పాలసీల డిజిటలైజ్ అవసరం
బీమా కంపెనీలను కోరిన ఐఆర్‌డీఏ
న్యూఢిల్లీ: ఇతర రూపాలతో నిమిత్తం లేకుండా పాలసీదారులకు సంబంధించిన అన్ని పాలసీలను, క్లెయిమ్స్‌ను ఎలక్ట్రానిక్(డిజిటలైజ్) రూపంలో నిక్షిప్తం చేయాలని ఐఆర్ డీఏ బీమా కంపెనీలకు సూచించింది. ఈ విధంగా డిజిటలైజ్ చేసిన పాలసీదారుల సమాచారానికి వైరస్, సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ సమస్యలు తదితర వాటి నుంచి కట్టుదిట్టమైన భద్రతను కల్పించాలని తెలిపింది. డిజిటలైజ్ చేసిన పాలసీల, క్లెయిమ్స్ సమాచారాన్ని ఎప్పుడు అవసరమైతే అప్పుడు సులభంగా తెలుసుకోవడానికి వీలుంటుందని పేర్కొంది. ఈ నిబంధనలతో రూపొందిన నోటిఫికేషన్ విడుదలైన 90 రోజుల్లోగా పాలసీదారుల సమాచారాన్ని డిజి టలైజ్ చేసే ప్రక్రియకు బీమా కంపెనీలు వాటి బోర్డుల ఆమోదం పొందాల్సి ఉంటుంది.