ఇంతవరకు ఎన్నో రకాల అలెర్జీలు చూశాం. కొన్ని రకాల ఎలర్జీలు చూస్తే మరీ ఇంత ఘోరంగా ఉంటాయా! అని ఆశ్చర్యపోతారు. అవి ఎంత జుగుప్సకరంగా ఉంటాయంటే..వామ్మో ఈ రేంజ్‌లో ఉంటుందా అలెర్జీ అన్నంత భయం వేస్తుంది. అలసు సడెన్‌గా ఇలా అలెర్జీలు ఎలా వస్తాయనే దానిపై శాస్త్రవేత్తలు పరిశోధన చేయగా చాలా షాకింగ్ విషయాలే వెల్లడించారు
వివరాల్లోకెళ్తే..సీఫుడ్ ఎలర్జీ ఉన్నవారు వాటి వాసన చూసినా అనారోగ్యానికి గురవ్వుతారని అంటున్నారు. అంతేకాదు ఒక వేళ్ల ఆహారంగా తింటే ఎలా అనారోగ్యానికి గుర్వవ్వుతారో అలానే వాసన చూసి అవ్వుతారని చెప్పారు. అంతేకాదు ఈ విధంగా ఎందుకు జరుగుతుంది? ఇలా అలెర్జీకి దారితీసేందుకు ప్రధాన కారణం ఏంటన్న? దాని గురించి చాలా షాకింగ్ విషయాలే వెల్లడించారు శాస్త్రవేత్తలు. ఈ మేరకు అలర్జీపై యేల్ స్కూల్ ఆఫ్ మెడసిన్ వైద్య పరిశోధకులు అధ్యయనం నిర్వహించారు. ఇందుకు ప్రధాన కారణం రోగ నిరోధక వ్యవస్థే కీలకమని వెల్లడించారు.
దీనికి సంబంధించిన పరిశోధన నేచర్ జర్నల్‌లో ప్రచురితమయ్యింది. పరిశోధన ప్రకారం..ఏదైన పడని ఆహారం లేదా ఫుడ్ ఎలర్జీ ఉన్నవారిలో సడెన్‌గా సంభవించే మార్పుల్లో రోగ నిరోధక వ్యవస్థే కీలకపాత్ర పోషిస్తుందని అధ్యయనంలో తేలింది. రోగనిరోధక వ్యవస్థే శరీరంలో మార్పులను నియంత్రిస్తుందని ఈ పరిశోధనలో వెల్లడయ్యింది. ఈ మేరకు యూల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ప్రొఫెసర్ మాట్లాడతూ..మన శరీరానికి హాని చేసే విషపదార్థాలకు వ్యతిరేకంగా మన మెదడు రక్షణాత్మక చర్యలను తీసుకునేలా ఈ రోగనిరోధక వ్యవస్థే ప్రేరేపిస్తుందని కనుగొన్నామన్నారు. ఈ రోగ నిరోధక వ్యవస్థ కమ్యూనికేషన్ లేకుండా మెదడు పర్యావరణంలో సంభావ్య ప్రమాదాల గురించి శరీరాన్ని హెచ్చరించ లేదని కూడా తెలిపారు.
అందుకోసం కొన్ని ఎలుకలపై అధ్యయనం నిర్వహించినట్లు తెలిపారు. కోడి గుడ్లలో ఉండే ఓవా అనే ప్రోటీన్‌కు అలెర్జీ ప్రతిచర్యలు ఉంటాయని గుర్తించారు. దీంతో పరిశోధకులు ఎలుకలకు ఈ ఓవాతో కలిపిన నీటిని ఇవ్వగా..వాటిలో కొన్ని ఎలుకలు ఆ నీటిని నివారించేందుకు మొగ్గు చూపుతాయి. మరికొన్ని ఆ నీటిని ఇష్టపడటం గమనించారు. కొన్ని ఎలుకలు నెలల తరబడి గుడ్డు ఓవా నీటి పట్ల విముఖతను చూపించాయి. ఈ రోగనిరోధక వ్యవస్థలో వేరియబుల్స్‌ను మార్చడం ద్వారా ఎలుకల్లో ఈ విముఖత ప్రవర్తనను మార్చగలమా అనే దిశగా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు.
అంటే రోగనిరోధక వ్యవస్థ ద్వారా ఉత్పత్తి చేయబడిన ఇమ్యునోగ్లోబులిన్ (IgE) ప్రతిరోధకాలను నిరోధించినట్లయితే ఈ గుడ్డు ఓవా నీటికి అలెర్జీ ఉన్న ఎలుకలకు ఆ ప్రోటీన్ పట్ల ఉన్న విరక్తిని కోల్పోతాయని కనుగొన్నారు. ఇక్కడ ఒక కమ్యూనికేటర్ లేకుండా ఇదంతా జరగదని గుర్తించారు. దీని అర్థం రోగనిరోధక వ్యవస్థను ఉత్పత్తి చేసే IgE ప్రతిరోధకాలు మెదడుని మాస్ట్ కణాల విడుదలను ప్రేరేపించేలా కమ్యూనికేట్ చేస్తుందని. తద్వారా ఎలుకలు విరక్తి ప్రవర్తన లేదా ఇన్ఫెక్షన్ రావడం జరుగుతుందని చెప్పారు. అంతేగాదు జంతువులకు పర్యావరణంలో ఎదురయ్యే ప్రమాదాలను నివారించేలా రోగనిరోధక వ్యవస్థ ఎల అభివృద్ధి చెంది ఉందో ఈ పరిశోధన వివరించిందన్నారు శాస్త్రవేత్తలు.
(చదవండి: జస్ట్ చెమటతోనే డయాబెటిస్‌ని గుర్తించే సరికొత్త సాంకేతిక పరికరం!)
Comments
Please login to add a commentAdd a comment