
‘రీసెట్ ఎర్త్’ పేరుతో ఐక్యరాజ్య సమితి కొత్త ప్రాజెక్ట్ చేపట్టింది. ఇందులో భాగంగా 10 నుంచి 15 ఏళ్ల వయసు మధ్య ఉన్న వారి కోసం ఒక మొబైల్ గేమ్‌ను రూపొందించారు. ఓజోన్ పొర విలువను తెలియజేసే గేమ్ ఇది. ‘ఓజోన్ పొర రక్షణకు సంబంధించిన ప్రచారం అనేది ఒక తరానికి సంబంధించిన విషయం కాదు. అది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది’ అంటున్నారు ప్రాజెక్ట్ బాధ్యుల్లో ఒకరైన మెక్ సెక్.
Comments
Please login to add a commentAdd a comment