న్యూఢిల్లీ: మణిపాల్ హాస్పిటల్స్‌లో మెజారిటీ వాటాలు దక్కించుకునే దిశగా షియర్స్ హెల్త్‌కేర్ ఇండియా ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. హెల్త్‌కేర్ రంగంలో ఇదే అతిపెద్ద ప్రైవేట్ ఈక్విటీ డీల్ కాగలదని పరిశ్రమవర్గాలు తెలిపాయి. డీల్‌పై వచ్చే వారం అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని వివరించాయి. ఒప్పందం ప్రకారం మణిపాల్ హాస్పిటల్స్ విలువ సుమారు రూ.40,000 కోట్లు – రూ.42,000 కోట్లుగా మదింపు చేసినట్లు పేర్కొన్నాయి.
ప్రమోటర్ కుటుంబం, ఇతర ఇన్వెస్టర్లయిన టీపీజీ, ఎన్‌ఐఐఎఫ్ నుంచి వాటాలు కొనుగోలు చేయడం ద్వారా తన వాటాను పెంచుకునేందుకు షియర్స్ ప్రయత్నాల్లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. మిగతా ఇన్వెస్టర్ల నుంచి 41 శాతం వాటాను కొనుగోలు చేయడం ద్వారా షియర్స్ తన మొత్తం వాటాను 59 శాతానికి పెంచుకునే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వివరించాయి. మణిపాల్ గ్రూప్‌నకు 28 ఆస్పత్రులు, 8,000 పడకలు ఉన్నాయి.
సింగపూర్‌కు చెందిన ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం టెమాసెక్‌కు సంబంధించిన హెల్త్‌కేర్ డెలివరీ అసెట్లను షియర్స్ నిర్వహిస్తోంది. షియర్స్‌కు మణిపాల్ హాస్పిటల్స్‌లో ప్రస్తుతం 18 శాతం వాటాలు ఉన్నాయి. దానితో పాటు అమెరికన్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ టీపీజీకి 21%, భారత సార్వభౌమ వెల్త్‌ఫండ్ నేషనల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (ఎన్‌ఐఐఎఫ్)కు 8 శాతం వాటాలు ఉన్నాయి. కోల్‌కతాకు చెందిన హాస్పిటల్ చెయిన్ మెడికా సినర్జీ, మెడాంటా హాస్పిటల్స్ ఆపరేటర్ గ్లోబల్ హెల్త్‌లోనూ షియర్స్ వాటాదారుగా ఉంది.
మణిపాల్ హాస్పిటల్స్‌లో షియర్స్‌కు మెజారిటీ వాటా
Published Sat, Apr 8 2023 6:11 AM | Last Updated on Sat, Apr 8 2023 6:11 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment