ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ప్రెసిడెంట్ 'డెన్నిస్ ఫ్రాన్సిస్' భారతదేశం దాని డిజిటల్ విప్లవాన్ని ప్రశంసించారు. దేశంలోని గ్రామీణ ప్రాంతాలకు బ్యాంకింగ్ సేవలు విస్తరిస్తున్నాయి. గత ఐదు నుంచి ఆరు సంవత్సరాల్లోనే కేవలం స్మార్ట్‌ఫోన్‌ల వాడకం వల్ల 80 కోట్ల మంది భారతీయులు పేదరికం నుంచి బయటపడగలిగారని ఆయన అన్నారు.
గతంలో మాదిరిగా కాకుండా నేడు గ్రామీణ ప్రజలు కూడా బ్యాంకింగ్ సేవల కోసం, వావాదేవీల కోసం స్మార్ట్‌ఫోన్ ఉపయోగిస్తున్నారు. దేశంలో డిజిటలైజేషన్ వేగంగా అభివృద్ధి చెందుతోందని ఫ్రాన్సిస్ ఇండియాను ప్రశంసించారు. ఈ ప్రయోజనాలను పొందటానికి ఇంటర్‌నెట్ సౌకర్యాలు కూడా మారుమూల ప్రాంతాలకు కూడా వ్యాప్తి చెందినట్లు ఆయన పేర్కొన్నారు.
పుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న డెన్నిస్ ఫ్రాన్సిస్.. ఇండియాను ప్రశంసించారు. భారతదేశం మాదిరిగానే ఇతర గ్లోబల్ సౌత్ దేశాలు కూడా డిజిటలైజేషన్‌ను అభివృద్ధి చేయడానికి కృషి చేయాలనీ ఆయన సూచించారు. రాబోయే రోజుల్లో భారత్ మొత్తం డిజిటలైజేషన్‌గా మారుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని ఫ్రాన్సిస్ పేర్కొన్నారు.
గత పది సంవత్సరాలుగా నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం డిజిటలైజేషన్ మీద ఎక్కువ ద్రుష్టి సారించింది. 2016లో రూ. 500, రూ. 1000 నోట్ల రద్దు తర్వాత.. యూపీఐ ట్రాన్సాక్షన్స్ భారీగా పెరిగాయి. జన్ ధన్ వంటి వాటికోసం ఆధార్ అథెంటికేషన్ చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో లక్షలాది మంది గ్రామీణ ప్రజలు బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసుకున్నారు. ఆ తరువాత చాలామంది ఆన్‌లైన్ చెల్లింపులు చేయడానికి ఆసక్తి చూపారు. ఈ విధంగా డిజిటలైజేష పురోగతి చెందింది.
Comments
Please login to add a commentAdd a comment