ముంబై: రిలయన్స్ నిప్పన్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీదారులకు గడిచిన ఆర్థిక సంవత్సరానికి (2022–23) రూ.344 కోట్ల బోనస్‌ను ప్రకటించింది. పార్టిసిపేటరీ పాలసీదారులకే ఈ బోనస్ లభించనుంది. గత ఆర్థిక సంవత్సరానికి ఈ సంస్థ రూ.108 కోట్ల నికర ఆదాయాన్ని ప్రకటించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 65 శాతం అధికమని తెలిపింది.
(ఇదీ చదవండి: భారీ లక్ష్యాల దిశగా పతంజలి ఫుడ్స్ - కొత్త ఉత్పత్తుల విడుదలకు సన్నాహాలు!)
ఈ బోనస్ 5.69 లక్షల పార్టిసిపేటరీ పాలసీదారులకు ప్రయోజనకరంగా ఉంటుందని సంస్థ సీఈవో ఆశిష్ వోహ్రా పేర్కొన్నారు. గత 22 ఏళ్లుగా సంస్థ పాలసీదారులకు బోనస్ ఇస్తున్నట్టు చెప్పారు. రిలయన్స్ నిప్పన్ లైఫ్ నిర్వహణలో మొత్తం రూ.30,609 కోట్ల ఆస్తులు ఉన్నాయి. 2023 మార్చి నాటికి సంస్థ మొత్తం రూ.85,950 కోట్ల బీమా రక్షణకు హామీదారుగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment