Policyholders
-
మ్యాక్స్‌లైఫ్ మిడ్‌క్యాప్ మూమెంటమ్ ఫండ్
మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ యులిప్ పాలసీదారుల కోసం ‘మిడ్‌క్యాప్ మూమెంటమ్ ఇండెక్స్ ఫండ్’ను ప్రారంభించింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ 150 మూమెంటమ్ 50 ఇండెక్స్‌ను అనుసరించి ఇది పెట్టుబడులు పెడుతుంటుంది. అంటే ఇండెక్స్‌లోని స్టాక్స్‌లోనే వెయిటేజీ ఆధారంగా పెట్టుబడులు పెడుతుంది. కనుక దీన్ని ఇండెక్స్ ఫండ్‌గా పరిగణించొచ్చు. ఈ ఇండెక్స్ రాబడులు ఐదేళ్లలో ఏటా 28.7 శాతం, పదేళ్లలో ఏటా 26.7 శాతంగా ఉన్నట్టు మ్యాక్స్‌లైఫ్ ప్రకటించింది. ఈ నెల 29వ తేదీ వరకు ఈ నూతన ఫండ్‌లో పాల్గొనవచ్చని పేర్కొంది. ఇండెక్స్‌లోని స్టాక్స్‌లోనే పెట్టుబడులు పెడుతుంది కనుక రాబడులు కూడా దానినే ప్రతిఫలించే మాదిరిగా ఉంటాయని ఆశించొచ్చు. ఒక యూనిట్ ఎన్ఏవీ రూ.10. మిడ్‌క్యాప్ విభాగంలో వ్యూహాత్మక పెట్టుబడుల అవకాశాలను సొంతం చేసుకోవచ్చని మ్యాక్స్‌లైఫ్ పేర్కొంది. -
పాలసీదారులకు రిలయన్స్ నిప్పన్ లైఫ్ బోనస్
ముంబై: రిలయన్స్ నిప్పన్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీదారులకు గడిచిన ఆర్థిక సంవత్సరానికి (2022–23) రూ.344 కోట్ల బోనస్‌ను ప్రకటించింది. పార్టిసిపేటరీ పాలసీదారులకే ఈ బోనస్ లభించనుంది. గత ఆర్థిక సంవత్సరానికి ఈ సంస్థ రూ.108 కోట్ల నికర ఆదాయాన్ని ప్రకటించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 65 శాతం అధికమని తెలిపింది. (ఇదీ చదవండి: భారీ లక్ష్యాల దిశగా పతంజలి ఫుడ్స్ - కొత్త ఉత్పత్తుల విడుదలకు సన్నాహాలు!) ఈ బోనస్ 5.69 లక్షల పార్టిసిపేటరీ పాలసీదారులకు ప్రయోజనకరంగా ఉంటుందని సంస్థ సీఈవో ఆశిష్ వోహ్రా పేర్కొన్నారు. గత 22 ఏళ్లుగా సంస్థ పాలసీదారులకు బోనస్ ఇస్తున్నట్టు చెప్పారు. రిలయన్స్ నిప్పన్ లైఫ్ నిర్వహణలో మొత్తం రూ.30,609 కోట్ల ఆస్తులు ఉన్నాయి. 2023 మార్చి నాటికి సంస్థ మొత్తం రూ.85,950 కోట్ల బీమా రక్షణకు హామీదారుగా ఉంది. -
సహారా లైఫ్ విలీనం కాదు.. పాలసీల బదిలీ
న్యూఢిల్లీ: సహారా లైఫ్‌ను తాము విలీనం చేసుకోవడం లేదని ఎస్బీఐ లైఫ్ స్పష్టం చేసింది. బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) ఆదేశాల మేరకు సహారా లైఫ్ ఇన్సూరెన్స్ నిర్వహణలోని పాలసీ దారుల ఆస్తులు, అప్పులను స్వాధీనం చేసుకుంటున్నట్టు తెలిపింది. సహారా లైఫ్ ఇన్సూరెన్స్ ఆర్థిక పరిస్థితులు క్షీణించడంతో సంస్థ జారీ చేసిన పాలసీలు, వాటి ఆస్తులు, అప్పులను స్వాధీనం చేసుకోవాలంటూ గత శుక్రవారం ఐఆర్డీఏఐ ఎస్బీఐ లైఫ్‌ను ఆదేశించడం గమనార్హం. మెరుగైన సేవలు అందిస్తామని సహారా లైఫ్ పాలసీదారులకు ఎస్బీఐ లైఫ్ అభయమిచ్చింది. ‘‘సహారా లైఫ్ పాలసీలను మా వ్యవస్థతో అనుసంధానించేందుకు వేగవంతమైన చర్యలు మొదలు పెట్టాం. పూర్తి స్థాయి ఏకీకరణకు కొంత సమయం పడుతుంది. సహారా లైఫ్ పాలసీదారులు 1800 267 9090 టోల్ ఫ్రీ నంబర్లో లేదా ట్చజ్చిట్చ జీజ్ఛఃటbజీ జీజ్ఛ. ఛిౌ. జీn మెయిల్ ఐడీ ద్వారా సంప్రదించాలని ఎస్బీఐ లైఫ్ సూచించింది. సహారా లైఫ్ కొత్తగా పాలసీలను విడుదల చేయరాదని కూడా ఐఆర్డీఏఐ ఆదేశించడం గమనార్హం. తగినంత సమయం, తగినన్ని అవకాశాలు కల్పించినప్పటికీ తమ ఆదేశాలను పాటించడంలో., పాలసీదారుల ప్రయోజనాల పరిరక్షణకు నిర్ణయాత్మక చర్యలు తీసుకోవడంలో సహారా లైఫ్ ఇన్సూరెన్స్ విఫలమైందని ఆఆర్డీఏఐ తన ఆదేశాల్లో పేర్కొంది. -
కమీషన్లపై బీమా కంపెనీలకు స్వేచ్ఛ
న్యూఢిల్లీ: కమీషన్ల పరంగా పరిమితులను బీమా రంగ అభివృద్ధి, నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏఐ) తొలగించింది. బీమా కంపెనీలు తమ పాలసీలను విక్రయించే మధ్యవర్తులకు కమీషన్లు చెల్లిస్తుంటాయి. ఈ భారం పరోక్షంగా పాలసీదారులపైనే పడుతుంది. అందుకే లోగడ ఈ విషయంలో ఐఆర్డీఏఐ పరిమితులు పెట్టింది. తాజాగా వీటిని ఎత్తివేస్తున్నట్టు తెలిపింది. మధ్యవర్తులకు ఎంత కమీషన్ చెల్లించాలన్నది బీమా కంపెనీలే నిర్ణయించుకోవచ్చని పేర్కొంది. కాకపోతే పాలసీదారుల ప్రయోజనాలకు భంగం కలగకుండా ఇది ఉండాలని స్పష్టం చేసింది. పాలసీదారులు, ఏజెంట్ల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కమీషన్ పాలసీని ఇన్సూరెన్స్ కంపెనీ బోర్డ్ రూపొందించుకోవాలంటూ తాజాగా విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొంది. కమీషన్లలో సౌలభ్యం ఉంటే అది దేశంలో బీమా కవరేజీ వ్యాప్తికి దోహదపడుతుందని, వ్యయాల పరంగా సామర్థ్యాలను పెంచుతుందని పేర్కొంది. బోర్డు స్థాయిలో నిర్ణయించే కమీషన్ అనేది తాజా నోటిఫికేషన్లో పేర్కొన్న నిర్వహణ వ్యయ పరిమితుల పరిధిలోనే ఉండాలని స్పష్టంగా నిర్ధేశించింది. నూతన నిబంధనలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. నోటిఫికేషన్ తేదీ నుంచి ప్రతి మూడేళ్లకోసారి నిబంధనలను సమీక్షిస్తామని ఐఆర్డీఏఐ ప్రకటించింది. ఇప్పటి వరకు బీమా కంపెనీలు చెల్లించే కమీషన్లను ఉత్పత్తుల వారీగా ఐఆర్డీఏఐ నిర్ణయిస్తోంది. తాజా సవరణలు ఆవిష్కరణలను ప్రోత్సహిస్తాయనే అభిప్రాయాన్ని ఐఆర్డీఏఐ వ్యక్తం చేసింది. నూతన వ్యాపార నమూనాలు, ఉత్పత్తులు, వ్యూహాల అభివృద్ధికి వీలు కల్పిస్తాయని పేర్కొంది. సవరించిన నిర్వహణ వ్యయ పరిమితులు, కమీషన్ పరిమితులు అనేవి సరైన మార్గంలో ఉన్నాయని బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ తపన్ సింఘాల్ తెలిపారు. -
యులిప్స్‌కు పెరుగుతున్న డిమాండ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుతం పాలసీదారులు తమ ఆర్థిక అవసరాలు, లక్ష్యాల సాధన కోసం యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీలు (యులిప్‌లు), గ్యారంటీ ప్లాన్ల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని ప్రైవేట్ రంగ జీవిత బీమా సంస్థ ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్ చీఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్ (సీడీవో) రాహుల్ అగర్వాల్ తెలిపారు. ఇందుకు అనుగుణంగానే తాము ఇటీవలే ఎక్సైడ్ లైఫ్ స్మార్ట్ ఇన్‌కం ప్లాన్‌ను ప్రవేశపెట్టామని చెప్పారు. ఇది ఇటు జీవితాంతం లైఫ్ కవరేజీ ఇవ్వడంతో పాటు అటు క్రమానుగతంగా ఆదాయం కూడా అందించే సాధనమని వివరించారు. మరోవైపు, పెట్టుబడుల పోర్ట్‌ఫోలియోలో టర్మ్ ప్లాన్ తప్పనిసరిగా ఉండాల్సిన సాధనమని ఆయన పేర్కొన్నారు. సాధారణంగా జీవిత బీమా పాలసీలంటే మరణానంతరం మాత్రమే ప్రయోజనం చేకూర్చే సాధనాలుగా ఒక ప్రతికూల అభిప్రాయం ఉండటం వల్ల వీటి గురించి మాట్లాడేందుకు ఎక్కువగా ఎవరూ ఇష్టపడరని అగర్వాల్ చెప్పారు. అయితే, కోవిడ్ రాకతో పరిస్థితులు మారాయని, జీవితంలో అనిశ్చితి గురించి అందరూ గ్రహిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కోవిడ్ పరిణామాల అనంతరం తాము కూడా గణనీయంగా డిజిటల్‌కు మళ్లుతున్నామని వివరించారు. -
ఎల్ఐసీ వద్ద క్లెయిమ్ చేయని నిధి రూ. 21,500 కోట్లు..!
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ ఎల్ఐసీ వద్ద క్లెయిమ్ చేయని పాలసీదారుల నిధులు 2021 సెప్టెంబర్ నాటికి రూ.21,500 కోట్ల మేర ఉన్నాయి. ఐపీవో కోసం సెబీ వద్ద దరఖాస్తు చేసిన పత్రాల్లో (డీఆర్‌హెచ్‌పీ) ఎల్ఐసీ ఈ వివరాలను పేర్కొంది. క్లెయిమ్ చేయని అసలుతోపాటు, దానిపై వడ్డీ కలిపి ఈ మొత్తం ఉన్నట్టు తెలిపింది. క్లెయిమ్ చేయని నిధి 2019 మార్చి నాటికి రూ.13,843 కోట్లు, 2020 మార్చి నాటికి రూ.16,052 కోట్లు, 2021 మార్చి నాటికి రూ.18,495 కోట్ల చొప్పున ఉన్నట్టు పేర్కొంది. రూ.1,000 అంతకుమించి క్లెయిమ్ చేయని ఫండ్స్ వివరాలను తన వెబ్సైట్లోనూ ఎల్ఐసీ ప్రకటించాల్సి ఉంటుంది. దానివల్ల పాలసీదారులు తమకు రావాల్సిన ప్రయోజనాల గురించి తెలుసుకునేందుకు వీలుంటుంది. పదేళ్లపాటు ఇలా క్లెయిమ్ రాకపోతే ఆ మొత్తాన్ని సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ ఫండ్ (ఎస్‌సీడబ్ల్యూఎఫ్)కు బదిలీ చేయాలని ఐఆర్డీఏఐ నిబంధనలు చెబుతున్నాయి. అన్ని బీమా సంస్థలకు ఇవే నిబంధనలు వర్తిస్తాయి. -
ఎల్ఐసీ పాలసీదారులకు అలర్ట్..! కచ్చితంగా..
ముంబై: రాబోయే పబ్లిక్ ఇష్యూలో (ఐపీవో) షేర్లను కొనుగోలు చేసేందుకు ఎల్ఐసీ పాలసీదారులు ఫిబ్రవరి 28లోగా తమ పర్మనెంట్ అకౌంటు నంబరు (పాన్) వివరాలను.. పాలసీ రికార్డులో అప్డేట్ చేసుకోవాల్సి రానుంది. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ఫిబ్రవరి 13న ఎల్ఐసీ దాఖలు చేసిన ముసాయిదా ప్రాస్పెక్టస్‌లో సంస్థ ఈ విషయం పేర్కొంది. ప్రాస్పెక్టస్ దాఖలు చేసిన రెండు వారాలు ముగిసేలోగా పాన్ వివరాలను ఎల్ఐసీ వద్ద అప్డేట్ చేసుకోని పాలసీదార్లను..షేర్ల కొనుగోలుగా అర్హులుగా పరిగణించబోమని తెలిపింది. కంపెనీ వెబ్సైట్లో నేరుగా లేదా ఏజెంట్ల సహాయంతో అప్డేషన్ చేసుకోవచ్చని వివరించింది. డీఆర్‌హెచ్‌పీ దాఖలు చేసే నాటికి, బిడ్/ఆఫర్ ప్రారంభమయ్యే తేదీ నాటికి ఒకటి లేదా అంతకు మించి పాలసీలు ఉన్న వారు.. పాలసీహోల్డర్ రిజర్వేషన్ పోర్షన్ కింద షేర్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు అర్హులై ఉంటారని పేర్కొంది. వారికి డీమ్యాట్ ఖాతా కూడా ఉండాలి. ఇష్యూలో దాదాపు 10 శాతం వరకూ పాలసీదారుల కోసం కేటాయించవచ్చని, పాలసీహోల్డర్లకు ఐపీవో ఇష్యూ ధరలో దాదాపు 10 శాతం వరకూ డిస్కౌంటు లభించే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం.. ఐపీవో కింద ఎల్ఐసీలో 5% వాటా (31.6 కోట్ల షేర్లు) విక్రయించనుంది. దీని విలువ దాదాపు రూ. 63,000 కోట్లుగా ఉంటుందని, ఇష్యూ మార్చిలో ఉంటుందని అంచనా. చదవండి: ఎల్ఐసీ ఐపీఓలో పాల్గొనే పాలసీదారులకు షాక్..! -
LIC IPO: పాన్ నంబరు అప్డేట్ చేయండి.. ఎల్ఐసీ సూచన
న్యూఢిల్లీ: ప్రతిపాదిత పబ్లిక్ ఇష్యూలో పాల్గొనేందుకు తమ తమ పాన్ నంబర్లను అప్డేట్ చేయాల్సిందిగా పాలసీదారులకు ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) సూచించింది. ఇష్యూకి సబ్స్క్రయిబ్ చేయాలంటే కంపెనీ రికార్డుల్లో పాలసీదారుల తాజా పాన్ వివరాలు ఉండాలని, అలాగే చెల్లుబాటయ్యే డీమ్యాట్ ఖాతా అవసరమని పేర్కొంది. దీనిపై పాలసీహోల్డర్లలో అవగాహన పెంచేందుకు ప్రచార కార్యకర్మాలు నిర్వహిస్తున్నామని ఎల్ఐసీ తెలిపింది. ఒకవేళ ఎవరికైనా డీమ్యాట్ ఖాతా లేకపోతే తమ సొంత ఖర్చుతో ఒక అకౌంటును తీసుకోవాలని పేర్కొంది. సదరు డీమ్యాట్ ఖాతా తెరవడం, నిర్వహణ.. పాన్ జారీ మొదలైన వాటికి అయ్యే ఖర్చు లను పాలసీదారే భరించాల్సి ఉంటుందని, కంపెనీకి సంబంధం లేదని ఎల్ఐసీ స్పష్టం చేసింది. ఐపీవోకి రెడీ ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ ప్రతిపాదనకు ఈ ఏడాది జూలైలో ప్రభుత్వం ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. ఈ ఆర్థిక సంవత్సరంలోనే దీన్ని పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రతిపాదన ప్రకారం ఇష్యూ పరిమాణంలో 10 శాతం దాకా షేర్లను పాలసీదారులకు కేటాయించాల్సి ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా రూ.1.75 లక్షల కోట్లు సమీకరించాలని కేంద్రం నిర్దేశించుకున్న సంగతి తెలిసిందే. ఈ లక్ష్యాన్ని సాధించడంలో ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ కీలకంగా ఉండనుంది. చదవండి: ఎల్ఐసీ ఐపీవోకు మర్చంట్ బ్యాంకర్లు రెడీ -
జీవిత బీమా ‘క్లెయిమ్’ చేయాల్సి వస్తే..?
మనం ఎంతగానో ప్రేమించే వారు దూరమైతే కోలుకోవడానికి సమయం పడుతుంది. అదే సమయంలో దూరమైన వ్యక్తికి సంబంధించి కుటుంబం ఆర్థికంగానూ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. జీవిత బీమా ఉంటే ఈ సవాళ్లను కొంత వరకైనా అధిగమించే శక్తిని సమకూర్చుకోవచ్చు. దురదృష్టవశాత్తూ పాలసీదారు మరణానికి గురైతే నామినీగా నమోదై ఉన్న వారు క్లెయిమ్ (జీవిత బీమా పరిహారం కోసం) ప్రక్రియను ప్రారంభించాల్సి ఉంటుంది. ఇవన్నీ సరిగ్గా, వేగంగా నిర్వహిస్తే.. అంతే వేగంగా పరిహారం చేతికి అందుతుంది. ఇందుకు సంబంధించి అనుసరించాల్సిన విధానాన్ని తెలియజేసే ‘ప్రాఫిట్ ప్లస్’ కథనమే ఇది. క్లెయిమ్ ప్రక్రియను ప్రారంభించడానికి ముందు నామినీగా ఉన్నవారు పాలసీదారు మరణానికి సంబంధించి సమాచారాన్ని జీవిత బీమా సంస్థకు తెలియజేయడం మంచిది. ఈ మెయిల్ లేదా ఫోన్ రూపంలో సమాచారం ఇవ్వొచ్చు. ఆ తర్వాత కావాల్సిన పత్రాలతో క్లెయిమ్ దాఖలు చేసుకోవాలి. కరోనా నేపథ్యంలో పాలసీదారుల సౌలభ్యం కోసం బీమా సంస్థలు ఆన్లైన్లోనే చాలా వరకు ప్రక్రియలను అనుమతిస్తున్నాయి. ఎస్బీఐ లైఫ్, టాటా ఏఐఏ లైఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్, ఎక్సైడ్ లైఫ్ క్లెయిమ్ ప్రక్రియను పూర్తిగా ఆన్లైన్లో చేపడుతున్నాయి. ఆన్లైన్లో అనుమతిస్తున్నాయంటే.. భౌతికంగా శాఖల రూపంలో అనుమతించడం లేదని పొరపడకండి. వీలుంటే ఆయా బీమా సంస్థ కార్యాలయానికి వెళ్లి అయినా క్లెయిమ్‌ను దాఖలు చేసుకునేందుకు అవకాశం ఉంది. ఈ మెయిల్ లేదా వాట్సాప్ లేదా కంపెనీ వినియోగదారుల సేవా కేంద్రాన్ని సంప్రదించొచ్చు. ఏజెంట్ సాయాన్ని అయినా తీసుకోవచ్చు. కరోనా మరణ కేసుల్లో క్లెయిమ్‌లను వేగంగా పరిష్కరించేందుకు గాను ఎస్బీఐ లైఫ్, పీఎన్బీ మెట్‌లైఫ్ సంస్థలు ప్రత్యేకంగా హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేశాయి. కొన్ని సాధారణ డాక్యుమెంట్లను కూడా క్లెయిమ్ దరఖాస్తుతోపాటు సమర్పించాల్సి వస్తుంది. క్లెయిమ్ ఫారమ్‌ను బీమా సంస్థల పోర్టళ్ల నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. డెత్ సర్టిఫికెట్, వైద్యులు ఇచ్చిన సర్టిఫికెట్, మెడికల్ రికార్డులు లేదా పరీక్షల ఫలితాల కాపీలను క్లెయిమ్ ఫారమ్‌తోపాటు జత చేయాల్సి ఉంటుంది. అలాగే, ఒరిజినల్ పాలసీ డాక్యుమెంట్, నామినీ బ్యాంకు ఖాతా వివరాలు, నామినీ కేవైసీ (చిరునామా, గుర్తింపు ధ్రువీకరణలతో), క్యాన్సిల్డ్ చేసిన చెక్‌ను ఇవ్వాల్సి ఉంటుంది. ప్రమాద మరణం అయినా, కరోనా మరణం అయినా, సాధారణ మరణం అయినా క్లెయిమ్ ఒకే విధంగా ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఎస్బీఐ లైఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ సంస్థలు ఈ ప్రక్రియను డిజిటలైజ్ చేశాయి. ఆన్లైన్లోనే క్లెయిమ్‌ను దాఖలు చేసి, డాక్యుమెంట్లను ఆప్‌లోడ్ చేస్తే సరిపోతుంది. వాట్సాప్, మొబైల్ యాప్, చాట్‌బాట్స్, వెబ్ పోర్టల్ ఏ రూపంలో అయినా బీమా కంపెనీని సంప్రదించొచ్చు. 30 రోజుల ప్రక్రియ బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) నిబంధనల ప్రకారం జీవిత బీమా సంస్థలు మరణ పరిహారం కోరుతూ వచ్చే క్లెయిమ్‌లను 30 రోజుల్లోగా పరిష్కరించాల్సి ఉంటుంది. క్లెయిమ్ దాఖలు చేసిన రోజు నుంచి ఈ గడువు అమలవుతుంది. ఒకవేళ పాలసీదారు మరణానికి సంబంధించి మరిన్ని వివరాలు, సందేహాలుంటే వాటిని నివృత్తి చేసుకునేందుకు బీమా సంస్థలు దర్యాప్తు అవసరమని భావించొచ్చు. కనుక దర్యాప్తు అవసరమైన కేసుల్లో 90 రోజుల సమయాన్ని బీమా సంస్థలు తీసుకోవచ్చు. అంటే 90 రోజుల్లో దర్యాప్తును పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత 30 రోజుల్లోపు క్లెయిమ్‌ను పరిష్కరించాల్సి ఉంటుంది. అయితే ఎటువంటి సందేహాల్లేకుండా, అన్ని పత్రాలు దాఖలు చేసిన కేసుల్లో ఏడు రోజుల వ్యవధిలోనే బీమా సంస్థలు పరిహారాన్ని విడుదల చేస్తున్నాయి. గతంతో పోలిస్తే క్లెయిమ్ ప్రక్రియ డిజిటలైజ్ కారణంగా వేగాన్ని సంతరించుకుందని చెప్పుకోవాలి. టాటా ఏఐఏ లైఫ్, ఎక్సైడ్ లైఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్, పీఎన్బీ మెట్‌లైఫ్ సంస్థలు క్లెయిమ్‌ను చాలా ప్రాధాన్యత అంశంగా పరిగణిస్తున్నాయి. టాటా ఏఐఏ లైఫ్, ఎక్సైడ్ లైఫ్ 48 గంటల్లోనే క్లెయిమ్‌ను పరిష్కరించేస్తున్నాయి. కాకపోతే కంపెనీ కోరిన డాక్యుమెంట్లను సమర్పించిన తర్వాత 48 గంటలను పరిగణనలోకి తీసుకోవాలి. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ 24 గంటల్లోనే ఈ ప్రక్రియను ముగించేస్తోంది. ఇక పీఎన్బీ మెట్‌లైఫ్ సంస్థ దీన్ని మరింత ప్రతిష్టాత్మకంగా పరిగణిస్తూ కేవలం మూడు గంటల్లోనే పరిష్కరిస్తుండడం గమనించాలి. గతంతో పోలిస్తే క్లెయిమ్‌ల విషయంలో బీమా సంస్థలు మరింత వేగాన్ని, నాణ్యతను సంతరించుకున్నాయి. డాక్యుమెంట్ల పరంగా.. కొన్ని బీమా సంస్థలు డాక్యుమెంట్ల విషయంలో కాస్త వెసులుబాటు కల్పించాయి. కరోనా వైరస్ నియంత్రణ వల్ల అమలవుతున్న ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని కంపెనీలు ఈ చర్యలు తీసుకున్నాయి. ఆస్పత్రిలో మరణం నమోదైతే సాధారణంగా క్లెయిమ్ కోసం డెత్ సర్టిఫికేట్ (మరణ ధ్రువీకరణ పత్రం) సమర్పించాల్సి ఉంటుంది. సంబంధిత ప్రభుత్వ విభాగాల నుంచి డెత్ సర్టిఫికెట్ అందుకునేందుకు సాధారణంగా 10–15 రోజులు వేచి ఉండాల్సి రావచ్చు. అంతకన్నా ఎక్కువ సమయం కూడా పట్టే పరిస్థితి ఉండచ్చు. అందుకనే ఎల్ఐసీ డెత్ సర్టిఫికెట్ బదులు.. మరణించిన తేదీ, సమయం, కారణం తదితర వివరాలతో ఆస్పత్రులు జారీ చేసే డెత్ సమ్మరీని కూడా అనుమతిస్తోంది. డెత్ సమ్మరీ సర్టిఫికెట్‌పై ఎల్ఐసీ క్లాస్–1 అధికారి లేదా డెవలప్మెంట్ ఆఫీసర్ సంతకంతోపాటు.. క్రిమేషన్ సర్టిఫికెట్‌ను సమర్పించడం ద్వారా పరిహారాన్ని క్లెయిమ్ చేసుకునేందుకు ఎల్ఐసీ అనుమతిస్తోంది. అలాగే, ఎస్బీఐ లైఫ్, టాటా ఏఐఏ లైఫ్ డెత్ సర్టిఫికెట్ దాఖలు నుంచి మినహాయింపునిచ్చాయి. ఆస్పత్రుల్లో చనిపోయిన వారికే ఈ మినహాయింపు పరిమితం. ఎందుకంటే ఆస్పత్రి యాజమాన్యాలు మరణానికి కారణం, ఇతర వివరాలతో డెత్ సమ్మరీని జారీ చేస్తాయి. కనుక దీన్ని ఆధారంగా పరిగణిస్తున్నాయి. ఇతర క్లెయిమ్‌లు జీవిత బీమా కంపెనీల నుంచి తీసుకునే ఇతర పాలసీల విషయంలోనూ క్లెయిమ్‌లకు సంబంధించి నిబంధనల పరంగా సడలింపు అమలవుతోంది. గడువు తీరిన పెన్షన్ పాలసీల (యాన్యుటీ ప్లాన్లు) విషయంలో పాలసీదారు లైఫ్ సర్టిఫికెట్‌ను ఇవ్వాల్సి ఉంటుంది. దీనికోసం సాధారణంగా వ్యక్తిగతంగా హాజరుకావాలి. కరోనా మహమ్మారి తీవ్ర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లను కంపెనీలు అనుమతిస్తున్నాయి. ఎల్ఐసీ కూడా యాన్యుటీ ప్లాన్ల విషయంలో లైఫ్ సర్టిఫికెట్ నుంచి మినహాయింపును కల్పించింది. వీడియోకాల్ రూపంలో ఈ ప్రక్రియను చేపడుతోంది. ఎస్బీఐ లైఫ్, బజాజ్ అలియాంజ్ లైఫ్ సంస్థలు సైతం యాన్యుటీ ప్లాన్ల విషయంలో డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్‌ను అనుమతిస్తున్నాయి. -
ఎల్ఐసీ పాలసీదారులకు శుభవార్త!
ఎల్ఐసీ తన పాలసీదారులకు శుభవార్త అందించింది. లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) వ్యక్తిగత ల్యాప్స్ స్థితిలో ఉన్న పాలసీలను పునరుద్ధరించడానికి రెండు నెలల సమయాన్ని ఇచ్చింది. ఎల్ఐసీ గురుంచి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రజల దగ్గరికి చేరువ కావడం కోసం ఎప్పటికప్పుడు సరికొత్త పాలసీల ప్రకటిస్తూ ఉంటుంది. ఎవరైతే ఎల్ఐసీ పాలసీ తీసుకోని ప్రీమియం రెగ్యులర్‌గా చెల్లించకపోతే వారి ఎల్ఐసీ పాలసీలు ల్యాప్స్ అవుతాయి. ఎల్ఐసీ పాలసీ ల్యాప్స్ అయితే కనుక భీమా, ఇతర ప్రయోజనాలు లభించవు. అందుకే ఎప్పటికప్పుడు ప్రీమియం రెగ్యులర్‌గా చెల్లించాలని పేర్కొంటుంది. ఒకసారి పాలసీ ల్యాప్స్ అయితే పునరుద్ధరించడం కొంచెం కష్టం అవుతుంది. ఎల్ఐసీ నిర్వహించే ప్రత్యేక కార్యక్రమం కింద మాత్రమే రుసుము చెల్లించి పాలసీను పునరుద్ధరించుకోవచ్చు. తాజాగా అలాంటి 'స్పెషల్ రివైవల్ క్యాంపైన్' అనే కార్యక్రమాన్ని అక్టోబర్ 22 వరకు నిర్వహిస్తుంది. ఈ ప్రచారంలో భాగంగా, పాలసీదారులు తమ బీమా పాలసీలను పునరుద్ధరించడానికి ప్రోత్సాహకంగా ఎల్ఐసీ ఆలస్య రుసుము ఫీజులపై రాయితీ కూడా అందిస్తుంది.(చదవండి: వొడాఫోన్ ఐడియాకు గట్టి ఎదురుదెబ్బ!) pic.twitter.com/U5tTme79hY — LIC India Forever (@LICIndiaForever) August 23, 2021 ఎవరు అర్హులు నిర్దిష్ట అర్హత కలిగిన, కొన్ని నియమనిబంధనలకు లోబడి మొదటి ప్రీమియం చెల్లించని నాటి నుంచి ఐదేళ్లలో పాలసీ పునరుద్ధరించవచ్చని ఎల్ఐసీ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. ల్యాప్స్ స్థితిలో ఉన్న పాలసీలు గడువు పూర్తి కానీ పాలసీదారుల మాత్రమే అర్హులు అని తెలిపింది. అయితే, టర్మ్ అస్యూరెన్స్, హై రిస్క్ ప్లాన్లను దీని నుంచి మినహాయించింది. "ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా చెల్లించిన మొత్తం ప్రీమియంలను బట్టి టర్మ్ అస్యూరెన్స్, హై రిస్క్ ప్లాన్లు కాకుండా ఇతర పాలసీల ఆలస్య రుసుము ఫీజులపై రాయితీలు ఇవ్వబడుతున్నాయి" అని ఎల్ఐసీ ఆఫర్ కూడా ఇచ్చింది. హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీ, మైక్రో ఇన్స్యూరెన్స్ ప్లాన్స్ కూడా రివైవ్ చేసుకోవచ్చు అని తెలిపింది. ఆలస్య రుసుము ఫీజులపై రాయితీ ఎంత ఎల్ఐసీ రూ.1,00,000 లోపు ప్రీమియంపై ఆలస్య రుసుములో 20 శాతం లేదా గరిష్ఠంగా రూ.2,000 వరకు తగ్గింపు లభిస్తుంది. అలాగే, రూ.1-3 లక్షల మధ్య గల ప్రీమియంపై ఆలస్య రుసుములో 25 శాతం లేదా గరిష్ఠంగా రూ.2,500 వరకు తగ్గింపు లభిస్తుంది. ప్రీమియం రూ.3 లక్షలకు మించి ఉన్నట్లయితే ఆలస్య రుసుములో 30 శాతం లేదా గరిష్ఠంగా రూ.3,000 వరకు తగ్గింపు లభిస్తుంది. "అనివార్య పరిస్థితుల కారణంగా సకాలంలో ప్రీమియంలు చెల్లించలేకపోయిన పాలసీదారుల ప్రయోజనం కోసం ఈ ప్రచార కార్యక్రమం ప్రారంభించబడింది. భీమా కవరేజీ పునరుద్ధరించడం కోసం పాత పాలసీని పునరుద్ధరించడం మంచి నిర్ణయం" అని ఎల్ఐసీ తెలిపింది. -
క్యాష్‌లెస్ క్లెయిమ్ తిరస్కరిస్తే.. కుదరదు
కరోనా రెండో విడతలో ఇన్ఫెక్షన్ కారణంగా ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య పెరుగుతోంది. ఆరోగ్య బీమా కలిగిన వారు సాధారణంగా నెట్వర్క్ ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్య చికిత్సలను పొందొచ్చు. కానీ, ప్రస్తుత కరోనా మహమ్మారి కాలంలో చాలా ఆస్పత్రులు నగదు చెల్లించేవారికే చికిత్సలు అందిస్తూ బీమా ప్లాన్లపై నగదు రహిత వైద్య సేవలను తిరస్కరిస్తున్నాయి. దీంతో ఐఆర్డీఏఐ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. నగదు రహిత కరోనా చికిత్సల క్లెయిమ్‌లను తిరస్కరించొద్దంటూ బీమా కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. ఆస్పత్రులతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు పాలసీదారులకు నగదు రహిత వైద్య చికిత్సలు అందేలా చూడాలని కోరింది. కొన్ని నెట్వర్క్ ఆస్పత్రులు కరోనా చికిత్సలకు అధిక రేట్లను వసూలు చేయడమే కాకుండా.. నగదునే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఆస్పత్రుల వైఖరి వల్ల పాలసీదారులకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రా ణాలను కాపాడుకోవాల్సిన పరిస్థితుల్లో నగదు కోసం పాట్లు పడేలా పరిస్థితులను ఆస్పత్రులు మార్చేశాయి. ఇటువంటి ప్రతికూలతలు ఎదురైతే పాలసీదారుల ముందున్న మార్గాలేంటో చూద్దాం... బీమా సంస్థలు, ఆస్పత్రులు కుదుర్చుకున్న సేవల ఒప్పందాన్ని అమలు చేసే దిశగా బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) ఇప్పటికే రెండు పర్యాయాలు సర్క్యులర్లను జారీ చేసింది. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి.. నిబంధనలను పాటించాలంటూ ఆస్పత్రులను కోరింది. ‘‘నగదు రహిత చికిత్సలు అందుబాటులో ఉన్నట్టు పాలసీదారు గుర్తించినట్టయితే.. పాలసీ ఒప్పందం మేరకు ఆయా నెట్వర్క్ ఆస్పత్రిలో నగదు రహిత వైద్యం పాలసీదారుకు అందేలా బీమా సంస్థలు చర్యలు తీసుకోవాలి’’ అని తన ఉత్తర్వుల్లో ఐఆర్డీఏఐ కోరింది. నగదు రహిత వైద్యాన్ని ఆస్పత్రి తిరస్కరిస్తే.. అందుకు వీలు కల్పించాలని కోరుతూ పాలసీదారులు థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్ (బీమా సంస్థ తరఫున క్లెయిమ్ సేవలు అందించే మూడో పక్షం/టీపీఏ)కు అధికారికంగా తెలియజేయాలి. అప్పటికీ నగదు రహిత వైద్యం లభించకపోతే.. ఆస్పత్రికి వ్యతిరేకంగా బీమా సంస్థకు నేరుగా ఫిర్యాదు దాఖలు చేయాలి. నగదు రహిత వైద్యం పాలసీదారులకు ఎంతో శ్రమను తప్పిస్తుంది. కనుక ఒక నెట్వర్క్ ఆస్పత్రి ఈ సేవను తిరస్కరించినట్టయితే.. అత్యవసర పరిస్థితుల్లో ఎక్కువ సమయం వేచి చూసే పరిస్థితి ఉండదు. అటువంటి సందర్భాల్లో మరో నెట్వర్క్ ఆస్పత్రికి వెళ్లి నగదు రహిత చికిత్సలను తీసుకోవడం ఒక పరిష్కారం. దీనివల్ల పాలసీదారులు తమ జేబుల నుంచి భారీగా వ్యయం చేయాల్సిన ఇబ్బంది తప్పుతుంది. ఆస్పత్రులు అంగీకరించిన ధరలనే వసూలు చేసేలా చూడాలని కూడా బీమా సంస్థలను ఐఆర్డీఏఐ కోరింది. ‘‘నెట్వర్క్ ఆస్పత్రులు అంగీకరించిన ధరలకే పాలసీదారులకు చికిత్సలు అందించేలా బీమా సంస్థలు చూడాలి. ఎటువంటి అదనపు చార్జీలు తీసుకోకుండా చూడాలి. ఒకవేళ ఒప్పందానికి విరుద్ధంగా నగదు రహిత చికిత్సలకు తిరస్కరిస్తే, ఆయా ఆస్పత్రులపై తగిన చర్యలు తీసుకోవాలి’’ అని ఐఆర్డీఏఐ కో రింది. ఒకవేళ ఆస్పత్రులు అధికంగా చార్జీలు వసూలు చేసినట్టయితే ఆ తర్వాత ఫిర్యాదు దాఖలు చేయడం ద్వారా వాటి సంగతి తేల్చవచ్చు. మంచి ఆస్పత్రి అని భావిస్తుంటే, నగదు రహిత చికిత్సలను తిరస్కరించిన సందర్భంలో నగదు చెల్లించి ఆ తర్వాత రీయింబర్స్మెంట్ పొందడం ఒక్కటే మార్గం. ఇతర ఆస్పత్రులు నగదు రహిత చికిత్సలకు తిరస్కారం ఎదురైన సందర్భాల్లో బీమా కంపెనీ నెట్వర్క్ జాబితాలో లేని ఆస్పత్రికి సైతం వెళ్లొచ్చు. ఎందుకంటే చికిత్సల వ్యయాలను సొంతంగా భరించి, ఆ తర్వాత రీయింబర్స్మెంట్ చేసుకోవడమే కనుక ఎక్కడైనా రిజిస్టర్డ్ హాస్పిటల్లో వైద్య సేవలను పొందొచ్చు. ముఖ్యంగా ఆయా క్లిష్ట సందర్భాల్లో ప్రాణాలను కాపాడుకోవడాన్ని ప్రాధాన్య అంశంగా చూడాలి. అందుకే కీలక సమయంలో కాలయాపనకు బదులు ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయించడం మంచిది. నిధులు సర్దుబాటు అయితే అందుబాటులోని ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్న తర్వాత రీయింబర్స్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. క్లెయిమ్ వచ్చేందుకు నెల వరకు సమయం తీసుకుంటుంది. ఆస్పత్రిపై ఫిర్యాదు నగదు రహిత వైద్యం తిరస్కరణపై ఐఆర్డీఏఐ తీవ్రంగా స్పందించింది. ఎటువంటి ఆటంకాల్లేని సేవలు లభించేందుకు నెట్వర్క్ ఆస్పత్రులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులకు ఏర్పాట్లు చేసుకోవాలని బీమా కంపెనీలకు సూచించింది. పాలసీదారుల ఫిర్యాదులకు కచ్చితమైన పరిష్కారం అందించాలని.. చట్టపరమైన చర్యల కోసం స్థానిక అధికార యంత్రాంగం దృష్టికి ఆయా ఆస్పత్రుల వ్యవహారాలను తీసుకెళ్లాలని కోరింది. ఒకవేళ ఆస్పత్రుల వ్యవహారశైలి పట్ల సంతృప్తిగా లేకపోతే బీమా సంస్థకు, స్థానిక అధికార యంత్రాగానికి పాలసీదారులు కూడా ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు దాఖలు ఎలా..? ఫిర్యాదును దాఖలు చేయడమే కాదు.. తగిన పరిష్కారాన్ని పొందడమూ ముఖ్యమే. పాలసీదారులు ముందుగా బీమా సంస్థకు చెందిన పాలసీదారుల ఫిర్యాదుల పరిష్కార విభాగాన్ని సంప్రదించాలి. 15 రోజుల్లోపు బీమా సంస్థ నుంచి సరైన పరిష్కారం లభించకపోయినా, పరిష్కారం పట్ల సంతృప్తి లేకపోయినా అప్పుడు సమగ్ర ఫిర్యాదుల పరిష్కార విభాగం రూపంలో ఐఆర్డీఏఐ దృష్టికి సమస్యను తీసుకెళ్లొచ్చు. ఈ పోర్టల్‌లో (https://igms.irda. gov.in/) పాలసీదారులు తమ వివరాలతో నమోదు చేసుకోవాలి. అనంతరం లాగిన్ అయ్యి ఫిర్యాదును దాఖలు చేయడంతోపాటు పురోగతిని తెలుసుకోవచ్చు. అలాగే ఈ మెయిల్ (complaints@irdai.gov.in) రూపంలో నూ ఐఆర్‌డీఏఐకి ఫిర్యాదు చేయవచ్చు. 1800 4254 732 టోల్‌ఫ్రీ నంబర్లో సంప్రదించొచ్చు. -
ఎల్ఐసీ ఐపీవో: పాలసీదారులకు 10 శాతం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రతిపాదిత లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) పబ్లిక్ ఇష్యూలో పాలసీదారులకు 10 శాతం షేర్లను కేటాయించనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. పాలసీదారుల ప్రయోజనాలను కాపాడే క్రమంలో ఎల్ఐసీలో ప్రభుత్వం మెజారిటీ వాటాదారుగా కొనసాగుతుందని ఆయన వివరించారు. రాజ్యసభకు ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో ఠాకూర్ ఈ విషయాలు తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎల్ఐసీని స్టాక్ ఎక్సేంజీల్లో లిస్ట్ చేయనున్నట్లు బడ్జెట్ ప్రసంగం సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎల్ఐసీ విలువను మదింపు చేయడానికి యాక్చువేరియల్ సంస్థ మిల్లీమన్ అడ్వైజర్స్‌ను కేంద్ర పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపం) ఎంపిక చేసింది. ప్రీ-ఐపీవో లావాదేవీలకు సంబంధించి సలహాదారులుగా డెలాయిట్, ఎస్బీఐ క్యాప్స్‌ను నియమించింది. ప్రభుత్వ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా (డిజిన్వెస్ట్‌మెంట్) 2021-22లో రూ. 1.75 లక్షల కోట్లు సమీకరించాలని కేంద్రం నిర్దేశించుకుంది. ఇందులో భాగంగానే ఎల్ఐసీ తదితర సంస్థల్లో వాటాలను విక్రయించనుంది. పీఎస్‌బీల ఎన్పీఏలు 6.09 లక్షల కోట్లు ప్రభుత్వరంగ బ్యాంకుల (పీఎస్‌బీలు) స్థూల మొండి బకాయిలు (వసూలు కాని రుణాలు/ఎన్పీఏలు) 2020 సెప్టెంబర్ నాటికి రూ.6.09 లక్షల కోట్లకు తగ్గినట్లు ఠాకూర్ చెప్పారు. -
ప్రీమియంల చెల్లింపునకు మరో 30 రోజుల వ్యవధి
న్యూఢిల్లీ: కరోనావైరస్ కట్టడిపరమైన లాక్డౌన్ అమలవుతున్న నేపథ్యంలో జీవిత బీమా పాలసీదారులకు ప్రీమియంల చెల్లింపు విషయంలో వెసులుబాటునిస్తూ బీమా రంగ అభివృద్ధి, నియంత్రణ సంస్థ ఐఆర్డీఏఐ నిర్ణయం తీసుకుంది. మార్చి, ఏప్రిల్‌లో కట్టాల్సిన రెన్యువల్ ప్రీమియంలకు సంబంధించి పాలసీదారులకు మరో 30 రోజుల వ్యవధి ఉంటుందని వెల్లడించింది. జీవిత బీమా సంస్థలు, లైఫ్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ విజ్ఞప్తుల మేరకు తాజా నిర్ణయం తీసుకుంది. ఆరోగ్య బీమా, వాహన థర్డ్ పార్టీ బీమా పాలసీలకు ఐఆర్డీఏఐ ఇప్పటికే ఈ వెసులుబాటు ప్రకటించింది. మార్చి 25 – ఏప్రిల్ 14 మధ్య కట్టాల్సిన మోటార్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలను ఏప్రిల్ 21లోగా చెల్లించవచ్చని వెసులుబాటు ఇచ్చింది. ఈ వ్యవధిలో రిస్క్ కవర్ కొనసాగుతుందని పేర్కొంది. మరోవైపు, నియంత్రణ సంస్థకు బీమా రంగ సంస్థలు సమర్పించాల్సిన రిటర్న్స్ విషయంలోనూ మరికాస్త వ్యవధినిచ్చింది. నెలవారీ రిటర్న్‌లకు అదనంగా 15 రోజులు, త్రైమాసిక, అర్ధ సంవత్సర, వార్షిక రిటర్నులు సమర్పించేందుకు 30 రోజుల వ్యవధి లభిస్తుంది. -
పెన్షన్ స్కీం సొమ్ముపై గుడ్ న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ: పెన్షన్ స్కీంలో మీ డబ్బు ఇరుక్కుపోయిందా. అయితే మీకో శుభవార్త. పెన్షన్ పాలసీ దారులకు ఊరట కల్పించేలా రెగ్యులేటరీ తాజా ఆదేశాలు జారీ చేసింది. పాలసీ తీసుకొని, కొంతవరకు చెల్లించి వదిలేసిన లేదా క్లైమ్ చేయని సొమ్ము వివిధ ఇన్సూరెన్స్ కంపెనీల దగ్గర వేలకోట్లరూపాయలు మూలుగుతున్నాయని ఇన్సూరెన్స్ అండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ) తాజాగా వెల్లడించింది. దీంతో సంబంధిత పాలసీదారులను గుర్తించి, ఆ ఫండ్‌ను వారికి చెల్లించాల్సిందిగా ఇన్సూరెన్స్ కంపెనీలను ఐఆర్డీఏఐ కోరింది. పాలసీదారులకు చెందిన 15వేల కోట్ల రూపాయలు జీవిత బీమా సంస్థల వద్ద క్లైమ్ చేయకుండా పడివున్నాయని రెగ్యులేటరీ వివరించింది. ఈ సొమ్మును ఆయా పాలసీ దారులు, లేదా లబ్దిదారులను శోధించి మరీ తిరిగి చెల్లించాల్సిందిగా బీమా సంస్థలకు ఆదేశించింది. అయితే ఇప్పటివరకు నిబంధనల ప్రకారం కనీస వాయిదాలు చెల్లించని జీవిత బీమా పాలసీ దారులు మెచ్యూరిటీ మొత్తాన్ని క్లెమ్ చేసే హక్కులేదు. అలాగే కొనుగోలు ధర కంటే మెచ్యూరిటీ వాల్యూ తక్కువగా ఉన్నా కూడా ఈ అవకాశం లేదు. తాజా ఆదేశాల ప్రకారం అలాంటి పాలసీదారులకు కూడా డబ్బును తిరిగి చెల్లించమని ఐఆర్డీఏఐ కోరింది. ఈ ఆదేశాలకు ప్రతికూలంగా ఇన్పూరెన్స్ కంపెనీలు వాదిస్తున్నాయి. ఇది చట్ట ఉల్లంఘన కిందికి వస్తుందని, పేరుకుపోయిన ఫండ్ విలువ ఈచెల్లింపులకు సరిపోదని ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ ఇన్సూరెన్స్‌కు చెందిన అనిల్‌కుమార్ సింగ్ తెలిపారు. 2015నాటి ప్రభుత్వ గెజిట్ ప్రకారం పాలసీదారుడు, నిర్దేశియ సమయంలో ప్రీమియంలను చెల్లించనప్పుడు లేదా గణనీయమైన మొత్తంలో చెల్లించని సందర్భాల్లో మెచ్యూరిటీ విలువ తక్కువగా ఉంటుంది. అటువంటి సందర్భంలో ఆ సొమ్ము కంపెనీతోనే ఉంటుందని హెచ్డీఎఫ్సీ స్టాండర్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ వైస్ ప్రెసిడెంట్, చిన్మయ్ బేడే పేర్కొన్నారు. -
పాలసీల డిజిటలైజ్ అవసరం
బీమా కంపెనీలను కోరిన ఐఆర్డీఏ న్యూఢిల్లీ: ఇతర రూపాలతో నిమిత్తం లేకుండా పాలసీదారులకు సంబంధించిన అన్ని పాలసీలను, క్లెయిమ్స్‌ను ఎలక్ట్రానిక్(డిజిటలైజ్) రూపంలో నిక్షిప్తం చేయాలని ఐఆర్ డీఏ బీమా కంపెనీలకు సూచించింది. ఈ విధంగా డిజిటలైజ్ చేసిన పాలసీదారుల సమాచారానికి వైరస్, సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ సమస్యలు తదితర వాటి నుంచి కట్టుదిట్టమైన భద్రతను కల్పించాలని తెలిపింది. డిజిటలైజ్ చేసిన పాలసీల, క్లెయిమ్స్ సమాచారాన్ని ఎప్పుడు అవసరమైతే అప్పుడు సులభంగా తెలుసుకోవడానికి వీలుంటుందని పేర్కొంది. ఈ నిబంధనలతో రూపొందిన నోటిఫికేషన్ విడుదలైన 90 రోజుల్లోగా పాలసీదారుల సమాచారాన్ని డిజి టలైజ్ చేసే ప్రక్రియకు బీమా కంపెనీలు వాటి బోర్డుల ఆమోదం పొందాల్సి ఉంటుంది.