UNA
-
‘80 కోట్ల భారతీయుల జీవితాలను మార్చిన స్మార్ట్‌ఫోన్’
ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ప్రెసిడెంట్ 'డెన్నిస్ ఫ్రాన్సిస్' భారతదేశం దాని డిజిటల్ విప్లవాన్ని ప్రశంసించారు. దేశంలోని గ్రామీణ ప్రాంతాలకు బ్యాంకింగ్ సేవలు విస్తరిస్తున్నాయి. గత ఐదు నుంచి ఆరు సంవత్సరాల్లోనే కేవలం స్మార్ట్ఫోన్ల వాడకం వల్ల 80 కోట్ల మంది భారతీయులు పేదరికం నుంచి బయటపడగలిగారని ఆయన అన్నారు.గతంలో మాదిరిగా కాకుండా నేడు గ్రామీణ ప్రజలు కూడా బ్యాంకింగ్ సేవల కోసం, వావాదేవీల కోసం స్మార్ట్‌ఫోన్ ఉపయోగిస్తున్నారు. దేశంలో డిజిటలైజేషన్ వేగంగా అభివృద్ధి చెందుతోందని ఫ్రాన్సిస్ ఇండియాను ప్రశంసించారు. ఈ ప్రయోజనాలను పొందటానికి ఇంటర్నెట్ సౌకర్యాలు కూడా మారుమూల ప్రాంతాలకు కూడా వ్యాప్తి చెందినట్లు ఆయన పేర్కొన్నారు.పుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న డెన్నిస్ ఫ్రాన్సిస్.. ఇండియాను ప్రశంసించారు. భారతదేశం మాదిరిగానే ఇతర గ్లోబల్ సౌత్ దేశాలు కూడా డిజిటలైజేషన్‌ను అభివృద్ధి చేయడానికి కృషి చేయాలనీ ఆయన సూచించారు. రాబోయే రోజుల్లో భారత్ మొత్తం డిజిటలైజేషన్‌గా మారుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని ఫ్రాన్సిస్ పేర్కొన్నారు.గత పది సంవత్సరాలుగా నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం డిజిటలైజేషన్ మీద ఎక్కువ ద్రుష్టి సారించింది. 2016లో రూ. 500, రూ. 1000 నోట్ల రద్దు తర్వాత.. యూపీఐ ట్రాన్సాక్షన్స్ భారీగా పెరిగాయి. జన్ ధన్ వంటి వాటికోసం ఆధార్ అథెంటికేషన్ చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో లక్షలాది మంది గ్రామీణ ప్రజలు బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసుకున్నారు. ఆ తరువాత చాలామంది ఆన్లైన్ చెల్లింపులు చేయడానికి ఆసక్తి చూపారు. ఈ విధంగా డిజిటలైజేష పురోగతి చెందింది. -
విరిగిపడిన కొండచరియలు.. ఇద్దరు మృతి!
హోలీ పర్వదినాన హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. హోలీ వేడుకలు జరుగుతున్న ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి ఇద్దరు మృతి చెందారు. మరో ఏడుగురు గాయపడ్డారు. ఉనా జిల్లా అంబ్ సబ్ డివిజన్లోని మేడిలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే హోలీ వేడుకల్లో భాగంగా భక్తులు గంగా నదిలో పుణ్యస్నానాలు చేస్తున్నారు. ఇంతలో అకస్మాత్తుగా కొండపై నుంచి రాళ్లు పడటం మొదలైంది. దీంతో భక్తుల మధ్య తొక్కిసలాట జరిగింది. ఈ నేపధ్యంలో తొమ్మిది మంది భక్తులు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సివిల్ ఆస్పత్రికి తరలించగా, ఇద్దరు భక్తులు మృతి చెందారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని ఉనా ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. -
ఆకాంక్షలను నెరవేరుస్తున్నాం
ఉనా/చంబా: దేశంలో గత ప్రభుత్వాలు ఉద్ధరించిందేమీ లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. ఇతర దేశాల్లో గత శతాబ్దంలో అందుబాటులో ఉన్న సౌకర్యాలను సైతం మన ప్రభుత్వాలు ప్రజలకు కల్పించలేకపోయాయని ఆక్షేపించారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న హిమాచల్ ప్రదేశ్‌లో మోదీ గురువారం పర్యటించారు. ఉనా, చంబాలో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. హరోలీలో బల్క్ డ్రగ్ ఫార్మా పార్క్ నిర్మాణానికి పునాదిరాయి వేశారు. ఉనాలో ‘ఐఐఐటీ–ఉనా’ను ప్రారంభించారు. చంబాలో రెండు హైడ్రోపవర్ ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఉనాలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు పచ్చజెండా ఊపారు. దేశంలో ఇది నాలుగో వందేభారత్ రైలు కావడం విశేషం. రాష్ట్రంలో పలుచోట్ల బహిరంగ సభల్లో ప్రధానమంత్రి ప్రసంగించారు. హిమాచల్‌లో ప్రతి ఎన్నికలో అధికార పార్టీని ఓడించే సంప్రదాయం ఈసారి ఆగిపోతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ‘డబుల్–ఇంజన్’ ప్రభుత్వాల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని ఉద్ఘాటించారు. కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉందని, అందుకే ఇక్కడ అభివృద్ధి యజ్ఞం జరుగుతోందని అన్నారు. 20వ శతాబ్దంతోపాటు 21వ శతాబ్దపు సౌకర్యాలను కూడా ప్రజలకు అందిస్తున్నామని వివరించారు. 21వ శతాబ్దపు భారతదేశ ఆకాంక్షలను తమ ప్రభుత్వం నెరవేరుస్తోందని, మన దేశం సవాళ్లను అధిగమిస్తూ శరవేగంగా పురోగమిస్తోందని వ్యాఖ్యానించారు. బీజేపీ స్టైలే వేరు బీజేపీ వర్కింగ్ స్టైల్ భిన్నంగా ఉంటుందని మోదీ చెప్పారు. అడ్డంకులు సృష్టించడం, ఉద్దేశపూర్వకంగా జాప్యం చేయడం, తప్పుదోవ పట్టించడం వంటి వాటికి తమ పాలనలో స్థానం లేదన్నారు. నిర్ణయాలు తీసుకుంటామని, తీర్మానాలు చేస్తామని, వాటిని అమలు పరుస్తామని, చివరకు ఫలితాలు చూపిస్తామని పేర్కొన్నారు. హిమాచల్ ప్రదేశ్ అభివృద్ధిని గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి ఊపందుకుందన్నారు. 3,125 కిలోమీటర్ల మేర గ్రామీణ ప్రాంతాల రోడ్ల అభివృద్ధి కోసం ఉద్దేశించిన ‘ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన–3’ని చంబాలో మోదీ ప్రారంభించారు. డబుల్–ఇంజన్ ప్రభుత్వం గత ఎనిమిదేళ్లలో రాష్ట్రంలో 12,000 కిలోమీటర్ల రోడ్లు నిర్మించిందని తెలిపారు. ప్రధాని ప్రారంభించిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఉనా నుంచి ఢిల్లీకి బుధవారం మినహా వారంలో ఆరు రోజులు ప్రయాణిస్తుంది. -
అక్కడ ఉగ్రవాదులకు అపరిమిత స్వేచ్ఛ.. ఐరాస ఆందోళన
ఐరాస: కల్లోలిత అఫ్గానిస్తాన్‌లో ఉగ్రవాద మూకలు అంతులేని స్వేచ్ఛను అనుభవిస్తున్నాయని, వాటికి ఎదురే లేకుండా పోయిందని ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుట్టెరస్ ఆందోళన వ్యక్తం చేశారు. అఫ్గానిస్తాన్‌లోని ఐసిస్ అనుబంధ సంస్థ ‘ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ లెవాంట్–ఖోరాసన్’కు సనావుల్లా గఫారీ అలియాస్ సాహ బ్ అల్-ముజాహిర్ నేతృత్వం వహిస్తున్నాడు. గత ఏడాది కాబూల్ ఎయిర్‌పోర్టుపై దాడికి సంబంధించి గఫారీపై అమెరికా సోమవారం 10 మిలియన్ డాలర్ల రివార్డు ప్రకటించింది. -
ఐక్యరాజ్య సమితి సమర్పించు...
‘రీసెట్ ఎర్త్’ పేరుతో ఐక్యరాజ్య సమితి కొత్త ప్రాజెక్ట్ చేపట్టింది. ఇందులో భాగంగా 10 నుంచి 15 ఏళ్ల వయసు మధ్య ఉన్న వారి కోసం ఒక మొబైల్ గేమ్‌ను రూపొందించారు. ఓజోన్ పొర విలువను తెలియజేసే గేమ్ ఇది. ‘ఓజోన్ పొర రక్షణకు సంబంధించిన ప్రచారం అనేది ఒక తరానికి సంబంధించిన విషయం కాదు. అది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది’ అంటున్నారు ప్రాజెక్ట్ బాధ్యుల్లో ఒకరైన మెక్ సెక్. -
దిగ్బంధనంలో ఉ.కొరియా!
వాషింగ్టన్: వరస అణ్వాయుధ పరీక్షలు చేస్తోన్న ఉత్తరకొరియాపై ఐరాస భద్రతా మండలి కొరడా ఝుళిపించింది. ఆ దేశంపై మరిన్ని ఆంక్షలు విధించాలంటూ అమెరికా రూపొందించిన తీర్మానానికి శుక్రవారం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. దీంతో ఇంధనం, ఎగుమతులు, దిగుమతులు, విదేశాల్లో పనిచేస్తున్న తమ కార్మికులకు సంబంధించి ఉ.కొరియా మరిన్ని పరిమితులు ఎదుర్కోనుంది. భద్రతా మండలిలోని 15 సభ్య దేశాలు సంతకం చేసిన ఈ తీర్మానంలో ఉ.కొరియా అక్రమ రవాణా కార్యకలాపాలు నిలువరించేలా సహకరించాలని అన్ని దేశాల అధికారులను కోరారు. తాజా ఆంక్షలతో శుద్ధిచేసిన పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతులను ఆ దేశం 90% కోల్పోనుంది. ఆ దేశం నుంచి జరిగే ఆహా ర ఉత్పత్తులు, యంత్ర సామగ్రి, ఎలక్ట్రికల్ పరికరాలపై కూడా నిషేధం విధించారు. ‘ఇంధన ఉత్పత్తులను ఉ.కొరియా అణు కార్యకలాపాలకే వినియోగించుకుంటోంది. ఆంక్షలు విధించడం ద్వారా ఆయుధాల తయారీని అడ్డుకోవచ్చు’అని బ్రిటన్ రాయబారి మాథ్యూ రిక్రాఫ్ట్ అన్నారు. -
పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోండిలా..
నిడమర్రు : ప్రభుత్వ గుర్తింపు పొందిన/ ప్రైవేట్/ కార్పొరేట్ రంగాల్లో పనిచేసే ఉద్యోగులకు భవిష్య నిధి సౌకర్యంగా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) ఖాతా ఉంటుంది. ఈ ఖాతాలో ఆ ఉద్యోగి వేతనం నుంచి కొంత మొత్తంలో మినహాయింపుతోపాటు పనిచేస్తున్న కంపెనీ కూడా కొంత మొత్తంలో నగదు జమ చేస్తుంది. ఈపీఎఫ్ ఖాతాలోని బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం ద్వారా ఎంత మొత్తంలో పొదుపు చేస్తామన్నది సులభంగా తెలుసుకోవచ్చు. ఈపీఎఫ్ బ్యాలెన్స్‌ను వివిధ రకాలుగా ఎప్పటికప్పుడు ఉచితంగా తెలుసుకునే అవకాశాన్ని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కల్పించింది. ఎస్ఎంఎస్ ద్వారా యూఏఎన్ యాక్టివేషన్ ఈపీఎఫ్ ఉన్న ఉద్యోగులందరికీ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్)ను సంస్థ కేటాయించింది. ఉద్యోగం మారినప్పుడు ఈ నెంబర్‌ను ఉపయోగించి మీ పీఎఫ్ ఖాతాలోని సొమ్మును బదిలీ చేసుకోవచ్చు. ఈ యూఏఎన్‌ను ప్రతి సంస్థ తమ ఉద్యోగులకు కేటాయించాలి. ఉద్యోగి ఉద్యోగం మారినా ఈ సంఖ్య మారదు. యూఏఎన్ ఆధారంగా ఈపీఎఫ్ ఖాతా పాస్‌బుక్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. యూఏఎన్‌కు నమోదు చేసుకుని ఉంటే మీ రిజిస్టర్ మొబైల్ నంబర్‌కు పీఎఫ్ బ్యాలెన్స్ సమాచారం సంక్షిప్త సందేశాల్లో వస్తుంది. దీని కోసం ఈ విధంగా చేయాలి. -
'చనిపోయిన ఆవుల్ని ముడితే ఒట్టు!'
ఉనా: చనిపోయిన ఆవుల్ని ఇక ముట్టుకోబోమని, వాటి చర్మాన్ని వొలిచే పనులను స్వస్తిపలుకుతున్నామని గుజరాత్ లోని ఉనాలో జరిగిన భారీ బహిరంగ సభలో వేలాది మంది దళితులు ప్రతిజ్ఞచేశారు. 'ఆవు తోక మీరే పట్టుకొని గుజరాత్‌లోని ప్రతి దళిత కుటుంబానికి 5 ఎకరాల భూమిని కేటాయించండి’ అని ఉనా దళిత్ అత్యాచార్ లదత్ సమితి (యూడీఏఎల్ఎస్) డిమాండ్ చేసింది. నెల రోజుల్లో తమ డిమాండ్ నెరవేర్చకుంటే మెగా రైల్ రోకో నిర్వహిస్తామని గుజరాత్ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. దళితులకు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపించాలని కోరింది. కొద్ది రోజుల కిందట చనిపోయిన ఆవు చర్మాన్ని వలుస్తున్న దళితులపై కొందరు గో సంరక్షకులు అమానుషంగా దాడి చేయడానికి నిరసనగా అహ్మదాబాద్ నుంచి ప్రారంభమైన యాత్ర సోమవారం ఉనా చేరుకుంది. వేలాది మంది దళితులు, ముస్లింలు ఒక్క చోట చేరి 70వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మువ్వన్నెల జెండా ఎగురవేశారు. ఈ భారీ నిరసన ప్రదర్శనలో హెచ్‌సీయూలో ఆత్మహత్యకు పాల్పడిన రోహిత్ తల్లి రాధిక వేముల, జేఎన్‌యూ విద్యార్థి సంఘం నాయకుడు కన్హయ్య కుమార్, ఉనా బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అలాగే దళితులపై అత్యాచారాలు, వివక్ష నుంచి స్వేచ్ఛ కావాలని డిమాండ్ చేశారు. ర్యాలీకి నేతృత్వం వహించిన జిగ్నేశ్ మవేనీ మాట్లాడుతూ.. తమ డిమాండ్ ప్రకారం రాష్ట్రంలోని దళితులకు వచ్చే నెల రోజుల్లోపు ఐదెకరాల భూమి కేటాయించకుంటే రైల్ రోకో చేపడతామని అల్టిమేటం ఇచ్చారు. అలాగే ఆవుల చర్మాల వ్యాపారాన్ని ఆపివేస్తామని దళితులు ప్రతిజ్ఞ చేశారు. అలాగే 2012లో తంగధ్ పట్టణంలో ముగ్గురు దళిత యువకుల్ని పోలీసులు కాల్చివేసిన ఘటనపై ప్రధాని మోదీ కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదని, ఈ కేసును పునర్విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. కన్హయ్య మాట్లాడుతూ.. గుజరాత్ అభివృద్ధి నమూనా ప్రచారానికి దళితులు గాలి తీశారని వ్యాఖ్యానించారు. కులతత్వం నుంచి విముక్తి కావాలని నినాదాలు చేశారు. రాధిక వేముల మాట్లాడుతూ.. కేవలం కులం వల్లే ఆత్మహత్యకు పాల్పడిన తన కుమారుడి పరిస్థితి ఏ యువకుడికీ రాకూడదనే ఇక్కడి వచ్చినట్లు పేర్కొన్నారు. ర్యాలీలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న ముస్లింలు దళిత్-ముస్లిం భాయి భాయి’ అనే నినాదాలతో హోరెత్తించారు. -
పాతకక్షలతోనే దళిత యువకులపై దాడి?
రాజ్‌కోట్: దేశవ్యాప్తంగా నిరసలతోపాటూ, పార్లమెంట్‌ను సైతం దద్దరిల్లేలా చేసిన ఉనా ఘటనలో కొత్త విషయాలు వెలుగు చూశాయి. నలుగురు దళితులను చితక్కొట్టిన ఘటనలో పాతకక్షలే కారణమని తెలుస్తోంది. అహ్మదాబాద్‌కు చెందిన ధళిత్ అధికార్ మంచ్ ఆధ్వర్యంలో నిజనిర్ధారణ కమిటీ, సంఘటన జరిగిన ప్రాంతాల్లో వివరాలు సేకరించింది. 8మంది సభ్యులతో కూడిన ఈ బృందం ఉనా సమీపంలోని మోటా సమదియాల గ్రామంలో పర్యటించింది. బాధితుల్లో ఒకరి తండ్రి బాలు భాయ్‌ను కలుసుకుంది. ఆరు నెలల కిందట అదే గ్రామంలోని అగ్ర కులానికి చెందిన సర్పంచ్, తమ వృత్తి నుంచి తప్పుకోవాలని బెదిరింపులకు పాల్పడ్డాడని బాలు భాయ్ పేర్కొన్నారు. గోవులతో వ్యాపారం చేయకూడదని, లేని పక్షంలో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, తమ ఇంటిని కూడా కూల్చివేస్తానని బెదిరింపులకు పాల్పడ్డట్టు నిజనిర్ధారణ బృందం సభ్యులకు బాలు భాయ్ తెలిపారు. 'జూలై11న చనిపోయిన గోవులను తీసుకెళ్లాల్సిందిగా రెండు గ్రామాలను నుంచి సమాచారం రావడంతో నా కుమారుడితో పాటూ మరో ముగ్గురిని పంపంపించాను. వారు తిరిగి వస్తుండగా రెండు వాహానాల్లో కర్రలు, ఐరన్ పైపులతో వచ్చిన కొందురు నా కుమారిడితోపాటూ ముగ్గురుపై దాడికి దిగారు. వారు వచ్చిన వాహనం రిజిస్ట్రేషన్ నెంబర్ డీడీ 03 ఎఫ్ 1294గానూ, వాహనం వెనక వైపు ప్రెసిడెంట్- శివసేన- గిర్ సోమనాథ్ అని రాసి ఉంది' అని నిజనిర్ధారణ బృందం సభ్యులకు తెలిపారు. అనంతరం వారిని వాహనానికి కట్టేసి, అసభ్య పదజాలంతో దూషించారని, తాము ఆవులను చంపలేదు, చచ్చిన గోవుల చర్మాన్ని వలవడమే మా వృత్తి అని దళిత యువకులు ఎంత మొత్తుకున్నా వారిని విడిచి పెట్టకుండా నాలుగు గంటలపాటు బట్టలూడదీసి కొట్టారని తెలిపారు. నేను, నా భార్య సంఘటన స్థలం చేరుకోగానే మమ్మల్ని కూడా దూషిస్తూ, దాడికి పాల్పడ్డారని బాలు బయ్యా వారికి వివరించారు.