలాంటి మార్పులు ఇతర గ్రహాలలో చాలా అరుదుగా కనిపిస్తాయి. ఒకప్పుడు సహారా ఎడారిగా పచ్చగా ఉండేదనడానికి కొన్ని ఆధారాలు లభ్యమయ్యాయి. అయితే ఇలాంటి మార్పు ఎలా సంభవించిందో ఇప్పటివరకు శాస్త్రవేత్తలు తెలుసుకోలేకపోయారు. అయితే తాజా పరిశోధన దీనిపై కొంత క్లారిటీని తీసుకువచ్చింది. ఎడారిలో నదులు, సరస్సులు ఆఫ్రికాలోని సహారా ఎడారి 92 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన ప్రపంచంలోనే అతిపెద్ద ఎడారి. కొన్ని వేల సంవత్సరాలకు ఒకసారి ఇది ఇది ఆకుపచ్చగా మారుతుంది. అప్పుడు ఇక్కడ నీటిపై ఆధారపడే జంతువులు, సవన్నా మైదానాలు, నదులు, సరస్సులు కనిపిస్తాయి. నేచర్ కమ్యూనికేషన్స్‌లో ప్రచురితమైన అధ్యయనంలో సహారా ఎడారిలో ఎప్పుడు తడి కాలాలు సంభవిస్తాయి? దీనికి సూర్యుని చుట్టూ తిరిగే భూమి కక్ష్య ఎలాంటి పాత్రను పాత్ర పోషిస్తుందో వివరించారు. భారీ పర్యావరణ మార్పులలో ఇదొకటి సహారాలో మంచు యుగం ప్రభావం కూడా కనిపించింది. బ్రిస్టల్, హెల్సింకి విశ్వవిద్యాలయానికి చెందిన వాతావరణ శాస్త్రవేత్త ఎడ్వర్డ్ ఆర్మ్‌స్ట్రాంగ్ విడుదల చేసిన ఒక ప్రకటనలో.. సహారా ఎడారిని సవన్నాలేదా ఫారెస్ట్‌గా మార్చే ప్రక్రియ భూమిపై అత్యంత అద్భుతమైన పర్యావరణ మార్పులలో ఒకటని పేర్కొన్నారు. ఈ సంఘటనలు ఎప్పుడు, ఎలా జరిగాయో వెల్లడించడానికి ఆఫ్రికాలో క్లైమేట్ మోడలింగ్ అధ్యయనం జరిగిందన్నారు. ఇటువంటి మార్పులు అనివార్యం చరిత్రలో సహారా ఎడారి పచ్చగా మారుతుందనే వాదనకు మద్దతు ఇచ్చే అనేక ఆధారాలు అందుబాటులో ఉన్నాయి. ఈ అధ్యయనంలో ఈ పచ్చదన ప్రక్రియ సూర్యుని చుట్టూ భూమి కక్ష్యలోని ప్రీసెషన్ ప్రక్రియ ద్వారా నిర్ణయమవుతుందని సూచించారు. భూమి కొన్నిసార్లు దాని సొంత అక్షం మీద కదలినప్పుడు సంభవించే మార్పుల కారణంగా భూమిపై ఏర్పడే రుతువులు దాదాపు ప్రతి 21 వేల కాలచక్రాలకు ప్రభావితం అవుతాయి. ఫలితంగా వర్షపాత పరిస్ధితులు ఏర్పడి ఆఫ్రికా రుతుపవనాలు నియంత్రితమవుతాయి. ఫలితంగా సహారాలో పచ్చదనం వ్యాపిస్తుంది. ప్రతి 21 వేల సంవత్సరాలకు.. ఉత్తర ఆఫ్రికాలో ప్రతి 21 వేల సంవత్సరాలకు విపరీత వాతావరణమార్పులు సంభవిస్తాయని, వీటిని భూమి తిరిగే కక్ష్య నిర్ణయిస్తుందనేది నిర్ధారించడానికి ఈ అధ్యయనంలో క్లిష్టమైన వాతావరణ నమూనాలను ఉపయోగించారు. ఈ మార్పు ఉత్తర అర్ధగోళంలో, పశ్చిమ ఆఫ్రికాలో రుతుపవన వ్యవస్థ శక్తిని మరింతగా పెంచుతుంది. ఫలితంగా సహారాలో వర్షపాతం విస్తృతంగా వ్యాపిస్తుంది. దీంతో ఎడారిలో పచ్చదనం కనిపిస్తుంది. 12 వేల ఏళ్ల తరువాత.. ఈ అధ్యయనంలో కనుగొన్న ఒక ప్రత్యేక విషయం ఏమిటంటే.. ఉత్తర ఆఫ్రికాలోని తేమతో కూడిన ప్రాంతాలు విపరీత వాతావరణమార్పులకు అంతగా గురికావు. ఎందుకంటే అక్కడి మంచు పలకలు అధిక అక్షాంశాలలో వ్యాపిస్తాయి. ఈ షీట్లు వాతావరణాన్ని చల్లబరుస్తాయి. ఫలితంగా రుతుపవనాల ప్రభావం కనిపించదు. సహారాలో సుమారు 5000 సంవత్సరాల క్రితం వరకు పచ్చదనం ఉండేది. ఇది భూమి కక్ష్య యొక్క వంపు 24.1 డిగ్రీలుగా మారిన సమయంలో జరిగింది. ప్రస్తుతం భూమి వంపు 23.5 డిగ్రీలలో ఉంది. అంటే ఇప్పుడు సహారాలో తదుపరి మార్పు సుమారు 12 వేల సంవత్సరాల తర్వాత కనిపిస్తుంది అప్పుడు మనం సహారా ఎడారి పచ్చగా మారడాన్ని చూడగలుగుతాం. ఇది కూడా చదవండి: కెనడాలో చోరీ, అఫ్రికాలో ప్రత్యక్ష్యం.. ఈ కార్లు ఎలా వస్తున్నాయబ్బా? -
ఎలుగెత్తి చెబుదాం గొంతెత్తి పాడుదాం
పిల్లలు నోరు తెరిచి దేశం గురించి మాట్లాడే రోజు ఆగస్టు 15. గొంతెత్తి దేశభక్తిని గానం చేసేరోజు మన స్వాతంత్య్ర దినోత్సవం. సంవత్సరంలో 364 రోజులు వారు ఫోనులోనో గేమ్స్లోనో మునిగి ఉన్నా ఈ ఒక్కరోజైనా వారి చేత దేశం గురించి మాట్లాడించాలి. దేశ ఘనతను పాడించాలి. తల్లిదండ్రులు తమ పిల్లల చేత కనీసం ఒక పాట పాడించాలి. ఐదు నిమిషాలు మాట్లాడించాలి. ఏ పాటలు? ఏ మాటలు? ఇవిగోండి సలహాలు... ‘దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా వొట్టి మాటలు కట్టిపెట్టొయ్ గట్టిమేల్ తలపెట్టవోయ్’... అన్నారు గురజాడ. ‘దేశమును ప్రేమించాలి’ అని పిల్లలకు తెలుసు. కాని దేశంలో మంచి పెరిగితేనే అది ప్రేమించ దగ్గ దేశమవుతుందని, దేశంలోని ప్రతి ఒక్కరికీ మేలు జరిగినప్పుడే అది గొప్ప దేశమవుతుందని గురజాడ చెప్పారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఇలాంటి ఒక పాటైనా పిల్లల చేత పాడించకపోతే తల్లిదండ్రుల పెంపకంలో నిర్లక్ష్యం ఉన్నట్టే అర్థం. ‘చెట్టపట్టాల్ పట్టుకొని దేశస్తులంతా నడవ వలెనోయ్... అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నీ మెలగవలెనోయ్’ అని కూడా గురజాడ అన్నారు. ఇవాళ్టి సందర్భంలో పిల్లలకు ఈ పాట నేర్పి, దాని అర్థం మనసుకు ఎక్కించకపోతే భవిష్యత్తులో వారు ‘దేశమంటే మట్టే’ అనుకుంటారు. ‘మనుషులు’ అనుకోరు. త్యాగఫలం తెలియచేయాలి ఇవాళ మనం పీలుస్తున్న ప్రతి శ్వాస మన పూర్వికుల రక్తం, చెమట, త్యాగం ఫలితం. మహానుభావులు వారి జీవితాలను త్యాగం చేసి భావితరాల చేతుల్లో పెట్టారు దేశాన్ని. ఎంతో విలువైన ఈ దేశ సంపద, దేశ సంస్కృతి పట్ల పిల్లలకు గౌరవం, బాధ్యత తెలియాలంటే వారిలో జాతీయ భావాలు, సుహృద్భావం కలగాలంటే ఆగస్టు 15ను ఒక సందర్భంగా చేసుకుని తెలియచేయాలి. ఇవాళ దురదృష్టవశాత్తు కొన్ని ఇళ్లల్లో పిల్లలకు తెలుగు నేర్పించడం లేదు. కొన్ని స్కూళ్లలో పిల్లలు జెండా వందనం రోజు జైహింద్ చెప్తే సరిపోతుందనుకుంటున్నారు. కనీసం ఒక బృందగానంలో కూడా పాల్గొనడం లేదు... వక్తృత్వంలో నాలుగు ముక్కలు దేశం గురించి మాట్లాడటం లేదు. అందుకే తల్లిదండ్రులు పూనుకుని తమ ప్రతి పిల్లల చేత అయితే తమ అపార్ట్మెంట్లో, లేదా తమ వీధిలో, ఇంట్లో ఏదో విధాన ఒక పాట పాడించడం, దేశం గురించి తప్పకుండా నాలుగు ముక్కలు మాట్లాడించడం అవసరం. పిల్లలు సరిగ్గా చెప్తే వింటారు. నేర్చుకుంటారు. వారికి ఆ వేళ విశేషమైన దుస్తులు, దేశభక్తులు వేషాలు వేస్తే ఎంతో సంబరపడతారు. ఆ స్ఫూర్తిని నింపుకుంటారు. ఆగస్టు 15 అంటే సెలవు దినం, ఆ రోజు ఎటైనా వెళ్లొద్దాం అని ప్లాన్ చేసుకునే తల్లిదండ్రులు పిల్లలను దేశం వైపు నడిపించడంలో నిర్బాధ్యతగా ఉన్నట్టే లెక్క. ఎన్నో పాటలు పిల్లలు నేర్చుకుని పాడటానికి తెలుగు, హిందీ భాషల్లో ఎన్నో పాటలు ఉన్నాయి. ప్రయివేటు గీతాలతో పాటు సినీ గీతాలు కూడా ఉన్నాయి. వీటిలో ఏదో ఒకటి నేర్పించవచ్చు. ‘దేశమును ప్రేమించుమన్నా’ (గురజాడ), ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ (శంకరంబాడి), ‘జయజయ ప్రియభారత జనయిత్రి’ (దేవులపల్లి), ‘తేనెల తేటల మాటలతో’ (ఇంద్రగంటి శ్రీకాంత శర్మ), ‘మాకొద్దీ తెల్లదొరతనము’ (గరిమెళ్ల), ‘చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడ’ (వేములపల్లి శ్రీకృష్ణ)... ఇవన్నీ ఉన్నాయి. ఇక సినిమా పాటల్లో ‘పాడవోయి భారతీయుడా’ (శ్రీశ్రీ) పిల్లలు పాడటానికి సులువుగా ఉంటుంది. మన పిల్లలకు ‘వందేమాతరం’, ‘జనగణమన’, ‘సారే జహాసే అచ్ఛా’ కనీసం వచ్చునా రావా అన్నది కూడా గమనించుకుంటే మంచిది. దేశం గురించి మాట్లాడాలి పిల్లలు దేశం గురించి, దేశ ఔన్నత్యం గురించి మాట్లాడాలి. మాట్లాడటంలో వారికి తర్ఫీదు ఇవ్వాలి. ఏం మాట్లాడాలన్న విషయంలో కొంచెం సాయం చేసినా పర్వాలేదు. ‘భిన్నత్వంలో ఏకత్వం’, ‘మన జాతిపిత’, ‘దేశాభ్యున్నతికై పర్యావరణ పరిరక్షణ’, ‘డిజిటల్ ఇండియా’, ‘స్త్రీ శక్తి’, ‘సామాజిక బాధ్యత’... ఇలా ఏదో ఒక అంశం ఇచ్చి ఐదు నిమిషాలు మాట్లాడేలా చేయాలి. ఇది ఒక సంప్రదాయం. ఒక తరం నుంచి మరో తరానికి అందాలి. అమృతోత్సవం సందర్భంగా ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిపై జెండా ఎగరేయడంలో పిల్లలను భాగస్వాములను చేయాలి. దేశ పతాకం పిల్లల చేతుల్లో రెపరెపలాడాలి. దేశభవిష్యత్తుకు వారే విధాతలు కావాలి. -
రాఫెల్ కొనుగోలు వివరాలివ్వండి
న్యూఢిల్లీ: ఫ్రాన్స్ నుంచి 36 రాఫెల్ ఫైటర్జెట్ల కొనుగోలుపై దేశంలో రగడ నడుస్తున్న వేళ సుప్రీంకోర్టు బుధవారం కీలక ఉత్తర్వులు జారీచేసింది. రాఫెల్ ఫైటర్జెట్ల కొనుగోలు ఒప్పందం కోసం పాటించిన ప్రక్రియ వివరాలను సీల్డ్ కవర్లో ఈ నెల 29లోగా సమర్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఒప్పందంలోని ఫైటర్జెట్ల ధర, ఇతర సాంకేతిక అంశాలను వెల్లడించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. న్యాయవాదులు వినీత్ ధండ, ఎంఎల్ శర్మ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాల(పిల్స్)ను సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్‌ల ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ వాదనలు వినిపిస్తూ.. ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యాలను రాజకీయ దురుద్దేశాలతో దాఖలు చేశారనీ, వీటిని వెంటనే కొట్టివేయాలని కోరారు. దీంతో అత్యున్నత న్యాయస్థానం స్పందిస్తూ..‘మేం రాఫెల్ ఫైటర్ జెట్ల ధర, అవి మన అవసరాలకు సరిపోతాయా? వంటి ప్రశ్నలు అడగడం లేదు. కేవలం ఈ ఒప్పందం కుదుర్చుకునేందుకు పాటించిన ప్రక్రియ చట్టబద్ధత గురించి మాత్రమే ప్రశ్నిస్తున్నాం. ఒకవేళ రాఫెల్ కొనుగోలు ఒప్పందం సందర్భంగా పాటించిన పద్ధతిని తెలపాలని కోరితే మీరు(కేంద్రం) ఏమంటారు?’ అని ప్రశ్నించింది. దీనికి వేణుగోపాల్ జవాబిస్తూ..‘ఫైటర్జెట్ల కొనుగోలు ఒప్పందంలోని నిబంధనలతో పాటు దేశ ప్రయోజనాల దృష్ట్యా ఈ వివరాలను ఎవ్వరికీ వెల్లడించలేం’ అని చెప్పారు. ‘ఒకవేళ ఒప్పందంలోని సాంకేతిక అంశాలు లేకుండా వివరాలు సమర్పించమని మేం కోరితే మీరేం చేస్తారు?’ అని అత్యున్నత న్యాయస్థానం మరోసారి ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో అటార్నీ జనరల్ స్పందిస్తూ..‘రాఫెల్ ఒప్పందంపై సుప్రీంకోర్టులో దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దేశంలోని ఏ ఒక్క నిరుపేద ప్రయోజనాలను ప్రస్తావించలేదు. ఇవన్నీ రాజకీయ దురుద్దేశంతో దాఖలు చేసిన పిటిషన్లు. పార్లమెంటులో కేంద్రం రాఫెల్ ఒప్పందంపై వివరణ ఇచ్చినప్పటికీ అవే ప్రశ్నలను పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ప్రస్తావించారు. ప్రస్తుతం ఈ ఒప్పందంపై దేశంలో ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇలాంటి సమయంలో ఈ పిటిషన్లపై విచారణకు అనుమతిస్తే వీటిని రాజకీయ అస్త్రాలుగా వాడుకునే వీలుంది. ప్రభుత్వం తీసుకునే ఇలాంటి విధానపరమైన నిర్ణయాల్లో న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోరాదు. ఒకవేళ కోర్టు ఇప్పుడు నోటీసులు జారీచేస్తే అది నేరుగా ప్రధానమంత్రికి వెళుతుంది. కాబట్టి దయచేసి ఈ పిటిషన్లను కొట్టివేయండి’ అని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పిటిషనర్ ఎం.ఎల్.శర్మ వాదిస్తూ.. రాఫెల్ ఫైటర్ జెట్ల ధర సహా మిగిలిన ఒప్పంద వివరాలను ఫ్రాన్స్ ప్రభుత్వం ఇప్పటికే అక్కడి పార్లమెంటు ముందు ఉంచిందని తెలిపారు. ఈ నేపథ్యంలో భారత్‌లో దాచిపెట్టడం సరికాదని వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న అత్యున్నత న్యాయస్థానం.. ఈ పిటిషన్లలో ప్రస్తావించిన అంశాల లోతుకు తాము వెళ్లడం లేదని స్పష్టం చేసింది. అలాగే రాఫెల్ ఒప్పందం విషయంలో కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు కూడా జారీ చేయబోమని తేల్చిచెప్పింది. రాఫెల్ ఫైటర్జెట్ల కొనుగోలు చట్టబద్ధతపై తాము సంతృప్తి చెందేందుకే ఈ సమాచారాన్ని కోరుతున్నామని వెల్లడించింది. అనంతరం తదుపరి విచారణను అక్టోబర్ 31కి వాయిదా వేసింది. కదనరంగంలోకి దూకేందుకు సిద్ధంగా ఉన్న 36 రాఫెల్ జెట్లను రూ.58,000 కోట్ల వ్యయంతో కొనుగోలు చేసేందుకు కేంద్రం 2016, సెప్టెంబర్ 23న ఫ్రాన్స్‌తో ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంలో భారీ అవినీతి చోటుచేసుకుందని ప్రతిపక్ష కాంగ్రెస్ ఆరోపిస్తోంది. నిర్మల పర్యటన అందుకే: రాహుల్ రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంలో ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయాన్ని సమర్థించేందుకు అనుగుణంగా చర్యలు ప్రారంభమయ్యాయని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు. ఇందులోభాగంగా రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ఫ్రాన్స్ పర్యటనకు వెళుతున్నారన్నారు. రిలయన్స్ ఉంటేనే ఒప్పుకుంటాం! రాఫెల్ ఒప్పందం కుదరాలంటే ఫ్రాన్స్‌కు చెందిన డసో ఏవియేషన్ తనకు భారత భాగస్వామిగా రిలయన్స్‌ను ఒప్పుకోవాల్సిందేనంటూ ఓ షరతు ఉన్న పత్రం తాజాగా తమకు లభించినట్లు ఓ ఫ్రెంచ్ మీడియా సంస్థ పేర్కొంది. రిలయన్స్‌ను డసోకు భారత భాగస్వామిగా మోదీ ప్రభుత్వమే ఎంపిక చేసిందనీ, మరో కంపెనీని తీసుకునే అవకాశం కూడా తమకు ఇవ్వలేదని గతంలో ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ వెల్లడించడం.. ఆ తర్వాత రిలయన్స్‌ను తామే ఎంచుకున్నామని డసో వివరణ ఇవ్వడం తెలిసిందే. తాజాగా ఫ్రెంచ్ జర్నల్ ‘మీడియాపార్ట్’.. రాఫెల్ ఒప్పందంలో భారత భాగస్వామిగా రిలయన్స్‌ను తప్పనిసరిగా తీసుకోవాలని ఓ షరతు ఉన్నట్లుగా తెలిపే పత్రం తమకు దొరికిందని వెల్లడించింది. -
నామం పెట్టారు
‘‘ఫిల్మ్ ఇండస్ట్రీలో పని చేసేవాళ్లు ఎక్కువగా సంపాదించేసి ట్యాక్స్ ఎగ్గొడతారని అనుకోవడం పొరపాటు. నేనెప్పుడూ నా ట్యాక్స్ ఎగ్గొట్టలేదు’’అన్నారు కస్తూరి. ‘అన్నమయ్య’లో ‘ఏలే ఏలే మరదలా...’ అంటూ నాగార్జునతో స్టెప్పులేసిన కస్తూరి గుర్తుండే ఉంటారు. రీసెంట్గా ట్వీటర్లో ఓ నెటì జన్ ‘మీరు క్రమం తప్పకుండా ట్యాక్స్ పే చేస్తారా అని అడగ్గా– ‘‘కచ్చితంగా పే చేస్తూనే ఉంటాను. నిజానికి నాకే నిర్మాతలు చాలాసార్లు నామం పెట్టారు. రాత్రీ పగలు అనే తేడా లేకుండా షూటింగ్స్ చేస్తూ ఉంటాం. కొన్ని సార్లు సినిమా రిలీజ్ అయ్యాక రెమ్యునరేషన్ ఇస్తాం అంటారు. చివరికి నామం పెడతారు. నాకు చాలా సార్లు జరిగింది. కానీ నేనెప్పుడూ నా ట్యాక్స్ విషయాల్లో నామం పెట్టలేదు’’ అని సమాధానమిచ్చారు కస్తూరి. -
జయ మరణాన్ని వివరించిన శశికళ
-
ప్రతి గడపకు వెళ్లండి.. బాబు సర్కార్ వైఫల్యాలను చెప్పండి
టీడీపీ ప్రభుత్వ అక్రమాలను వివరించండి ‘గడపగడపకు వైఎస్సార్’ను సమీక్షించిన వైఎస్ జగన్ సాక్షి, విశాఖపట్నం: ప్రతి గడపకు వెళ్లండి.. ప్రతి ఒక్కరినీ కలవండి.. చంద్రబాబు సర్కార్ వైఫల్యాలను ఎండగట్టండి.. అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ నేతలను ఆదేశించారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘గడప గడపకు వైఎస్సార్’ కార్యక్రమం అమలుపై విశాఖ జిల్లా నేతలతో పార్టీ అధినేత నిర్వహించిన సమీక్ష వివరాలను పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ స్థానిక విలేకర్లకు ఫోన్లో వివరించారు. ‘గడప గడపకు వైఎస్సార్సీపీ ప్రారంభించి 40 రోజులు దాటింది. రాష్ట్ర వ్యాప్తంగా మంచి స్పందన వస్తోంది. మీ జిల్లాలో కార్యక్రమం ఎలా జరుగుతోంది.. ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తోంద’ని పార్టీ అధినేత జగన్ ఆరా తీశారన్నారు. నెలకు 16 రోజుల కంటే తక్కువగా ఎక్కడైతే ఈ కార్యక్రమం చేయలేదో ఆయా నియోజక వర్గాల నేతలకు తాను స్వయంగా ఫోన్ చేశానని, ఒక్కసారి కూడా విశాఖ జిల్లాకు ఫోన్ చేసే అవసరం రాలేదని పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి విశాఖ జిల్లాలోని సమన్వయకర్తలను అభినందించారని అమర్నాథ్ తెలిపారు. ఇదే స్ఫూర్తితో ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కర్ని కలిసే వరకు ఈ కార్యక్రమం కొనసాగించాలని జగన్ సూచించారన్నారు. గత రెండేళ్లలో టీడీపీ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలను వివరించండని పార్టీ నేతలకు సూచించారని తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు బూడి ముత్యాలనాయుడు, గిడ్డి ఈశ్వరి, మాజీ ఎమ్మెల్యేలు గొల్ల బాబూరావు, తైనాల విజయ్‌కుమార్, కరణం ధర్మశ్రీ, కో ఆర్డినేటర్లు వంశీకష్ణ శ్రీనివాస్, కోలా గురువులు, అన్నంరెడ్డి అదీప్‌రాజు, తిప్పల నాగిరెడ్డి, పెట్ల ఉమాశంకర గణేష్, వీసం రామకష్ణ, చిక్కాల రామారావు, ప్రగడ నాగేశ్వరరావు, అదనపు కో ఆర్డినేటర్ బొడ్డేడ ప్రసాద్, అరుకు త్రిసభ్య కమిటీ సభ్యులు కె.అరుణకుమారి, పోయా రాజారావు, జర్సింగి సూర్యనారాయణ పాల్గొన్నారు. -
ప్రతి గడపకు వెళ్లండి.. బాబు సర్కార్ వైఫల్యాలను చెప్పండి
టీడీపీ ప్రభుత్వ అక్రమాలను వివరించండి సాక్షి, విశాఖపట్నం: ప్రతి గడపకు వెళ్లండి.. ప్రతి ఒక్కరినీ కలవండి.. చంద్రబాబు సర్కార్ వైఫల్యాలను ఎండగట్టండి.. అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ నేతలను ఆదేశించారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘గడప గడపకు వైఎస్సార్’ కార్యక్రమం అమలుపై విశాఖ జిల్లా నేతలతో పార్టీ అధినేత నిర్వహించిన సమీక్ష వివరాలను పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ స్థానిక విలేకర్లకు ఫోన్లో వివరించారు. ‘గడప గడపకు వైఎస్సార్సీపీ ప్రారంభించి 40 రోజులు దాటింది. రాష్ట్ర వ్యాప్తంగా మంచి స్పందన వస్తోంది. మీ జిల్లాలో కార్యక్రమం ఎలా జరుగుతోంది.. ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తోంద’ని పార్టీ అధినేత జగన్ ఆరా తీశారన్నారు. నెలకు 16 రోజుల కంటే తక్కువగా ఎక్కడైతే ఈ కార్యక్రమం చేయలేదో ఆయా నియోజక వర్గాల నేతలకు తాను స్వయంగా ఫోన్ చేశానని, ఒక్కసారి కూడా విశాఖ జిల్లాకు ఫోన్ చేసే అవసరం రాలేదని పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి విశాఖ జిల్లాలోని సమన్వయకర్తలను అభినందించారని అమర్నాథ్ తెలిపారు. ఇదే స్ఫూర్తితో ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కర్ని కలిసే వరకు ఈ కార్యక్రమం కొనసాగించాలని జగన్ సూచించారన్నారు. గత రెండేళ్లలో టీడీపీ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలను వివరించండని పార్టీ నేతలకు సూచించారని తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు బూడి ముత్యాలనాయుడు, గిడ్డి ఈశ్వరి, మాజీ ఎమ్మెల్యేలు గొల్ల బాబూరావు, తైనాల విజయ్‌కుమార్, కరణం ధర్మశ్రీ, కో ఆర్డినేటర్లు వంశీకష్ణ శ్రీనివాస్, కోలా గురువులు, అన్నంరెడ్డి అదీప్‌రాజు, తిప్పల నాగిరెడ్డి, పెట్ల ఉమాశంకర గణేష్, వీసం రామకష్ణ, చిక్కాల రామారావు, ప్రగడ నాగేశ్వరరావు, అదనపు కో ఆర్డినేటర్ బొడ్డేడ ప్రసాద్, అరుకు త్రిసభ్య కమిటీ సభ్యులు కె.అరుణకుమారి, పోయా రాజారావు, జర్సింగి సూర్యనారాయణ పాల్గొన్నారు. -
ఫేస్ బుక్ ఫ్రీ బేసిక్స్ ప్రమాదకరం!
ఫేస్బుక్ సంస్థ.. ఫ్రీ బేసిక్స్ పేరున ప్రజలను మోసగిస్తోందా? నెట్ న్యూట్రాలిటీకి తూట్లు పొడుస్తూ యూజర్లని మభ్యపెడుతోందా? గతంలో ఇంటర్నెట్ డాట్ ఆర్గ్ వివాదాస్పదం అవ్వడంతో.. మరింత ఆకట్టుకునేందుకు ఫ్రీ బేసిక్స్ డాట్ కామ్ తో మళ్ళీ ముందుకొచ్చిందా? ఈ కొత్త ప్లాన్ వెనుక ఫేస్ బుక్ పెద్ద ఎత్తుగడే ఉందంటున్నారు నిపుణులు. జనానికి ఉచితి సర్వీసులు అందిస్తున్నట్లు చేసి... స్వలాభం కోసం ప్రయత్నిస్తోందని... ఫేస్ బుక్ అందిస్తున్న ఫ్రీ బేసిక్స్ ఎప్పటికైనా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. నెట్ న్యూట్రాలిటీ అనేది దేశవ్యాప్తంగా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇంటర్నెట్ను అందరికీ సమానంగా అందుబాటులో ఉంచడం ‘నెట్ న్యూట్రాలిటీ' ప్రధాన లక్ష్యం. ఇంటర్నెట్ లో అన్ని వెబ్ సైట్లనూ వినియోగదారులంతా ఒకే రీతిలో వాడుకునేందుకు వీలుగా.. యూజర్లంతా స్పందించాలని 'సేవ్ ద ఇంటర్నెట్' పేరున ఇప్పటికే ఆన్ లైన్ ఉద్యమాలు కొనసాగుతున్నాయి. ఫేస్ బుక్ మార్కెటింగ్ మాయాజాలాన్ని ఎదుర్కొనేందుకు వినియోగదారులు ఒక్క తాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. ఇంటర్నెట్ అందరికీ అందుబాటులో ఉండాలని కోరుతూ ట్రాయ్‌కు సైతం ఫిర్యాదులు చేశారు. అయితే కొందరు టెలికాం అపరేటర్లు ప్యాకేజీల పేరున వినియోగదార్లను ఆకట్టుకొని.. ఇంటర్నెట్ వినియోగం నియంత్రించే ప్రయత్నాలు చేయడంతోనే అసలు గొడవ మొదలైంది. ఇదే తరహాలో వచ్చిన ఫేస్ బుక్ ఫ్రీ బేసిక్స్ సరైన పద్ధతి కాదని, ఇతర దేశాలు ప్రోత్సహిస్తున్న ఈ మార్కెటింగ్ పద్ధతిని తిప్పికొట్టాలని యూజర్లు సంఘంగా ఏర్పడ్డారు. ఫేస్ బుక్ ఫ్రీ బేసిక్స్ వల్ల కలిగే నష్టాలను వివరిస్తున్నారు. ఫ్రీ బేసిక్స్ ద్వారా ఇంటర్నెట్ వాడకం మన చేతుల్లోనుంచి టెలికమ్ కంపెనీల చేతుల్లోకి వెళ్ళబోతోంది అన్నది నిపుణుల ఉవాచ. ప్రజలకు ఫ్రీ ఇంటర్నెట్ అందించేందుకు ఇంకా ఎన్నో ఇతర పద్ధతులు ఉన్నాయని, ఫేస్ బుక్ పోటీతత్వంతో స్వప్రయోజనాలను ప్రజలపై రుద్దే ప్రయత్నంలో భాగంగా ఫ్రీ బేసిక్స్‌ను తెస్తోందని చెప్తున్నారు. ఫ్రీ బేసిక్స్‌కు ఏమాత్రం మద్దతివ్వద్దంటున్నారు. నిజానికి ఫేస్ బుక్ ఫ్రీ బేసిక్స్ కోసం టెలికాం ఆపరేటర్లకు ఎలాంటి బిల్లూ చెల్లించదు. ఇది టెలికాం ఆపరేటర్లే చెల్లించాల్సి వస్తుంది. ఈ విధంగా ఇంటర్నెట్ డేటా ఖర్చును తగ్గించుకుని ఫేస్ బుక్ తన పబ్బం గడుపుకొనే ప్రయత్నం చేస్తోందని చెప్తున్నారు. అంతేకాదు ఫ్రీ బేసిక్స్ తన భాగస్వాములకు మాత్రమే ఉచిత సౌకర్యాన్ని అందిస్తుంది. మిగిలినవారంతా ఇంటర్నెట్ కోసం ఫీజు చెల్లించాల్సి వస్తుంది. ఇది ఒక రకంగా నెట్ న్యూట్రాలిటీని ఉల్లంఘించడమే అవుతుంది. భారత దేశంలో రోజురోజుకీ ఇంటర్నెట్ వినియోగం వేగంగా పెరుగుతోంది. 2015 సంవత్సరంలో ఫ్రీ బేసిక్స్ అందుబాటులో లేని సమయంలో దేశంలో వంద మిలియన్ల వినియోగదారులు కొత్తగా చేరారు. ఇప్పుడు ఫ్రీ బేసిక్స్ బహిరంగ వేదిక కాకపోగా.. ప్రత్యేకంగా తమకు కొన్ని మార్గదర్శకాలను కూడ నిర్వచించుకోవడం విశేషం. అందుకు అనుగుణంగానే వినియోగదారులు కూడ నడచుకోవాల్సి వస్తుంది. ఇది ప్రజలను మభ్యపెట్టడమూ, తప్పుదారి పట్టించడమేనని కొన్ని టెలికాం సంస్థలు సైతం చెప్తున్నాయి. ఫ్రీ బేసిక్స్ పేరున ఫేస్ బుక్ అన్ని సైట్లలో ఉచితంగా చొరబడగలగడమే కాక, ఎన్.ఎస్.ఏ కు డేటా అందించడం కూడ భారత దేశ భ్రతకే ముప్పు అంటున్నారు నిపుణులు. నిజానికి ఫ్రీ బేసిక్స్ ప్రకటనలకూ అతీతమేం కాదు. తమ సైట్లో ప్రకటనలు ఉండవు అని చెప్పడం లేదు. 3.2 మిలియన్ల ప్రజలు తమకు మద్దతు పలుకుతున్నారని చెప్పడంలోనే నిజం కనిపించడం లేదు. వారికి వచ్చిన ఈ మెయిల్స్ లో న్యాయబద్ధమైనవి ఎన్ని ఉంటాయనేది అనుమానమే అంటున్నారు ఆన్ లైన్ ఉద్యమకారులు. ఫ్రీ బేసిక్స్ ను ఎట్టి పరిస్థితిలో ప్రోత్సహించవద్దని గట్టిగా చెప్తున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం నెట్ న్యూట్రాలటీ అంశం పై చెలరేగిన వివాదాన్ని క్రేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. దీన్ని అధ్యయనం చేసేందుకు పలువురు నిపుణుల కమిటీని కూడ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.