న్యూఢిల్లీ: సాధారణ బీమా విభాగంలో భాగమైన అగ్రి బీమా ఉత్పత్తుల ఆవిష్కరణకూ ముందస్తు అనుమతి అవసరం లేదని బీమా రంగ నియంత్రణ సంస్థ (ఐఆర్‌డీఏఐ) వెసులుబాటు కల్పించింది.
ఇప్పటికే హెల్త్ ఇన్సూరెన్స్ ఉత్పత్తులను సైతం ముందస్తు అనుమతి లేకుండా మార్కెట్లోకి ప్రవేశపెట్టేందుకు సాధారణ బీమా కంపెనీలను ఐఆర్‌డీఏఐ అనుమతించడం తెలిసిందే. తాజాగా ఈ వెసులుబాటు సాగు బీమా ఉత్పత్తులకూ కల్పించింది. మార్కెట్లోకి విడుదల చేసిన తర్వాత, ఆయా ఉత్పత్తులకు అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంటే (యూజ్ అండ్ ఫైల్) చాలని తెలిపింది.
దేశంలో బీమా కవరేజీ విస్తరణకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. ఈ విభాగంలోని అవసరాలకు అనుగుణంగా పరిశ్రమ సకాలంలో వినూత్నమైన ఉత్పత్తులను రూపొందించి, ప్రవేశపెట్టేందుకు తమ తాజా ఆదేశాలు వీలు కల్పిస్తాయని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment