హోలీ పర్వదినాన హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. హోలీ వేడుకలు జరుగుతున్న ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి ఇద్దరు మృతి చెందారు. మరో ఏడుగురు గాయపడ్డారు. ఉనా జిల్లా అంబ్ సబ్ డివిజన్‌లోని మేడిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే హోలీ వేడుకల్లో భాగంగా భక్తులు గంగా నదిలో పుణ్యస్నానాలు చేస్తున్నారు. ఇంతలో అకస్మాత్తుగా కొండపై నుంచి రాళ్లు పడటం మొదలైంది. దీంతో భక్తుల మధ్య తొక్కిసలాట జరిగింది. ఈ నేపధ్యంలో తొమ్మిది మంది భక్తులు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సివిల్ ఆస్పత్రికి తరలించగా, ఇద్దరు భక్తులు మృతి చెందారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని ఉనా ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment