
దుమ్ము... దుమ్ము ... దుమ్ దుమ్ దుమ్ దుమ్ దుమ్ము...
ఆస్తమా పేషంట్లూ ఇంట్లోనే ఉండండి! ఎలర్జీలున్న వాళ్లూ బయటకి రాకండి. మామూలు వాళ్లూ కళ్లద్దాల్లేకుండా బైక్ ఎక్కకండి!!
ఇంగ్లండ్ ఇప్పుడు తన ప్రజలందరికీ జారీ చేసిన హెచ్చరిక ఇది. లండన్, సౌత్ ఇంగ్లండ్, మిడ్ లాండ్స్, వేల్స్ వంటి ప్రాంతాల్లో ఇప్పటికే ప్రమాదకర పరిస్థితులున్నాయని ప్రభుత్వం చెబుతోంది.
ఆఫ్రికాలోని సహారా ఎడారిలో మొదలైన ఈ ధూళి తుఫాను ఆఫ్రికా దేశాలను చుట్టబెట్టింది. నెమ్మదిగా యూరప్ మీద పడింది. ఇప్పటికే పారిస్, బ్రసెల్స్ వంటి ప్రాంతాల్లో ఆఫ్రికా దుమ్ము దుమ్ము రేపుతోంది. ఇక లండన్ వరకూ వచ్చేస్తోంది.
ఈ దుమ్ము, ఇప్పటికే ప్రధాన నగరాల్లో ఉన్న వాహన కాలుష్యం కలిసి లవ్వాడేసుకుంటున్నాయి. దీంతో ముందు ఏముందో కనపడని పరిస్థితి ఉంది. ఇప్పుడు లండన్ నగరానికి కూడా ఆఫ్రికన్ దుమ్ము వచ్చేస్తే పరిస్థితి ఏమవుతుందోనని బ్రిటన్ ఇప్పుడు కంగారు పడుతోంది. ఇప్పుడు ఉత్తర దిశగా దుమ్ము వ్యాపిస్తోంది. ఇప్పుడు బ్రిటన్ 'ఉత్తరం ఊపి కొట్టింది. దక్షిణం దంచి కొట్టింది. ఇక ఏమవుతుందో' అని కలవరపడుతోంది.