
వాషింగ్టన్: వరస అణ్వాయుధ పరీక్షలు చేస్తోన్న ఉత్తరకొరియాపై ఐరాస భద్రతా మండలి కొరడా ఝుళిపించింది. ఆ దేశంపై మరిన్ని ఆంక్షలు విధించాలంటూ అమెరికా రూపొందించిన తీర్మానానికి శుక్రవారం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. దీంతో ఇంధనం, ఎగుమతులు, దిగుమతులు, విదేశాల్లో పనిచేస్తున్న తమ కార్మికులకు సంబంధించి ఉ.కొరియా మరిన్ని పరిమితులు ఎదుర్కోనుంది.
భద్రతా మండలిలోని 15 సభ్య దేశాలు సంతకం చేసిన ఈ తీర్మానంలో ఉ.కొరియా అక్రమ రవాణా కార్యకలాపాలు నిలువరించేలా సహకరించాలని అన్ని దేశాల అధికారులను కోరారు. తాజా ఆంక్షలతో శుద్ధిచేసిన పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతులను ఆ దేశం 90% కోల్పోనుంది. ఆ దేశం నుంచి జరిగే ఆహా ర ఉత్పత్తులు, యంత్ర సామగ్రి, ఎలక్ట్రికల్ పరికరాలపై కూడా నిషేధం విధించారు. ‘ఇంధన ఉత్పత్తులను ఉ.కొరియా అణు కార్యకలాపాలకే వినియోగించుకుంటోంది. ఆంక్షలు విధించడం ద్వారా ఆయుధాల తయారీని అడ్డుకోవచ్చు’అని బ్రిటన్ రాయబారి మాథ్యూ రిక్రాఫ్ట్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment