పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోండిలా..
నిడమర్రు : ప్రభుత్వ గుర్తింపు పొందిన/ ప్రైవేట్/ కార్పొరేట్ రంగాల్లో పనిచేసే ఉద్యోగులకు భవిష్య నిధి సౌకర్యంగా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) ఖాతా ఉంటుంది. ఈ ఖాతాలో ఆ ఉద్యోగి వేతనం నుంచి కొంత మొత్తంలో మినహాయింపుతోపాటు పనిచేస్తున్న కంపెనీ కూడా కొంత మొత్తంలో నగదు జమ చేస్తుంది. ఈపీఎఫ్ ఖాతాలోని బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం ద్వారా ఎంత మొత్తంలో పొదుపు చేస్తామన్నది సులభంగా తెలుసుకోవచ్చు. ఈపీఎఫ్ బ్యాలెన్స్‌ను వివిధ రకాలుగా ఎప్పటికప్పుడు ఉచితంగా తెలుసుకునే అవకాశాన్ని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కల్పించింది.
ఎస్‌ఎంఎస్ ద్వారా యూఏఎన్ యాక్టివేషన్
ఈపీఎఫ్ ఉన్న ఉద్యోగులందరికీ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్)ను సంస్థ కేటాయించింది. ఉద్యోగం మారినప్పుడు ఈ నెంబర్‌ను ఉపయోగించి మీ పీఎఫ్ ఖాతాలోని సొమ్మును బదిలీ చేసుకోవచ్చు. ఈ యూఏఎన్‌ను ప్రతి సంస్థ తమ ఉద్యోగులకు కేటాయించాలి. ఉద్యోగి ఉద్యోగం మారినా ఈ సంఖ్య మారదు. యూఏఎన్ ఆధారంగా ఈపీఎఫ్ ఖాతా పాస్‌బుక్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యూఏఎన్‌కు నమోదు చేసుకుని ఉంటే మీ రిజిస్టర్ మొబైల్ నంబర్‌కు పీఎఫ్ బ్యాలెన్స్ సమాచారం సంక్షిప్త సందేశాల్లో వస్తుంది. దీని కోసం ఈ విధంగా చేయాలి.