Temasek
-
పెట్టుబడులకు టెమాసెక్ ఆసక్తి
ముంబై: గ్లోబల్ పెట్టుబడుల దిగ్గజం టెమాసెక్.. దేశీయంగా పెట్టుబడులపై మరోసారి దృష్టి సారించింది. ఇందుకు అనుగుణంగా సింగపూర్ సంస్థ బోర్డు డైరెక్టర్లు దేశీయంగా పర్యటనకు వచి్చనట్లు తెలుస్తోంది. ఓవైపు దేశీ స్టాక్ మార్కెట్లు చరిత్రాత్మక గరిష్టాలను తాకడం, మరోపక్క రాజకీయ స్థిరత్వ పరిస్థితులు ఇందుకు కారణమైనట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలలో భారత్ వెలుగుతున్న నేపథ్యంలో 11మంది సభ్యులుగల టెమాసెక్ బోర్డు దేశీయంగా పెట్టుబడులపై అత్యంత ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. రానున్న మూడేళ్ల కాలంలో 10 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేసే వ్యూహంతో టెమాసెక్ ఉన్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీ, ముంబైలలో పారిశ్రామికవేత్తలు, కార్పొరేషన్లు, సీనియర్ ప్రభుత్వ అధికారులతో సమావేశంకానున్నట్లు తెలుస్తోంది. సగటున 1.5 బిలియన్ డాలర్లు దాదాపు గత రెండు దశాబ్దాలలో టెమాసెక్ సగటున ఏడాదికి 1–1.5 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేస్తూ వచ్చింది. ఈ బాటలో ప్రస్తుతం పెట్టుబడులను మూడు రెట్లు పెంచే యోచనలో ఉంది. ఇటీవల విదేశీ ఇన్వెస్టర్లు దేశీయంగా పెట్టుబడులకు తరలి వస్తున్న నేపథ్యంలో టెమాసెక్ ప్రణాళికలకు ప్రాధాన్యత ఏర్పడింది. ఇటీవల జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఫలితాలలో అధికార బీజేపీ విజయం సాధించడంతో పాలసీలు కొనసాగనున్నట్లు విదేశీ ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. దీనికితోడు ఈ ఆర్థిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికం(జులై–సెపె్టంబర్)లో దేశ ఆర్థిక వ్యవస్థ(జీడీపీ) పటిష్ట వృద్ధిని సాధించడం జత కలుస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో హెల్త్‌కేర్ రంగంలోని మణిపాల్ హాస్పిటల్స్‌లో 2 బిలియన్ డాలర్లకుపైగా వెచ్చించి టెమాసెక్ మెజారిటీ వాటాను సొంతం చేసుకుంది. ఇది భారీ డీల్‌కాగా.. ఇప్పటికే ఓలా, జొమాటో, డాక్టర్ అగర్వాల్స్ హెల్త్‌కేర్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్, క్యూర్‌ఫిట్ తదితరాలలో ఇన్వెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. -
ఓలా ఎలక్ట్రిక్‌కు రూ.3,200 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ వా హనాల తయారీలో ఉన్న ఓలా ఎలక్ట్రిక్ తాజా గా రూ.3,200 కోట్ల నిధులను అందుకుంది. టెమసెక్ నేతృత్వంలోని ఇన్వెస్టర్లు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ మొత్తాన్ని సమకూర్చాయి. ఎలక్ట్రిక్ వెహికిల్స్ వ్యాపార విస్తరణకు, అలాగే తమిళనాడులోని కృష్ణగిరి వద్ద లిథియం అయాన్ సెల్ తయారీ ప్లాంటు ఏర్పాటుకు ఈ నిధులను వెచి్చంచనున్నట్టు కంపెనీ గురువారం ప్రకటించింది. ద్విచక్ర వాహనాల తయారీ సామర్థ్యాన్ని పెంచడం, ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లతోపాటు ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెట్టడం.. అలాగే గిగాఫ్యాక్టరీ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయడం ద్వారా వృద్ధిని వేగవంతం చేయాలని ఓలా ఎలక్ట్రిక్ లక్ష్యంగా చేసుకుంది. ‘ఆటోమొబైల్స్ రంగంలో ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ యుగానికి ముగింపు పలకడమే మా లక్ష్యం. అంతర్జాతీయంగా ఈవీ హబ్‌గా మారే దిశగా భారత ప్రయాణంలో కంపెనీ నెలకొల్పుతున్న గిగాఫ్యాక్టరీ పెద్ద ముందడుగు. ఈవీలు, సెల్ విభాగంలో ప్రధాన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి కట్టుబడి ఉన్నాం. స్థిర మొబిలిటీ వైపు వేగవంతంగా మళ్లడానికి తయారీని పరుగులు పెట్టిస్తున్నాం’ అని ఓలా ఎలక్ట్రిక్ ఫౌండర్, సీఈవో భవీశ్ అగర్వాల్ తెలిపారు. -
మణిపాల్ చేతికి ఆమ్రి హాస్పిటల్స్
కోల్‌కతా/న్యూఢిల్లీ: హెల్త్‌కేర్ సంస్థ మణిపాల్ హాస్పిటల్స్ తాజాగా ఇమామీ గ్రూప్ సంస్థ ఆమ్రి హాస్పిటల్స్‌లో 84% వాటాను సొంతం చేసుకుంది. సింగపూర్ కంపెనీ టెమాసెక్ హోల్డింగ్స్‌కు 59% వాటాగల మణిపాల్ ఇందుకు రుణాలుసహా రూ. 2,300 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. ఆమ్రి హాస్పిటల్స్‌లో 15% వాటాతో ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఇమామీ గ్రూప్ ఇన్వెస్టర్‌గా కొనసాగనుంది. తాజా కొనుగోలుతో మణిపాల్ హాస్పిటల్స్ దేశ తూర్పు ప్రాంతంలో కార్యకలా పాలు విస్తరించనుంది. సంయుక్త సంస్థ దేశవ్యాప్తంగా 17 పట్టణాలు, నగరాలలో 9,500 పడకలతో 33 ఆసుపత్రులను నిర్వహించనుంది. వెరసి దేశీయంగా రెండో పెద్ద హెల్త్‌కేర్ సేవల సంస్థగా ఆవి ర్భవించనుంది. సంబంధిత వర్గాల సమా చారం ప్రకారం ఆమ్రి రుణ భారం రూ.1,600 కోట్లు కాగా.. రూ.2,400 కోట్ల ఎంటర్ప్రైజ్ విలువలో డీల్ జరిగినట్లు తెలుస్తోంది. క్లినికల్ నైపుణ్యాలు, మౌలిక సదుపాయాలుగల ఆమ్రి హాస్పిటల్స్‌ను జత కలుపుకోవడం ద్వారా భారీ నెట్‌వర్క్‌కు తెరలేవనున్నట్లు మణిపాల్ పేర్కొంది. తద్వారా దేశ తూర్పుప్రాంతంలో అత్యంత నాణ్యమైన ఆరోగ్యపరిరక్షణ సేవలకు పెరుగుతున్న డిమాండుకు అనుగుణమైన సేవలు అందించేందుకు వీలు చిక్కనున్నట్లు తెలియజేసింది. అయితే మణిపాల్ 2021లో కోల్‌కతాలోని కొలంబియా ఏషియా హాస్పిటల్స్‌ను కొనుగోలు చేయడం ద్వారా తూర్పు భారతంలో కార్యకలాపాలు ప్రారంభించింది. కాగా.. హెల్త్‌కేర్ రంగ మరో దిగ్గజం అపోలో హాస్పిటల్స్ 10,000 పడకల సామర్థ్యంతో 64 ఆసుపత్రులను నిర్వహిస్తోంది. -
మణిపాల్ హాస్పిటల్స్‌లో షియర్స్‌కు మెజారిటీ వాటా
న్యూఢిల్లీ: మణిపాల్ హాస్పిటల్స్‌లో మెజారిటీ వాటాలు దక్కించుకునే దిశగా షియర్స్ హెల్త్‌కేర్ ఇండియా ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. హెల్త్‌కేర్ రంగంలో ఇదే అతిపెద్ద ప్రైవేట్ ఈక్విటీ డీల్ కాగలదని పరిశ్రమవర్గాలు తెలిపాయి. డీల్‌పై వచ్చే వారం అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని వివరించాయి. ఒప్పందం ప్రకారం మణిపాల్ హాస్పిటల్స్ విలువ సుమారు రూ.40,000 కోట్లు – రూ.42,000 కోట్లుగా మదింపు చేసినట్లు పేర్కొన్నాయి. ప్రమోటర్ కుటుంబం, ఇతర ఇన్వెస్టర్లయిన టీపీజీ, ఎన్ఐఐఎఫ్ నుంచి వాటాలు కొనుగోలు చేయడం ద్వారా తన వాటాను పెంచుకునేందుకు షియర్స్ ప్రయత్నాల్లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. మిగతా ఇన్వెస్టర్ల నుంచి 41 శాతం వాటాను కొనుగోలు చేయడం ద్వారా షియర్స్ తన మొత్తం వాటాను 59 శాతానికి పెంచుకునే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వివరించాయి. మణిపాల్ గ్రూప్‌నకు 28 ఆస్పత్రులు, 8,000 పడకలు ఉన్నాయి. సింగపూర్‌కు చెందిన ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం టెమాసెక్‌కు సంబంధించిన హెల్త్‌కేర్ డెలివరీ అసెట్లను షియర్స్ నిర్వహిస్తోంది. షియర్స్‌కు మణిపాల్ హాస్పిటల్స్‌లో ప్రస్తుతం 18 శాతం వాటాలు ఉన్నాయి. దానితో పాటు అమెరికన్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ టీపీజీకి 21%, భారత సార్వభౌమ వెల్త్‌ఫండ్ నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఎన్ఐఐఎఫ్)కు 8 శాతం వాటాలు ఉన్నాయి. కోల్‌కతాకు చెందిన హాస్పిటల్ చెయిన్ మెడికా సినర్జీ, మెడాంటా హాస్పిటల్స్ ఆపరేటర్ గ్లోబల్ హెల్త్‌లోనూ షియర్స్ వాటాదారుగా ఉంది. -
రివులిస్‌తో జైన్ ఇరిగేషన్ జత
న్యూఢిల్లీ: వ్యవసాయ రంగ సూక్ష్మ నీటి పరికరాల కంపెనీ జైన్ ఇరిగేషన్ సిస్టమ్స్ రుణ భారాన్ని తగ్గించుకునేందుకు ప్రణాళికలు అమలు చేస్తోంది. ఇందుకు అనుగుణంగా టెమాసెక్ కంపెనీ రివులిస్ పీటీఈతో గ్లోబల్ ఇరిగేషన్ బిజినెస్‌ను విలీనం చేసేందుకు తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. గ్లోబల్ బిజినెస్ విలువ రూ. 4,200 కోట్లుకాగా.. నగదు, స్టాక్ రూపేణా కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా లభించే నిధులతో కన్సాలిడేటెడ్ రుణ భారాన్ని రూ. 2,700 కోట్లు(45 శాతం వరకూ) తగ్గించుకోనుంది. మరో రూ. 200 కోట్లు మాతృ సంస్థకు లభించనున్నట్లు జైన్ ఇరిగేషన్ ఎండీ అనిల్ జైన్ వెల్లడించారు. విలీన సంస్థలో జైన్ ఇంటర్నేషనల్ 22 శాతం వాటాను పొందనుండగా.. టెమాసెక్ హోల్డింగ్ మిగిలిన 78 శాతం వాటాను సొంతం చేసుకోనుంది. రెండో పెద్ద కంపెనీ తాజా విలీనం తదుపరి సంయుక్త సంస్థ 75 కోట్ల డాలర్ల(రూ. 5,850 కోట్లు) ఆదాయంతో రెండో పెద్ద గ్లోబల్ కంపెనీగా ఆవిర్భవించనున్నట్లు జైన్ ఇరిగేషన్ పేర్కొంది. ప్రస్తుతం రివులిస్ ఆదాయం 40 కోట్ల డాలర్లుకాగా.. జైన్ ఇరిగేషన్ గ్లోబల్ బిజినెస్ 35 కోట్ల డాలర్ల అమ్మకా లు సాధించింది. విలీనానికి వీలుగా సొంత అను బంధ సంస్థ జైన్ ఇంటర్నేషనల్ ట్రేడింగ్ ద్వారా రివులిస్ పీటీఈతో జైన్ ఇరిగేషన్ చేతులు కలిపింది. తద్వారా 22.5 కోట్ల డాలర్ల పునర్వ్యవస్థీకరించిన విదేశీ బాండ్లతోపాటు, పూర్తి రుణ భారంలో 45 శాతంవరకూ తిరిగి చెల్లించనున్నట్లు జైన్ ఇరిగేషన్ తెలియజేసింది. అంతేకాకుండా బాండ్ హోల్డర్లు, ఐఐబీ రుణదాతలకిచ్చి న రూ. 2,275 కోట్ల కార్పొరేట్ గ్యారంటీని సై తం విడిపించుకోనున్నట్లు వెల్లడించింది. 2022 మార్చి31కల్లా కంపెనీ కన్సాలిడేటెడ్ రుణ భారం రూ. 6,000 కోట్లుగా నమోదైంది. దీనిలో దేశీ బిజినెస్ వాటా రూ. 3,300 కోట్లు. ఈ కాలంలో మొత్తం ఆదాయం రూ. 7,119 కోట్లను అధిగమించగా.. రూ. 358 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఈ వార్తల నేపథ్యంలో జైన్ ఇరిగేషన్ షేరు ఎన్ఎస్ఈలో 20 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకి రూ. 37.5 వద్ద ముగిసింది. -
మాస్టర్ ఫండ్‌లో టెమసెక్ 2,750 కోట్ల పెట్టుబడులు
ముంబై: నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్(ఎన్ఐఐఎఫ్)లో సింగపూర్‌కు చెందిన టెమసెక్ హోల్డింగ్స్... రూ.2,750 కోట్లు (40 కోట్ల డాలర్లు) పెట్టుబడులు పెట్టనుంది. తమ మాస్టర్ ఫండ్‌లో టెమసెక్ ఈ మేరకు పెట్టుబడులు పెట్టనున్నట్లు ఎన్ఐఐఎఫ్ వెల్లడించింది. దీంతో తమ ఫండ్‌లో ఇన్వెస్టర్ల సంఖ్య ఏడుకు చేరనున్నట్లు ఎన్ఐఐఎఫ్ ఎమ్డీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ సుజోయ్ బోస్ చెప్పారు. ఈ ఫండ్‌లో ఇప్పటికే భారత ప్రభుత్వం, అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ, హెచ్డీఎఫ్సీ గ్రూప్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్‌మహీంద్రా లైఫ్ ఇన్సూరెన్స్, యాక్సిస్ బ్యాంక్‌లు ఇన్వెస్ట్ చేశాయి. త్వరలో స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్... కొత్త మౌలిక ప్రాజెక్ట్‌లు, ఇప్పటికే ప్రారంభమై, ఆగిపోయిన మౌలిక ప్రాజెక్ట్‌లకు నిధులందించేందుకు గాను ప్రభుత్వం ఎన్ఐఐఎఫ్ను 2015లో ఏర్పాటు చేసింది. ఎన్ఐఐఎఫ్లో కేంద్రానికి 49 శాతం చొప్పున వాటా ఉండగా, ఇతర వాటాలు దేశీయ, అంతర్జాతీయ దిగ్గజ సంస్థలకు ఉన్నాయి. ఎన్ఐఐఎఫ్ ఇప్పటికే రెండు ఫండ్స్–మాస్టర్ ఫండ్, ఫండ్స్ ఆఫ్ ఫండ్స్‌ను నిర్వహిస్తోంది. మాస్టర్ ఫండ్ నేరుగా కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తుండగా, ఇతర సంస్థలు నిర్వహించే ఫండ్స్‌లో ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తోంది. తాజాగా 200 కోట్ల డాలర్ల నిధులతో మూడో ఫండ్–స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్‌ను ప్రారంభించే సన్నాహాలు చేస్తోంది. కాగా ఈ మూడు ఫండ్ల ద్వారా రూ.40,000 కోట్లు సమీకరించాలని యోచిస్తున్నామని సుజోయ్‌బోస్ చెప్పారు. కాగా మౌలిక రంగ ఆస్తుల నిర్మాణానికి గాను దిగ్గజ ఇన్వెస్ట్మెంట్ సంస్థగా ఎన్ఐఐఎఫ్ త్వరతిగతిన అవతరిస్తోందని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ పేర్కొన్నారు. -
ఎస్బీఐ లైఫ్‌లో టెమాసెక్, కేకేఆర్‌కు వాటాలు
• 3.9% విక్రయిస్తున్న ఎస్బీఐ • డీల్ విలువ రూ. 1,794 కోట్లు • సంస్థ విలువ రూ. 46,000 కోట్లు ముంబై: అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ సంస్థలు టెమాసెక్, కేకేఆర్ తాజాగా బీమా రంగ సంస్థ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో 3.9 శాతం వాటాలు కొనుగోలు చేయనున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఈ వాటాలను విక్రరుుస్తోంది. ఈ డీల్ విలువ సుమారు రు. 1,794 కోట్లు (దాదాపు 264 మిలియన్ డాలర్లు). షేరు ఒక్కింటికి రూ. 460 చొప్పున జీవిత బీమా వ్యాపార సంస్థలో 3.9 కోట్ల షేర్లను (3.9 శాతం వాటా) విక్రరుుంచేందుకు శుక్రవారం బోర్డు ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆమోదముద్ర వేసిందని ఎస్బీఐ వెల్లడించింది. కేకేఆర్, టెమాసెక్లు తమ తమ అనుబంధ సంస్థల ద్వారా చెరి 1.95 కోట్ల షేర్లను కొనుగోలు చేయనున్నట్లు పేర్కొంది. ఈలావాదేవీతో ఎస్బీఐ లైఫ్ వేల్యుయేషన్ సుమారు రూ. 46,000 కోట్ల పైచిలుకు ఉండగలదని ఎస్బీఐ చైర్మన్ అరుంధతి భట్టాచార్య తెలిపారు. అత్యుత్తమ సంస్థగా ఎదగడంలో ఎస్బీఐ లైఫ్‌కి గల నిబద్ధతకు కేకేఆర్, టెమాసెక్ల భాగస్వామ్యం నిదర్శనమని ఆమె పేర్కొన్నారు. పాలసీదారులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఇది తోడ్పడగలదని ఎస్బీఐ లైఫ్ ఎండీ అరిజిత్ బసు చెప్పారు. 2001లో ఏర్పాటైన ఎస్బీఐ లైఫ్‌లో ఎస్బీఐకి 74 శాతం, బీఎన్పీ పారిబా కార్డిఫ్లకు 26 శాతం వాటాలు ఉన్నారుు.