బ్రెడ్‌ని మిగతా ఆహార పదార్థాల్లానే ఫ్రిజ్‌లో పెడుతుంటారు చాలమంది. అయితే ఇలా ఫ్రిజ్‌లో పెట్టిన బ్రెడ్‌ని ఆహారంగా తీసుకోవడం మంచిదంటున్నారు వైద్యులు. పైగా ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిందటూ చాలా షాకింగ్ విషయాలు చెబుతున్నారు. ఎలా ప్రిజ్‌లో ఉంచిన నిల్వ బ్రెడ్ మంచిది? ఎలా ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది?
నిజానికి బ్రెడ్ వంటివి ఎక్కువ తీసుకోవద్దని డాక్టర్లు చెబుతుంటారు. వాటిలో గ్లూకోజ్ కంటెంట్ ఎక్కువ ఉంటుందని, పైగా బేక్ చేసే బేకరీ పదార్థాలని అస్సలు వద్దనే చెబుతారు. అలాంటిది ప్రిజ్‌లో నిల్వ ఉంచిన బ్రెడ్‌ని మాత్రం తీసుకుంటే మంచిదని వైద్యులు ఎలా చెబుతున్నారు?. పైగా పరిశోధనలో ఇలాంటి బ్రెడ్ తీసుకున్న వారిలో మంచి ఫలితం కనిపించిందంటూ ఆశ్చర్యకర విషయాలు చెబుతున్నారు పోషకాహార నిపుణుడు డాక్టర్ అమీ షా.
ఎందువల్ల మంచిందంటే..?
తాజా వైట్ బ్రెడ్ కంటే నిల్వ ఉంచిన బ్రెడ్ మంచిది. అదికూడా ఫ్రిజ్‌లో నిల్వ ఉన్నది మంచిదని అంటున్నారు. ఇలా ఫ్రీజర్‌లో నిల్వ ఉండటం వల్ల గ్లైసమిక్ ఇండిక్స్ తగ్గి ఆరోగ్యకరమైన స్టార్చ్‌గా మారుతుందని చెబుతున్నారు. ఇలా నిల్వ ఉండటం వల్ల శరీరానికి అవసరమైన గట్ బ్యాక్టీరియా దీని వల్ల లభిస్తుందని చెబుతున్నారు. ఈ విషయమై 2008లో జరిపిన పరిశోధనలో చాలా ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయని షా చెప్పారు.
ఈ మేరకు ఆక్స్‌ఫర్డ్ బ్రూక్స్ యూనివర్సిటీ పరిశోధన బృందం దీని గురించి సుమారు 22 నుంచి 59 ఏళ్ల వయస్సు ఉన్న పదిమంది పురుషులు, మహిళలపై అధ్యయనం చేసినట్లు తెలిపారు. వారికి ఇంట్లో తయారు చేసిన బ్రెడ్, మార్కెట్‌లో దొరికే బ్రెడ్‌లను వేర్వేరుగా నిల్వ చేసి ఇచ్చారు. కొందరికి తాజా బ్రెడ్ ఇవ్వగా, మరికొందరికి నిల్వ చేసింది ఇచ్చారు. మిగతా వారికి నిల్వ ఉంచి, రోస్ట్ చేసింది ఇచ్చారు.
తాజాగా ఇంట్లో తయారుచేసిన బ్రెడ్‌తో పోలిస్తే, బ్రెడ్‌ను నిల్వ చేసి రోస్ట్ చేసినప్పుడూ బ్లడ్‌లో గ్లూకోజ్ స్థాయిలు గణనీయంగా తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అదే విధంగా మార్కెట్లో కొన్న వైట్ బ్రెడ్‌తో పోలిస్తే బ్రెడ్‌ని రోస్ట్ చేసిందే బెటర్ అని తేలింది. అలాగే ఈ బ్రెడ్‌ని కూడా నిల్వ చేసి రోస్ట్ చేసి తీసుకుంటే గ్లూకోజ్ లెవెల్స్ తక్కువగా ఉంటాయని చెప్పారు. దీన్ని ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యానికి కూడా మంచిదని అన్నారు.
ఇలా ఈ నిల్వ ఉండటం వల్ల వాటిలో కిణ్వన ప్రక్రియ జరిగి శరీరానికి అవసరమయ్యే మంచి బ్యాక్టీరియా అంది షుగర్ సంబంధిత సమస్యలు ఉత్పన్నం కాకుండా చేస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అయితే ఇంకెందుకు ఆలస్యం వైట్ బ్రెడ్‌ని తినేందుకు జంకకండి. చక్కగా తెచ్చుకుని ఒక రాత్రి ఫ్రిజ్‌లో పెట్టి రోస్ట్ చేసుకుని హాయిగా ఆస్వాదించండి.
(చదవండి: మసాలా దినుసులు ఘాటు పోకూడదంటే..ఇలా స్టోర్ చేయండి!)
Comments
Please login to add a commentAdd a comment