IRDAInsurance Company
-
బ్యాంకులపై ఆధారపడొద్దు: ఐఆర్డీఏఐ
బీమా పాలసీలను విక్రయించేందుకు ఏదో ఒక సంస్థ మీదో లేదా బ్యాంకులపైనో అధికంగా ఆధారపడకూదని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఐఆర్డీఏఐ) బీమా కంపెనీలకు సూచించింది. ఇందుకు ప్రత్యామ్నాయాలను వెతకాలని తెలిపింది. పాలసీలను విక్రయించేందుకు ఇతర అనువైన వ్యవస్థలను అభివృద్ధి చేసుకోవాలని పేర్కొంది.బీమా కంపెనీలు వాటి మాతృ సంస్థలుగా ఉన్న బ్యాంకుల ద్వారానే దాదాపు 90 శాతం పాలసీలను విక్రయిస్తున్నాయని బీమా నియంత్రణ సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీన్ని అరికట్టేందుకు ఐఆర్డీఏఐ మార్కెట్ నిపుణులతో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. సమీప భవిష్యత్తులో పాలసీల విక్రయానికి సంబంధించి కొత్త నిబంధనలతో ముసాయిదాను తీసుకురావాలని ఐఆర్డీఏఐ యోచిస్తోంది. ఇప్పటివరకు అధికంగా బ్యాంకుల ద్వారానే పాలసీలు విక్రయిస్తున్నందున ఒక్కసారిగా ఈ విధానంలో మార్పు రాదని, అందుకు కొంత సమయం పడుతుందని ఒక అధికారి తెలిపారు. పాలసీల విక్రయానికి సంబంధించి ఐఆర్డీఏఐ నిబంధనలు తీసుకురాబోతున్న నేపథ్యంలో కంపెనీలు ఇతర పంపిణీ వ్యవస్థలను సిద్ధం చేసుకోవాలని ఆయన తెలిపారు.ఇదీ చదవండి: పెట్రోల్, డీజిల్‌పై రూ.5 తగ్గింపు!బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్లు తమ కస్టమర్లకు మోసపూరిత బీమా పాలసీలను అంటగడుతున్నట్లు ఇప్పటికే బీమా నియంత్రణాధికార సంస్థ ఐఆర్డీఏఐ గుర్తించింది. ఇలా మోసపూరితంగా పాలసీలు విక్రయించకూడదని ఐఆర్డీఏఐ ఛైర్మన్ దేబాశీస్ పాండా గతంలో స్పష్టం చేశారు. బ్యాంకర్లు తమ ప్రధాన వ్యాపారంపైనే దృష్టి సారించాలన్నారు. దేశంలో అందరికీ బీమాను చేరువ చేయడంలో బ్యాంకులు కీలకపాత్రే పోషిస్తున్నప్పటికీ, బలవంతంగా మోసపూరిత పాలసీలను అంటగడుతున్నట్లు చెప్పారు. -
పాలసీదారుల డేటా లీక్..! ఐటీ సిస్టమ్‌ల ఆడిట్
పాలసీదారుల డేటా లీకేజీ ఉదంతాల నేపథ్యంలో ఐటీ సిస్టమ్‌లను ఆడిట్ చేయాలని బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్డీఏఐ బీమా కంపెనీలను ఆదేశించింది. ఇందుకోసం స్వతంత్ర ఆడిటర్‌ను నియమించుకోవాలని సూచించింది. ఆయా సంస్థల యాజమాన్యాలతో కలిసి పరిస్థితిని పర్యవేక్షిస్తామని వివరించింది.ఐఆర్డీఏఐ ప్రకటనలోని వివరాల ప్రకారం..‘డేటా ఉల్లంఘనలను చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాం. పాలసీదారుల ప్రయోజనాలు కాపాడేందుకు సంస్థ చర్యలు తీసుకుంటోంది. బీమా తీసుకున్నవారి డేటా లీకేజీ ఉదంతాల నేపథ్యంలో రెండు సంస్థలకు(పేర్లు వెల్లడించలేదు) చెందిన ఐటీ సిస్టమ్‌లను ఆడిట్ చేయాలి. ఇందుకు స్వతంత్ర ఆడిటర్‌ను నియమించుకోవాలి. ఆయా సంస్థల యాజమాన్యాలతో కలిసి ఐఆర్డీఏఐ పరిస్థితిని పర్యవేక్షిస్తుంది’ అని తెలిపింది.ఇదీ చదవండి: పెట్రోల్ కల్తీని ఎలా గుర్తించాలంటే..రెండు సంస్థల పేర్లను ఐఆర్డీఏఐ వెల్లడించకపోయినప్పటికీ ఆ జాబితాలో స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నట్లుగా భావిస్తున్నారు. డేటా లీకేజీ జరిగిన మాట వాస్తవమేనని ఆ కంపెనీ ఇటీవలే వెల్లడించడం ఇందుకు కారణం. ఇక డేటా ఉల్లంఘన బారిన పడిన రెండో సంస్థ పేరు తెలియరాలేదు. ఇదిలాఉండగా, స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్‌కు చెందిన 3.1 కోట్ల మంది చందాదారుల వ్యక్తిగత డేటా ఆన్లైన్లో అమ్మకానికి పెట్టారు. హ్యాకర్ షెన్జెన్ ఏర్పాటు చేసిన ఓ వెబ్ పోర్టల్‌లో స్టార్ హెల్త్ కస్టమర్ల ఫోన్ నంబర్, పాన్, చిరునామా, ముందస్తు వ్యాధుల చరిత్ర తదితర వివరాలు విక్రయానికి పెట్టినట్టు తెలిసింది. -
వంద శాతం క్యాష్‌లెస్ హెల్త్ క్లెయిమ్ - ఐఆర్డీఏఐ
ముంబై: పాలసీదారులు త్వరలోనే నూరు శాతం నగదు రహిత వైద్య సదుపాయం పొందేందుకు వీలుగా బీమా సంస్థలతో కలసి పనిచేస్తున్నట్టు బీమా రంగ అభివృద్ధి, నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏఐ) ప్రకటించింది. నూరు శాతం క్యాష్‌లెస్ క్లెయిమ్ పరిష్కారాల కోసం బీమా సంస్థలు, నేషనల్ హెల్త్ అథారిటీ, బీమా కౌన్సిల్‌తో చర్చిస్తున్నట్టు ఐఆర్డీఏఐ చైర్మన్ దేవాశిష్ పాండా వెల్లడించారు. ముంబైలో జరుగుతున్న ఫిన్‌టెక్ ఫెస్ట్‌లో భాగంగా ఆయన ఈ అంశంపై మాట్లాడారు. పాలసీదారులు నగదు రహిత చికిత్సలు పొందే విషయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో పాండా దీన్ని ప్రస్తావించడం గమనార్హం. క్లెయిమ్ మొత్తంలో బీమా సంస్థలు నిబంధనల పేరుతో కొంత కోత పెడుతుండగా, కొన్ని క్లెయిమ్‌లను తిరస్కరించడం, రీయింబర్స్మెంట్ విధానంలో రావాలని కోరుతున్నాయి. నేషనల్ హెల్త్ ఎక్సే్ఛంజ్ పరిధిలోకి మరిన్ని హాస్పిటల్స్ చేర్చేందుకు కూడా ఇన్సూరెన్స్ కౌన్సిల్, నేషనల్ హెల్త్ అథారిటీతో సంప్రదింపులు చేస్తున్నట్టు పాండా తెలిపారు. వృద్ధులకు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీఇయం అందుబాటులో ఉండేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నట్టు చెప్పారు. -
3 కోవిడ్ టీకాలు తీసుకున్నవారికి బంపరాఫర్!
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా పలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) చర్యలకు నడుం బిగించింది. మూడు డోసులు టీకా తీసుకున్న వారికి సాధారణ, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల పునరుద్ధరణపై డిస్కౌంట్ ఇవ్వాలని అన్ని బీమా సంస్థలను కోరింది. కరోనా క్లెయిమ్‌లను వీలైనంత త్వరితంగా పరిష్కరించాలని, డాక్యుమెంట్ల అవసరాన్ని తగ్గించాలని కోరింది. బీమా సంస్థలు తమ వెల్‌నెట్ నెట్వర్క్ ద్వారా ఆర్టీపీసీఆర్ టెస్ట్‌లు నిర్వహించుకునే విధంగా పాలసీదారులను ప్రోత్సహించాలని, ఇందుకు వారికి రాయితీలు కల్పించాలని సూచించింది. కోవిడ్ నిబంధనలను పాలసీదారులు అనుసరించేలా సామాజిక మాధ్యమాల ద్వారా వారిని ప్రోత్సహించాలని బీమా సంస్థలతో నిర్వహించిన సమావేశంలో భాగంగా కోరినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. విదేశీ ప్రయాణ బీమా పాలసీలు తీసుకునే వారికి, పలు దేశాల్లో కరోనా పరీక్షల నిర్వహణ అవసరాల గురించి తెలియజేయాలని ఐఆర్డీఏఐ సూచించింది. కరోనాతో చికిత్స కోసం వచ్చే పాలసీదారుల నుంచి నెట్వర్క్ హాస్పిటళ్లు డిపాజిట్ తీసుకోకుండా చూడాలని కోరింది. నగదు రహిత సదుపాయం ఉన్న ఆస్పత్రుల్లో చేరినప్పటికీ, కరోనా మొదటి, రెండో విడతలో చాలా ఆస్పత్రులు రోగుల నుంచి డిపాజిట్లు తీసుకున్నాయి. దీంతో ఐఆర్డీఏఐ ఈ సూచన చేసింది. కరోనా కేసులు ఒకవేళ అధికంగా వస్తే సాయం అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాలని కోరింది. 2022 మార్చి నాటికి బీమా సంస్థలు కరోనాకు సంబంధించి 2.25 లక్షల క్లెయిమ్‌లను పరిష్కరించడం గమనార్హం. -
అగ్రి బీమా ఉత్పత్తులకూ అదే వెసులుబాటు!
న్యూఢిల్లీ: సాధారణ బీమా విభాగంలో భాగమైన అగ్రి బీమా ఉత్పత్తుల ఆవిష్కరణకూ ముందస్తు అనుమతి అవసరం లేదని బీమా రంగ నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏఐ) వెసులుబాటు కల్పించింది. ఇప్పటికే హెల్త్ ఇన్సూరెన్స్ ఉత్పత్తులను సైతం ముందస్తు అనుమతి లేకుండా మార్కెట్లోకి ప్రవేశపెట్టేందుకు సాధారణ బీమా కంపెనీలను ఐఆర్డీఏఐ అనుమతించడం తెలిసిందే. తాజాగా ఈ వెసులుబాటు సాగు బీమా ఉత్పత్తులకూ కల్పించింది. మార్కెట్లోకి విడుదల చేసిన తర్వాత, ఆయా ఉత్పత్తులకు అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంటే (యూజ్ అండ్ ఫైల్) చాలని తెలిపింది. దేశంలో బీమా కవరేజీ విస్తరణకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. ఈ విభాగంలోని అవసరాలకు అనుగుణంగా పరిశ్రమ సకాలంలో వినూత్నమైన ఉత్పత్తులను రూపొందించి, ప్రవేశపెట్టేందుకు తమ తాజా ఆదేశాలు వీలు కల్పిస్తాయని తెలిపింది. -
కరోనాకి క్యాష్‌లెస్ ట్రీట్మెంట్.. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ సభ్యురాలి కీలక వ్యాఖ్య
న్యూఢిల్లీ: ఆరోగ్యంపై వ్యయాలు రోజురోజుకూ పెరిగిపోతుండడంపై ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ) సభ్యురాలు (నాన్–లైఫ్) టీఎల్ అలమేలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రులపై నియంత్రణా వ్యవస్థ అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు. ఇందుకు ఐఆర్‌డీఏఐను అనుమతించాలని లేదా ప్రత్యేకంగా ఒక రెగ్యులేటర్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. ఆరోగ్య బీమా ప్రీమియంల నిరంతర పెరుగుదల నుండి ప్రజలను రక్షించాలని ఇన్సూరెన్స్ రెగ్యులేటర్‌గా ఐఆర్డీఏఐ కోరుకుంటుందని సభ్యురాలు వివరించారు. ఒక కార్యక్రమంలో ఆమె చేసిన ప్రసంగంలో ముఖ్యాంశాలు.. - ఇన్సూరెన్స్ రెగ్యులేటర్‌గా ఆరోగ్య సంబంధ వ్యవహారాల వ్యవస్థను పూర్తిగా నియంత్రించడం మాకు పెద్ద కష్టంగా అనిపించదు. అయితే మేము దానిలో ఒకే ఒక భాగాన్ని నియంత్రిస్తున్నాము. మా నియంత్రణలో ఉన్నవి బీమా సంస్థలు మాత్రమే. బీమా సంస్థలకు సంబంధించిన టీపీఏల (థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్లు)పై పూర్తి నియంత్రణ మాకు ఉండదు. ఈ నియంత్రణలకు అనుమతిస్తే, ఆసుపత్రులను సైతం నియంత్రించగలుగుతాము. - బీమా సంస్థలు తమ ప్రీమియంలను ఎలా పెంచుతాయనే అంశంపై మాకు దృష్టి ఉంది. కానీ మరోవైపు ఎటువంటి నియంత్రణా పరిధిలోలేని సర్వీస్ ప్రొవైడర్లు ఉన్నారు. అక్కడి పరిస్థితి పూర్తిగా నియంత్రణ లేమితో ఉంది. స్వయంగా ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలతో మేము మాట్లాడిన సంఘటనలు ఉన్నాయి. - మేము స్వయంగా రంగంలోకి దిగినా, ఆసుపత్రులు ప్రతిస్పందించడానికి సమయం పట్టింది. కాబట్టి ఆసుపత్రులపై ఒక రెగ్యులేటర్ ఉండాలనేది మా కోరిక. లేదా ఆసుపత్రులను కూడా నియంత్రించడానికి మమల్ని అనుమతించాలి. తద్వారా వైద్య రంగంపై (లాజికల్ ఎకోసిస్టమ్‌పై) పూర్తి నియంత్రణ సాధ్యమవుతుంది. - కోవిడ్–19కి సంబంధించి కొన్ని ఆసుపత్రులు నగదు రహిత చికిత్సను అందించడానికి నిరాకరించాయన్న విషయం ఐఆర్డీఏఐ దృష్టికి వచ్చింది. - క్యాష్‌లెస్ (చికిత్స) కోసం ముందుకు రావాలని మేము ఆసుపత్రులను కోరుతున్నాము. జనాభాను పరిగణనలోకి తీసుకుంటే మనకు చాలా కొద్ది ఆసుపత్రులు మాత్రమే ఉన్నాయి. బీమా చేయబడిన జనాభా సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే, బీమా సంస్థలతో నగదు రహిత ఒప్పందాలు చేసుకున్న ఆసుపత్రుల సంఖ్య కూడా తక్కువే. ఆసుపత్రులు తమ బిల్లులను పెంచడం, తమ టారిఫ్‌లను మార్చుకోవడం వంటి సమస్యలనూ ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. - హెల్త్‌కేర్ రంగం మొత్తం నియంత్రిత వ్యవస్థ కిందకు వస్తేనే అంతిమంగా పాలసీదారుని లేదా సాధారణ ప్రజల ప్రయోజనాల పరిరక్షణ జరుగుతుంది. - తద్వారా ప్రజలు బీమాను కొనుగోలు చేయడం, దాని ప్రయోజనాలు పొందడంపై మరింత విశ్వాసాన్ని పొందుతారు. బీమా వ్యవస్థను విశ్వసిస్తారు. ఇది బీమా ప్రొడక్టులను కొనుగోలు చేయడానికి ఎక్కువ మందిని ప్రేరేపిస్తుంది. -
కరోనా బీమా పాలసీ దారులు ఈ విషయాలు మీకు తెలుసా?
దేశంలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ శరవేగంగా వ్యాప్తి చెందుతుంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది వ్యాది సంక్రమణ రేటు, మరణాల రేటు అధికంగా ఉంది. చాలా మంది ఆసుపత్రుల్లో బెడ్స్ లభించక ఇంట్లోనే ఉండి ఈ వ్యాధికి చికిత్స పొందుతున్నారు. ఇంట్లో ఉన్న కూడా కరోనా వల్ల అయిన ఖర్చులను భీమా సంస్థ ద్వారా తిరిగి తెలుసుకోవచ్చు. కరోనా సోకిన వారు మీ ఆరోగ్య భీమా సంస్థ నుంచి చికిత్సకు సంబంధించిన ఖర్చులను క్లెయిమ్ చేసుకోవడానికి కొన్ని వాస్తవాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇబ్బందులు లేని క్లెయిమ్ సెటిల్మెంట్స్ కోసం ఈ క్రింది విషయాలపై అవగాహన పెంచుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. క్లెయిమ్ సెటిల్మెంట్ కోసం తెలుసుకోవాల్సిన అంశాలు: కరోనా క్లెయిమ్‌లకు సంబందించి ఐఆర్డీఏఐ రెగ్యులేటర్ పేర్కొన్న మార్గదర్శకాలను పూర్తిగా చదవండి. చాలా బీమా సంస్థలు క్లెయిమ్ సెటిల్మెంట్ టర్నరౌండ్ సమయాన్ని తగ్గించాయి. కోవిడ్ -19కి సంబంధించిన ఏవైనా లక్షణాలు మీరు గమనించినట్లయితే, వెంటనే ప్రభుత్వం చేత గుర్తింపబడిన ప్రయోగశాలలో పరీక్షించుకోవాలి. మీకు కరోనా వైరస్ సోకినట్లు నిర్దారణ అయిన తర్వాత క్లెయిమ్ సెటిల్మెంట్ గందరగోళాన్ని నివారించడానికి.. మీరు తీసుకుంటున్న చికిత్సకు సంబందించిన పూర్తి వివరాలను వెంటనే మీ భీమా సంస్థకు తెలియజేయండి. మీరు ఇంట్లో ఉండి చికిత్స పొందుతున్నారా? లేదా ఆసుపత్రిలో ఉండి చికిత్స పొందుతున్నారా? అనేది వారికి తెలియజేయాలి. ఇలా చేయడం వల్ల బీమా సంస్థకు క్లెయిమ్ మొత్తాన్ని అంచనా వేయడానికి ఈ సమాచారం ఉపయోగపడుతుంది. దానికి తదనుగుణంగా క్లెయిమ్‌ను తిరిగి చెల్లిస్తారు. చాలా భీమా కంపెనీలు ఆసుపత్రిలో చేరడానికి అంబులెన్స్ ఛార్జీలు కూడా చెల్లిస్తాయి. ఒకసారి మీరు తీసుకున్న కరోనా హెల్త్ పాలసీలో ఇది మీకు వర్తిస్తుందో లేదో తెలుసుకోండి. మీరు గనుక ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటే, బీమా సంస్థ లేదా ఆసుపత్రిలోని మూడవ పార్టీ నిర్వాహకుడు(టిపీఎ)డెస్క్ నుంచి ప్రీ-ఆథరైజేషన్ ఆమోదం పొందాలి. ఆసుపత్రిలో చేరడానికి డాక్టర్ సిఫార్సు ఉండాలి. మీరు ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు అయిన మొత్తం ఖర్చుల వివరాలను డాక్యుమెంట్ల ద్వారా బీమా సంస్థలు తేలియజేయలి. మీరు భీమా సంస్థ చెప్పిన నెట్వర్క్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లయితే మీరు నగదు రహిత సదుపాయాన్ని పొందవచ్చు. నెట్వర్క్ కాని ఆసుపత్రి చికిత్స విషయంలో మీరు చికిత్స కోసం చెల్లించిన నగదును తిరిగి రీయింబర్స్మెంట్ కింద చెల్లిస్తాయి. క్లెయిమ్ సెటిల్మెంట్ సమయంలో అవసరమైన పత్రాలు ఆర్టీ-పీసీఆర్ రిపోర్ట్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, మెడికల్ హెల్త్ కార్డ్, హాస్పిటల్ డిశ్చార్జ్ రిపోర్ట్, ఆసుపత్రిలో చేరడానికి వైద్యుడు సూచించిన డాక్యుమెంట్లు వంటి పత్రాలను భీమా సంస్థకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రస్తావించదగిన విషయం ఏమిటంటే, మీ చికిత్స చేయించుకుంటున్న ఆసుపత్రి భీమా నెట్వర్క్ ఆసుపత్రిలో ఉన్నప్పటికీ కొన్ని యాజమాన్యాలు మీ క్యాష్ లెస్ క్లెయిమ్‌ను తిరస్కరించవచ్చు. ఇటువంటి సమయంలో మీరు మీ బీమా సంస్థకు ఫిర్యాదు చేయాలి. దీంతోపాటు మీ ఫిర్యాదు కాపీని ఐఆర్డీఎకు కూడా సమర్పించాలి. చదవండి: వాహనదారులకు అదిరిపోయే శుభవార్త! -
సెప్టెంబర్ 1 నుంచి కొత్త వాహనాలు కొంటే..
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ఆదేశాలకు మేరకు సెప్టెంబరు 1 న లేదా తర్వాత విక్రయించిన వాహనాలపై దీర్ఘకాలిక థర్డ్ పార్టీ భీమా వర్తించనుంది. ఈ మేరకు ఇన్సూరెన్స్ రెగ్యులేటర్, బీమా రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ) అన్నిబీమా కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలకనుగుణంగా బీమా సంస్థలు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ సెగ్మెంట్లో ఇప్పుడు కార్ల కోసం మూడు సంవత్సరాల బీమా, ద్విచక్ర వాహనాలకు ఐదు సంవత్సరాల బీమాను ఆఫర్ చేయాలి. అలాగే కొత్త కారు, లేదా బైక్ కొనుగోలు చేసే వినియోగదారులు థర్డ్‌పార్టీ ఇన్సూరెన్స్ తీసుకోవడం తప్పనిసరి. భవిష్యత్ వాహన కొనుగోలుదారులు థర్డ్‌పార్టీ ఇన్సూరెన్స్ కింద కొత్త కార్ల కోసం రూ. 24వేల దాకా చెల్లించాల్సి ఉంటుంది. కొత్త మోటార్ సైకిల్స్ కొనుగోలు చేసినవారు 13వేల రూపాయల దాకా చెల్లించాల్సి ఉంటుంది. వాహన్ మోడల్, ఇంజీన్ కెపాసిటీ ఆధారంగా బీమాను నిర్ణయిస్తారు. జూలై 20,2018న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో థర్డ్ పార్టీ వారికి కూడా ఇన్సూరెన్స్ ఇవ్వాలని బీమా సంస్థలను కోరింది. ఇంతకుముందు ఇది ఒక్క సంవత్సరం మాత్రమే థర్డ్ పార్టీకి బీమా కల్పించేది. ఈ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ విధానం ప్రకారం కొత్త రేట్లు సెప్టెంబర్ 1, 2018 నుంచి మార్చి 31,2019 వరకు కొత్త వాహనాలు కొనుగోలు చేసిన వారికి అమలు అవుతుందని ఐఆర్డీఏఐ ప్రకటించింది. దీని ప్రకారం వాహనాలు కొనుగోలు చేసే సమయంలోనే మొత్తం మూడేళ్లకుగానీ ఐదేళ్లకుగానీ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. వాహనం మరొకరికి అమ్మితేనే వాహన యజమానిపై ఉన్న థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ రద్దు చేసి...కొత్త యజమానికి బదిలీ చేయాల్సి ఉంటుంది. ఇన్సూరెన్స్ ప్రీమియం రేట్లవివరాలు ఇలా ఉన్నాయి. ప్రైవేట్ కార్లకు: మూడేళ్ల ప్రీమియం 1000సీసీ మించకుండా ఉండే వాహనానికి రూ.5,286/- 1000సీసీ నుంచి 1500సీసీ మధ్య ఉండే వాహనానికి : రూ.9,534 1500 సీసీకి మించితే : రూ. 24,305 టూ వీలర్స్ : ఐదేళ్ల ప్రీమియం 75 సీసీ లోపు : రూ.1,045 75సీసీ నుంచి 150 సీసీ మధ్య : రూ. 3,285 150 సీసీ నుంచి 350 సీసీ మధ్య: రూ. 5453 350 సీసీకి మించి : రూ.13,034 -
ఐఆర్డీఏఐ, ఫెడరల్ ఇన్సూరెన్స్ డీల్‌కు ఓకే
న్యూఢిల్లీ: భారతీయ బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్డీఏఐ, అమెరికా ఫెడరల్ ఇన్సూరెన్స్ ఆఫీస్ (ఎఫ్‌ఐవో) మధ్య అవగాహన ఒప్పందానికి కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదముద్ర వేసింది. నియంత్రణ పరమైన బాధ్యతలు, అనుభవాలు మొదలైన సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునేందుకు, శిక్షణా తదితర కార్యకలాపాల్లో పరస్పరం సహకరించుకునేందుకు ఈ ఒప్పందం తోడ్పడుతుంది. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని క్యాబినెట్ బుధవారం జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను నెలకొల్పడం, ఆర్థిక స్థిరత్వం సాధించడం, వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడం తదితర అంశాల్లో సహకరించుకునేందుకు ఇరు దేశాలు అంగీకరించినట్లు కేంద్రం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. దేశీ బీమా రంగంలో విదేశీ పెట్టుబడుల పరిమితిని 49 శాతానికి పెంచిన నేపథ్యంలో ఎఫ్‌డీఐలు.. ముఖ్యంగా అమెరికా నుంచి భారీగా పెట్టుబడులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఐఆర్డీఏఐ, ఎఫ్‌ఐవో మధ్య ద్వైపాక్షిక అవగాహన ఒప్పందం ఇందుకు తోడ్పడగలదని ప్రభుత్వం పేర్కొంది. మరోవైపు, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) వ్యయాల పరిమితిని 80 శాతం మేర పెంచే ప్రతిపాదనకు కూడా క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. దీంతో ఈ పరిమితి రూ.800 కోట్ల నుంచి రూ. 1,435 కోట్లకు చేరుతుంది. సెప్టెంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా ఐపీపీబీ కార్యకలాపాలు అధికారికంగా ప్రారంభించనున్న నేపథ్యంలో ఇది ప్రాధాన్యం సంతరించుకుంది. ఢిల్లీలో ప్రధాని మోదీ దీన్ని ప్రారంభించనున్నారు. ఐపీపీబీ 650 శాఖలు, 3,250 యాక్సెస్ పాయింట్స్‌తో సేవలు ప్రారంభించనుంది. గ్రామీణ ప్రాంతాల్లో సేవింగ్స్ .. కరెంట్ అకౌంట్లు, మనీ ట్రాన్స్ఫర్, ప్రత్యక్ష నగదు బదిలీ, బిల్లుల చెల్లింపులు వంటి ఆర్థిక సేవలు అందిం చనుంది. ఐపీపీబీ మూడేళ్లలో లాభాల్లోకి మళ్లవచ్చని అంచనాలు ఉన్నాయి. 2018 డిసెంబర్ 31 నాటికి దేశవ్యాప్తంగా ఉన్న 1.55 లక్షల పోస్టాఫీసులను ఈ వ్యవస్థకు అనుసంధించడం పూర్తి కాగలదని కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి మనోజ్ సిన్హా తెలిపారు. తెలంగాణలోనూ సెప్టెంబర్ 1 నుంచే ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు సేవలు తెలంగాణలో 23 శాఖలు, 115 యాక్సెస్ పాయింట్లలో సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభం అవుతాయని తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ బి.చంద్రశేఖర్ తెలిపారు. 17 కోట్లకు పైగా పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతాదారులతో కలిపి ఐపీపీబీకి దేశవ్యాప్తంగా 40 కోట్ల మంది ఖాతాదారులు ఉన్నట్టు చెప్పారు. డిసెంబర్ నాటికి 1.55 లక్షల పోస్టాఫీసులను పేమెంట్స్ బ్యాంకుతో అనుసంధానం చేయనున్నట్టు పేర్కొన్నారు. -
పాలసీల డిజిటలైజ్ అవసరం
బీమా కంపెనీలను కోరిన ఐఆర్డీఏ న్యూఢిల్లీ: ఇతర రూపాలతో నిమిత్తం లేకుండా పాలసీదారులకు సంబంధించిన అన్ని పాలసీలను, క్లెయిమ్స్‌ను ఎలక్ట్రానిక్(డిజిటలైజ్) రూపంలో నిక్షిప్తం చేయాలని ఐఆర్ డీఏ బీమా కంపెనీలకు సూచించింది. ఈ విధంగా డిజిటలైజ్ చేసిన పాలసీదారుల సమాచారానికి వైరస్, సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ సమస్యలు తదితర వాటి నుంచి కట్టుదిట్టమైన భద్రతను కల్పించాలని తెలిపింది. డిజిటలైజ్ చేసిన పాలసీల, క్లెయిమ్స్ సమాచారాన్ని ఎప్పుడు అవసరమైతే అప్పుడు సులభంగా తెలుసుకోవడానికి వీలుంటుందని పేర్కొంది. ఈ నిబంధనలతో రూపొందిన నోటిఫికేషన్ విడుదలైన 90 రోజుల్లోగా పాలసీదారుల సమాచారాన్ని డిజి టలైజ్ చేసే ప్రక్రియకు బీమా కంపెనీలు వాటి బోర్డుల ఆమోదం పొందాల్సి ఉంటుంది.