Megastar Chiranjeevi Prepared a Special Dish for his Mom, Video Went Viral | అమ్మ కోసం చిరు చేసిన వంట - Sakshi
Sakshi News home page

అమ్మ కోసం చిరు చేసిన వంట

Published Mon, Aug 10 2020 11:29 AM | Last Updated on Mon, Aug 10 2020 6:40 PM

Chiranjeevi Preparing Seafood Video Viral - Sakshi

ఇటీవల సోష‌ల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి నిత్యం ఎంతో సందడి చేస్తున్నారు. ఓ వైపు క‌రోనాపై అవ‌గాహ‌న క‌ల్పిస్తూనే ప‌లు ఇంట్రెస్టింగ్ విష‌యాల‌ని షేర్ చేస్తున్నారు. ఆదివారం ఉద‌యం తాను ‘చింత తొక్కుతో చిన్న చేపల గుజ్జు వేపుడు…’ చేస్తానంటూ ఓ ట్వీట్ చేశారు. సాయంత్రం 4 గంటలకు అది విడుదల చేస్తానని ప్రకటించారు. అయితే విజయవాడలో నిన్న జరిగిన విషాద ఘటనతో కలత చెందిన చిరు.. ఈ వీడియో విడుదలను వాయిదా వేసి, సోమవారం ఉదయం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. (చదవండి : ఐదు నిమిషాల్లో 346 సినిమా పేర్లు )

‘అమ్మ కోసం అమ్మ నేర్పిన వంట’ అంటూ చింత తొక్కుతో చిన్న చేపల గుజ్జు వేపుడు వంట తాలూకు వీడియోను సోషల్ మీడియాలో అభిమానుల కోసం పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. చిరు కోడ‌లు ఉపాస‌న మెగాస్టార్ వంటకి ఫిదా అయిన‌ట్టు కామెంట్ పెట్టింది. చిరంజీవి ప్రస్తుతం ‘ఆచార్య’ చిత్రంలో నటిస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రామ్ చరణ్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement