ఎస్బీఐ లైఫ్లో టెమాసెక్, కేకేఆర్కు వాటాలు
• 3.9% విక్రయిస్తున్న ఎస్‌బీఐ
• డీల్ విలువ రూ. 1,794 కోట్లు
• సంస్థ విలువ రూ. 46,000 కోట్లు
ముంబై: అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థలు టెమాసెక్, కేకేఆర్ తాజాగా బీమా రంగ సంస్థ ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో 3.9 శాతం వాటాలు కొనుగోలు చేయనున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఈ వాటాలను విక్రరుుస్తోంది. ఈ డీల్ విలువ సుమారు రు. 1,794 కోట్లు (దాదాపు 264 మిలియన్ డాలర్లు). షేరు ఒక్కింటికి రూ. 460 చొప్పున జీవిత బీమా వ్యాపార సంస్థలో 3.9 కోట్ల షేర్లను (3.9 శాతం వాటా) విక్రరుుంచేందుకు శుక్రవారం బోర్డు ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆమోదముద్ర వేసిందని ఎస్‌బీఐ వెల్లడించింది.
కేకేఆర్, టెమాసెక్‌లు తమ తమ అనుబంధ సంస్థల ద్వారా చెరి 1.95 కోట్ల షేర్లను కొనుగోలు చేయనున్నట్లు పేర్కొంది. ఈలావాదేవీతో ఎస్‌బీఐ లైఫ్ వేల్యుయేషన్ సుమారు రూ. 46,000 కోట్ల పైచిలుకు ఉండగలదని ఎస్‌బీఐ చైర్మన్ అరుంధతి భట్టాచార్య తెలిపారు. అత్యుత్తమ సంస్థగా ఎదగడంలో ఎస్‌బీఐ లైఫ్‌కి గల నిబద్ధతకు కేకేఆర్, టెమాసెక్‌ల భాగస్వామ్యం నిదర్శనమని ఆమె పేర్కొన్నారు. పాలసీదారులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఇది తోడ్పడగలదని ఎస్‌బీఐ లైఫ్ ఎండీ అరిజిత్ బసు చెప్పారు. 2001లో ఏర్పాటైన ఎస్‌బీఐ లైఫ్‌లో ఎస్‌బీఐకి 74 శాతం, బీఎన్‌పీ పారిబా కార్డిఫ్‌లకు 26 శాతం వాటాలు ఉన్నారుు.