Seafood
-
మత్స్య ఉత్పత్తుల్లో ఏపీ టాప్..
-
ఫుడ్ అలెర్జీ ఎందుకు వస్తుందో తెలుసా?
ఇంతవరకు ఎన్నో రకాల అలెర్జీలు చూశాం. కొన్ని రకాల ఎలర్జీలు చూస్తే మరీ ఇంత ఘోరంగా ఉంటాయా! అని ఆశ్చర్యపోతారు. అవి ఎంత జుగుప్సకరంగా ఉంటాయంటే..వామ్మో ఈ రేంజ్లో ఉంటుందా అలెర్జీ అన్నంత భయం వేస్తుంది. అలసు సడెన్‌గా ఇలా అలెర్జీలు ఎలా వస్తాయనే దానిపై శాస్త్రవేత్తలు పరిశోధన చేయగా చాలా షాకింగ్ విషయాలే వెల్లడించారు వివరాల్లోకెళ్తే..సీఫుడ్ ఎలర్జీ ఉన్నవారు వాటి వాసన చూసినా అనారోగ్యానికి గురవ్వుతారని అంటున్నారు. అంతేకాదు ఒక వేళ్ల ఆహారంగా తింటే ఎలా అనారోగ్యానికి గుర్వవ్వుతారో అలానే వాసన చూసి అవ్వుతారని చెప్పారు. అంతేకాదు ఈ విధంగా ఎందుకు జరుగుతుంది? ఇలా అలెర్జీకి దారితీసేందుకు ప్రధాన కారణం ఏంటన్న? దాని గురించి చాలా షాకింగ్ విషయాలే వెల్లడించారు శాస్త్రవేత్తలు. ఈ మేరకు అలర్జీపై యేల్ స్కూల్ ఆఫ్ మెడసిన్ వైద్య పరిశోధకులు అధ్యయనం నిర్వహించారు. ఇందుకు ప్రధాన కారణం రోగ నిరోధక వ్యవస్థే కీలకమని వెల్లడించారు. దీనికి సంబంధించిన పరిశోధన నేచర్ జర్నల్‌లో ప్రచురితమయ్యింది. పరిశోధన ప్రకారం..ఏదైన పడని ఆహారం లేదా ఫుడ్ ఎలర్జీ ఉన్నవారిలో సడెన్‌గా సంభవించే మార్పుల్లో రోగ నిరోధక వ్యవస్థే కీలకపాత్ర పోషిస్తుందని అధ్యయనంలో తేలింది. రోగనిరోధక వ్యవస్థే శరీరంలో మార్పులను నియంత్రిస్తుందని ఈ పరిశోధనలో వెల్లడయ్యింది. ఈ మేరకు యూల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ప్రొఫెసర్ మాట్లాడతూ..మన శరీరానికి హాని చేసే విషపదార్థాలకు వ్యతిరేకంగా మన మెదడు రక్షణాత్మక చర్యలను తీసుకునేలా ఈ రోగనిరోధక వ్యవస్థే ప్రేరేపిస్తుందని కనుగొన్నామన్నారు. ఈ రోగ నిరోధక వ్యవస్థ కమ్యూనికేషన్ లేకుండా మెదడు పర్యావరణంలో సంభావ్య ప్రమాదాల గురించి శరీరాన్ని హెచ్చరించ లేదని కూడా తెలిపారు. అందుకోసం కొన్ని ఎలుకలపై అధ్యయనం నిర్వహించినట్లు తెలిపారు. కోడి గుడ్లలో ఉండే ఓవా అనే ప్రోటీన్‌కు అలెర్జీ ప్రతిచర్యలు ఉంటాయని గుర్తించారు. దీంతో పరిశోధకులు ఎలుకలకు ఈ ఓవాతో కలిపిన నీటిని ఇవ్వగా..వాటిలో కొన్ని ఎలుకలు ఆ నీటిని నివారించేందుకు మొగ్గు చూపుతాయి. మరికొన్ని ఆ నీటిని ఇష్టపడటం గమనించారు. కొన్ని ఎలుకలు నెలల తరబడి గుడ్డు ఓవా నీటి పట్ల విముఖతను చూపించాయి. ఈ రోగనిరోధక వ్యవస్థలో వేరియబుల్స్‌ను మార్చడం ద్వారా ఎలుకల్లో ఈ విముఖత ప్రవర్తనను మార్చగలమా అనే దిశగా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. అంటే రోగనిరోధక వ్యవస్థ ద్వారా ఉత్పత్తి చేయబడిన ఇమ్యునోగ్లోబులిన్ (IgE) ప్రతిరోధకాలను నిరోధించినట్లయితే ఈ గుడ్డు ఓవా నీటికి అలెర్జీ ఉన్న ఎలుకలకు ఆ ప్రోటీన్ పట్ల ఉన్న విరక్తిని కోల్పోతాయని కనుగొన్నారు. ఇక్కడ ఒక కమ్యూనికేటర్ లేకుండా ఇదంతా జరగదని గుర్తించారు. దీని అర్థం రోగనిరోధక వ్యవస్థను ఉత్పత్తి చేసే IgE ప్రతిరోధకాలు మెదడుని మాస్ట్ కణాల విడుదలను ప్రేరేపించేలా కమ్యూనికేట్ చేస్తుందని. తద్వారా ఎలుకలు విరక్తి ప్రవర్తన లేదా ఇన్ఫెక్షన్ రావడం జరుగుతుందని చెప్పారు. అంతేగాదు జంతువులకు పర్యావరణంలో ఎదురయ్యే ప్రమాదాలను నివారించేలా రోగనిరోధక వ్యవస్థ ఎల అభివృద్ధి చెంది ఉందో ఈ పరిశోధన వివరించిందన్నారు శాస్త్రవేత్తలు. (చదవండి: జస్ట్ చెమటతోనే డయాబెటిస్‌ని గుర్తించే సరికొత్త సాంకేతిక పరికరం!) -
కరోనా వైరస్ పుట్టుకపై మరో షాకింగ్ కోణం..
న్యూయార్క్: కరోనా వైరస్ పుట్టుకపై ఇది మరో కొత్త విశ్లేషణ. ఇన్నాళ్లూ గబ్బిలాల నుంచి ఈ వైరస్ సంక్రమించిందని భావిస్తూ ఉంటే కొందరు అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం శునకాల నుంచి వచ్చిందని తమ పరిశోధనల్లో వెల్లడైనట్టు చెప్పారు. చైనాలోని వూహాన్ సీఫుడ్ మార్కెట్లో సేకరించిన జన్యు నమూనాలను అధ్యయనం చేస్తే వూహాన్ మార్కెట్లో అమ్ముతున్న రకూన్ డాగ్స్ నుంచే వైరస్ వ్యాప్తి చెందిందని తేల్చారు. ఈ కొత్త విశ్లేషణను న్యూయార్క్ టైమ్స్ పత్రిక ప్రచురించింది. జనవరి 2020లో కొందరు శాస్త్రవేత్తలు వూహాన్ మార్కెట్లో శాంపిల్స్ సేకరించారు. అప్పటికే కొత్త వైరస్ ఆందోళనతో వూహాన్ మార్కెట్ అంతా ఖాళీ చేయించారు. ఆ మార్కెట్ గోడలపైన, నేలపైన, జంతువుల్ని ఉంచే పంజరాల్లోనూ జన్యు నమూనాలు సేకరించి అధ్యయనం చేశారు. ఆ నమూనాల్లో అత్యధిక భాగం రకూన్ డాగ్స్‌తో సరిపోలాయని శాస్త్రవేత్తల బృందం తేల్చింది. ఈ వివరాలను చైనా శాస్త్రవేత్తలతోనూ వారు పంచుకున్నారు. అయితే ఆ తర్వాత గ్లోబల్ ఇనీషియేటివ్ ఆన్ షేరింగ్ ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా డేటా (జీఐఎస్ఏఐడీ) నుంచి ఈ డేటా మాయం అయిపోయిందని ఆ శాస్త్రవేత్తలు చెప్పారు. అరిజోనా యూనివర్సిటీ, కాలిఫోర్నియాలో స్క్రిప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సిడ్నీ యూనివర్సిటీ వైరాలజిస్టులు ఈ బృందంలో ఉన్నారు. రకూన్ డాగ్స్ నుంచే మనుషులకి సంక్రమించిందా లేదా అన్నది శాస్త్రవేత్తలు స్పష్టంగా చెప్పలేకపోయారు. శునకాల నుంచి మనుషులకే నేరుగా సోకొచ్చు లేదా ఆ డాగ్స్ నుంచి వేరే జంతువుకి వెళ్లి మనుషులకి సోకి ఉండొచ్చని అన్నారు. -
డౌట్ లేదు కరోనా పుట్టింది అక్కడే.. తేల్చిన అధ్యయనం
బీజింగ్: కరోనా వైరస్ వ్యాప్తి మొదలైనప్పటి నుంచి దాని మూలలపై తీవ్ర చర్చ జరిగింది. చైనాలోని వుహాన్ ల్యాబ్ నుంచే వైరస్ బయటకు వచ్చిందనే ప్రచారమూ జరిగింది. చైనా మాత్రం దీన్ని ఖండించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా కోవిడ్-19 ఎక్కడ పుట్టిందనే విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే తాజాగా కరోనా మూలాలపై అధ్యయనం చేసిన రెండు నివేదికలు వైరస్ వ్యాప్తి వుహాన్‌లోనే మొదలైందని స్పష్టం చేశాయి. అయితే ఇది కచ్చితంగా వుహాన్ ల్యాబ్‌లో పుట్టలేదని, అదే నగరంలోని సీఫుడ్ మార్కెట్ నుంచే దీని వ్యాప్తి మొదలైందని పేర్కొన్నాయి. అడవి జంతువులు, క్షీరదాల విక్రయాలు జరిగే సమయంలో వైరస్ ఉత్పరివర్తనం చెంది మనుషులకు వ్యాపించి ఉంటుందని స్పష్టం చేశాయి. రెండు నివేదికలు అడవిలోని క్షీరదాల్లోనూ సార్స్ కోవ్-2 వైరస్ ఉన్నట్లు వెల్లడించాయి. 2019 నవంబర్ ముందు వరకు సార్స్ కోవ్-2 మనుషులకు వ్యాపించలేదని అధ్యయనం స్పష్టం చేసింది. 2019 డిసెంబర్ 20 నాటికి వెలుగు చూసిన తొలి 8 కరోనా కేసులు వుహాన్ సీ ఫుడ్ మార్కెట్ ఉన్న పశ్చిమ ప్రాంతంలోనే నమోదయ్యాయని అధ్యయానాలు పేర్కొన్నాయి. చైనాలో వెలుగుచూసిన కరోనా ఆ తర్వాత ప్రపంచ దేశాలకు విస్తరించి అతలాకుతలం చేసింది. ఈ మహమ్మారి ధాటికి ప్రపంచవ్యాప్తంగా 60లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పాయరు. అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలి విపత్కర పరిస్థితిని ఎదుర్కొన్నాయి. చదవండి: మంకీపాక్స్ అలానే సోకదు... ఒక్కోసారి..: డబ్ల్యూహెచ్ఓ -
అమ్మ కోసం చిరు చేసిన వంట
-
చిరు చేసిన 'చేపల వేపుడు’ వీడియో చూశారా!
ఇటీవల సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి నిత్యం ఎంతో సందడి చేస్తున్నారు. ఓ వైపు కరోనాపై అవగాహన కల్పిస్తూనే పలు ఇంట్రెస్టింగ్ విషయాలని షేర్ చేస్తున్నారు. ఆదివారం ఉదయం తాను ‘చింత తొక్కుతో చిన్న చేపల గుజ్జు వేపుడు…’ చేస్తానంటూ ఓ ట్వీట్ చేశారు. సాయంత్రం 4 గంటలకు అది విడుదల చేస్తానని ప్రకటించారు. అయితే విజయవాడలో నిన్న జరిగిన విషాద ఘటనతో కలత చెందిన చిరు.. ఈ వీడియో విడుదలను వాయిదా వేసి, సోమవారం ఉదయం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. (చదవండి : ఐదు నిమిషాల్లో 346 సినిమా పేర్లు ) ‘అమ్మ కోసం అమ్మ నేర్పిన వంట’ అంటూ చింత తొక్కుతో చిన్న చేపల గుజ్జు వేపుడు వంట తాలూకు వీడియోను సోషల్ మీడియాలో అభిమానుల కోసం పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. చిరు కోడలు ఉపాసన మెగాస్టార్ వంటకి ఫిదా అయినట్టు కామెంట్ పెట్టింది. చిరంజీవి ప్రస్తుతం ‘ఆచార్య’ చిత్రంలో నటిస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రామ్ చరణ్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. -
వైజాగ్ చేప.. ‘కోనాం’గలరా?
డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ): విశాఖ మత్స్యకారులకు బుధవారం అతి భారీకొమ్ము కోనాం చేపలు లభ్యమయ్యాయి. ఫిషింగ్ హార్బర్లో బుధవారం సాయంత్రం సుమారు 20 వరకు కొమ్ము కోనాం చేపలను విక్రయించారు. ఒక్కో కొమ్ము చేప 100 కేజీల నుంచి 800 కేజీల బరువు తూగాయి. వీటి ధర రూ.15 వేల నుంచి రూ.50 వేలు పలికింది. ఇంత బరువున్న చేపలను నీటిలో నుంచి బయటకు తీసేందుకు జాలర్లు కష్టపడాల్సి వచ్చింది. వీటిని వేలం పాటలో పాడుకునేందుకు జనం పెద్దఎత్తున తరలివచ్చారు. -
సేంద్రియ ఆక్వా సాగుకు ఎంపెడా సమాయత్తం!
చేపలు, రొయ్యల సాగులో సేంద్రియ పద్ధతులను ప్రోత్సహించడానికి సముద్ర ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి సంస్థ(ఎంపెడా) సమాయత్తమవుతున్నది. సేంద్రియ ఆక్వా సాగులో ఖర్చు పెరుగుతుంది కాబట్టి సాధారణంగా ఆక్వా రైతులు వెనుకడుగు వేస్తుంటారు. అయితే, సేంద్రియ ఆక్వా ఉత్పత్తులకు 15 శాతం అధిక ధర చెల్లించి కొనుగోలు చేయడానికి విదేశీ సంస్థలు ముందుకొస్తున్నందున ఇక మీదట ఆ ఇబ్బంది ఉండబోదని ఎంపెడా చైర్మన్ ఎ.జయతిలక్ అంటున్నారు. స్విట్జర్లాండ్‌కు చెందిన అతిపెద్ద వినియోగదారుల సహకార సంస్థ ‘కూప్ కో–ఆపరేటివ్’కు అత్యంత నాణ్యమైన సేంద్రియ ఆక్వా సాగు, అంతర్జాతీయ సేంద్రియ ఆక్వా సర్టిఫికేషన్ పద్ధతులు తదితర అంశాల్లో పాతికేళ్ల అనుభవం ఉంది. గోవాలో ఇటీవల జరిగిన అంతర్జాతీయ సీఫుడ్ షో–2018లో కూప్ కోఆపరేటివ్‌తో ‘ఎంపెడా’ అవగాహన కుదుర్చుకుంది. దేశీయంగా ఆక్వా సంస్థలు, రైతులతో సేంద్రియ ఆక్వా సాగు చేయించడంతోపాటు 15% అదనపు ధరకు కొనుగోలు చేయడానికి కూప్ కో–ఆపరేటివ్ అంగీకరించిందని ఎంపెడా చైర్మన్ తెలిపారు. సేంద్రియ సాగుకు సీడ్‌ను అందించేందుకు హేచరీ, మేత తయారీ కర్మాగారం, సేంద్రియ సాగు పద్ధతులపై సాంకేతిక సహకారం, శిక్షణ, దేశ,విదేశీ మార్కెట్ల కోసం సర్టిఫికేషన్, ఒప్పంద కొనుగోళ్లు.. వీటన్నిటిలోనూ ఆ సంస్థ తోడ్పాటును అందించనుంది. వియత్నాంలో సేంద్రియ ఆక్వా సాగును ప్రోత్సహిస్తున్న కూప్ కో–ఆపరేటివ్.. దిగుమతి చేసుకున్న ఆక్వా ఉత్పత్తులను స్విట్జర్లాండ్‌లో తన 2,200 అవుట్లెట్ల ద్వారా విక్రయిస్తోంది. -
భోజనంలో ముత్యం..
ఓ అమెరికన్‌ను అదృష్టం ఈ అరుదైన ముత్యం రూపంలో వరించింది. వాషింగ్టన్‌లోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లిన లిండ్సే హాస్జ్ అనే మహిళకు సీఫుడ్‌లో ఇది దొరికింది. దాన్ని తీసుకెళ్లి రత్నాల నిపుణుడికి చూపించగా అది కువాహాగ్ జాతి ముత్యమని,రూ.41 వేల ధర పలుకుందని చెప్పాడు.