వికసిత భారత్ నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తూ.. ప్రపంచ దేశాలతో సత్సంబంధాలను ఏర్పరచుకుంటోంది. ఈ తరుణంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి 'పీయూష్ గోయల్' సిడ్నీలో పారిశ్రామిక ప్రముఖులు & ప్రభుత్వ అధికారులతో సమావేశమయ్యారు. ఇందులో భారత్.. ఆస్ట్రేలియా మధ్య పెరుగుతున్న ఆర్థిక సంబంధాలను గురించి ప్రస్తావించారు.
భారత్ - ఆస్ట్రేలియా భాగస్వామ్య ప్రాముఖ్యతను గురించి వివరిస్తూ.. ఇరు పక్షాల మధ్య సహకారం, భవిష్యత్ అవకాశాల గురించి చర్చించడం ఆనందంగా ఉందని గోయల్ అన్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడానికి కొత్త మార్గాలను అన్వేషించాలని ఆయన అన్నారు.
గోయల్ తన పర్యటనలో ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని ప్రముఖ డేటా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఎయిర్‌ట్రంక్ వ్యవస్థాపకుడు, సీఈఓ 'రాబిన్ ఖుదా'తో కూడా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇండియాలో డిజిటలైజేషన్ వృద్ధి గురించి మాత్రమే కాకుండా.. భారత్ ఆస్ట్రేలియా మధ్య డేటా మౌలిక సదుపాయాల రంగంలో సహకారం కోసం గణనీయమైన సంభావ్యత గురించి చర్చించినట్లు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేశారు.
ఇదీ చదవండి: భారత్ వృద్ధికి కీలక చర్చలు: పీయూష్ గోయల్
భారత్ డిజిటలైజేషన్‌లో వేగంగా పురోగమిస్తోంది. కాబట్టి డేటా సెంటర్‌లు, క్లౌడ్ కంప్యూటింగ్, టెక్నాలజీతో నడిచే మౌలిక సదుపాయాల వంటి వాటి పెట్టుబడులకు దేశం కేంద్రంగా మారింది. ఇండియా గ్లోబల్ డిజిటల్ హబ్‌గా మారాలంటే.. టెక్ రంగంలో జాయింట్ వెంచర్లు, భాగస్వామ్యాల సంభావ్యత చాలా అవసరమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
Excellent meeting with Australia’s leading Super Funds, where we explored significant investment opportunities within India's dynamic growth sectors.
Also, discussed avenues to enhance collaboration, giving further boost to India-Australia trade and investment ties. 🇮🇳🤝🇦🇺 pic.twitter.com/Bq36vWncw1— Piyush Goyal (@PiyushGoyal) September 23, 2024
Comments
Please login to add a commentAdd a comment